గంజాయి విక్రేతల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్ట్‌

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

● 120 గ్రాముల గంజాయి స్వాదీనం

జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు మోతె శ్మశానవాటిక ఎదురుగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్‌ చూపారు. పట్టణ శివారు లింగంపేటకు చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్‌బోర్డుకు చెందిన గజ్జెల అజయ్‌, లక్ష్మీపూర్‌కు చెందిన ఆలకుంట్ల గణేశ్‌, తులసీనగర్‌కు చెందిన ఏళ్ల మనోజ్‌ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లి 120 గ్రాముల గంజాయి కొనుక్కుని వచ్చి మోతె శ్మశాన వాటిక వద్ద విక్రయిస్తున్నారు. వారిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకుని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

సిరిసిల్ల: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,000 జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్‌ మంగళవారం తీర్పునిచ్చారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే కథనం ప్రకారం.. సిరిసిల్లకు చెందిన బూర్ల చంద్రశేఖర్‌ ఓ మైనర్‌ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసి చంద్రశేఖర్‌ను రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్‌ ఎస్సైలు రవీందర్‌నాయుడు, శ్రవణ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్‌ జనార్ధన్‌, కోర్టు మానిటరింగ్‌ కానిస్టేబుల్‌ నవీన్‌, పొక్సో కోర్టు కానిస్టేబుల్‌ వెన్నెల 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్‌ తరుపున పీపీ రజినీకాంత్‌ వాదించారు. న్యాయమూర్తి సాక్ష్యాలు పరిశీలించి నిందితుడికి జైలు, జరిమానా విధించారు.

ధాన్యం బకాయిలు చెల్లించాలి

వేములవాడరూరల్‌: రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మంగళవారం మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్‌ ఆధ్వర్యంలో వే ములవాడ రూరల్‌ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో ఎంతమంది రైతులు నష్టపోయా రు, బాధ్యులపై ఎం చర్యలు తీసుకుంటున్నారనే వి షయాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డి మాండ్‌ చేశారు. మర్రిపల్లి, మల్లారం, నూకలమర్రి రైతులు బకాయిల కోసం ఆందోళనలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదష్టకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీని వాస్‌, జిల్లా కార్యదర్శి సురేందర్‌రావు, ఓబీసీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, కౌన్సిల్‌ సభ్యుడు జక్కుల తిరుపతి, వేములవాడ అర్బన్‌ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement