Algorithm
-
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో చేతులు కలిపిన స్టాక్ బ్రోకర్లపై పెండింగ్‌లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్మెంట్ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్ బ్రోకర్ సంస్థలకు 2025 జూన్ 16 నుంచి సెపె్టంబర్ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్‌వరకూ గడువును పొడిగించింది. -
రోబో సలహాలు.. మంచివే!
మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? సలహాదారులను ఆశ్రయిస్తున్నారా? వారికి చెల్లించాల్సిన ఫీజు ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? సలహాదారులు ఎందుకులే... అనుకుంటూ మీకు తోచినట్లు ఇన్వెస్ట్మెంట్లు చేసి చేతులు కాల్చుకుంటున్నారా? పోనీ సలహాదారులు చెప్పినట్లే చేసినా కూడా వారి ఫీజులు పోను పెద్దగా రిటర్న్స్ రావటం లేదా? ‘నేను పెట్టేది తక్కువ మొత్తమే కదా! ఆర్థిక సలహాదారులు ఎందుకులే’ అని అనుకుంటున్నారా? ఇలాంటి వాటన్నిటికీ సమాధానమే కొత్తతరం రోబో అడ్వైజర్లు. చౌకగా పోర్టుఫోలియోలను నిర్వహించుకోవటమే కాదు... ఆకర్షణీయమైన లాభాలూ సొంత చేసుకోవచ్చు. ఈ తరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న రోబో అడ్వైజర్ల గురించి సమగ్రంగా చెప్పేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...దశాబ్దాలుగా ఇన్వెస్టింగ్ చేయడమంటే ఆర్థిక సలహాదారును కలవడమే కాదు. చాంతాడంత ఫారాలూ నింపాల్సి వచ్చేది. అడ్వైజరీ ఫీజులు ఎక్కువే. దీంతో ఇదంతా చాలా పెద్ద వ్యవహారంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలు రోబో అడ్వైజర్లను తెచ్చాయి. వీటి సాయంతో అత్యంత చౌకగా పోర్ట్‌ఫోలియోలను నిర్మించుకోవటమే కాదు. నిర్వహణ పనులు కూడా అవే చేసిపెడుతున్నాయి. ఎవరీ రోబో అడ్వైజర్లు.. రోబో అడ్వైజర్లంటే మరెవరో కారు..(కావు). అల్గోరిథమ్‌లను ఉపయోగించి పోర్ట్‌ఫోలియోలను రూపొందించడంతో పాటు నిర్వహణ సేవలూ అందించే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారాలు. పోర్ట్ ఫోలియో నిర్వహణకు సంబంధించి ఇవి ప్రధానంగా ఇన్వెస్టర్ రిస్కు సామర్థ్యాలను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేస్తాయి. వాటి సమాధానాలను బట్టి ఏ సాధనానికి ఎంత కేటాయించాలనేది వివిధ మోడల్స్‌ని బట్టి సూచిస్తాయి. అలాగే పెట్టుబడి వ్యయాలు తక్కువగా ఉండే సాధనాలను ఎంపిక చేస్తాయి. ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్ చేస్తాయి. అంతర్జాతీయంగా చూస్తే... బెటర్మెంట్, వెల్త్ఫ్రంట్, ఫిడిలిటీ గో, సోఫైలాంటి ప్లాట్‌ఫామ్‌లు ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఈ మోడల్లో తమ ఆదాయం, లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాల్లాంటి ప్రశ్నలకు ఇన్వెస్టర్లు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ రోబో వ్యవస్థ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియలో మనిషి జోక్యం చాలా తక్కువ. అంతా సిస్టం చూసుకుంటుంది. అందుకే ఖర్చూ తక్కువగా ఉంటుంది. అసలెలా పని చేస్తాయి.. ఈ రోబో అడ్వైజర్లు ముందుగా రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తాయి. ఈ దశలో మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు? ఒకవేళ మార్కెట్ గానీ 10 శాతం పడితే మీరెలా స్పందిస్తారు? మీ ఆదాయం ఎంత మేర స్థిరంగా ఉంటుంది? వంటి ప్రశ్నలు వేస్తాయి. మీరిచ్చే సమాధానాలను బట్టి మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. మీరు ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడతారా? లేక ఒక మోస్తరుగా తీసుకోగలరా? లేక రిసు్కకు దూరంగా ఉంటారా? అనేది అర్థం చేసుకుంటాయి. పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఇలా... మీరు ఓకే చేశాక... రెండో దశలో అల్గోరిథం మీ రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్, కొన్ని సందర్భాల్లో బంగారం లేదా అంతర్జాతీయ అసెట్స్లాంటి సాధనాలకు ఎంతెంత కేటాయించవచ్చనేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఈక్విటీ మార్కెట్లు పెరిగి, మీరు నిర్దేశించిన స్థాయికన్నా కేటాయింపులు పెరిగిపోతే, సిస్టం ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్ చేస్తుంది. చాలా మటుకు ప్లాట్‌ఫామ్‌లు మీ లక్ష్యాలను ట్రాక్ చేసే విధంగా పని చేస్తాయి. రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడిని నిర్వహిస్తాయి. తద్వారా ఆర్థిక విషయాల్లో స్పష్టతనిచ్చేందుకు ప్రయతి్నస్తాయి. కొత్త వారికి లాభాలెన్నో..→ తక్కువ వ్యయాలు: సంప్రదాయ అడ్వైజరీ సరీ్వసులందించే సంస్థలు ఏటా 1– 2 శాతం చార్జీలు లేదా లావాదేవీలకింత కమీషన్ చొప్పున వసూలు చేస్తుంటాయి. అంతా ఆటోమేటెడ్‌గానే ఉంటుంది కాబట్టి రోబో–అడ్వైజర్ల ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఫీజులు తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మరింత ఎక్కువగా రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. → క్రమశిక్షణ: సాధారణంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు భావోద్వేగాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. భయం వల్ల కావచ్చు లేదా అత్యాశ వల్ల కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్లు సర్వసాధారణంగా ఎక్కువ రేటులో కొని, తక్కువ రేటుకు అమ్మేస్తుంటారు. ఆటోమేటెడ్ సిస్టంలలో ఇలాంటి భావోద్వేగాలు ఉండవు. వాటి తాలూకా తప్పిదాలూ ఉండవు. డేటా ఆధారిత అలొకేషన్ నిబంధనలను ఇవి పాటిస్తాయి. తద్వారా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగేలా చూస్తాయి. → సరళత్వం: రోబో అడ్వైజర్లు దన్నుగా ఉంటే డజన్ల కొద్దీ మ్యూచువల్ ఫండ్లను విశ్లేíÙంచుకోవాల్సిన పనిగానీ... ప్రతి రోజూ మార్కెట్ న్యూస్‌ని ట్రాక్ చేస్తూ ఉండటం గానీ చేయనక్కర్లేదు. డైవర్సిఫికేషన్ రీబ్యాలెన్సింగ్ అంతా కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామే చూసుకుంటుంది. → అందుబాటు స్థాయిలో: సాధారణంగా చాలా తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. సంపాదన అప్పుడప్పుడే మొదలుపెట్టినవారికి ఇది ఎంతో అనుకూల అంశంగా ఉంటుంది. మన దగ్గర ఇలాంటి సాధనాలున్నాయా? భారత్‌లోను ఇప్పుడిప్పుడే ఇలాంటి సరీ్వసులు అందుబాటులోకి వస్తున్నాయి. జెరోధా, గ్రో లాంటి డిస్కౌంట్ బ్రోకరేజీలు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు.. లక్ష్యాల ఆధారిత ఇన్వెస్టింగ్ సాధనాలు, ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దిన పోర్ట్‌పోలియోలను అందిస్తున్నాయి. కొన్ని ప్లాట్‌ఫాంలు మోడల్ పోర్ట్‌ఫోలియోలను రూపొందిస్తున్నాయి. అర్థయంత్ర, కువేర, ఇండ్‌మనీ, స్క్రిప్‌బాక్స్, ఫండ్స్ ఇండియా లాంటివి వివిధ ప్రొఫైల్స్‌కి తగ్గట్లుగా సరీ్వసులు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా సుమారు 140 రోబో–అడ్వైజరీ స్టార్టప్స్ ఉన్నట్లు అంచనా. కాకపోతే ఇంకా దేశీయంగా పూర్తి స్థాయిలో అమెరికా మాదిరి ఆటోమేట్ చేసిన ఈటీఎఫ్ ఆధారిత రోబో ప్లాట్‌ఫాంలు అందుబాటులో లేవు. హైబ్రిడ్ మోడల్స్ మాత్రం వస్తున్నాయి. ఇవి లక్ష్యాల ఆధారిత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్, పెట్టుబడులకు ముందు డిజిటల్‌గా రిస్క్ ప్రొఫైలింగ్ చేయడం, ఆటోమేటిక్‌గా సిప్‌లను సరి చేయడంలాంటివి చేస్తున్నాయి. దేశీయంగా ఫిన్‌టెక్ వినియోగం, సిప్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రోబో–అడ్వైజరీ సరీ్వసులు మరింత విస్తరిస్తాయనేది సుస్పష్టం.ఇవి ఎవరికి అనువంటే...→ తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారికి → బిజీగా ఉండే ప్రొఫెషనల్స్‌కి → మార్కెట్‌పై పరిమిత స్థాయి పరిజ్ఞానం ఉన్న వారికి → దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునేవారికి అయితే, అత్యంత సంపన్న వర్గాల వారికి, సంక్లిష్టమైన విధంగా పన్నులు కట్టాల్సిన వారికి మాత్రం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మనుషులు అందించే అడ్వైజరీ సరీ్వసులే అవసరం కావచ్చు.ఇప్పుడిదే ట్రెండు..యువ ఇన్వెస్టర్లు ఇప్పుడు పేపర్ వర్క్, సేల్స్‌మెన్ బాదరబందీని కాకుండా సింపుల్‌గా ఉండే యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. రోబో–అడ్వైజర్లు సరిగ్గా ఇందుకు సరిపోతాయి. సాధారణంగా చాలా మటుకు ఇండియన్స్ పెట్టుబడి అంటే అదేదో బ్రహ్మపదార్థమనే భావనతో ఇన్వెస్టింగ్‌ని వాయిదా వేస్తుంటారు. రోబో అడ్వైజరీ సాధనాలు ఇలాంటి అపోహలను పోగొట్టి.. పెట్టుబడి పెట్టడాన్ని చాలా సులభతరం చేస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయాలు..→ పెట్టుబడులు పెట్టడం మీకు కొత్తయినా, ఎలా మొదలెట్టాలో తెలియకపోయినా, రిస్క్ ప్రొఫైలింగ్ టూల్‌తో మొదలుపెట్టండి. వైవిధ్యమైన, తక్కువ ఖర్చులు ఉండే ప్రోడక్టులను ఎంచుకోండి. స్వల్పకాలిక గందరగోళం ప్రభావంలో పడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ చేయండి. → ముఖ్యంగా రోబో–అడ్వైజర్లంటే మ్యాజిక్ చేసేసి, సంపదను సృష్టించే సాధనాలేమీ కాదు. క్రమశిక్షణతో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలుగా మాత్రం చూడొచ్చు. అడ్వైజర్లతో గంటల తరబడి, రోజుల తరబడి చర్చిస్తూ కూర్చోడం కన్నా సింప్లిసిటీని కోరుకునే బిగినర్స్.. మార్కెట్లలోకి తొలి అడుగు వేసేందుకు ఇది స్మార్ట్ మార్గంగా ఉపయోగపడొచ్చు. -
అలాంటి నిర్ణయాలతో రిస్క్: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
న్యూఢిల్లీ: ఆల్గోరిథమ్ ఆధారితంగా (సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్) నిర్ణయాలు తీసుకోవడం, సేవలు కొన్ని వేదికలపైనే కేంద్రీకృతం కావడాన్ని సరిగ్గా నియంత్రించకపోతే.. ఇవి సంప్రదాయ రిస్క్‌లు కానందున మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే అభిప్రాయపడ్డారు.డిజిటల్ ఆవిష్కరణలు అన్నవి నేడు కేవలం చెల్లింపులకే పరిమితం కావడం లేదన్నారు. డిజిటల్ వేదికలపై సూక్ష్మ బీమా, పింఛను ఉత్పత్తుల పంపిణీ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ తరహా డిజిటల్ ఆవిష్కరణలు తక్కువ ఆదాయ వర్గాలకు సాయపడుతున్నట్టు చెప్పారు. యూపీఐని ఇతర దేశాలకూ విస్తరించడం వల్ల సీమాంతర చెల్లింపులు వేగాన్ని సంతరించుకున్నట్టు పేర్కొన్నారు. బాధ్యాతయుతంగా అభివృద్ధి చెందగల వాతావరణాన్ని.. సురక్షితమైన, సుస్థిరమైన, కస్టమర్ కేంద్రంగా ఉండే కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాల అభివృద్ధిని ఆర్బీఐ ప్రోత్సహిస్తుందని చెప్పారు.‘‘పాలన, రిస్క్ నిర్వహణ, కస్టమర్ రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. సాంకేతిక పరమైన పురోగతి అన్నది ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతతో సరిపోలాలి’’అని స్వామినాథన్ పేర్కొన్నారు. ఫిన్‌టెక్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక వ్యవస్థ సరిహద్దులు విస్తరిస్తున్నాయంటూ, ఇది సరికొత్త రిస్‌్కలను తెచి్చపెడుతున్నట్టు చెప్పారు. వీటిని సరిగ్గా చెక్‌పెట్టకపోతే అప్పుడు విడిగా సంస్థల నుంచి మొత్తం ఆర్థిక వ్యవస్థకు రిస్‌్కలు విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఆర్థిక సేవల విస్తృతికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. -
ట్రంప్ ఓ ‘ఇడియట్’: గూగుల్ ఇమేజెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఆయన పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రంప్ పేరుతో గూగుల్‌లో సెర్చ్(Google search) చేస్తే ఆయనకు సంబంధించి తాజా వార్తావిశేషాలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తన పర్యటనలు... ఇలా విభిన్న సమాచారం ప్రత్యక్షం అవుతుంది. అయితే గూగుల్ ఇమేజెస్‌లో ఇటీవల ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తున్న వ్యూయర్లకు కూడా ట్రంప్ ఫొటోనే దర్శనమివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో అమెరికా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిటీ ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) అలా జరగడానికి కారణాలేంటో వివరించారు.ఇటీవల యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను గూగుల్ ఇమేజెస్‌లో ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలను ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ‘మేము కీవర్డ్ తీసుకుంటాం. మా ఇండెక్స్‌లోని బిలియన్లలో ఉన్న పేజీలతో సరిపోలుస్తాం. ఆ సమయంలో ఆ కీవర్డ్‌కు సంబంధించిన, తాజాగా ఉన్న, ప్రజాదరణ పొందిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తాం. ఇది పూర్తిగా ఇతర వ్యక్తులు సెర్చ్ చేస్తున్నదానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వాటిని ర్యాంక్ చేస్తాం’ అన్నారు.గూగుల్ బాంబింగ్‘ఈ విధానాన్ని ‘గూగుల్ బాంబింగ్’ అని పిలుస్తారు. ఇది ఒక నిర్దిష్ట పదాన్ని నిర్దిష్ట పేజీకి లింక్ చేయడం వంటి ఆన్లైన్ సమన్వయ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. గూగుల్ మాన్యువల్‌గా ఫలితాలను తారుమారు చేయదు. రాజకీయ పక్షపాతం వహించదు. ఈ అల్గోరిథమ్‌లు వినియోగదారుల ప్రవర్తన, ఇంటర్నెట్ ట్రెండ్స్‌ను ప్రతిబింబిస్తాయి’ అని పిచాయ్ నొక్కి చెప్పారు. ‘ఇది కొన్నిసార్లు ఊహించని లేదా వివాదాస్పద ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు. -
ప్రతి కదలికపై నజర్!
లండన్: మన ప్రతి కదలికను స్మార్ట్‌వాచ్‌ల ద్వారా రికార్డు చేసే అత్యాధునిక సాంకేతికతో కూడిన అల్గారిథమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజువారీ జరిపే ప్రతి చర్యలను ఇది రికార్డు చేస్తుందని, తద్వారా రోజులో ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది కచ్చితత్వంతో తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌వాచ్‌ల ద్వారా కేవలం యోగ, పరిగెత్తడం వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక కార్యకలాపాలు మాత్రమే రికార్డు చేయొచ్చు. అయితే తాము అభివృద్ధి చేసిన అల్గారిథమ్ ద్వారా దంతాలు శుభ్రపరుచుకోవడం, వంట చేయడం వంటి చిన్న చిన్న రోజువారీ ప్రతిచర్యలను సైతం కచ్చితత్వంతో రికార్డు చేయవచ్చని సస్సెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. ‘మానవుడు రోజు వారీ చేసే చర్యలు అమితమైనవి. వాటన్నింటినీ రికార్డు చేయాలంటే ప్రస్తు తం ఉన్న స్మార్ట్‌వాచ్‌లకు సాధ్యపడదు. ఈ సమస్యను అధిగమించేందుకే ఈ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశాం’ అని ప్రొఫెసర్ జోరేస్కి చెప్పారు. -
చిప్స్ ప్యాకెట్‌కూ చెవులుంటాయి!
న్యూయార్క్: రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు.. గోడలకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారిని గూర్చి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది! ఇక ముందు మీరు చిప్స్ తినేసి పక్కన పెట్టిన ఖాళీ ప్యాకెట్, మంచినీళ్ల గ్లాసు, పక్కనే ఉన్న ఒక మొక్క.. ఇలాంటివన్నీకూడా మీరేం మాట్లాడుకున్నారో చెప్పేస్తాయి. ఇందుకు తోడ్పడే అల్గారిథమ్ (ప్రోగ్రామ్)ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు.. అన్నిరకాల వస్తువులలో స్వల్పస్థాయిలో ప్రకంపనాలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు. కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యమున్న కెమెరాలతో.. ఆ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్ సహాయంతో విశ్లేషిస్తే.. ఆ ధ్వని పునరుత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు కూడా. తొలుత వారు ఒక ధ్వని చేసి.. ఆ ధ్వనికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లో కలిగిన ప్రకంపనాలను చిత్రించారు. వాటిని ‘అల్గారిథమ్’తో విశ్లేషించి.. అదే ధ్వని తిరిగి ఉత్పత్తి చేయగలిగారు.


