ఎక్కడి నుంచి ఎక్కాలి?.. ఎక్కడ దిగాలి? | Mehdipatnam Fob Becomes Puzzle For Passengers | Sakshi
Sakshi News home page

ఎక్కడి నుంచి ఎక్కాలి?.. ఎక్కడ దిగాలి?

Sep 23 2026 12:10 PM | Updated on Sep 23 2026 12:14 PM

Mehdipatnam Fob Becomes Puzzle For Passengers

మీరు మెహిదీపట్నం వస్తున్నారా..? వస్తే ఇక్కడ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ) మాత్రం ఎక్కకండి. ఎందుకంటే మీరు ఎటువైపు దిగాలో తెలియక తికమక పడే ప్రమాదం ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యం, ఇంజినీరింగ్‌ లోపాల కారణంగా అత్యంత కీలకమైన మెహిదీపట్నం ప్రాంతంలోని ఎఫ్‌ఓబీ ప్రయాణికులకు అర్ధంకాని పజిల్‌గా మిగిలింది.   

👉 మూడేళ్ల క్రితం మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఎఫ్‌ఓబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతుబజార్‌ కాంపౌండ్, గోల్కొండ డీసీపీ కార్యాలయం నుంచి రైతుబజార్‌ మెయిన్‌ గేటు మీదుగా ఆసిఫ్‌నగర్‌ మెయిన్‌ రోడ్డు..మ్యాక్స్‌ షోరూమ్‌ వరకు ఈ వంతెన నిర్మించారు. మరి ఇక్కడ వరకు వచి్చన తర్వాత బ్రిడ్జిపైకి ఎలా ఎక్కాలో అన్న విషయం ప్రజలకు అర్ధం కావడం లేదు.  

👉 రైతు బజార్‌ బస్టాప్‌ వద్ద ఎఫ్‌ఓబీ కింద స్టీల్‌తో స్లాబ్‌ వేశారు. దీంతో కింది ప్రాంతం చీకటిగా మారింది. ఈ స్లాబ్‌పై షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. కానీ కొనుగోలు దారులు ఏ రూట్‌లో ఈ కాంప్లెక్సుకు రావాలో తెలియడం లేదు. అలాగే ఈ రూట్లో భారీ లోడ్‌ వాహనాలు పైన స్టీల్‌ స్లాబ్‌కు రాసుకుంటూ పోతున్నాయి.

👉 మెహిదీపట్నం మెయిన్‌ బస్టాప్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీ నిర్మాణం సైతం ప్రజలకు అర్ధంకాని ప్రశ్నలాగే మిగిలింది. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కింద నుంచి రైతు బజార్‌ వైపునకు ఉన్న ఈ ఎఫ్‌ఓబీ ప్రారంభానికి నోచుకోలేదు. దీనిపైన పెద్దగా ఉన్న రెండు పోల్స్‌ ఎందుకో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

  • గరంలోని ప్రధాన మార్గంలో ఓ వైపు హైదరాబాద్‌ జిల్లాకు (బల్కంపేట వైపు)..మరోవైపు మేడ్చల్‌ జిల్లాకు (ఫతేనగర్‌ వైపు) సరిహద్దుగా నిలిచిన ఫతేనగర్‌ బ్రిడ్జి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన అప్పటి జనాభా అవసరాలకు సరిపోగా..ఇప్పుడు పెరిగిన వాహనాలతో నిత్యం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిక్కిరిసి పోతోంది. అటు ఫతేనగర్‌ వైపు వెళ్లాలన్నా..ఇటు బల్కంపేట రూట్లో రావాలన్నా ఈ వంతెన దాటాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ బ్రిడ్జి విస్తరణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంది. దీంతో నిత్యం వేలాది వాహనాలు నత్తల మాదిరిగా నెమ్మదిగా కదలాల్సి వస్తోంది.  

నిధులు మంజూరైనా... 
ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ విస్తరణకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. అప్పటి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన కూడా చేశారు. ఈలోగా ప్రభుత్వం మారింది. ప్రాజెక్ట్‌ అటకెక్కింది. ఫ్లైఓవర్‌ను విస్తరిస్తే తప్ప ఈ మార్గంలో ట్రాఫిక్‌ తిప్పలు తప్పవు. 

ఫతేనగర్‌ బ్రిడ్జిపై ప్రయాణికులకు అష్టకష్టాలు 
    ఇరుకు వంతెన విస్తరించక నిత్యం ట్రాఫిక్‌ నరకం

  1.  జీడిమెట్ల, షాపూర్‌నగర్, చింతల్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, బేగంపేట, పంజగుట్ట వైపు రావాలంటే దగ్గరి దారి ఫతేనగర్‌ మార్గం ఒక్కటే.

  2. రోడ్డుపై గుంతలు..వాహనాల అడ్డగోలు పార్కింగ్‌..ఫ్లైఓవర్‌ వెడల్పు అతి చిన్నగా ఉండడం వంటి కారణాలతోనూ నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

  3. ముఖ్యంగా ఉదయం కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయం, సాయంత్రం తిరిగి వచ్చే వేళల్లో ఫ్లైవర్‌పై వాహనాలు బారులుదీరుతున్నాయి.

  4. బాలానగర్‌ విమల్‌ థియేటర్‌ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లైఓవర్‌ మీదుగా బల్కంపేట, ఎస్సార్‌నగర్‌ వరకు రావాలంటే గంట సమయం పడుతోంది.

  5. ఈ ఫ్లైవర్‌పై ఎటువైపు వెళ్లాలన్నా ఒక వాహనం మాత్రమే వెళ్లగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ఏ వాహనమైనా బ్రేక్‌ డౌన్‌ అయ్యిందంటే ఇక అంతే సంగతులు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement