రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ నివాసమైన యాంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా గణనాథుడిని కొలువుదీర్చి, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
యాంటిలియాలో ఆధ్యాత్మిక శోభ
గణపతి బాప్పా రాకను పురస్కరించుకుని యాంటిలియా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. అంబానీ కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులతో పాటు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


