ఎస్‌ఐఆర్‌ను గడువులోగా పూర్తి చేయాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: విద్యారంగంలో జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలపాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పీజీఐ(పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్) తదితర అంశాలపై కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా విద్యాధికారి మొండయ్య, అధికారులతో సమీక్షించారు. ప్రతీ 15 రోజులోకసారి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి నాణ్యమైన విద్యతోపాటు, మౌలిక వసతులు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, కో ఆర్డినేటర్లు సతీశ్, పద్మజ ఉన్నారు.
గడువులోగా ఎస్‌ఐఆర్
డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 86.09 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


