ఆరునెలలకే తారు మారు | - | Sakshi
Sakshi News home page

ఆరునెలలకే తారు మారు

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

ఇదేం బడిబాట

కోనరావుపేట మండలం మల్కపేటలోని చల్మెడ జానకీదేవి ప్రాథమికో న్నత పాఠశాల దారి నీటిమయంగా తయారైంది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒర్రెలు, పొలాల మధ్య నుంచి వస్తున్న వరద ఇదే దారిలో ప్రవహిస్తూ చెరువులోకి వెళ్తోంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. – కోనరావుపేట

కోనరావుపేట మండలం మల్కపేట రామాలయం గుట్టపైకి భక్తులు వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు నాణ్యతాలోపంతో దెబ్బతింటోంది. గుట్ట పైనుంచి కింది వరకు రూ.90 లక్షల వ్యయంతో 2024 నవంబర్‌ 26న మల్కపేట రిజర్వాయర్‌ కట్టపై రోడ్డు పనులు ప్రారంభించారు. ఒక వైపు రక్షణ గోడ, మరో వైపు రక్షణగా సిమెంట్‌ దిమ్మెలు నిర్మించారు. పనులు పూర్తయి ఆరునెలలు దాటుతోంది. నాణ్యతా లోపంతో సిమెంట్‌ దిమ్మెలు పగిలిపోయాయి. మరో పక్క సైడ్‌వాల్‌ పగుళ్లు బారుతోంది. కాగా, ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు పనులు నాణ్యతతో పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. – కోనరావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement