ఎన్‌ఎస్‌ఈ ఐపీవో నేడే విడుదల | India NSE to launch IPO september 17 to 21 | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ ఐపీవో నేడే విడుదల

Sep 17 2026 4:46 AM | Updated on Sep 17 2026 4:46 AM

India NSE to launch IPO september 17 to 21

ధరల శ్రేణి రూ. 1700–1785

21న ముగింపు

రూ. 22,569 కోట్ల సమీకరణకు ఛాన్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీవో నేడు (గురువారం) ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్‌ 21న ముగుస్తుంది. 22న షేర్ల కేటాయింపు, 24న ఎక్సే్చంజీలో లిస్టింగ్‌ ఉంటుంది. ఈ ఇష్యూ కింద ఒక్కో షేరుకి ధర శ్రేణిని రూ. 1,700–1,785గా నిర్ణయించారు. ఒక్కో లాట్‌ పరిమాణం 8 షేర్లుగా ఉంటుంది. 

అర్హత గల ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 170 చొప్పున డిస్కౌంట్‌ లభిస్తుంది. ఐపీవో ద్వారా ఎన్‌ఎస్‌ఈ సుమారు రూ. 22,569 కోట్ల వరకు సమీకరించనుంది. ఈ ఇష్యూ హ్యుందాయ్‌ మోటర్స్‌ (రూ. 27,870 కోట్లు) తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద ఐపీవోగా నిలవనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలోనే ఉండే ఈ ఇష్యూలో భాగంగా 12.64 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.  

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 6,746 కోట్లు...
ఐపీఓలో భాగంగా బుధవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ ద్వారా ఎన్‌ఎస్‌ఈ రూ. 6,746 కోట్లు సమీకరించింది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్, గోల్డ్‌మన్‌ శాక్స్, ఫిడిలిటీ తదితర సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్క్యులర్‌ ప్రకారం 150 యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకి రూ. 1,785 ధర చొప్పున ఎన్‌ఎస్‌ఈ మొత్తం 3.77 కోట్ల షేర్లను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement