ముంబై: దేశీయంగా డిజిటల్ బీ2బీ చెల్లింపుల వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్‌ను ఆవిష్కరించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తద్వారా దీన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిల్చినట్లు వివరించింది. ఇందుకోసం ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే (ఎన్‌బీబీఎల్)తో చేతులు కలిపినట్లు తెలిపింది.
చిన్న, మధ్య తరహా సంస్థల ఇన్వాయిస్ జనరేషన్, వసూళ్లు, సెటిల్మెంట్స్ మొదలైన వాటికి ఈ ప్లాట్‌ఫాం ఉపయోగకరంగా ఉంటుందని బ్యాంకు పేర్కొంది. ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 కార్యక్రమం సందర్భంగా బ్యాంక్ ఎండీ కల్యాణ్ కుమార్, ఎన్‌బీబీఎల్ ఎండీ నూపుర్ చతుర్వేది దీన్ని ఆవిష్కరించారు.


