మెటాకు సర్వీస్‌ ప్రొవైడర్‌ బాధ్యతలు వర్తిస్తాయి | Meta is service provider not simple intermediary, as algorithms amplify content | Sakshi
Sakshi News home page

మెటాకు సర్వీస్‌ ప్రొవైడర్‌ బాధ్యతలు వర్తిస్తాయి

Sep 17 2026 5:10 AM | Updated on Sep 17 2026 5:10 AM

Meta is service provider not simple intermediary, as algorithms amplify content

 కేంద్ర ప్రభుత్వ వర్గాలు

న్యూఢిల్లీ: మెటాను కేవలం ఒక మధ్యవర్తి సంస్థగా (ఇంటర్మీడియరీ) పరిగణించడానికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏయే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏది కనిపించేలా చూడాలనేది మెటా తమ అల్గోరిథంల ద్వారా నిర్ణయిస్తుందని పేర్కొన్నాయి. కాబట్టి, దాన్ని సేవలు అందించే సంస్థగానే పరిగణించాల్సి వస్తుందని, సర్వీస్‌ ప్రొవైడర్లకు నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ మెటాకి కూడా వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

 నిర్దిష్ట చట్టాల నుంచి దానికి మినహాయింపులేమీ ఉండవని పేర్కొన్నాయి. అయితే, ఈ అంశంపై కోర్టు నిర్ణయమే అంతిమం అని వివరించాయి. పిల్లల వేధింపుల కంటెంట్‌ గురించి సమాచారాన్ని ఇప్పటివరకు అమెరికన్‌ నియంత్రణ సంస్థలకు మాత్రమే తెలియజేస్తూ వచి్చన మెటా తాజాగా భారత సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ నిర్వహించే పోర్టల్‌కి కూడా తెలియజేసేందుకు అంగీకరించిందని వివరించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement