జలాశయాల వివరాలు
చిన్ననీటి వనరుల పరిస్థితి
చెరువులు ఖాళీ
కూలిన ఇళ్లు.. విరిగిన చెట్లు
● మూడో రోజూ వానజల్లు ● కూలిన చెట్లు.. విరిగిపడిన స్తంభాలు ● అత్యధికం బోయినపల్లిలో 54.7 మిల్లిమీటర్లు ● సగటు వర్షం 35.8 మిల్లిమీటర్లు
వర్షపాతం ఇలా..
సిరిసిల్ల: జిల్లాలో మూడో రోజు గురువారం ముసురువర్షం కురుస్తూనే ఉంది. ఈ వానాకాలంలో సరైన వర్షాలు కురువక రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వాన ఊపిరిపోసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో వర్షాలు ఎక్కువ పడడంతో పాల్వంచవాగులోని వరద గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరులోకి చేరుతోంది. వేములవాడ మూలవాగు పడువాటు నీళ్లతో పారడంతో మధ్యమానేరులోకి చిన్నపాటి వరద చేరుతోంది. ఎల్లంపల్లి వద్ద మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను పంపింగ్ చేయడంతో మధ్యమానేరులోకి నీరు వస్తోంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ శివా రు అడవుల్లో కురిసిన వర్షాలతో కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి వరద వస్తోంది.
వాగులు.. ఒర్రెల్లో చిన్నపాటి పాయలు
వేములవాడ మండలం హన్మాజీపేట నక్కవాగు, లక్ష్మీపూర్ సండ్రవాగు, బోయినపల్లి గంజివాగు, ఇల్లంతకుంట మండలం బిక్కవాగుల్లో వరదనీరు పారుతోంది. వీర్నపల్లి మండలంలోని గిరిజనతండాల మధ్య ఒర్రెలు పారుతున్నాయి. వర్షాలతో సిరి సిల్ల పెద్ద బజారులో చెట్టు విరిగిపడి ఒకరు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలంల్లో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సవరించారని ఎస్‌ఈ వేణుమాధవ్ సిబ్బందికి సూచించారు.
మండలం వర్షపాతం(మి.మీ)
బోయినపల్లి 54.7
ఇల్లంతకుంట 27.7
గంభీరావుపేట 24.2
ఎల్లారెడ్డిపేట 25.4
తంగళ్లపల్లి 29.5
వీర్నపల్లి 29.3
రుద్రంగి 37.3
ముస్తాబాద్ 26.1
సిరిసిల్ల 28.9
వేములవాడ రూరల్ 53.5
కోనరావుపేట 35.7
వేములవాడ 49.9
చందర్తి 43.3
జలాశయం సామర్థ్యం ప్రస్తుత నిల్వ
మధ్యమానేరు(మాన్వాడ) 27.55 టీఎంసీలు 8.856 టీఎంసీలు
అన్నపూర్ణ(అనంతగిరి) 3.50 టీఎంసీలు 1.46 టీఎంసీలు
మల్కపేట రిజర్వాయర్ 3.00 టీఎంసీలు 1.04 టీఎంసీలు
ఎగువ మానేరు(నర్మాల) 2.00 టీఎంసీలు 1.237 టీఎంసీలు
చెరువులు 0–25శాతం 25–50 50–75 75–100 మత్తడి
నిండినవి శాతం శాతం శాతం దూకుతున్నవి
656 259 13 06 03 0 0
జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు ఉండగా.. 281 చెరువుల్లోకి కొద్దిపాటి వర్షం నీరు చేరుతోంది. మిగతా 375 చెరువుల్లోకి నీరు రాలేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్న ఈ సమయంలో మూడు రోజుల ముసురు వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
ఇల్లంతకుంట/రుద్రంగి/గంభీరావుపేట/వేములవాడరూరల్/ముస్తాబాద్/ వీర్నపల్లి: ఇల్లంతకుంట మండలం రామాజీపేట పాఠశాలలో నీరు నిలిచింది. సర్పంచ్ చొప్పరి భూమయ్య పైపులైన్ వేయించి నీటి బయటకు పంపించివేశారు. ఎల్లారెడ్డిపేటలోని ఆటోస్టాండ్ సమీపంలో చెట్టు విరిగిపడింది. వేములవాడ సమీపంలోని మూలవాగు పరవళ్లు తొక్కుతోంది. హన్మాజిపేట నక్కవాగు మల్లారం ఫీడర్ ఛానల్ మీదుగా ప్రవహిస్తోంది. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో లాల్‌బీ ఇల్లు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వీర్నపల్లి మండల కేంద్రంలోని పశువుల ఆరోగ్య ఉపకేంద్రంలోకి వరద నీరు వచ్చి చేరింది.


