గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఏమైనా అయితే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి దారి ఉండదు. వాగు తగ్గే వరకు దేవుడి మీద భారమేసుడే.
– మాలోత్ సోనీ, కాశీతండా మహిళ
వాగు దాటితేనే చదువు
కాలేజీకి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే వాగు తగ్గే వరకు ఇంటి వద్దే ఉండాల్సి వస్తోంది. ఒకవేళ ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి ఇంటికొచ్చే లోపు వాగొస్తే ఆ రోజు వాగు అవతలి ఒడ్డున బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నాం. – మాలోత్ జ్యోత్స్న, డిగ్రీ విద్యార్థిని
బ్రిడ్జి నిర్మించాలి
కాంట్రాక్టర్, అధికారుల మధ్య సమన్వయలోపంతో బ్రిడ్జి పనులు ఆలస్యమవుతున్నాయి. ఇసుక పర్మిషన్ గురించి తహసీల్దార్‌ను అడిగితే మైనింగ్ వాళ్లను అడగండి అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
– కడవాత్ శిరీష, మద్దిమల్లతండ సర్పంచ్


