దీపావళి నాటికి 100 నగరాల్లో అమెజాన్‌ నౌ  | Amazon India altra fast services Targets 100 Cities by Diwali 2026 | Sakshi
Sakshi News home page

దీపావళి నాటికి 100 నగరాల్లో అమెజాన్‌ నౌ 

Sep 17 2026 5:01 AM | Updated on Sep 17 2026 5:01 AM

Amazon India altra fast services Targets 100 Cities by Diwali 2026

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దీపావళి నాటికి 100 నగరాలకు అల్ట్రా ఫాస్ట్‌ డెలివరీ సరీ్వసుల విభాగం అమెజాన్‌ నౌ సేవలను విస్తరించనున్నట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా కంట్రీ హెడ్‌ సమీర్‌ కుమార్‌ తెలిపారు. పండుగల సీజన్‌ నేపథ్యంలో పది వారాల వ్యవధిలోనే నాలుగు రెట్లు నగరాలకు అమెజాన్‌ నౌ సేవలను విస్తరించినట్లు వివరించారు. 

దీనితో తిరుపతి, గుంటూరు, వరంగల్‌ సహా 60 నగరాలు, పట్టణాల్లో నిమిషాల్లో డెలివరీ సేవలు అందుబాటులోకి వచి్చనట్లు చెప్పారు. ఇందుకు 750 పైగా మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్, అర్బన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు తోడ్పడుతున్నాయని తెలిపారు. అమెజాన్‌ నౌ గత మూడు నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన 1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే స్థూల విక్రయాలను నమోదు చేసినట్లు కుమార్‌ చెప్పారు. మరోవైపు కొత్తగా 20 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు, 6 సోర్టింగ్‌ సెంటర్లు, 150 లాస్ట్‌ మైల్‌ డెలివరీ స్టేషన్లను అమెజాన్‌ ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement