రష్యాపై ఆంక్షలు భారత్‌కు ప్రతికూలం | Jaishankar discusses India concerns on U.S. sanctions against Russia and Iran | Sakshi
Sakshi News home page

రష్యాపై ఆంక్షలు భారత్‌కు ప్రతికూలం

Sep 24 2026 6:20 AM | Updated on Sep 24 2026 6:20 AM

Jaishankar discusses India concerns on U.S. sanctions against Russia and Iran

రూబియోతో భేటీలో జైశంకర్‌ అభ్యంతరం

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల కోసం న్యూయార్క్‌కు విచ్చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువును కొని విదేశాలకు ఎగుమతిచేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం పన్నులు విధించేందుకు ట్రంప్‌ తీసుకొచ్చిన ‘లిండ్సే ఓ గ్రాహమ్‌ రష్యా, ఇరాన్‌ ఆంక్షల చట్టం’కారణంగా భారత్‌పై ఆర్థికభారం పడనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రూబియో వద్ద జైశంకర్‌ ప్రస్తావించారు. కొత్త చట్టంతో భారత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయో, అది ఏ విధంగా తమ దేశానికి ప్రతికూలమో రూబియోకు జైశంకర్‌ వివరించారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై జైశంకర్‌తో చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగాయని రూబియో ‘ఎక్స్‌’లో వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement