చందుర్తి(వేములవాడ): చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం కోసం కేటాయించిన స్థలానికి ఎదురుగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నందుకే కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దప్పుల అశోక్ ఆరోపించారు. చందుర్తిలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వ్యతిరేకించినందుకు చందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వ్యవస్థాపక సభ్యు డు దయ్యాల కమలాకర్‌పై కేసు నమోదు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్యలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అశోక్‌ను సొంత పూచీకత్తుపై విడిపించారు.


