నో టెన్షన్‌.. ఈసారి ముందుగానే జీతాలు | Advance Salaries Banks Open Sunday, Centre Preparing 3-Day Strike | Sakshi
Sakshi News home page

నో టెన్షన్‌.. ఈసారి ముందుగానే జీతాలు

Sep 24 2026 12:06 PM | Updated on Sep 24 2026 1:04 PM

Advance Salaries Banks Open Sunday, Centre Preparing 3-Day Strike

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈసారి ముందుగానే జీతాలు, పెన్షన్లు అందనున్నాయి. మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగులు నెలాఖరున ఈ సమ్మెకు పూనుకోవడంతో వరుసగా బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా జీతాలు జమయ్యే సమయం కావడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు.

ఈ ఇబ్బందులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ సెప్టెంబర్‌ నెల జీతం, పెన్షన్‌ సాధారణ నిర్దేశిత షెడ్యూల్‌ కంటే ముందుగానే సెప్టెంబర్‌ 25వ తేదీనే వారి ఖాతాలకు జమ కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీటని ముందుస్తు చెల్లింపులుగా పరిగణించి వచ్చే అక్టోబర్‌ నెల జీతాల నుంచి సర్దుబాటు చేస్తారు.

బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ (UFBU) సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ స‍మ్మెలో దాదాపు 90 శాతం ఉద్యోగులు పాల్గొంటున్నట్లు ఫోరమ్‌ చెబుతోంది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లలో ముఖ్యంగా వారానికి ఐదు రోజుల పని విధానం, ఏకీకృత పింఛన్‌ వంటివి ఉన్నాయి.

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు
బ్యాంకు ఉద్యోగుల సమ్మె, వరుస సెలవుల నేపథ్యంలో ఖాతాదారులు, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  వారంతపు సెలవు అయినప్పటికీ ఈ ఆదివారం (సెప్టెంబర్‌ 27) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని కోరింది. ఈ మేరకు సెలవు రోజున బ్యాంకు శాఖలు, ఏటీఎం-అనుబంధ బ్యాంకు కేంద్రాలు, నగదు నిల్వ కేంద్రాలు పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించేలా ఆ‍ర్బీఐ ఆదేశించింది.

ఇదీ చదవండి: అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్‌ డాడ్‌’ సీక్రెట్‌!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement