taxes
-
పన్ను రాబడులపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: పన్నుల ఆదాయమే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌ను ప్రతిపాదించింది. మొత్తం రాబడుల్లో 58 శాతం పన్నుల రూపంలోనే అందుతాయని అంచనా వేసింది. పన్నుల రూపంలో మొత్తం రూ.1.75 లక్షల కోట్లు సమకూరుతాయని పేర్కొనగా.. అందులో రాష్ట్ర సొంత పన్నుల రాబడులే రూ.1.45 లక్షల కోట్ల మేర ఉంటాయని అంచనా వేసింది. ఈసారి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.51 వేల కోట్లు, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19 వేల కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.27 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.37 వేల కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ.8,535 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.1,38,181.26 కోట్లు పన్నుల రాబడి ఉంటుందని గత బడ్జెట్లో వస్తుందని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో రూ.1,29,406.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. అంటే బడ్జెట్ అంచనాల కంటే తగ్గినది రూ.8 వేల కోట్లు మాత్రమేకావడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం భారీగా పన్నుల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ల శాఖపై ఆశలు..వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,228 కోట్లు సమకూరుతాయని గత బడ్జెట్లో పేర్కొన్నా.. సవరించిన అంచనాల మేరకు ఇది రూ.14,692 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం ఈసారి రూ.19,087.26 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది. ఇది గత బడ్జెట్ ప్రతిపాదన కంటే రూ.1,000 కోట్లు, సవరించిన అంచనా కంటే రూ.5 వేల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. భూముల విలువల సవరణ తోపాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.పన్నేతర ఆదాయం ఎలా?బడ్జెట్లో పన్నేతర ఆదాయం అంచనాలు కూడా పెద్దగా తగ్గలేదు. ఈ పద్దు కింద 2024–25లో రూ.35వేల కోట్లు వస్తాయని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ.25,807 కోట్లు సమకూరుతోంది. అంటే రూ.10వేల కోట్లు తేడా ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పన్నేతర ఆదాయం అంచనాలను రూ.31,611.47 కోట్లుగా చూపింది. ఇందులో మైనింగ్ రాయల్టీ, సీవరేజీ ఫీజు, ఇసుక ద్వారా ఆదాయం కింద రూ.8 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. మరో రూ.21 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమకూర్చుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కూడా పెంచారు. 2024–25లో రూ.21,636.15 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరణలో రూ.19,836 కోట్లు వస్తున్నట్టు చూపెట్టారు. ఎక్సైజ్ ఆదాయమూ కీలకమే..2024–25 సవరణ అంచనాల మేరకు ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరుతుండగా.. 2025–26లో రూ. 27,623.36 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. ఇది సుమారు రూ.2 వేల కోట్లు అదనం. ఈ ఏడాదిలో వైన్ (ఏ4) షాపులకు లైసెన్సు గడువు ముగియనుండటంతో.. టెండర్లు పిలవనున్నారు. వైన్‌షాపుల కోసం వచ్చే దరఖాస్తుల ఫీజు రూపంలో ఈ మొత్తం సమకూర్చు కోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు.పట్టణాలకురూ. 17,677 కోట్లు» నిర్వహణ వ్యయంరూ.7,639.57 కోట్లు »ప్రగతి పద్దు రూ. 8,796.73 కోట్లు »గతేడాది కంటే ప్రగతి పద్దు రూ.3 వేల కోట్లు అధికం »మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు»2025–26 బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్లో పురపాలక శాఖకు రూ.17,677 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు రూ.7,639.96 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.8,796.73 కోట్లు ప్రతిపాదించింది. 2024–25 బడ్జెట్లో ఈ శాఖకు ప్రగతి పద్దు రూ.5,642.35 కోట్లు ఉండగా, ఈసారి రూ.3 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఇందులో పట్టణాభివృద్ధి కోసం రూ.2,957.58 కోట్లు, ప్రజారోగ్యం కోసం రూ.525.47 కోట్లు ప్రతిపాదించారు. గత సంవత్సరం సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.106.07 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,700 కోట్లు, వాటర్‌బోర్డుకు రూ.635 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పేదింటికి కొంతే.. కావాల్సింది రూ.22,500 కోట్లు.. ఇచ్చింది రూ.12,571 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 22,500 కోట్లు అవసరమన్నది గృహనిర్మాణ శాఖ లెక్కలు. కానీ, తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.12,571 కోట్లను ప్రతిపాదించింది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. గత బడ్జెట్లో రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాదని ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 72 వేల ఇళ్లకు సంబంధించి ముగ్గుపోసుకునే పనిని లబ్దిదారులు ప్రారంభించారు. ఈనెలాఖరుకు తొలివిడత రూ.లక్ష వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇప్పుడు నిధుల అవసరం చాలా ఉంది. దీంతో ప్రతిపాదించిన నిధులు, మంజూరు చేస్తున్న ఇళ్ల సంఖ్య ప్రకారం చూస్తే సరిపోదు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఆ ఇళ్లన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉండదన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. రెండుమూడు విడతల నిధుల విడుదలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఈ కేటాయింపులు సరిపోతాయన్న అంచనాతో ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇవ్వాల్సి ఉంది. అక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. -
నవ భారత ప్రణాళిక
ఒక సమాఖ్య దేశంగా భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్బీఐ ప్రైమ్ లెండింగ్ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. సహజ వనరులపై హక్కురైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్... మద్రాస్ రెజిమెంట్. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి.- వ్యాసకర్త ఫ్రీలాన్స్ కామెంటేటర్, రచయితmohanguru@gmail.com-మోహన్ గురుస్వామి -
పన్ను పోటు!
సాక్షి, అమరావతి: భారీగా మార్కెట్ అప్పులు, కేంద్రం నుంచి రుణాలతో ప్రజలపై పెనుభారం మోపడమే లక్ష్యంగా 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభకు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రజారుణం కింద ఏకంగా రూ.1.03 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. పన్నుల ఆదాయం రూపంలో వచ్చే ఆర్థిక ఏడాది అదనంగా రూ.15 వేల కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం ద్వారా అదనంగా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2024–25 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.94,966 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో సొంత పన్నుల ఆదాయం రూ.1,09,006 కోట్లుగా అంచనా వేశారు. పన్నేతర ఆదాయం 2024–25లో రూ.7,018 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో ఏకంగా రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే పన్నులు, పన్నేతర రూపంలో ప్రజల జేబులను ఖాళీ చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలున్నట్లు వెల్లడవుతోంది.రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.81,956.50 కోట్ల అప్పులు, కేంద్రం నుంచి రూ.21,700 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే మొత్తం ప్రజా రుణం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,656.50 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు బడ్జెట్లో ఆ ఊసే లేకుండా చేశారు.ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. పైగా భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బడా సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం బడ్జెట్లో ఏకంగా రూ.2000 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తం మీద పన్నుల రూపంలో ఇటు భారీ ఆదాయం, అటు భారీ అప్పులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.82 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 4.38 శాతమని చెప్పారు. మద్యం ద్వారా 2025–26లో రూ.27,097 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.13,150 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేశారు. -
నిత్యావసర ధరలపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం
-
ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి వారం గడిచింది. ఈ వారంలో ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. చైనా నుండి యూరప్ వరకు, ఉక్రెయిన్ నుండి ఇరాన్ వరకు, ట్రంప్ నిర్ణయాలను విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో అమెరికన్లు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్షునిగా అధికార బాధ్యతలు చేపట్టారు. వెంటనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గడచిన వారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.చైనాతో దోస్తీ?ముందుగా చైనా విషయానికొస్తే ట్రంప్ తొలి పదవీకాలంలో, చైనా- అమెరికా మధ్య సత్సంబంధాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 శాతం వరకు భారీగా సుంకం విధిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రంప్ వారం గడిచినా ఈ విషయమై నోరు మెదపడం లేదు. పైగా ఒక ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో ఏదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోగలరా అని అడిగినప్పుడు ట్రంప్ అందుకు సిద్దమేనన్నట్లు సమాధానం చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై మారిన వైఖరిట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ యుద్ధంపై గతంలో చేసిన వాగ్దానం అమలులో వైఖరిని మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా.. రష్యాను వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ను పావుగా వాడుకుంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం మేరకు ఇది జరిగింది. నిజానికి ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం నుండి అమెరికాను దూరంగా ఉంచవచ్చు. కానీ ఇది అమెరికా భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ మద్దతు ఉంది. ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గితే, భవిష్యత్‌లో రష్యాతో చేతులు కలిపే సందర్భం వస్తే ఎటువంటి హాని ఏర్పడదని ట్రంప్ భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు.జన్మతః పౌరసత్వ చట్టండొనాల్డ్ ట్రంప్ రెండవమారు అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ట్రంప్ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుండి అమెరికాలో అమల్లోకి వస్తాయి. ఇది విదేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరికన్ పౌరసత్వం పొందాలని కలలు కంటుంటారు. అయితే ట్రంప్ నిర్ణయం వారి కలలను కల్లలు చేసింది.ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహంట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారిలో ఆయన సన్నిహితుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ట్రంప్ ఇటీవల స్టార్గేట్ పేరుతో భారీ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నారు. స్టార్గేట్లో పాల్గొన్న మూడు కంపెనీలకు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదని మస్క్ సోషల్ మీడియాలో రాశారు.గాజా శరణార్థుల పునరావాసంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గాజా శరణార్థుల పునరావాసానికి సంబంధించి ఓ ప్రతిపాదన చేశారు. గాజాలో ఉండలేకపోతున్న పాలస్తీనా వాసులు అక్కడికి పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో తాత్కాలిక పునరావాసం పొందాలని ట్రంప్ సూచించారు. గాజా ప్రాంతం నాశనమైందని, అక్కడి ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సహకరించాలని ఆయన కోరారు.ఆర్థిక సాయం నిలిపివేతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యుద్ధంలో చిక్కుకున్న ఉక్రేయిన్ కూడా ఆర్ధిక సాయం నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్లకు సైనిక బలగాల పెంపు కోసం అందించే నిధులకు మినహాయింపులు ఇవ్వడం విశేషం.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
ఇప్పటిది ఓకే.. మరి అప్పట్లో..
ప్రస్తుత కుంభమేళా కనీసం రూ.2–4 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుందన్నది ఓ అంచనా. మరి అప్పట్లో అంటే 1870లో అలహాబాద్‌లోనే బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన కుంభమేళాలో ఎంత వచ్చి ఉంటుంది? కరెక్టుగా చెప్పాలంటే.. రూ.41,824! ఇందులో పావు వంతు క్షురకుల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చినదే. అప్పటి కుంభమేళాలో భక్తజనం కోసం 2,500–3,000 మంది క్షురకులను పెట్టారు. ఇక్కడ వ్యాపారం చేసుకున్నందుకు గానూ వీరి నుంచి రూ.4 చొప్పున పన్ను వసూలు చేశారు. ఈ కుంభమేళాతో వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు.. అలాగే అల్ఫ్రెడ్ పార్క్, అలహాబాద్ మ్యూజియం, వైద్య సదుపాయాల కోసం వెచ్చించింది. తర్వాత 1882లో జరిగిన కుంభమేళాలో రూ.49,840 మేర ఆదాయం వచ్చిందట. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా?: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం(నవంబర్ 16) రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా?విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు.ఐదు నెలల్లో రూ.57వేల కోట అప్పులు చంద్రబాబు చేశారు.ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీడీపీ చెప్పిన అబద్ధాలు స్పష్టమయ్యాయి. గతంలో వైఎస్జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి రూ.11వేల కోట్లు ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్చగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక పాలసీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించేది. ఈనాడులో నిస్సిగ్గుగా వైఎస్జగన్ కుటుంబ సభ్యులపై వార్తలు రాయడం దారుణం. మనుషుల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసే విధంగా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు’అని మార్గాని భరత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం -
రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ ఆర్జన శాఖలకు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై భారం పడకుండానే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించి ఆదాయ ఆర్జన శాఖలు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి మించి అదనంగా 15 శాతం 25 శాతం వరకు పెంచాలని ఆయా శాఖల అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రాన్ని నిధులు అడగలేమని, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల ద్వారానే అమలు చేయాల్సి ఉందని ఆయన చేశారు. ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, మైనింగ్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం మేరకు సీఎం సమీక్షలో ఆదాయ ఆర్జన శాఖలకు ఆర్థిక శాఖ భారీ ఆదాయ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపు ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.8000 కోట్ల ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను భూముల విలువను పెంచాల్సిందిగా సూచించింది. దీని ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఆదాయం పెంచాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ చార్జీల పెంపుపైన కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీ ఎగవేతలను నిరోధించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాల్సిందిగా సూచించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ప్రస్తుతం రూ.4,500 కోట్లు ఆదాయం వస్తోందని, దీన్ని రూ.8000 కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థికశాఖ నిర్దేశించింది. నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ఆదాయం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాల్సిందిగా సూచించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే హామీలు అమలు చేయగలమని, ఈ నేపథ్యంలో ఆదాయ ఆర్జన శాఖలు అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. నినాదంతో ముందుకు సాగాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం పరిశ్రమలశాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌తో కలిపి ఐదు అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం ద్వారా ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని మెరుగుపరచాలని సూచించారు. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి వంతున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
గ్రానైట్ దందాకు వెల కట్టి వేలం!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి, అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తూ మార్టూరు నుంచి పాలి‹Ù్డ గ్రానైట్ పలకలను జీరో దందాతో అక్రమంగా తరలిస్తున్నారు. జీరో దందా కోసం వ్యాపారులు అధికార పార్టీ పర్చూరు ముఖ్యనేత అనుచరులకు ఒక్కో లారీకి రూ.40 వేలు చొప్పున కప్పం చెల్లిస్తున్నారు. రోజుకు 80 లారీలకుపైగా గ్రానైట్ తెలంగాణకు తరలిపోతుండగా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతోంది. పర్చూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల టీడీపీ నేతలు ఇందులో వాటాలు పంచుకుంటున్నారు. దందా నడిపిస్తున్న పర్చూరు ముఖ్యనేత, చిలకలూరిపేట నేతకు నెలకు రూ. 2.64 కోట్లు చొప్పున చెల్లిస్తుండగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నేతలు ముగ్గురికీ నెలకు రూ.2.20 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, కమర్షియల్ టాక్స్ అధికారులకు కలిపి నెలకు రూ.60 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రోజుకు ఒక్కో లారీకి రూ. 40 వేల చొప్పున 80 లారీలకు రూ.32 లక్షలు వంతున దందా నిర్వాహకులు నెలకు రూ. 9.60 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ నేతలు, అధికారులకు రూ.5.44 కోట్లు చెల్లిస్తుండగా రూ.4.17 కోట్లు దందా నిర్వాహకుల వాటాగా చెబుతున్నారు. ఖజానాకు భారీగా గండి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిష్డ్ రాయికి సేల్స్ టాక్స్ రూ.1,300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున మొత్తం రూ.2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్ కట్టాలి. రోజుకు 80 లారీలు దొడ్డి దారిన గ్రానైట్‌ను తరలిస్తుండగా నిత్యం రూ.56 లక్షలు చొప్పున నెలకు రూ.16.80 కోట్లు టాక్స్ ఎగ్గొడుతున్నారు. గ్రానైట్ పాలి‹Ù్డ రాయి అక్రమ రవాణా వ్యవహారం అధికార పార్టీలో కాక రేపుతోంది. ప్రధానంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పంచాయితీ నిర్వహించనున్నట్లు తెలిసింది. -
ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలు తగ్గవు..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో కోత విధించే అవకాశం లేదని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఈ నేపథ్యంలో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితి లేదని చెప్పారు. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతానికి దిగుమతులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ధరలు ఇప్పటికే తగ్గినప్పుడు, ఇక పన్ను తగ్గింపు ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు కోసం అడగవచ్చు, కానీ పన్నుల తగ్గింపు గురించి ఇప్పుడు ప్రశ్నించడం సరికాదు’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని చివరిసారిగా మే 2022లో తగ్గించారు. ఈ నిర్ణయం మేరకు పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు రూ.8 తగ్గింది. డీజిల్‌పై రూ.6 తగ్గించడం జరిగింది. రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం! బడ్జెట్ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శాఖ సీనియర్ అధికారి తెలిపారు. -
గ్రేటర్ వరంగల్‌లో ‘క్యూఆర్ కోడ్’తో పన్నుల చెల్లింపు... స్కాన్ అండ్ పే..
వరంగల్ అర్బన్: స్మార్ట్ సేవలు అందించడంలో గ్రేటర్ వరంగల్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో మొదటిసారిగా క్యూ ఆర్ కోడ్ సిస్టమ్‌ను వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనూతన విధానంతో ప్రజలు సులువుగా పన్నులు చెల్లించేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆస్తి, చెత్త పన్నులు, నీటి చార్జీలు ఇళ్లు, ఆఫీస్, వ్యాపార దుకాణాల్లో నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అన్ని రకాల పన్నులకు సంబంధించి కార్యకలాపాలను అనుసంధానం చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మీసేవ, ఈసేవ, అమెజాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్ను కట్టేందుకు సౌకర్యం ఉంది. ఆన్లైన్లో సొమ్ము చెల్లిస్తే నగదు సక్రమంగా జమ కాని పరిస్థితులూ ఉన్నాయి. నూతన విధానం ద్వారా పారదర్శకంగా చెల్లింపులకు వీలు కలగనుంది. నగరంలో 2,07 లక్షల అసెస్మెంట్లు(భవనాలు) ఉండగా.. 1.70 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 1.20 లక్షల అసెస్మెంట్లకు డిజిటల్ డిమాండ్ నోటీసులను పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నోటీసులను ఒకటి, రెండు రోజుల్లో అందిస్తామని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా రెండు రకాలుగా పన్నులు చెల్లించే అవకాశం ఉంది. ● ఇళ్లల్లో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో పన్నుల విభాగానికి చెందిన బిల్ కలెక్టర్లు క్యూఆర్ కోడ్‌తో కలిగి ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసుల్ని పంపిణీ చేస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పన్నులు, వడ్డీ చూపెడుతుంది. ఆసొమ్ము చెల్లిస్తే బల్దియా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. ● క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసులు అందకపోతే మరో విధానం ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పే ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే ‘ఇ మునిసిపాలిటీ తెలంగాణ’ సైట్లో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జిల్లా, ప్రాంతం, సర్కిల్, ఇంటి నంబర్ ఎంటర్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అదేవిధంగా వాటర్ చార్జీ చెల్లింపునకు క్యాన్ నంబరు డీటెయిల్స్‌పై క్లిక్ చేసి కింది భాగంలో ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేస్తే వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆస్తి, నీటి, చెత్త పన్నుల చెల్లింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లిస్తేనే నగరాభివృద్ధి జరుగుతుంది. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – షేక్ రిజ్వాన్ బాషా, బల్దియా కమిషనర్ -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు? కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ?
వాహనదారులకు త్వరలో కేంద్రం శుభవార్త చెప్పనుందా? దేశంలో భారీగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? పెట్రోల్, డీజిల్‌తో సహా మరికొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం ఉందా? అవుననే అంటున్నాయి రాయిటర్స్ కథనాలు. ఆకాశాన్ని తాకిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కొన్నింటిపై ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది. గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఆర్బీఐ కృషి చేస్తున్నాయి. ఇందలో భాగంగా గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయితే జనవరి నెల నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసరడంతో కేంద్రం, ఆర్బీఐ లెక్కలు తారుమారయ్యాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరింది. జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న దానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది. దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం మొక్కజొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే పెట్రో ధరలపై మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. దీనిపై అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, ఆర్బీఐ గానీ స్పందించలేదు. -
కొత్త పన్నుల యోచన లేదు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్తగా పన్నులు వేసే ఆలోచన లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సూచనలు చేస్తోందని చెప్పారు. జూన్ నాటికి రూ.20 వేల కోట్లను సమకూర్చుకోనున్నామని, నిరర్ధక ఆస్తులను వనరులుగా మార్చుకుంటున్నామని తెలిపారు. కే వలం భూములను అమ్మడం ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామనడం సరికాదన్నారు. బుధవారం బడ్జెట్‌పై సాధారణ చర్చ అనంతరం కాంగ్రెస్ సభా పక్షనేత భట్టి విక్రమార్క అడిగిన క్లారిఫికేషన్స్‌కు ఆయన సమాధానమిచ్చారు. పాత్రికేయులకు వెంటనే స్థలాలివ్వండి: భట్టి లిక్కర్, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని బడ్జెట్లో భారీగా చూపటం అనైతికమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వచ్చే విదేశీయులకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు వెళ్తే మాత్రం ఎందుకు అరెస్టు చేస్తోందని నిలదీశారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను అందజేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత పాత్రికేయులకు వెంటనే ఆ స్థలాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి నాలుగైదు గంటలు కూడా కరెంటు సరఫరా కావటం లేదని సభ దృష్టికి తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో చెరువు నీటిని తాగినందుకు ఓ మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించేందుకు ఆయన ప్రయత్నించగా, ముందస్తు అనుమతి తీసుకోనందున అనుమతించలేమని స్పీకర్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై.. బడ్జెట్లో నిరుద్యోగుల భృతి, స్పోర్ట్స్ పాలసీ, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తావన లేదని బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రస్తావించగా.. క్రీడా విధానంపై మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రకటన చేస్తారని, డబుల్ బెడ్రూం ఇళ్లను హడ్కో నుంచి తెచ్చే రుణం ద్వారా పూర్తి చేస్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, మూడు పెండింగ్ డీఏలను చెల్లించటంతోపాటు తక్షణమే కొత్త పీఆర్సీ కమిటీ వేయాలని, సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు సమాధానమిచ్చారు. -
ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లు ఇవ్వడం లేదని గత మూడు బడ్జెట్ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పన్నుల్లో వాటా కింద ప్రతిపాదించిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తోంది... కానీ, కేంద్రంపై ఆధారపడి ఉన్న రెండు పద్దుల కింద మాత్రం తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను చూపెట్టింది. వచ్చే ఏడాదికైనా కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతుందా అనే ఆశతో పెట్టిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ. 62,730.01 కోట్ల మేర రాబడులను ఈసారి బడ్జెట్లో చూపెట్టడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపారు. అయితే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద గత ఏడాది (2021–22) వచ్చింది కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే. 2022–23 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ. 41,001.73 కోట్లు వస్తుందని ప్రతిపాదించినా డిసెంబర్ నాటికి వచ్చింది రూ.7,770.92 కోట్లే. మిగిలిన మూడు నెలల్లో ఎంత వస్తుందనే అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద ఏకంగా రూ.30,250 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2022–23 సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది (2023–24)కి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30వేల కోట్లకు మరో రూ.11వేల కోట్లు అదనంగా ‘గ్రాంట్స్’రూపంలో రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గ్రాంట్స్ పద్దు కింద రాష్ట్రం ఆశిస్తున్న మొత్తానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో మినహా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు కాదు కదా అందులో సగం కూడా ఎప్పుడూ కేంద్రం ఇవ్వలేదు. పన్నుల్లో వాటా... పరవాలేదా? ఇక, కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో ప్రతిపాదనలు, మంజూరు గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నా కేటాయించిన మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2021–22లో రూ.18,720.54 కోట్లు కేంద్రం నుంచి రాగా, 2022–23 సవరించిన అంచనాల మేరకు రూ.19.668.15 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, తాజా బడ్జెట్లో ఈ పద్దును రూ.21,470.84 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా విభేదాలున్నప్పటికీ కేంద్రంపై నమ్మకంతో తాజా బడ్జెట్లో ఈ రెండు పద్దుల కింద రూ.62 వేల కోట్ల (దాదాపు 20 శాతం) రాబడులు చూపారు. ఇదే విషయమై ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రావాల్సిన నిధులను అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం తెలంగాణకు కూడా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కొన్నేళ్లుగా తక్కువగానే వస్తున్నా కేంద్రంపై ఆశలు పెట్టుకునే ప్రతిపాదనలు చేశామని చెప్పారు. -
విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుతోపాటు, ఎగుమతి చేసే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ప్రాఫిట్ (గుంపగుత్త లాభాలు) పన్నును కేంద్ర సర్కారు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత దిగిరావడంతో అందుకు అనుగుణంగా పన్నులను తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.2,100గా ఉన్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్ను రూ.1,900కు తగ్గింది. ఎగుమతి చేసే ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.6.5గా ఉన్న పన్ను రూ.5కు తగ్గింది. ఏటీఎఫ్ లీటర్‌పై రూ. 4.5 నుంచి రూ.3.5కు తగ్గింది. కొత్త పన్ను రేట్లు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది చమురు ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీనివల్ల దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఇలా గుంపగుత్తగా వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును 2022 జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి జనవరి 3నాటి సమీక్షలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును కేంద్రం పెంచింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ మేరకు తాజాగా ఉపశమనం కల్పించింది. అంతర్జాతీయ పరిణామాలు.. అంతర్జాతీయంగా చాలా దేశాలు విండ్‌ఫాల్ లాభా ల పన్నును అమల్లోకి తీసుకురావడం గమనార్హం. ఆరంభంలో కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతిపై రూ.6 చొప్పు,. లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 చొప్పున పన్ను విధించింది. దేశీయ ంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ. 23,250 పన్నును అమలు చేసింది. తదుపరి మొద టి సమీక్షలోనే పెట్రోల్‌పై ఈ పన్నును ఎత్తివేసింది. -
సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు. ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు జపాన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఫైన్ విధించింది. జపాన్ రాజధాని టోక్యో నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ అమ్మకాల్ని నిర్వహిస్తుంది. అయితే టోక్యోకి వచ్చే విదేశీయులకు యాపిల్ కంపెనీ భారీ ఎత్తున ఐఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లపై ఎలాంటి దిగుమతి సుంకం చెల్లించకుండా బల్క్‌లో ఫ్రీగా అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహించిన యాపిల్ 105 మిలియన్లు (రూ. 870 కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు క్యోడో మీడియా పలు కథనాల్ని ప్రచురించింది. క్యోడో నివేదిక ప్రకారం..జపాన్‌లో యాపిల్ సంస్థ $1,04,16,84,000 (రూ. 8,634 కోట్లు) పన్ను మినహాయింపు పొందింది. ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించకుండా సెప్టెంబర్ 2021 నుండి రెండు సంవత్సరాల పాటు విక్రయాలు సాగించినట్లు ట్యోక్యో రీజనల్ ట్యాక్సేషన్ బ్యూరో అధికారులు గుర్తించారు. యాపిల్ తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రొడక్ట్‌లపై రీసేల్ నిర్వహించినట్లు పేర్కొంది. అనైతికంగా వ్యాపారం యాపిల్ అనైతికంగా నిర్వహిస్తున్న బిజినెస్‌పై దృష్టిసారించిన ట్యాక్సేషన్ బ్యూరో గతేడాది నుంచి విచారణ చేపట్టింది. ఈ విచారణలో అసాదారణ లావేదేవీలు, యాపిల్ స్టోర్ నుంచి వందల సంఖ్యలోని యాపిల్ డివైజ్‌లను టూరిస్ట్‌లకు అమ్మినట్లు గుర్తించిందని జపాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందుకే తక్కువ సేల్స్ (underreported) నిర్వహించిన ప్రొడక్ట్‌లపై 105 మిలియన్ల అదనపు పన్ను, ట్యాక్స్ చెల్లించాల్సిన ఉత్పత్తులపై అదనపు వినియోగపు పన్నును భారీగా విధించనుంది. టూరిస్ట్‌ల ముసుగులో జపాన్‌కు వచ్చిన విదేశీయులు ఆరు నెలలలోపు కొనుగోలు చేసే వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అదే వస్తువుల్ని రీసేల్ చేస్తే.. జరిపిన విక్రయాలను బట్టి పన్ను కట్టాలి. కాబట్టే యాపిల్..ఐఫోన్లు, ఇతర ప్రొడక్ట్‌లను జపాన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు విక్రయించి.. ఆపై వాటిని విదేశాలకు భారీ ఎత్తున తరలించి పన్ను మినహాయింపు పొందేలా బిజినెస్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు ట్యాక్స్ బ్యూరో అధికారులు అనుమానిస్తున్నారు. చైనా పౌరులపై కేసులు 2020లో జపాన్ను సందర్శించేందుకు టూరిస్ట్, ఇతర వీసాలను ఉపయోగించిన ఏడుగురు చైనీయులపై కేసులు నమోదయ్యాయి. ఒసాకా ప్రాంతీయ ట్యాక్స్ బ్యూరో అధికారులు వారి కొనుగోళ్లపై సుమారు $56,58,162 (దాదాపు రూ. 46 కోట్లు)ను వసూలు చేసింది. క్యోడో నివేదించిన ప్రకారం రూ. 475 కోట్ల విలువైన లగ్జరీ బ్రాండ్ వస్తువులు. వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లతో కూడిన ఉత్పత్తులను రీసేల్ కోసం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో రీసేల్ నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్లలో కాస్మోటిక్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన సందర్భాలు వెలుగులోకి రావడంతో ట్యాక్స్ బ్యూరో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు అప్రమత్తమయ్యారు. డిపార్ట్మెంట్ స్టోర్ల యజమానులు అనైతికంగా విక్రయాలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’? -
వాహన పరిశ్రమ వృద్ధికి విఘాతం
న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు. ‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్‌యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
చమురు కంపెనీలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదల వల్ల దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలు ఆర్జిస్తున్న భారీ లాభాలపై (విండ్‌ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఎత్తివేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. చమురు ధరలు మోస్తరు స్థాయికి చేరుకోనుండడాన్ని ఇందుకు అనుకూలంగా ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి విండ్‌ఫాల్ పన్నును కేంద్ర సర్కారు అమల్లోకి తీసుకురావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించే, ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లపై దీన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉత్పత్తి కంపెనీలకు ఒక్కసారిగా అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఈ ప్రయోజనాన్ని కొంత వరకు పన్నుల రూపంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తీసుకునే ప్రయతాన్ని ప్రభుత్వం చేసింది. దేశ చమురు వినియోగంలో 15 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నదే ఉంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దశాబ్ద గరిష్టాలకు చేరడం తెలిసిందే. ఈ ఏడాది చివరికి బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద స్థిరపడుతుందని ఫిచ్ అంచనా వేసింది. ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు పుంజుకుంటాయని, 2022లో నష్టాలను అవి కొంత వరకు భర్తీ చేసుకుంటాయని ఫిచ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. రిఫైనింగ్ మార్జిన్లు మధ్య స్థాయికి చేరుకుంటాయని, చమురు మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ అంశాలు మెరుగుపడతాయని పేర్కొంది. -
బడ్జెట్ అంచనా 53 వేల కోట్లు.. వచ్చింది 11వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన ఆర్థిక సహకారం అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం నిధుల్లో కేవలం 20 శాతం మాత్రమే వచ్చాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద రూ.53 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.11 వేల కోట్లే రావడం గమనార్హం. మరో ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇంకా 80శాతం నిధులు రావాల్సి ఉండగా, అందులో సగం రావడం కూడా అనుమానమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుపై వివక్ష వాస్తవానికి, కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో రాష్ట్రాలకు ఆర్థిక ఆసరా అందుతుంది. ఇందులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా ఒకటైతే, వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరొకటి. ఈ రెండు పద్దులను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా కింద గత ఏడు నెలల్లో రాష్ట్రానికి రూ.5,911.06 కోట్లు (47.64 శాతం) వచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది పన్నుల్లో వాటా కింద రూ. 12,407.64 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు అయితే పూర్తిగా వివక్షకు గురవుతోంది. ఈ పద్దు కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.41,001.73 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా.. అందులో కేవలం 13.64 శాతం అంటే... రూ. 5,592.66 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొదవే లేదు తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులో కోత పెడుతున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా మంజూరు చేస్తోంది. రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా, వాటి వార్షిక బడ్జెట్ పద్దు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా 35 నుంచి 80 శాతం వరకు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఇందులో గుజరాత్‌కు అయితే దాదాపు 80 శాతం నిధులు ఇచ్చేసింది. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశా, త్రిపుర... ఇలా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి తెలంగాణ కంటే ఎక్కువగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం అందడం గమనార్హం. పన్నుల్లో వాటా కింద కూడా ఈ రాష్ట్రాలకు కేంద్రం.. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే పంపిందని కాగ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని లిజ్ ట్రస్‌పై భారత సంతతి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ విజయం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. యూగవ్ తాజాగా నిర్వహించిన గ్యాలప్ పోల్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే మళ్లీ ట్రస్‌కు ఓటేస్తామన్నారు. రిషి వైపు 55% మంది మొగ్గు చూపారు. పన్నుల్లో కోత పెట్టి, వివాదాస్పదం కావడంతో వాటిని ఉపసంహరించుకున్న లిజ్‌ట్రస్ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ ఈ సర్వే చేపట్టారు. ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని 55 శాతం మంది కోరుకుంటుంటుండగా, కొనసాగాలని 38% మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. పార్టీ గేట్ కుంభకోణంతో తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను సరైన ప్రత్యామ్నాయంగా 63 శాతం మంది పేర్కొనడం విశేషం. ప్రధానిగా జాన్సన్‌ను 32%, రిషిని 23 శాతం బలపరిచారు. తప్పులు చేశాం..క్షమించండి: లిజ్ ట్రస్ ప్రధాని లిజ్‌ట్రస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లో నెట్టాయి. సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఆర్థిక మంత్రిని నియమించాను. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం’అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీలోగా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: రష్యా కొత్త పంథా.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి -
ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థిరంగా పన్ను ఆదాయం.. కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే! -
జీఎస్టీ వసూళ్లలో తగ్గేదేలే!.. టార్గెట్ రూ.1.5 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు అక్టోబర్ నుంచి రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలలకు జీఎస్టీ ఆదాయం సగటున రూ.1.4 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వరుసగా రూ.1.5 లక్షల కోట్లు దాటి నమోదు కావడం లేదు. ఆగస్ట్ నెలకు రూ.1.43 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చింది. వార్షికంగా క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోల్చి చూసినప్పుడు 28 శాతం పెరిగింది. కానీ, జూలైలో వచ్చిన రూ.1.49 లక్షల కోట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఆ నెలకు రూ.1.67 లక్షల కోట్ల ఆదాయం నమోదైంది. సీబీఐసీ కార్యక్రమంలో భాగంగా తరుణ్ బజాజ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించేందుకు గత కొన్ని నెలలుగా తాము కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు. కొన్ని సందర్భాల్లో రూ.2,000 కోట్లు, రూ.6,000 కోట్లు తక్కువ నమోదైనట్టు తెలిపారు. కానీ, అక్టోబర్ నెలకు జీఎస్టీ ఆదాయం రూ.1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తర్వాత నుంచి స్థిరంగా రూ.1.5 లక్షల కోట్ల పైన నమోదవుతుందని అంచనా వేశారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి సైతం పాల్గొన్నారు. చదవండి: దేశంలో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ! -
భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం
న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను మెరుగుపర్చడం, ట్యాక్సేషన్‌ను సరళీకరించడం, టారిఫ్‌లపరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం మొదలైన సంస్కరణలు .. ప్రపంచ దేశాలతో భారత్ జరిపే వాణిజ్య లావాదేవీలకు కీలకమని ఒక నివేదిక పేర్కొంది. అబ్జర్వర్వ్ రీసెర్చ్ ఔండేషన్ (ఓఆర్ఎఫ్), ఓఆర్ఎఫ్ అమెరికా సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కోవిడ్ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లోకి (జీవీసీ) భారత్ ఏ విధంగా అనుసంధానం కాగలదనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని తయారు చేశాయి. నిర్దిష్ట ఉత్పత్తి తయారీలో వివిధ దేశాలు పాలుపంచుకునే ప్రక్రియను జీవీసీగా వ్యవహరిస్తారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో సరఫరా పరమైన సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఆర్థిక ప్రగతికి దివ్యౌషధంగా భావించిన జీవీసీ, ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోందని వివరించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, భారీ యంత్రాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న 200 పైచిలుకు దేశ, విదేశీ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయిదు సవాళ్లు.. ‘భారత్‌లో వ్యాపార విస్తరణకు కంపెనీలు ప్రధానంగా ఐదుఅడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటిలో ట్యాక్సేషన్ నిబంధనలు .. పాలసీలు; మౌలిక సదుపాయాల నాణ్యత (లోపాలు); వాణిజ్య.. టారిఫ్ విధానంలో అనిశ్చితి; మూలధనం (అందుబాటులో లేకపోతుండటం); ముడి వస్తువులు (కొరత) ఉన్నాయి‘ అని నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో జీవీసీలో అను సంధానానికి తోడ్పడేందుకు అత్యవసరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని వివరించింది. అలాగే కీలకమైన సరఫరా వ్యవస్థల్లోని బలహీనతలను గుర్తించడం, నియంత్రణ పరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం, లాజిస్టిక్స్.. రవాణా నిబంధనలను సమన్వయ తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించింది. మరిన్ని విశేషాలు.. ♦భారత వాణిజ్య భాగస్వామిగా అంతా ఏకగ్రీవంగా అమెరికాకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) గ్రూప్‌నకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ♦ జీవీసీలో భాగం కావడం తమకు చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 87 శాతం కంపెనీలు తెలిపాయి. మహమ్మారి అనంతరం జీవీసీల విషయంలో తమ అభిప్రాయాలు మారినట్లు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ♦ ఎక్కువగా ఇతరులపై ఆధారపడే తయారీ విధానాల వల్ల పరిశ్రమకు రిస్కులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ♦ దేశీ విధానాలు తమ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని ఆటో కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు తమపై ప్రభావం చూపుతాయని మిగతా రంగాల కంపెనీలు తెలిపాయి. ♦ జీవీసీతో అనుసంధానమయ్యేందుకు భారత్ వాణిజ్య విధానాలు చాలా ముఖ్యమని 70 శాతం సంస్థలు తెలిపాయి. వైద్య పరికరాలు, ఫార్మా పరిశ్రమలో ఈ ధోరణి మరింత స్పష్టంగా (93 శాతం) కనిపించింది. ♦ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ’ముడి వస్తువుల లభ్యత’ కీలకంగా ఉంటోందని 74 శాతం సంస్థలు వివరించాయి. నిపుణులైన సిబ్బంది అంశం తర్వాత స్థానంలో (70 శాతం కంపెనీలు) ఉంది. -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్‌ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్‌తో రూపాయి శుక్రవారం మరో ఆల్‌టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
పెట్రోల్ ‘ట్యాంక్’ ఖాళీ అవుతోంది!.. క్రూడాయిల్ లెక్కలివీ..
పెట్రోల్.. డీజిల్.. ఇవి లేనిదే బండి కదలదు.. మనుషుల బతుకూ కదలదు.. రేటు పెరిగిందంటే కలకలమే. పొద్దున ఇంటికొచ్చే పాల ప్యాకెట్ నుంచి విమాన ప్రయాణం దాకా అన్నీ ఖరీదవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికైతే బిల్లు గుండె గుభేలుమనిపిస్తుంటుంది. ఇటీవలే మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడం, కేంద్రం కాస్త తగ్గించాక ఉపశమనం ఫీలవడం అందరికీ తెలిసిందే. మరోవైపు ప్రపంచంలో చమురు నిక్షేపాలు అడుగంటుతూ ఆందోళన రేపుతున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్ ఎలా వస్తుంది? ఎక్కడ ఎక్కువగా నిల్వలున్నాయి? అసలు ధర ఎంత? మనకు చేరేది ఎంతకనే వివరాలు తెలుసుకుందాం.. లక్షల ఏళ్ల కింద సముద్రం అడుగున కూరుకుపోయిన జంతు, వృక్ష అవశేషాలు.. విపరీతమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ముడి చమురుగా మారాయి. శిలాజాల నుంచి వచ్చే ఇంధనం కాబట్టి శిలాజ ఇంధనమని పిలుస్తారు. కొన్నిచోట్ల నేచురల్ గ్యాస్ రూపంలోనూ ఉంటాయి. విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ముడి చమురు వనరులు తగ్గిపోతున్నాయి. ఇలాగే కొన సాగితే మరో 47 ఏళ్లలో భూమ్మీ ద పెట్రోలియం నిల్వలు ఖాళీ అయిపోతాయని అంచనా. వేల ఏళ్ల నుంచీ వినియోగం యూరప్, అమెరికా, మధ్యాసి యా, చైనా తదితర దేశాల్లో వేల ఏళ్ల కిందటి నుంచీ చమురు విని యోగం ఉంది. భూమి పొరల్లో పగుళ్ల నుంచి పైకి ఉబికి వచ్చే చమురును వివిధ అవసరాలకు వాడేవారు. 1850 సంవత్సరంలో ముడి చమురు నుంచి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలు, కందెన (లూబ్రికెంట్)ను వేరు చేసే పద్ధతులను కనిపెట్టడంతో.. వినియోగం పెరిగిపోయింది. కిరోసిన్, పె ట్రోల్‌తో నడిచే వాహనాలు వచ్చాయి. వీధి లైట్లు వెలిగించడం, పరిశ్రమల్లో వినియోగించడం మొదలైంది. తర్వాత అసలు పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మానవ మనుగడే ముందుకు కదలనంత గా మారిపోయింది. అంతర్జాతీయంగా ఏదైనా స మస్య ఏర్పడినా,దేశాల మధ్య యుద్ధం వచ్చినా చమురు ధరలకు రెక్కలు రావడం.. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైనే ఆధారపడిన ఇండియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రూడాయిల్ లెక్కలివీ.. ►ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన చమురు నిక్షేపాలు: 1,65,058 కోట్ల బ్యారెళ్లు ►వెనెజువెలా 18.2శాతం నిక్షేపాలతో టాప్‌లో ఉండగా.. సౌదీ (16.2%), కెనడా (10.4%), ఇరాన్ (9.5%), ఇరాక్ (8.7%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ►ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ఉత్పత్తి జరుగుతున్న దేశాలు: 127 ►మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో ఒక్క అమెరికా వాటా: 20.3% ►టాప్–10 దేశాలు వాడేస్తున్న క్రూడాయిల్: 60 శాతం ►ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 50 వేలకుపైగా చమురు బావులు ఉన్నా యి. అందులో 2–3 వేల బావుల్లోనే 95%పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ముడి చమురు ధరల లెక్క ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎడారులు, తీర ప్రాంతాల్లో, తీరానికి కాస్త దూరంగా సముద్రతలం దిగువన (డీప్ వాటర్) ముడి చమురు నిక్షేపాలను గుర్తించారు. ఇందులోనూ నేరుగా భారీగా ఉండే చమురు రిజర్వాయర్లు కొన్నికాగా.. రాతిపొరల మధ్య ఉండే (షేల్) నిక్షేపాలు మరికొన్ని. సౌదీ వంటి దేశాల్లో ఎడారుల్లో భారీ నిక్షేపాలు ఉన్నాయి. దానితో ఉత్పత్తి ధర తక్కువ. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, యూరప్ దేశాల్లో తీరప్రాంతాలకు కాస్త దూరంగా సముద్రతలం దిగువన నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీయడం కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇక షేల్ నిక్షేపాల నుంచి చమురు తీయడానికి మరింత వ్యయం అవుతుంది. ఉత్పత్తి ఖర్చు ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను బట్టి ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి. ►సగటున చూస్తే సౌదీలో ఒక్కో బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తికి కేవలం 3డాలర్లు (సుమారు రూ.230) ఖర్చయితే.. గల్ఫ్ దేశాలు, రష్యా, పలు ఆఫ్రికా దేశాల్లో సగటున 15డాలర్ల (రూ.1,160) వరకు, అమెరికా–యూరప్ దేశాల్లో 50–60 డాలర్ల (రూ. 3,800–రూ.4,600) వరకు ఖర్చవుతుంది. ►ప్రస్తుతం మార్కెట్లో బ్యారెల్ ధర సుమారు 113 డాలర్ల (రూ.8,773) వద్ద ఉంది. ►చమురును శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులకు వేర్వేరు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. ►క్రూడాయిల్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలు చాలా వరకు సొంతంగా వినియోగించుకుంటున్నాయి. అదే కేవలం ఎగుమతులను బట్టి చూస్తే.. ప్రపంచంలో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా, ఇరాక్, కెనడా, అమెరికా, నైజీరియా, కువైట్, బ్రెజిల్, కజకిస్థాన్, నార్వే ఉన్నాయి. దేశంలో సగానికిపైగా పన్నులే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ల రీటైల్ ధరల్లో సగానికిపైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే కావడం గమనార్హం. కేంద్ర పన్ను దేశవ్యాప్తంగా ఒకేలా ఉండగా, ఆయా రాష్ట్రాల్లో పన్నులు వేర్వేరుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా క్రూడాయిల్ ధరలను బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్‌ల మూల ధర సగటున సుమారు రూ.49–రూ.52 మాత్రమే. కానీ కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలిపి పెట్రోల్ ధర రూ.96 నుంచి రూ.112 మధ్య.. డీజిల్ ధర రూ.87 నుంచి రూ.99 మధ్య ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర, పన్నులు ►లీటర్ పెట్రోల్ మూల ధర: రూ.49.2 ►కేంద్ర పన్నులు: రూ.28 ►డీలర్ల కమీషన్: రూ.5.45 ►రాష్ట్ర పన్నులు: రూ.26.95 ►మొత్తంగా రీటైల్ ధర: రూ.109.7 ( మే 25 నుంచి జూన్ 3 వరకు సగటు ధరల ఆధారంగా లెక్కించారు. రవాణా వ్యయం, ఇతర అంశాల ఆధారంగా స్థానికంగా ధర మారుతుంది.) ఇండియా ఎక్కడ? ►ఇప్పటివరకు గుర్తించిన మొత్తం చమురు నిల్వలు: 472.9 కోట్ల బ్యారెళ్లు ►ప్రపంచ క్రూడాయిల్ నిల్వల్లో శాతం: 0.29 ►ఉత్పత్తిలో ర్యాంకు: 20 ►దేశంలో రోజువారీ ఉత్పత్తి: 10.16 లక్షల బ్యారెళ్లు ►రోజువారీ వినియోగం: 44.43 లక్షల బ్యారెళ్లు ►దిగుమతి చేసుకోకుండా ఇండియాలోని చమురు వనరులను మొత్తం వాడేస్తే.. కేవలం మూడేళ్లలో ఖాళీ అయిపోతాయని అంచనా. చరిత్ర ఇదీ ► ప్రపంచంలో మొదటగా చైనీయులు పెట్రోలియంను ఇంధనంగా ఉపయోగించారు. ► క్రీస్తుశకం 347వ సంవత్సరంలోనే చైనాలో చమురు బావులు తవ్వినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ►ప్రపంచంలో వాణిజ్యపరంగా 1837లో తొలి క్రూడాయిల్ రిఫైనరీని అజర్బైజాన్లో ప్రారంభించారు. అక్కడే 1846లో తొలి చమురు బావిని తవ్వారు. ►అమెరికాలో 1859లో తొలి అధునాతన ఆయిల్ బోర్వెల్ను తవ్వారు. ముడి చమురు నుంచి ఏమేం వస్తాయి? క్రూడాయిల్‌ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారె ల్ అంటే దాదాపు 159 లీటర్లు (42 గ్యాలన్లు). దీని నుంచి 73 లీటర్ల పెట్రోల్, 35 లీటర్ల వరకు డీజిల్, 15.5 లీటర్ల మేర జెట్ ఫ్యూయల్, ఒక లీటర్ కిరోసిన్ వస్తాయి. మరో 42 లీటర్ల మేర హెవీ ఫ్యూయల్ ఆయిల్స్, లూబ్రికెంట్స్, స్టిల్ గ్యాస్, ఆస్ఫాల్ట్, కోక్ వంటి ఇతర ఉత్పత్తులు వెలువడతాయి. ►ప్రస్తుతం మన కరెన్సీలో ఒక లీటర్ క్రూడాయిల్ ధర సుమారు రూ.78కాగా.. శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.49, డీజిల్ ధర రూ.52 వరకు ఉంటుంది. ►పెట్రోల్, డీజిల్ రెండూ నీళ్లలా పారదర్శకంగా ఉంటాయి. వాటిని సరిగా గుర్తించేందుకు రంగులు కలుపుతారు. ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌లో నీలం–ఆకుపచ్చ కలిసిన రంగును.. డీజిల్‌లో నారింజ రంగును కలుపుతాయి. హైపవర్, ప్రీమియం వంటి పెట్రోల్‌కు పసుపు రంగును కలుపుతుంటారు. ఖాళీ అయితే ఎలా? ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మన జీవితాన్ని ఊహించలేం. ఇంట్లో వంట చేసుకునే ఎల్పీజీ నుంచి.. బైకులు, కార్లు, బస్సులు, నౌకలు, విమానాలకు ఇంధనం దాకా.. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ వంటి ఎన్నో ఉత్పత్తులకు చమురే ఆధారం. మరి భూమిపై చమురు నిక్షేపాలన్నీ ఉన్నట్టుండి ఖాళీ అయితే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవడానికే భయం గొలుపుతుంది. అందుకే శా స్త్రవేత్తలు సౌర, పవన, ఇతర ప్రత్యా మ్నాయ విద్యుదుత్పత్తిపై, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టిపెట్టారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పన్ను బకాయా.. ‘సెటిల్మెంట్’ చేస్కోండి
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రూ. 3 వేల కోట్లకు పైగా పన్నులను రాబట్టేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్–1957, తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్–2005, సెంట్రల్ ట్యాక్స్ యాక్ట్–1956, తెలంగాణ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇన్టు లోకల్ ఏరియాస్–2001 చట్టాల పరిధిలోకి వచ్చే పన్నుల చెల్లింపునకు సంబంధించి పన్నుల శాఖతో వివాదం ఉంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. వివాదాల్లో ఉన్న పన్ను చెల్లింపులకు సంబం ధించి సాధారణ పన్నులో 60 శాతం మాఫీ కానుంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 50 శాతం, ఎంట్రీ ట్యాక్స్ 40 శాతం మాఫీ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పన్నులను 100 శాతం కట్టాల్సి ఉంటుంది. అయితే వీటిపై వేసిన జరిమానాలు, వడ్డీలు రద్దవుతాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యాపారి సదరు మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం రూ.25 లక్షల కంటే ఎక్కువుంటే 4 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశమిస్తారు. ఈ వాయిదాల వరకు వడ్డీలు ఉండవు. 4 కన్నా ఎక్కువ వాయిదాలైతే పెంచిన వాయిదాల కు బ్యాంకు వడ్డీ వర్తిస్తుంది. పథకం కింద ఈ నెల 16 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను జూలై 1 నుంచి 15 వరకు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీకి సర్కిల్ ఏసీ, డీసీ, జేసీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీదే తుది నిర్ణయం. మాఫీ పోను మిగిలిన సొమ్మును అదే నెల 16 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాలి. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై పన్ను తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై రాష్ట్రప్రభుత్వం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నును తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. పెట్రో ల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించిన కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి పెరిగిన పెట్రో ల్, డీజిల్ ధరలతో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4, డీజిల్‌పై రూ.3 చొప్పున రాష్ట్రానికి ఆదాయం వస్తోందని సోమవారం నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ భారాన్ని తగ్గించాలని, అలాగే పెంచిన కరెంటు, బస్సు చార్జీలను తగ్గిస్తేనే ప్రజ లు కేసీఆర్‌ను విశ్వసిస్తారని పేర్కొన్నారు. -
హేయ్ ఎలన్‌మస్క్ ! వెల్కమ్ టూ తెలంగాణ ? కేటీఆర్ దూకుడు
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో నిరంతరంగా ప్రయత్నించే మినిస్టర్ కేటీఆర్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. చిక్కుముళ్లు ఎదురుగా ఉన్నా అవన్ని పక్కన పెట్టి ఏకంగా టెస్లా కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఎలన్‌మస్క్‌తో టచ్‌లోకి వెళ్లారు. 2016లో మొదలు గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపి చూశారు కేటీఆర్. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్ ఎక్స్ కారుని అమెరికాలో నడిపారు. కారు బాగుందని తెలుపుతూ కొత్తగా ఆలోచించిన ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా తాజాగా పాత ట్వీట్‌ని రీట్వీట్ చేశారు కేటీఆర్. ఆ వెంటనే అందరినీ ఆశ్చర్యపరిచేలా మరో ట్వీట్ చేశారు. పని చేయలని ఉంది ఇండియాకి టెస్లా కనుక వస్తే.. మీతో కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్ మంత్రిగా తెలియజేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యాపార సంస్థలు అనేక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయంటూ ట్వీట్ చేశారు. వస్తాం.. కానీ తెలంగాణకు టెస్లా వస్తే సంతోషిస్తామంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ఎలన్ మస్క్ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, ఇంకా అనేక అంశాలపై చర్చలు కొలిక్కి రాలేదంటూ ఎలన్‌మస్క్ బదులిచ్చారు. Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr — KTR (@KTRTRS) January 14, 2022 ఎప్పుడొస్తుంది గత రెండేళ్లుగా టెస్లా కార్లను ఇండియాకి తెస్తామంటూ ఎలన్ మస్క్ ప్రకటిస్తున్నారు. అయితే పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లు ఐనందున దిగుమతి సుంకం తగ్గించాలంటూ మెలిక పెట్టారు. ఇండియాలో కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పన్ను రాయితీలపై సానుకూలంగా స్పందిస్తామని కేంద్రం బదులిచ్చింది. దీనిపై ఇటు టెస్లా, అటు కేంద్రం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో టెస్లా కనుక ఇండియాకి వస్తే తెలంగాణలో ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ ఏకంగా టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌ని అడగడం ద్వారా మంత్రి కేటీఆర్ చొరవ చూపించారు. చదవండి: ఇండియాలో టెస్లా కార్ల విడుదలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్..! -
చేనేత రంగాన్ని ఆదుకోవాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. -
నువ్వు బతికున్నావనే సంగతి మర్చిపోతుంటాను: ఎలన్ మస్క్
వాషింగ్టన్: టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్‌ని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశాడు ఎలన్ మస్క్. ఓ నువ్వు ఇంకా బతికు ఉన్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అసలు వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలయ్యింది అంటే.. కొన్ని రోజుల క్రితం ఎలన్ మస్క్ టెస్లాలో తన పేరిట ఉన్న 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నాడు. 1.2 మిలియన్ షేర్లను అమ్మేశారు. వీటి విలువ 1.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ పరోక్షంగా స్పందిస్తూ ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: Elon Musk: ఎలన్ మస్క్‌కి ఏమైంది, ఎందుకిలా?..) We must demand that the extremely wealthy pay their fair share. Period. — Bernie Sanders (@SenSanders) November 13, 2021 దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘ఓ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను.. ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. టెస్లా సీఈఓ ట్వీట్‌పై సాండర్స్ ఇంకా స్పందించలేదు. Want me to sell more stock, Bernie? Just say the word … — Elon Musk (@elonmusk) November 14, 2021 అయితే ఎలన్ మస్క్ స్టాక్ విక్రయానికి గత వారం నిర్వహించిన ట్విటర్ పోల్ ఫలితాలే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. ఇక మస్క్ ప్రస్తుతం అతను 13.3 శాతం అత్యధిక పన్ను రేటు కలిగి ఉన్న కాలిఫోర్నియాకు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్ రాష్ట్ర ఆదాయపు పన్ను లేని టెక్సాస్‌కు మారినప్పటికీ, అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఇటీవలి ట్వీట్లో అంగీకరించాడు. ఎందుకంటే అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. (చదవండి: అన్నంత పని చేసిన ఎలన్‌మస్క్.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?) బిలియనీర్ల విపరీతమైన సంపదపై పన్ను విధించడం సాండర్ విధుల్లో అతి పెద్ద భాగం. సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ఇది రాబోయే దశాబ్దంలో సుమారు 4.35 ట్రిలియన్ డాలర్లను సమీకరించగలదని.. అంతేకాక రానున్న 15 సంవత్సరాలలో బిలియనీర్ల సంపదను సగానికి తగ్గించగలదని సాండర్స్ పేర్కొన్నాడు. అధ్యక్షుడు జో బిడెన్ తీసుకువచ్చిన విస్తృత సామాజిక భద్రతా నికర ప్రణాళికకు నిధులు సమకూర్చడానికి డెమొక్రాట్లు బిలియనీర్లపై పన్ను విధించడానికి ప్రయత్నిస్తున్నారు. చదవండి: పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్.. కారణం ఇదేనా? -
ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే!
Most Expensive and Cheapest Petrol and Diesel Prices Countries: పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్ కంపెనీలు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారంతో పెట్రోలు, డీజిల్ రేట్లు లీటరకు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. కాన్నీ కొన్ని దేశాల్లో అగ్గిపెట్టె కంటే పెట్రోలు చాలా చీప్. మరి కొన్ని చోట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే సామాన్యులు మోయలేని దశకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా.. ఇంకా తమ ధరల దాహం తీరలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు సంకేతాలు పంపుతున్నాయి. కానీ ఈ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటరు పెట్రోలును కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనుజువెలా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలం. అమెరికా ఆయిల్ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనుజువెలాలో లీటరు పెట్రోలు ధర 0.02 డాలర్లు మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్ అందిస్తోంది. ఇక్కడయితే ఇంతే వెనుజువెలా తర్వాత పెట్రోలు అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్ నిలిచింది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51గా ఉంది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోలు వస్తోంది. అక్కడ మోత మోగుతోంది పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్కాంగ్ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్‌కాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్‌కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్లాండ్, ఐస్లాండ్లలో లీటరు పెట్రోలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి. ఏడాదిన్నరలో రూ.36 పెరుగుదల కరోనా సమయంలో డిమాండ్, సప్లై మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మేలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర కనివినీ ఎరుగని రీతిలో పెరిగింది. మరీ ఈ వైరుధ్యం ఏంటో ? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంటూ కేంద్రం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లుగా నమోదు అయ్యింది. అప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 దగ్గర నమోదు అవుతోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి : మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు -
ద్రవ్యలోటు రూ.3.21 లక్షల కోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే నాటికి లక్ష్యంలో 21.3 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తాజా గణాంకాలు ఇలా... - జూలై ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదా యం రూ.6.83 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 34.6%). ఇందులో రూ.5,29,189 కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1,39,960 కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.14,148 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.5,777 కోట్ల రుణ రికవరీలు, రూ.8,371 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి. - ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.10.04 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్లో 28.8 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.8,76,012 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1,28,428 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.2,25,817 కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. 1,20,069 కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 3.21 లక్షల కోట్లుగా ఉంది. 6.8 శాతం లక్ష్య సాధన కష్టమే! 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని ద్రవ్యలోటు 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్ -
టెక్స్ టైల్ ఎగుమతిదారులకు ఊరట
న్యూఢిల్లీ: జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఆర్ఓఎస్సీటీఎల్ (రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్) స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. జూలై 14న కేంద్ర క్యాబినెట్ ఈ పథకం పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. అంతర్జాతీయ పోటీకి దీటుగా... అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని పేర్కొన్నారు. స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోగాభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని అభిప్రాయపడ్డారు -
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గుర్తింపు
న్యూఢిల్లీ: జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తున్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోనూ నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి సందేశం ఇచ్చారు. ఆదాయపన్ను శాఖ విధానాలు, ప్రక్రియలను సులభతరంగా మార్చడంలోను, పారదర్శకంగా, సౌకర్యవంతమైన అనుభవాన్ని పన్ను చెల్లింపుదారులకు కల్పించే విషయంలో ఆదాయపన్ను శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించి చాలా వరకు ప్రక్రియలు, నిబంధనల అమలు ఆన్లైన్ వేదికలపైకి తీసుకురావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖలకు ప్రత్య క్షంగా రావాల్సిన అవసరం లేకుండా పోయినట్టు లేదా చాలా వరకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. పన్ను ల వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి నెలకొనడం పట్ల ఆదాయపన్ను శాఖ కృషిని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్ కూడా అభినందించారు. -
ఈ పొరపాట్లు చేయొద్దు.. ఫారం 16ని చెక్ చేయండి
ఐటీ రిటర్నులు వేస్తున్నాం.. పన్నులు కట్టేస్తున్నాం కదా అని మనలో మనం సంబరపడుతుంటాము. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో బైటపడ్డ నిజాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.. ► ఒక ఉద్యోగి ఒక సంవత్సరకాలంలో రెండు చోట్ల ఉద్యోగం చేసినప్పుడు .. ఇద్దరూ ఫారం 16 జారీ చేసి ఉంటారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఇస్తారు. ఇద్దరూ సెక్షన్ 80సి మినహాయింపులూ ఇస్తారు. కానీ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒకసారే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రాదు. స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు ఆదాయంలో మార్పు రాదు. కానీ మినహాయింపులు, సగానికి తగ్గుతాయి. ఫలితంగా పన్నుభారం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కాక పన్ను భారం పెరిగిపోయిందో అని ఆందోళన .. కాస్సేపు బాధ .. కాస్సేపు బెంగ వస్తాయి. ఇవన్నీ సర్దుకునే సరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఫారం 16ని చెక్ చేయండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సరిదిద్దుకోండి. ► కొన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకోరు. బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ, ఆన్సర్ పేపర్లు దిద్దితే వచ్చే డబ్బు, ఇన్విజిలేషన్ వల్ల వచ్చే డబ్బు, నగదు రూపంలో వచ్చే ట్యూషన్ ఫీజులు, ఇంటద్దెలు, గార్డియన్‌గా పిల్లలకు వచ్చిన ఆదాయం, జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూపించాలి. ఎటువంటి రిస్కు తీసుకోవద్దు. ► పన్ను భారం ఉండని ఆదాయాన్ని.. అంటే.. మినహాయింపు లభించే ఆదాయాలను కూడా రిటర్నులో డిక్లేర్ చేయాలి. ఇలా చేయడం వల్ల పన్ను భారం ఉండదు. భవిష్యత్తులో ‘‘సోర్స్’’ వివరణ ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ► బ్యాంకుల మీద వచ్చే వడ్డీ కేవలం 10 శాతం టీడీఎస్‌కి గురి అవుతుంది. మీ నికర ఆదాయంపై 10 శాతం, 20 శాతం లేదా 30 శాతం వర్తించవచ్చు. 20 శాతం, 30 శాతం రేటు పడినప్పుడు వడ్డీ మీద టీడీఎస్ సరిపోదు. పది శాతం పన్ను పడుతుంది. అలా తెలియగానే ఎంతో బాధ.. ఏదో తప్పు జరిగిందని ఆవేదన, ఆలోచన వస్తాయి. మిగతా మొత్తం చెల్లించక్కర్లేదు అనుకోవడం తప్పు. ► నికర ఆదాయం నిర్దేశించిన పరిమితి దాటితే స్థూల పన్ను భారంలో 10 శాతం సర్‌చార్జి పడుతుంది. సర్‌చార్జి మీద 4 శాతం సెస్సు అదనం. ముందుగా ఏ ఆదాయానికి ఆ ఆదాయం విడిగా లెక్కించి, అజాగ్రత్త వలన నికర ఆదాయం తక్కువగా అనిపించి సర్‌చార్జీని పరిగణనలోకి తీసుకోరు. కానీ అన్నీ కలిపేసరికి నికర ఆదాయం కోటి రూపాయలు దాటితే సర్‌చార్జి కరెంటు షాకులాగా తగులుతుంది. తప్పు .. తప్పని తేలకపోతే ఫర్వాలేదు. కానీ తేలితే మళ్లీ బెంగ.. భయం.. పైగా పన్నూ తప్పదు. కాబట్టి ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త వహించండి. -
అధిక పెట్రో ధరలు భారమే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న ప్రజా డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వీటి ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె అంగీకరిస్తూనే.. పన్నుల తగ్గింపు అన్నది కేంద్రం, రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. దేశంలో రాజస్తాన్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరుకోగా.. రిటైల్ ధరలో 60 శాతం కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల రూపంలో వెళుతుండడం గమనార్హం. డీజిల్ రిటైల్ ధరలో 56 శాతం పన్నుల రూపంలోనే ఉంటోంది. కరోనా కారణంగా గతేడాది అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు పడిపోయిన సమయంలో మంత్రి సీతారామన్ ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా ఆదాయ లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు ఆమె ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఈ విషయమై ఆర్థిక మంత్రి శుక్రవారం మీడియా ముఖంగా స్పందించారు. తగ్గించాల్సిన అవసరం ఉందంటూనే.. అందుకే తాను ధర్మసంకటం పదాన్ని ప్రయోగించినట్టు చెప్పారు. ‘‘ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒక్కటే పన్నులు విధించడం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేసుకుంటున్నాయి’’ అని పరిస్థితిని ఆమె వివరించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకే వెళుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువస్తే పన్నుల భారం తగ్గుతుందన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది జీఎస్టీ కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన తీసుకువెళతారా? అన్న మీడియా ప్రశ్నకు.. సమావేశానికి ముందు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కెయిర్న్ ఆర్బిట్రేషన్‌పై అప్పీల్ కెయిర్న్ ఎనర్జీకి భారత్ 1.4 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుపై అప్పీల్ చేయడం తన విధిగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమ యంత్రాంగానికి ఉన్న పన్ను విధింపు హక్కును ప్రశ్నించినప్పుడు అప్పీల్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘‘రెట్రోస్పెక్టివ్ పన్ను అంశంలో మా విధానాన్ని స్పష్టంగా వెల్లడించాము. 2014 నుంచి 2020 వరకు ఏటా దీన్నే పునరావృతం చేశాం. ఇందులో స్పష్టత లేకపోవడమేమీ కనిపించలేదు’’ అని మంత్రి చెప్పారు. ఆర్థిక ఉద్దీపనల భారాన్ని ప్రజలపై వేయం... ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆర్థిక ఉద్దీపనలకు కావాల్సిన నిధులను రుణాలు, ఆదాయాల రూపంలో సమకూర్చుకుంటామే కానీ, ప్రజలపై భారం వేయబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులపై ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా చార్జీ ఉండదన్నారు. ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందే కానీ, ప్రజల నుంచి కాదని చెప్పారు. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. -
పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించనుందా? తాజా అంచనాలు ఈ ఆశాలనే రేకెత్తిస్తున్నాయి. పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలను తాకడంతో వాహనాలను తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుందనే అంచనాలు భారీగా వ్యాపించాయి. ఈ మేరకు చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోందట. (పెట్రోలుకు తోడు మరో షాక్ ) పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేృత్వంలోని బీజేపీ సర్కార్ గత 12 నెలల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచింది. తాజాగా వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తో్ంది. అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఇంధనంపై పన్నును ఎప్పుడు తగ్గిస్తామో చెప్పలేను, కానీ, పన్ను భారంపై కేంద్ర, రాష్ట్రాలు చర్చించాలి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్యాసింజర్‌కు అస్వస్థత, కరాచీకి ఎమర్జెన్సీ మళ్లింపు టాటా మోటార్స్‌కు భారీ షాక్ -
పన్నుల విధానాన్ని సమీక్షించాలి: సునీల్ మిట్టల్
ముంబై: దేశీయ టెలికాం రంగం పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాలను సమీక్షించాలని మొబైల్ దిగ్గజం భారతి ఏయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ శుక్రవారం తెలిపారు. టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆయన వెబ్ కాన్పరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికాం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలికాం రంగం మూలధన కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. మరోవైపు టెలికాం రంగాన్ని ఆధునికరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు. -
ఉద్యోగ కల్పనలో ఏపీని ఆదర్శంగా తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య - పరిష్కరానికి చేపట్టవలసిన కార్యాచరణ అన్న ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే గ్రామ సచివాలయాలలో గ్రాడ్యుయేట్ల కోసం లక్షా 26 వేల 728 ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించిందని అన్నారు. దేశ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సవరించిన విషయం తెలిసిందే. నిబంధనలను తుంగలో తొక్కుతూ గత యూపీఏ ప్రభుత్వం వేల కోట్ల బ్యాంక్ రుణాల మంజూరీకి అనుమతించి, అంతులేని అక్రమాలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు వంటి దుస్సాహసానికి ఒడిగట్టి ఆర్థిక రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని అన్నారు.(‘కక్కుకుంటూ ఒకరు.. కెన్యాపై మరొకరు’) కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదు దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఆయన ప్రస్తావిస్తూ తాజాగా విడుదలైన పే కమిషన్ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో 38.9 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా 31 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగిందని అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో 46 శాతం, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో 47 శాతం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, సివిల్ సర్వీసుల ద్వ్రారా 2014లో 1364 పోస్టులు భర్తీ చేస్తే 2019 నాటికి ఆ సంఖ్య 896కి తగ్గిపోయిందన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని,. ఒక కేలండర్‌ను అనుసరించి వాటిని భర్తీ చేయకపోవడం వలన లక్షలాది మంది ఉద్యోగావకాశాలను కాలరాసినట్లువుతుందని అన్నారు. నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదని సూచించారు. (కరోనాపై బాలీవుడ్ సెలబ్రిటీల సూచనలు) దేశంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రధానంగా జాతీయ రహదారులు, పట్టణ రవాణా, పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో భారీ పెట్టుబడుల ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు. పదేళ్ళు గడిచినా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇంకా డ్రాయింగ్ టేబుల్ స్థాయి నుంచి ముందుకు కదలలేదని ఉదాహరించారు. అలాగే విశాఖపట్నం నుంచి ఫార్మా, మెరైన్ ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం కార్గో సౌకర్యాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదని తెలిపారు. విశాఖపట్నం మేజర్ పోర్టు విస్తరణ ప్రణాళిక ఆచరణకు నోచుకోలేదని, ఇలాంటి కారణాల వలన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందని ఆయన విమర్శించారు. ('లేఖలు, లీకులు అందులో భాగమే') సవరించిన బడ్డెట్ అంచనాలలో భారీగా కోత ‘‘దేశ జనాభాలో కనీసం 70 శాతం గ్రామాల్లోనే ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడమే. దీనికి విరుద్ధంగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీలకు సవరించిన బడ్డెట్ అంచనాలలో భారీగా కోత పెట్టింది. సబ్సిడీలలో దాదాపు 28 శాతం కోత విధించారు. ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో గత ఏడాది కంటే 9,500 కోట్లు తగ్గించారు. దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైన, అక్కడ నిరుద్యోగ సమస్యపైన ప్రబలంగా ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిలా పనిచేస్తున్న విదేశీ ఆర్థిక పెట్టుబడులపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం దిశగా తరుముతోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం యావత్తు ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో పాల్గొంది. ఇలాంటి సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోవాలి. ఇప్పటివరకు మాన్యుఫాక్చరింగ్ రంగంలో ముందున్న చైనాను అధిగమించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ జేఏసీ) న్యూఢిల్లీ : ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఎగుమతులపై సుంకాల మాఫీకి పథకం గురించి రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎగుమతులకు కల్పిస్తున్న రాయితీలపై ఏర్పడిన వివాదంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పేనల్ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీవోలో నెలకొన్న వివాదం గురించి వివరించారు.(‘ఆ మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి’) పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టాం భారత్ అమలు చేస్తున్న ఎగుమతులకు సంబంధించిన పథకాలు, సుంకం చెల్లించకుండా దిగుమతులు చేసుకునే పథకంపై ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికా వివాదం లేవనెత్తింది. దీనిపై వివాద పరిష్కార ప్యానల్ తన నివేదిక సమర్పిస్తూ భారత్ ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకాలు డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా లేవని తీర్పు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. నివేదికను గత ఏడాది నవంబర్ 19 భారత్ సవాలు చేసింది. అయితే డబ్ల్యూటీవో అప్పిలేట్ వ్యవస్థ క్రియాశీలంగా లేని కారణంగా విచారణ భారత్ దాఖలు చేసిన పిటిషన్ సస్పెన్షన్‌లో ఉండిపోయిందని అన్నారు. డబ్ల్యూటీవో తీర్పు ఎగుమతులపై దుష్ప్రభావం చూపకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎగుమతి చేసే ఉత్పాదనలపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. (మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18) న్యూఢిల్లీ : నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాలకు చెందిన వ్యక్తులు ఈ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం ప్రధాన పారిశ్రామిక రంగాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మాన్యుఫాక్చరింగ్ రంగం గణనీయమైన భాగస్వామ్యం పొందేందుకు, ప్రధాన పారిశ్రామిక రంగాల మధ్య పోటీతత్వం పెంచేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన జరుగుతుందని మంత్రి వెల్లడించారు. (కామసూత్ర నటికి కరోనా కష్టాలు) -
ఆదాయానికి ఐడియా..!
జాతీయ రహదారులపై టోల్ వసూలు తరహాలోనే ఇక గ్రానైట్ ఉత్పత్తులకూ ఇకపై రుసుము వసూలు చేయనున్నారు. అందులో భాగంగా రాయల్టీ వసూళ్లకు టెండర్ల కోసం ప్రకటన కూడా జారీ చేశారు. దీనికి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. గ్రానైట్ గనుల నుంచి పెద్ద మొత్తంలో ముడిరాయి రాయల్టీ చెల్లించకుండానే సరిహద్దు దాటిపోతోందని వివిధ రకాల నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలోనే దొంగ చేతికి తాళం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, ఒంగోలు: జిల్లాలో అన్ని రకాల ఖనిజాలకు సంబంధించి మొత్తం ఎనిమిది మైనింగ్ లీజులు, 526 క్వారీ లీజులు ఉన్నాయి. అన్ని రకాల ఖనిజాలకు సీనరేజి వసూళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల ఖనిజాలకు రాయల్టీ వసూలు కొన్ని రకాల శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలించింది. బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, బల్లాస్ట్, మొరం, గ్రావెల్ ఆర్డినరీ ఎర్త్ మినహా అన్ని రకాల మైనర్ మినరల్స్‌కు సీనరేజి రుసుం వసూలు, ఇతర చార్జీలు, పన్నుల వసూలు కోసం టోల్ వసూలు తరహా కాంట్రాక్టర్ల ఎంపికకు బిడ్స్ పిలిచింది. జిల్లా పరిధిలో 272 క్వారీలు జిల్లా పరిధిలో 272 క్వారీల నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇక సీనరేజి రుసుం వసూలు ప్రైవేటు వ్యక్తులే చేయనున్నారు. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ 141 లీజులు, బ్లాక్ గ్రానైట్ క్వారీ లీజులు 60, కలర గ్రానైట్ లీజులు 71 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా భూగర్భ గనులశాఖ ఒంగోలు ఏడీ కార్యాలయం పరిధిలో రూ.360 కోట్లు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.3 కోట్లు రాయల్టీ ద్వారా ఆదాయం వస్తోంది. వీటికి 20 శాతం అదనంగా చేర్చి టెండర్ బిడ్ పిలిచినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. జిల్లాలో అత్యధిక రాయల్టీ భూగర్భ గనుల శాఖ ఒంగోలు సహాయ సంచాలకుని కార్యాలయం పరిధిలోనే ఉంది. రాయల్టీ వసూలు ఇక ప్రైవేటు పరం కానున్న నేపథ్యంలో క్లస్టర్లను నిర్ణయించారు. ఒక వేళ జిల్లా మొత్తానికి ఒకే టెండర్ బిడ్ రాకపోతే క్లస్టర్లకు విడివిడిగా టెండర్లను పిలవడానికి వీలుగా క్లస్టర్లను నిర్ణయించారు. ఒంగోలు, మార్టూరు, మార్కాపురం, చీమకుర్తి క్లస్టర్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రానైట్ నుంచి మాత్రమే సీనరేజి వసూలు చేయాలని నిర్ణయించారు. సీనరేజితో పాటు ఆదాయపన్ను, డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్, నెట్ చార్జీలు కూడా టెండర్ దక్కించుకున్న వారే వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం పేరొందిన సంస్థలు, వ్యక్తుల నుంచి డిపార్టుమెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. ప్రకాశంలో గెలాక్సీ గ్రానైట్, కలర్, బ్లాక్ గ్రానైట్ ఖనిజాలు ఉన్నాయి. గెలాక్సీ మినహా కలర్, బ్లాక్, చిత్తూరు రెడ్ వంటి రకాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఎస్టిసిఈసిఓఎంఎంఇఆర్సిఇ డాట్ కామ్) లేదంటే డిపార్టుమెంట్ ఆప్ మైన్స్ అండ్ జియాలజి వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఐఎన్ఈఎస్ డాట్ ఏపి డాట్ జీవోవి డాట్ ఇన్)లో వివరాలు పొందు పరిచారు. బిడ్స్ దాఖలు చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంది. రూ.450 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, కనిగిరి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్ గనులు ఉన్నాయి. ఏటా ఒంగోలు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.380 కోట్ల వరకు రాయల్టీ రుసుం వసూలవుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారుల నివేదికలో రాయల్టీ రూపంలో జమవుతున్నదాని కన్నా రెట్టింపు దొడ్డిదారిన పోతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానం తరహాలోనే గ్రానైట్ రాయల్టీ రుసుం వసూలుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి రూ.450 కోట్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు నెలకున్నాయి. జిల్లాలో ఇప్పటికే డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.558 కోట్లు ఉంది. రూ.101.78 కోట్లతో 992 పనులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 55 శాతం నిధులతో కమ్యూనిటీ బెన్ఫిట్ వర్కులు, 40 శాతం నిధులతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు నిధులు కేటాయించారు. కమ్యూనిటీ బెన్ఫిట్ విభాగంలో విద్య, అంగన్వాడీ భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ విభాగానికి, ఆరోగ్యం, తాగునీటి సరఫరాకు, పారిశుద్ధ్య పనులకు నిధులను కేటాయించారు. మిగిలిన 40 శాతం నిధులతో సిమెంట్ రహదారులు, మురుగునీటి పారుదలకు కాలువల నిర్మాణానికి, నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించారు. ఇక మీదట డీఎంఎఫ్ చార్జీలు కూడా సంబంధిత కాంట్రాక్టర్లే వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో గ్రానైట్ సీనరేజి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రంగాల్లోని వ్యాపారులు సీనరేజి వసూలుకు ప్రభుత్వ మార్గదర్శకాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. -
పంచాయితీలు కార్పోరేషన్లో విలీనం
సాక్షి, అల్గునూర్: కరీంనగర్ కార్పొరేషన్ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్ కార్పొరేషన్ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటుచేశారు. హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు స్వాధీనం.. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ భవనాలకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పాలన ప్రారంభం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, మానకొండూర్ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్ పాలన మొదలైంది. పన్నులు పెరగవు.. గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్‌కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను డీసీఎంఏకు రాసి ఆన్లైన్ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్‌లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
ఆందోళన బాటపట్టిన క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు
సాక్షి, విశాఖపట్నం: మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ పేరిట భారీగా వసూళ్లు చేపట్టడాన్ని నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమరావతి కోసం ఏడాదికి 2వేల రూపాయలు లెబర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. మ్యాక్సీ క్యాబ్‌లకు పోలీసులు పార్కింగ్ సదుపాయం కల్పించకపోగా, ఫొటోలు తీసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి వాహనాలు నడుపుతున్నా.. ఆయిల్ డబ్బులు కూడా రావటం లేదని వాపోయారు. ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌లు కట్టలేక భార్యల పుస్తెలు తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాక్సీ క్యాబ్ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని అన్నారు. పలు ట్యాక్స్‌ల పేరిట, ఇన్సూరెన్స్ పేరిట ఏడాదికి సుమారు లక్ష రూపాయలు లాగేస్తుంటే.. తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. -
డిసెంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు 2018 డిసెంబర్లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. డిసెంబర్లో వసూలైన రూ.94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) పరిమాణం రూ.16,442 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.47,936 కోట్లు, సెస్సు రూ. 7,888 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 9 నెలల్లో రూ.8.71 లక్షల కోట్లు.. 2018–19 బడ్జెట్లో కేంద్రం వార్షికంగా జీఎస్టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 1.12 లక్షల కోట్లు నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే.. జీఎస్టీ వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్, అక్టోబర్‌లో మాత్రమే ఇవి రూ.1 లక్ష కోట్లు దాటాయి. కొత్త రిటర్న్ ఫారంల నోటిఫికేషన్: కాగా జీఎస్టీ విధానం కింద జూన్ 30 నాటికి వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన వార్షిక జీఎస్టీ రిటర్న్ కొత్త ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. మరోవైపు, 2017 జులై–2018 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిపై లేట్ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని సీబీఐసీ నిర్ణయించింది. అయితే, ఆయా సంస్థలు 2019 మార్చి 31 నాటికి మొత్తం 15 నెలల వ్యవధి రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. -
‘రిజర్వేషన్లు కల్పించే వరకు పన్నులు చెల్లించం’
ముంబై : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న మరాఠా నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు పన్నులు చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్ల కోసం మరాఠా నేతలు గతకొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం వివిధ మరాఠా సంఘాలకు చెందిన నేతలు లాథూర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ సభ్యుల, శాసనసభ్యుల కార్యలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రభుత్వానికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్లపై ప్రకటన చేసే వరకు ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదని నేతలు భావిస్తున్నారు. మరాఠి నేత సంజీవ్ బోర్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న మరాఠా క్రాంతి జన్ ఆందోళన్ పేరిట రహదారులపై నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. మరాఠాలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని కోరారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గతవారం చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న మరాఠా నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారని.. వాటిని తక్షణమే ఎత్తివేయాలని మరో నేత శాంతారామ్ కుంజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఐటీ రిటర్నులను సరళీకృతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: వయోజనులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారిని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పన్ను రిటర్నుల దాఖలను సరళీకృతం చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఆన్లైన్ ద్వారానే ఈ–రిటర్నులను స్వీకరి స్తుండటంతో వృద్ధులు, కంప్యూటర్ పరిజ్ఞానం తెలియని వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా దరఖాస్తు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. మంగళవా రం ఇక్కడ జరిగిన 158వ ఆదాయ పన్ను దినో త్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదాయ పన్నుల చెల్లింపులకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న కొందరు పారిశ్రామికవేత్తలతో ఓ కన్సార్టి యాన్ని రూపొందించి, వారు చెల్లించిన పన్నుల నుంచి కొంతభాగాన్ని విద్య, వైద్య రంగాల్లో సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం తిరిగి వారికే చెల్లించాలనిగవర్నర్ ప్రతిపాదించారు. కార్యక్రమంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సీఎండీ వి.ఉదయభాస్కర్, ఏపీ, టీఎస్ హైదరాబాద్ రీజియన్ ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామ్‌ప్రసాద్ చౌదరి, ఎన్ఎండీసీ సీఎండీ ఎన్.బిజేంద్రకుమార్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లిమిటెడ్ చైర్మన్ సతీష్ కె.రెడ్డి, అమర్‌రాజా బ్యాటరీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ రాంచంద్ర ఎన్.గల్లా పాల్గొన్నారు. -
జీఎస్టీ అంటే ఆర్ఎస్ఎస్ ట్యాక్స్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని ఆర్ఎస్ఎస్ ట్యాక్స్‌గా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభివర్ణించారు. దీని కారణంగా ప్రజలపై విపరీతంగా పన్ను భారం పెరిగిందనీ, అందుకే ఇది ‘చెడుమాట’గా మారిందన్నారు. ‘అది ఒక విచిత్రమైన జంతువు లాంటిది. సగటు జీవిపై జీఎస్టీతో విపరీత భారం మోపారు. ఒకే పన్ను రేటు ఉంటే జీఎస్టీ అనొచ్చు. అనేకమార్లు పన్నులు వసూలు చేస్తుంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ అని పిలవాల్సి ఉంటుంది’ అన్నారు. అధికారులు మాత్రమే జీఎస్టీ వల్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. పరోక్ష పన్నుల విధానంలోకి పెట్రోలియం ఉత్పత్తులను కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. -
జీఎస్టీ@365
సాక్షి, మెదక్ : ఒకే దేశం ఒకే పన్ను విధానం జీఎస్టీ(వస్తు సేవల పన్ను) అమలులోకి వచ్చి నేటికి ఏడాది. జూన్ 30వ తేదీ అర్ధరాత్రి అనగా జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఆరంభంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు వ్యాపార వర్గాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండ అమలు చేసింది. జీఎస్టీకి ముందు జిల్లాలో వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అమలులో ఉండేది. దీని పరిధిలో 1,132 రకాల చెల్లింపుదారులు ఉండేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగింది. వివిధ రకాల ఉత్పత్తులపై పన్ను చెల్లించే వారి సంఖ్య 1,972కు చేరుకుంది. అదనంగా మరో 840 మంది వ్యాపారులు, వ్యాపార సంస్థలు వస్తు సేవల పన్న చెల్లింపు పరిధిలోకి వచ్చాయి. అన్ని రకాల వ్యాపారాల్లో 20 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వ్యాపారులు, వ్యాపారసంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఏడాది కాలంగా ప్రతి మూడు మాసాలకు ఒకమారు రిటర్న్‌లు ఫైల్‌చేస్తూ పన్నులు చెల్లిస్తున్నారు. వ్యాట్ అమలులో ఉన్నప్పుడు ప్రతినెలా పన్నుల రూపంలో సుమారు రూ.2 కోట్లు వచ్చేవి. అయితే జీఎస్టీ అమలు తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రతినెలా రూ.3 కోట్లకుగాపై పన్నులు వసూలు అవుతున్నాయి. దీంతో జిల్లాలో జీరో దందా తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో ఒకే పన్ను విధానం అమలు అవుతుండటంతో పన్నుఎగవేత లేకుండా పోయింది. అలాగే ప్రజలకు చాలా ఉత్పత్తులు ఒకే ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఎత్తివేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తుల రవాణా వేగం పెరిగింది. వ్యాపారులకు ట్యాక్స్ చెల్లించటం సులువైంది. ఆన్లైన్లో చెల్లింపు విధానంతో వ్యాపారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి. అయితే జీఎస్టీపై అందరి వ్యాపారులకు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీని అమలులో ఇంకా కొన్ని ఇబ్బందులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయి నెట్వర్క్ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాపారులు, వ్యాపార సంస్థలు పన్నులు సక్రమంగా చెల్లిస్తుంది లేనిదీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గతంలో మాదిరిగా పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి దాడులు నిర్వహించాలన్నా.. నిబంధన ప్రతిబంధకంగా మారుతోంది. -
బెజవాడ వాసులపై పన్నుల మోత
-
చమురు ధరలు తగ్గించడంపై కేంద్రం దృష్టి
-
అధిక పన్నుల్లో మీరే ఆదర్శం: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్నులు వేసి ప్రజలను వేధించడంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు రూ.68, రూ.53 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు బ్యారెల్ ధర 79 డాలర్లకు తగ్గినప్పుడు రూ.84, రూ.74కు ఎందుకు పెరిగాయో చెప్పాలని నిలదీశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 22 రాష్ట్రాల కన్నా ఎక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. 16 నుంచి 18 శాతం వరకు ఇతర రాష్ట్రాల్లో పన్నులుంటే తెలంగాణలో పెట్రోల్‌పై 35.02 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్నులను విధించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. -
ప్రజలకు మంట.. ప్రభుత్వాలకు పంట
సాక్షి, అమరావతి: ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. పెట్రోలు, డీజిల్ రేట్లతో ఖజానా నింపుకొంటున్నాయి. దీని కోసం ఎడా పెడా పన్నులు పెంచేస్తున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆదాయం తగ్గుతోందని పన్నులు పెంచిన ప్రభుత్వాలు ఇప్పుడు దేశీయ మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరినా ఆ పెంచిన భారాన్ని తగ్గించడం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ. 79.81, డీజిల్ రూ.72.38కు చేరుకున్నాయి. గడిచిన రెండేళ్లలో పెట్రోలు ధరలు 22 శాతం, డీజిల్ ధరలు 34 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులే. ఈ రెండేళ్లలో రెండు ప్రభుత్వాలు కలసి పెట్రోల్‌పై రూ. 11.47, డీజిల్‌పై రూ. 15.47 అదనపు పన్నులు విధించాయి. మోదీ ప్రభుత్వం సుంకాలను తొమ్మిదిసార్లు పెంచి ఒకసారి తగ్గించింది. గత అక్టోబర్‌లో కేంద్రం సుంకం రూ. 2 తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి, 2015లో లీటర్‌కు రూ. 4 అదనపు వ్యాట్‌ను విధించింది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాట్‌ను తగ్గించమని రాష్ట్రాలకు కేంద్రం చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర సరిహద్దుల్లోని బంకులు మూతపడుతున్నాయని పెట్రోలియం డీలర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖజానా గలగలలు.. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 15,000 కోట్ల ఆదాయం వస్తోంది. నేరుగా రాష్ట్రం విధించే వ్యాట్ ద్వారా గత ఏడాది రూ. 9,785.24 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 42 శాతం రాష్ట్ర వాటాను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ. 4,200 కోట్లు వస్తున్నాయి. 2015 ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధరలో రాష్ట్ర పన్నుల వాటా రూ. 13.99గా ఉంటే ఇప్పుడది సుమారు రూ. 22కు చేరింది. అదే విధంగా లీటరు డీజిల్ ధరలో పన్నుల వాట రూ. 8.86 నుంచి సుమారు రూ.16కు చేరింది. రాష్ట్రంలో ఏడాదికి సగటున పెట్రోల్ 320 కోట్ల లీటర్లు, డీజిల్ 125 కోట్ల లీటర్లు వినియోగం జరుగుతోంది. కేవలం రూ. 4 అదనపు వ్యాట్ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 5,000 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించింది. సంక్షోభంలో రవాణా రంగం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. దీంతో సరుకుల ధరలు కూడా పెరిగి సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి లీటరు డీజిల్ ధర రూ. 48 వద్ద ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 72 దాటేసిందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యాపారాలు లేక రవాణా చార్జీలు పెంచలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందన్నారు. ప్రతి కిలోమీటరు, టన్నుకు ఎంత ధర అన్నది నిర్ణయించమని ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పెడచెవినపెడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రాష్ట్ర వ్యాట్ ఆదాయం ఏడాది ఆదాయం (రూ. కోట్లలో) (జూన్–మార్చి) 2014-15 5,269.74 2015-16 8,074.71 2016-17 8,979.99 2017-18 9,785.24 నోట్: ఇది కాకుండా కేంద్రం వసూలు చేసే పన్నులో 42 శాతం రాష్ట్రానికి వస్తుంది. -
అమెజాన్‌కు షాక్: ట్రంప్ టాక్స్ వార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్‌పై మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్ల గక్కారు. పన్నులు చెల్లించకుండా భారీ ఆదాయాన్ని దండు కుంటోందంటూ తన తాజా ట్వీట్లో దాడి చేశారు. ఇటీవల మీడియా నివేదికలకు బలం చేకూరుస్తూ ట్రంప్ గురువారం మరో ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు అమెజాన్ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశా..పన్నులు చెల్లించకుండా.. పన్ను చెల్లిస్తున్న చిన్నవ్యాపారులకు తీరని నష్టం చేకూరుస్తోందంటూ అమెజాన్‌పై ఆయన ధ్వజమెత్తారు. ఇతరుల మాదిరిగా కాకుండా చాలా స్వల్పంగా లేదా అసలు పన్నులు చెల్లించకుండా వేలాదిమంది రీటైలర్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది. తమ పోస్టల్ సిస్టంను అమెజాన్ డెలీవరీ బాయ్‌గా వాడుకుంటూ అమెరికాకు తీరని నష్టాన్ని కలిగిస్తోందంటూ ట్విటర్లో మండిపడ్డారు. మరోవైపు అధ్యక్షుడి ప్రకటనకు వైట్ హౌస్ ట్రంప్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ లిండ్సే వాల్టర్స్ మద్దతు పలికారు. అమెజాన్ చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో భారతదేశంతో సహా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అమెజాన్ వ్యాపారాన్ని దెబ్బతీసేలా పటిష్టమైన ఆంక్షల తీసుకోనుందనే సంకేతాలను అందించారు. ఈ వ్యాఖ్యలు మార్కెట్లో షేరు కదలికలపై మరింతగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా యాంటీ ట్రస్ట్ చట్టాన్ని ఉపయోగించేందుకు ముమ్మరంగా చర్చలు నిర్వహించారని యాక్సోస్ అనే వెబ్సైట్ నివేదించడంతో అమెజాన్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అమెజాన్ షేరు 5శాతం నష్టపోయి 30 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూని కోల్పోయిన సంగతి తెలిసిందే. I have stated my concerns with Amazon long before the Election. Unlike others, they pay little or no taxes to state & local governments, use our Postal System as their Delivery Boy (causing tremendous loss to the U.S.), and are putting many thousands of retailers out of business! — Donald J. Trump (@realDonaldTrump) March 29, 2018 -
పన్ను ఎగవేతదారుల నుంచి భారీగా నగదు
పన్ను ఎగవేతదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగానే చుక్కలు చూపిస్తోంది. బ్యాంకు ఖాతాలకు, రెండు లక్షలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్ కార్డును తప్పనిసరి చేయడంతో, దాంతో పాటు ఆధార్ లింక్ చేయడం వంటి వాటితో పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం గండికొడుతోంది. తాజాగా అదనపు రిటర్నులలో రూ.1.7 కోట్ల ఫైల్ చేశారని, దీంతో మొత్తంగా ప్రభుత్వం డిసెంబర్ వరకు రూ.26,500 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ఇన్-హౌజ్ సమాచారంతోనే నాన్-ఫైలర్స్‌ను ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు తెలిపారు. ఈ డేటాను టీడీఎస్, టీసీఎస్ ద్వారా సేకరించిన ఎక్కువ విలువ ఉన్న లావాదేవీలతో ట్యాలీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ నెంబర్‌ను రూ.2 లక్షలకు పైన జరిపే లావాదేవీలు ప్రాపర్టీ, షేర్లు, బాండ్లు, ఇన్సూరెన్స్, విదేశీయ ప్రయాణం వంటి అన్నింటికీ తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతేడాది 35 లక్షల నాన్-ఫైలర్స్‌ను గుర్తించామని, ఆ ముందటేడాది ఈ సంఖ్య 67 లక్షలుగా ఉండేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నాన్-ఫైలర్స్‌ను గుర్తించిన అనంతరం పలు కేటగిరీలోకి కేసులను వర్గీకరించి, మానిటర్ చేస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. రిటర్నులు ఫైల్ చేయాలని టార్గెట్ చేసిన గ్రూప్‌లుకు టెక్ట్స్ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పంపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. వారి స్పందనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్ ఇన్సైట్ అనే కొత్త మెకానిజం ద్వారా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ఐటీ చట్టాలు దుర్వినియోగం చేయొద్దు
న్యూఢిల్లీ: పన్నులు కట్టే విషయంలో వేతన జీవుల కన్నా కార్పొరేట్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర సూచించారు. వివిధ మినహాయింపులు పోనూ భారత్‌లో బడా కంపెనీలపై విధిస్తున్న పన్ను భారం చాలా తక్కువే ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో పన్నులు ఎగవేసే ఉద్దేశంతో.. ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయొద్దని సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్ర ఈ విషయాలు తెలిపారు. ‘చట్టాలు చాలా మటుకు సరళం చేశాం. సాధారణంగా మీరు అడిగేట్లుగానే రేటు కూడా సముచిత స్థాయిలోనే ఉండేలా చూస్తున్నాం. ఇక, పరిశ్రమవర్గాలు నిఖార్సుగా పన్నులు కడుతున్న పక్షంలో పన్ను రేటు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. వేతన జీవులకన్నా కంపెనీలు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన చెప్పారు. -
కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటా ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో వాటాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2018-19వ సంవత్సరానికి రూ. 33,929.84 కోట్లు దక్కనున్నాయి. ఇక తెలంగాణకు రూ. 19,207.43 కోట్లు కేంద్రం ఇవ్వనుంది. ప్రతి ఏడాది రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల మొత్తంలో ఆయా రాష్ట్రాల వాటాను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలకు దక్కనున్న కేంద్ర పన్నుల వాటా మొత్తం జాబితాను వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సూచలన మేరకు రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల రాబడిలో 42శాతం వాటాను ఆయా రాష్ట్రాలకు తిరిగి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్ పన్ను మొత్తం రూ. 9526 కోట్లు కాగా, ఆదాయపన్ను మొత్తం రూ. 8430 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూ. 10,919 కోట్లు, సుంకాల మొత్తం 1671 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నులు 1628 కోట్లు.. ఇందులో 2016-17 సంవత్సరం అంచనాలతో పోలిస్తే.. రూ. 849 కోట్లు లోటు కనిపిస్తున్నది. ఇక, తెలంగాణకు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్ పన్ను మొత్తం రూ. 5381 కోట్లు కాగా, ఆదాయపన్ను మొత్తం రూ. 4772 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూ. 6181 కోట్లు, సుంకాల మొత్తం 946 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నులు 946 కోట్లు.. ఇందులో 2016-17 సంవత్సరం అంచనాలతో పోలిస్తే.. రూ. 481 కోట్లు లోటు కనిపిస్తున్నది. రాష్ట్రాలవారీగా కేంద్ర పన్నుల వాటాను క్రింది చిత్రపటంలో చూడొచ్చు.. -
బ్యాలెన్స్డ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయ్?
నేను 2011లో ఒక యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ)ని తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేశాను. బీమా మొత్తంలో 20 శాతానికి సమానమైన ప్రీమియమ్‌ను ఈ ఐదేళ్ల కాలంలో చెల్లించాను. ఈ పాలసీని సరెండర్ చేయడంవల్ల వచ్చిన సరెండర్ వేల్యూపై నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? వివరించగలరు. – నందు, విజయవాడ పన్ను అంశాల పరంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యులిప్)లను జీవిత బీమా పాలసీలాగానే పరిగణిస్తారు. యులిప్‌లకు సాధారణంగా లాక్–ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. మీ యులిప్కు ఈ ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ముగిసినందున మీరు పొందిన సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10డి) కింద మీకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద మీరు చెల్లించిన ప్రీమియమ్లకు పన్ను రాయితీ పొందినప్పటికీ, మీకు సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్ను భారం ఉండదు. నేను గత కొంత కాలంగా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ రాబడులపై పన్నులు ఎలా ఉంటాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? ఉంటే ఏ రేంజ్లో ఈ పన్నులు ఉంటాయి ? – రవళి, విశాఖపట్టణం బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను హైబ్రిడ్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్ డెట్‌లో కొంత, ఈక్విటీలో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తాయి. దేంట్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారో దానిని బట్టి వీటిని ఈక్విటీ ఆధారిత లేదా డెట్ ఆధారిత ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఫండ్ ఈక్విటీలో కనీసం 65 శాతం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఫండ్‌ను ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్‌గా భావిస్తారు. 65 శాతం కంటే తక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, దానిని డెట్ ఆధారిత ఈక్విటీ ఫండ్‌గా భావిస్తారు. ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించి కొనసాగాయనుకోండి..మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ ఫండ్స్‌లో ఏడాదిలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వచ్చిన రాబడులపై మీరు 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లకు మించి కొనసాగితే, వాటిపై వచ్చే రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. ఈ ఫండ్స్‌ను మీరు మూడేళ్లలోపే విక్రయిస్తే, వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను, నా భార్య ఇద్దరమూ ఉద్యోగులమే. మాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. మా నలుగురికి గరిష్టంగా ఎన్ని పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాలు ఉండొచ్చు? ఈ ఖాతాల్లో గరిష్టంగా ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు? – ఈశ్వర్, వరంగల్ మీరు, మీ భార్య ఇద్దరూ చెరొక పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. ఒక్కో ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇక మీలో ఎవరైనా ఒకరు మీ మైనర్ పిల్లల తరపున మరో పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పిల్లల్లో ఒకరికి ఒకటి చొప్పున పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఒక వ్యక్తి తన సొంత ఖాతా, గార్డియన్‌గా పిల్లల పేరు మీద తెరచిన పీపీఎఫ్ ఖాతాల్లో మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. అయితే రూ.లక్షన్నరకు మించి చేసిన డిపాజిట్‌పై ఎలాంటి వడ్డీ రాదు. పైగా లక్షన్నరకు మించి డిపాజిట్ చేసిన దానికి ఎలాంటి పన్ను రాయితీలు కూడా లభించవు. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తరచుగా వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఇవి మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ? –వెంకట్, హైదరాబాద్ ఓపెన్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ రెండింటికి కొన్ని ప్రయోజనాలు కొన్ని లోపాలూ ఉన్నాయి. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఉన్న ప్రధాన లోపం.. ఇన్వెస్టర్లు రెగ్యులర్‌గా ఈ తరహా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వీలు లేకపోవడం. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్టర్లు తరచుగా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు. ఈ అంశం ఫండ్ మేనేజర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలం రాబడులను దృష్టిలో ఉంచుకునే ఫండ్ మేనేజర్ పెట్టుబడి వ్యూహాలు రూపొందిస్తారు. అయితే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్.. అధిక రాబడులు సాధించిన దాఖలాలు ఏవీ ఇంతవరకూ లేవు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ పనితీరు ఇవి ప్రారంభమైనప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
‘చమురు’ వదులుతోంది!
సాక్షి, అమరావతి : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్ను వేసి వినియోగదారుల నడ్డివిరుస్తోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 450 కోట్ల లీటర్ల డీజిల్, 115 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్‌పై వేసే వ్యాట్ కాకుండా ప్రతి లీటరుకు అదనంగా వినియోగదారుల జేబులో నుంచి మరో నాలుగు రూపాయలు లాగేస్తున్నారు. దీంతో 450 కోట్ల లీటర్ల డీజిల్‌పై రూ.1,800 కోట్లు, అదేవిధంగా 115 కోట్ల లీటర్ల పెట్రోలుపై రూ. 460 కోట్లు.. మొత్తం కలిపి రూ.2260 కోట్ల మేరకు ప్రతి ఏటా వినియోగదారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఈ లెక్కన వినియోగదారులకు తెలియకుండానే నెలకు రూ. 188.33 కోట్లు వారి జేబుకు చిల్లు పడుతోంది. ఇలా మూడేళ్లుగా నాలుగు రూపాయల అదనపు పన్ను వసూలు చేస్తుండటంతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా కన్పిస్తోంది. చమురు ధరల్లో మన రాష్ట్రానికి, పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు లేక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సుమారు 600 బంకులకు గాను 200–300 వరకు మూతబడినట్లు సమాచారం. మనకు, పక్క రాష్ట్రాల్లో లీటరుకు రూ.4 తేడా ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లోని వాహనదారులు అక్కడకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో మన రాష్ట్రం సరిహద్దుల్లోని బంకుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం అమ్మకాలు తగ్గాయని అక్కడి బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హామీని మరచిపోయి అదనపు పన్ను వేయడం అన్యాయమని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలను పరిశీలిస్తే రాష్ట్రంలో లీటరు పెట్రోల్ రూ.35 ప్రకారం విక్రయించాల్సి ఉండగా రూ.76.27లకు విక్రయించడం ఏ మేరకు సబబమని వారు ప్రశ్నిస్తున్నారు. అదనపు పన్నుతో తీవ్ర నష్టం రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 అదనపు పన్ను వేయడంవల్ల వాటి అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. సరిహద్దు రాష్ట్రాలో ధరలు తక్కువగా ఉన్నందున అక్కడకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది 16 శాతం కొనుగోళ్లు తగ్గాయి. దీంతో ఒక్కొక్కరు పెట్రోలు బంకులు మూసివేస్తున్నారు. అదనపు పన్ను వసూలు చేస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, ఇతర వాహనదారులు మన రాష్ట్ర సరిహద్దులోని బంకుల్లో డీజిల్, పెట్రోలు నింపుకోవడం లేదు. దీంతో ఇటు ప్రభుత్వానికి అటు బంకుల నిర్వాహకులు, లారీ ట్రాన్స్‌పోర్టు యజమానులు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై పునరాలోచించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన కన్పించడం లేదు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. – రావి గోపాలకృష్ణ, రాష్ట్ర పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షులు. -
బీసీసీఐ పన్ను ఎంత కట్టిందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానం జీఎస్టీలోకి తీసుకొచ్చిన తర్వాత తొలి నెలల్లో భారీగా పన్ను వసూలయ్యాయి. అంచనాల కంటే జీఎస్టీ వసూలు బాగానే వచ్చాయి. దేశంలోనే అత్యంత ధనికవంతమైన క్రీడా సంస్థ బీసీసీఐ, జీఎస్టీ అమలు తర్వాత రూ.44 లక్షల పన్నులు చెల్లించింది. బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొంది. జూలై నెల కింద 44 లక్షల 29,516 రూపాయల పన్నులు చెల్లించినట్టు బీసీసీఐ తన వెబ్సైట్లో తెలిపింది. భారత జాతీయ జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్కు కూడా ఐదు నెలల కాలానికి రూ.58 లక్షల 87,139ను బీసీసీఐ చెల్లించింది. అంతేకాక 2015-16 సీజన్‌ల్లో అంతర్జాతీయ మ్యాచుల నుంచి ఆర్జించిన గ్రాస్ రెవెన్యూలను కొంతమంది ప్లేయర్లకు బీసీసీఐ పంచింది. వీరిలో ఎక్కువగా స్టువర్ట్ బిన్నీకి రూ.92 లక్షలు, హర్బజన్ సింగ్‌కు రూ.62 లక్షలు, స్పిన్నర్ అక్సర్ పటేల్‌కు రూ.37.51 లక్షలు, ఉమేశ్ యాదవ్‌కు రూ.34.79 లక్షలు చెల్లించినట్టు తెలిసింది. -
జీఎస్టీ పేరు.. దోపిడీ తీరు
♦ తగ్గని పప్పులు,మసాలా దినుసుల ధరలు ♦ 50 శాతం మంది వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు లేవు ♦ మధ్య తరగతి ప్రజలకు తప్పని ధరాఘాతం ♦ నిద్రావస్థలో వాణిజ్య పన్నుల యంత్రాంగం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణ మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంట్లోని వారు సరుకులు తీసుకురమ్మని పంపారు. ఆయన సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లారు.సరుకులు కావాలని పట్టీ ఇచ్చారు. దుకాణదారుడు అన్నీ ఇచ్చాడు. ఇదేమందయ్యా..! కందిపప్పు కిలో రూ.60–65 మధ్య ధర ఉంటే నీవేమో రూ.90 రాశావని దుకాణదారుడిని నిలదీశారు. అవునయ్యా...జీఎస్టీ అమలులోకి వచ్చింది.. నన్నేం చేయమంటావని అన్నాడు. అన్ని సరుకులకు జీఎస్టీ లేదు కదా? అని వెంకటరమణ దుకాణదారుడిని ప్రశ్నించారు. మా ధర ఇంతే తక్కువకు ఎక్కడైనా వస్తే తెచ్చుకో...అని అన్నాడు. కడప అగ్రికల్చర్/కోటిరెడ్డి సర్కిల్: మామూలుగా జీఎస్టీ అమలైతే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ హోల్‌సేల్ వ్యాపారులు పన్నులు చెల్లించలేమంటూ రిటైలర్లకు విక్రయించే ధరలను పెంచేశారు. ఇదే సాకు చూపి చిరు వ్యాపారులు సైతంధర పెంచి విక్రయిస్తున్నారు. కంపెనీ ప్యాకెట్లలో లేని(నాన్ ప్యాక్డ్) వస్తువులకు జీఎస్టీ లేదని నిబంధనలు చెబుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. కానీ దుకాణదారులు అన్ని వస్తువులకు పన్నులు ఉన్నాయంటూ ధరలను పెంచేశారు. జీఎస్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను చాలా మంది వ్యాపారులు చేసుకోలేదు. కానీ బిల్లులు ఇవ్వకుండానే ధరలు మాత్రం పెంచారు. హోల్‌సేల్‌లో కొన్నప్పుడు తాము ముందే పన్నులు చెల్లించామని వ్యాపారులు వినియోగదారులతో వాదనలకు దిగుతున్నారు. జీఎస్టీ అమలులో ఉన్నా.. మార్కెట్లో జీఎస్టీ వచ్చినప్పటి నుంచి చాలా సరుకుల ధరలు తగ్గాల్సి ఉంది. ఇప్పటికీ మూడేళ్ల నుంచి ఉన్న ధరలతోనే అమ్ముతున్నారు. పప్పులు, మసాలా దినుసులు, బియ్యం ధరలు తగ్గిస్తూ జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచారు. వ్యాపారులు మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు ధరలు ఏ మాత్రం తగ్గలేదని వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. జిల్లాలో దాదాపు 70 శాతం మంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. చాలీ చాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా ఉన్న తరుణంలో జీఎస్టీ దెబ్బతో ధరలు పెరిగి కుంగిపోతున్నారు. పప్పులు, మసాలా దినుసుల ధర బాగా తగ్గినా వ్యాపారులు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్‌కి మార్కెట్లోని వస్తువుల ధరలకు చాలా తేడా కనిపిస్తోంది. హోల్‌సెల్‌గా వస్తువులను సరఫరా చేసే బడా వ్యాపారులు సిండికేట్ కావడం, కార్పొరేట్ వ్యాపార సంస్థల చేతుల్లో ధరల నిర్ణయాధికారం ఉంటుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం జిల్లాలో చాలా మంది వ్యాపారులు సిండికేటై జీఎస్టీ సాకుతో ధరలనుతగ్గించలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిలో కంది పప్పు కొంతమంది వ్యాపారులు రూ.60–65 మధ్య అమ్ముతుంటే మరి కొందరు రూ.80–90లతో విక్రయిస్తున్నారు. బియ్యం కిలో ధర రూ.50 ఉండగా దానిని రూ.80లకు విక్రయిస్తున్నారు. కంపెనీ ప్యాకింగ్లేని కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, వేరుశనగ పప్పులను, మసాలా దినుసులను ఇష్టారాజ్యంగా వారికి తోచిన ధరకు విక్రయిస్తున్నారు. సామాన్యులు ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేయమంటావ్.. ప్రభుత్వం జీఎస్టీ అనే పన్ను విధించింది. ఆ ధరకే మేం కొనుగోలు చేసి మీకు విక్రయిస్తున్నామనే సమాధానం వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలోని సరుకుల దుకాణా లను తనిఖీ చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులపై పన్నులుంటాయా?
లిక్విడ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి వాటిపై లాభాలనార్జిస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – సాగర్, విశాఖపట్టణం లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే గడించే మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపు విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఒక వేళ మూడేళ్ల కాలానికి మించిన తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుంది. నా భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో ఆరేళ్లు పనిచేసి మానేసింది. ఇటీవలే ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసింది. ఈ విత్‌డ్రా చేసిన మొత్తంపై పీఎఫ్ డిపార్ట్మెంట్ ఎలాంటి పన్నుకోత విధించలేదు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ విత్‌డ్రాయల్‌ను చూపించాలా ? ఒక వేళ చూపించాల్సి వస్తే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద చూపించాలి? – వివేక్, హైదరాబాద్ రెండు సందర్భాల్లో ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పీఎఫ్ విత్డ్రాయల్స్పై టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) ను విధిస్తుంది. మొదటి సందర్భం,..ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఇక రెండోది. ఎవరైనా ఉద్యోగి ఒక కంపెనీలో నిరంతరంగా ఐదేళ్లలోపే పనిచేసి, పీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ రెండు సందర్భాల్లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై టీడీఎస్ ఉంటుంది. మీ భార్య ఒక కంపెనీలో 5 ఏళ్లకు మించి పనిచేసినందున పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి టీడీఎస్‌ను ఈపీఎఫ్ఓ విధించలేదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ మొత్తాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. వేతనం నుంచి ఆదాయం అనే పద్దు కింద ఈ మొత్తాన్ని చూపించాల్సి ఉంటుంది. నేను కొంత మొత్తానికి హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ అనే టర్మ్ ప్లాన్‌ను తీసుకున్నాను. అయితే ఈ ప్లాన్‌లో యాక్సిడెంట్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజ్ లేదు. ఈ రెండు కవరేజ్‌లు ఉన్న మరో టర్మ్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్–లైఫ్ ఆప్షన్‌ను అదనంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా అదనపు టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలా ? లేక హెచ్డీఎఫ్సీ సంస్థనే ఈ రెండు కవరేజ్‌లు కూడా జత చేయమని అడిగి కొంచెం ఎక్కువగా ప్రీమియమ్ చెల్లించాలా ? తగిన సలహా ఇవ్వగలరు ? – నాగేశ్, విజయవాడ క్రిటికల్ ఇల్నెస్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలు ఉన్న మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమా ?లేక ప్రస్తుతమున్న టర్మ్ప్లాన్కే రైడర్లను జత చేస్తే ఎక్కువ ప్రయోజనమా అనే విషయాలపై మీరు ముందుగా మదింపు చేయండి. మీరు ప్రస్తుతం తీసుకున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్‌కు క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేయవచ్చు. కొంత అధిక ప్రీమియమ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.10,332గా ఉంటుంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేశారనుకోండి, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్రూ.15,979కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేస్తే, ప్రీమియమ్ రూ.21,698కు పెరుగుతుంది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్ను తీసుకుంటే, ఈ ప్లాన్‌కు సంబంధించి బేసిక్ కవరేజ్ ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.8,906గా ఉంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేస్తే, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.13,074కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేశారనుకోండి, ప్రీమియమ్ రూ.18,742కు పెరుగుతుంది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను సూచించండి? – తేజశ్విని, ఈమెయిల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో పోల్చితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ దాదాపు లిక్విడ్ ఫండ్స్లాంటివే. ఈ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు ఉన్న మంచి ఆకర్షణీయ అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ములపై వచ్చే రాబడుల కన్నా, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులే అధికంగా ఉంటాయి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, ఐడీఎఫ్సీ ఆర్బిట్రేజ్ ఫండ్, జేఎం ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, రిలయన్స్ ఆర్బిట్రేజ్ అడ్వాండేజ్ ఫండ్, ఎస్బీఐ ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్‌లో ఏదో ఒకదానిని ఎంచుకొని ఆ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. -
భారీ పన్ను డిఫాల్టర్ల జాబితా జారీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ఆదాయపన్ను శాఖ తాజాగా జాబితా విడుదల చేసింది. భారీగా పన్ను ఎగవేత దారులు నేమ్ అండ్ షేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవమాన వ్యూహంలో భాగంగా రూ .10 కోట్లకుపైగా పన్నులు చెల్లించని ఢిల్లీకి చెందిన ఐదు సంస్థల పేర్లను ప్రచురించింది. ఆదాయ పన్ను,కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సిన జాబితాను ప్రధాన జాతీయ జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలోఐటీశాఖ విడుదల చేసింది. "పన్ను బకాయిలు వెంటనే" చెల్లించాలని కోరింది. పన్ను శాఖ యొక్క పాలసీ యంత్రాంగం ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు (సిబిడిటి) గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ అవమాన పథకాన్ని ఆదాయం పన్ను శాఖ ప్రారంభించింది. ఈ క్రమంలో గతంలో 96 సంస్థలు గుర్తించింది. ఇవి గుర్తించలేకుండా లేదా రికవరీ కోసం ఎలాంటి ఆస్తులు లేకుండా మిగిలిపోయాయి. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జారీ చేసిన ఒక నోటీసు లో ఈ జాబితాను వెల్లడి చేశారు. పాన్ కార్డు సంఖ్య, చివరిగా తెలిసిన చిరునామా, అంచనా పరిధి , పన్ను చెల్లించని మొత్తాన్ని, వ్యక్తిగత, సంస్థల వివరాలతో వెల్లడించినట్టు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ సంస్థల చిరునామా, వ్యాపారం, వాటాదారుల నిర్వహణ మరియు నిర్వహణ వంటివి మారవచ్చు. ఈ సంస్థల గురించి సమాచారం తెలిసిన వారు, ఉపయోగకరమైన సమాచారం ఉంటే తమకు తెలియపర్చాల్సిందిగా కోరారు. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లీన్‌మనీ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రారంభించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చేలా , పన్ను చెల్లింపులకు ప్రజలను ప్రోత్సహించేలా ఈ పోర్టల్‌ను లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ డిఫాల్టర్ల పేర్లను తన అధికారిక వెబ్ సైట్ లో కూడా ప్రచురించడం ప్రారంభించింది. -
సకాలంలో పన్నులు చెల్లించండి
కాకినాడ సిటీ : వ్యాపారులందరూ తమ పన్నులను సకాలంలో చెల్లించి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించాలని జీఎస్టీ అదనపు డైరెక్టర్ ఎస్కే రెహమా¯ŒS కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంస్థల ఆధ్వర్యంలో శనివారం స్థానిక యంగ్మె¯Œ్స హ్యాపీక్లబ్‌లో నగరంలోని వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏకీకృత పన్ను (జీఎస్టీ) విధానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును విశాఖ కస్టమ్స్ కమిషనర్ బి.హరేరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతినెలలో వ్యాపారులు విక్రయించిన వస్తువులకు తరువాత నెలలోని 20వ తేదీన వివరాలు వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథి, జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్కే రెహమా¯ŒS మాట్లాడుతూ ఒకే పన్ను విధానం ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విధానంపై వ్యాపారులకు అవగాహనను గత ఏడాది నుంచి కల్పిస్తున్నామన్నారు. జీఎస్టీ విధానం అమలయ్యాక వాటితో వచ్చిన ఇబ్బందులను వ్యాపారుల నుంచి తెలుసుకుని కేంద్రానికి వివరిస్తామన్నారు. ఈ సదస్సుకు కోకనాడ చాంబర్ అధ్యక్షుడు దంటు సూర్యారావు అధ్యక్షత వహించగా వాణిజ్య పన్నులశాఖ డీసీ డి.రమేష్, కాకినాడ ఐసీఏఐ చైర్మ¯ŒS ఎ¯ŒS.సురేష్, గోదావరి చాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ, ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు జి.సాంబశివరావు, వ్యాపారులు, చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘ఫిక్స్డ్’ మైండ్ వదిలేయండి!
► ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్డీలు పనికిరావు ► పన్ను, ద్రవ్యోల్బణం పోగా మిగిలేది సున్నానే ఎఫ్డీ, ఆర్డీ, పొదుపు కోసమే తప్ప పెట్టుబడికి కాదు ► దీర్ఘకాలిక లక్ష్యాలకు డెట్, ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం సంప్రదాయంగా, కొన్ని దశాబ్దాలుగా ఎక్కువ మందికి పొదుపు, మదుపు సాధనంగా ఉంటూ వస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం కళతప్పాయ్! దీర్ఘకాల లక్ష్యాలకు, సంపద వృద్ధికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇకపై ఎంత మాత్రం ఉత్తమ సాధనాలు కావన్నది ఆర్థిక పండితుల మాట. ఆర్థిక విధానాలు, మార్కెట్ తీరుతెన్నులు మారుతున్న తరుణంలో, ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రస్తుతం పక్కన పెట్టేసి వాటికి మించి రాబడులనిచ్చే వాటిని ఎంచుకోవడం అవసరం అంటున్నారు ఆర్థిక సలహాదారులు... మన తాత, తల్లిదండ్రుల కాలం నుంచి చాలా మందికి తెలిసింది ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) గురించే. లేదంటే పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు. కొంత మొత్తం పొదుపు కనిపించిన వెంటనే బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయడం అలవాటుగా ఉండేది. కానీ, అదే సమయంలో అత్యవసరాలు ఏర్పడితే కనిపించేదీ అదే డిపాజిట్. దాంతో ఆ డిపాజిట్‌ను మధ్యలోనే రద్దు చేసి వెనక్కి తీసుకునేవారు. చివరి వరకూ కొనసాగించేది కొందరే. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉత్తమ పెట్టుబడి సాధనం కాదు అనేందుకు పలు కారణాలున్నాయి. ఒకప్పుడు 8–9% వడ్డీ రేటు డిపాజిట్లపై వచ్చేది. కానీ, ఇప్పుడది 7 శాతానికి పడిపోయింది. ఎఫ్డీపై పన్ను భారంతోపాటు ఎటువంటి పన్ను రాయితీలు లేవు. ఒకవేళ 30% ఆదాయపన్ను శ్లాబులో ఉన్న వారు తీసుకెళ్లి ఎఫ్డీలో పెడితే పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షలను ఎఫ్డీ చేస్తే దానిపై వార్షికంగా రూ.72వేల ఆదాయం పొందారనుకోండి. 30% పన్ను కింద రూ.21,600 చెల్లించాల్సి వస్తుంది. పోనీ ఎంతోకొంత వచ్చిందని సర్ది చెప్పుకోకండి. ద్రవ్యోల్బణం ఉండనే ఉంది. ఏటేటా ద్రవ్యోల్బణం నగదు విలువను హరిస్తుంటుంది. ఈ ప్రభావాన్ని మినహాయిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడిలో చివరికి ఏమీ మిగలదు. అధిక పన్ను రేటులో ఉన్నవారు ప్రతి కూల రాబడులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రాబడి లేకపోగా తమ పెట్టుబడుల విలువ 1 నుంచి 2% వరకు కోల్పోవాల్సి ఉంటుంది. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనాలున్నాయి. అందులోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల తరహా సాధనమే కావాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ సరైనవి. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పైనా పన్ను ఉంటుంది. కానీ ఆ పన్ను ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన రాబడులకే వర్తిస్తుంది. అందుకే ఎఫ్డీలతో పోలిస్తే డెట్ మ్యూ చువల్ ఫండ్స్ బెటర్. డెట్ మ్యూచువల్ ఫండ్స్...? నిజానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డెట్ ఫండ్స్ ఓ రకం. ఇది ఎఫ్డీలకు చక్కని ప్రత్యామ్నాయం. డెట్ ఫండ్స్ ద్వారా తమకు వచ్చిన నిధులను అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అధిక భద్రత ఉండే ప్రభుత్వ బాండ్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, ఇతర భద్రతతో కూడిన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణ ఇన్వెస్టర్‌కు ఈ విధమైన వైవిధ్య పెట్టుబడులు కష్ట సాధ్యం. పన్నులో వెసులుబాటు బ్యాంకు ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటిపైనా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ డెట్ ఫండ్స్‌పై పన్ను చాలా తక్కువ. ఎలా అంటే... డెట్ ఫండ్స్‌పై రాబడి 8 శాతం ఉందనుకోండి. దానిలోంచి ద్రవ్యోల్బణ సూచీ ప్రభావాన్ని తీసేయగా మిగిలిన నికర రాబడిపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇదీ తేడా... ఉదాహరణకు... ఎఫ్డీలో, డెట్ ఫండ్‌లో రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెడితే... రెండింటిపైనా రాబడి 8 శాతం అనుకుంటే (కేవలం అవగాహన కోసమే) మూడేళ్ల తర్వాత ఒక్కోదానిలో రూ.1,25,971 చొప్పున అవుతాయి. ఎఫ్డీపై కొనుగోలు ఆధారిత ద్రవ్యోల్బణ ప్రభావం కలిపేందుకు అవకాశం లేదు. అదే డెట్ ఫండ్‌పై ఈ వెసులుబాటు ఉంది. అప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని నికర పెట్టుబడికి కలిపితే లక్ష కాస్తా రూ.1,19,102 అవుతుంది. అంటే పన్ను చెల్లించాల్సిన నికర రాబడి డెట్ ఫండ్‌లో రూ.6,869 కాగా, ఎఫ్డీలో రూ.1,25,971. ఇప్పుడు ఎఫ్డీపై 30 శాతం పన్ను రేటులో ఉన్న వారు చెల్లించాల్సిన పన్ను రూ.8,025. ఎఫ్డీపై రూ.1,371 మాత్రమే. పన్ను పోగా ఎఫ్డీలో మిగిలిన రాబడి రూ.17,946. డెట్ ఫండ్‌లో రూ.24,597. రాబడి శాతం ఎఫ్డీలో 5.65 శాతం కాగా, డెట్ ఫండ్‌లో 7.61 శాతంగా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు? దీర్ఘకాల పెట్టుబడులకు ఎఫ్డీలు సరైన సాధనాలు కావన్నది నిజమే. కానీ, ఆరు నెలల కాలానికి ఎఫ్‌డీల్లో మదుపు చేయడం తప్పేమీ కాదు. చాలా తక్కువ కాలంలోనే డబ్బుతో పని ఉంటే అప్పటి వరకు ఎఫ్‌డీల్లో ఉంచడమే నయం. రాబడి ఓ రెండు శాతం ఎక్కువ వస్తుంది కదా అని మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లక్కర్లేదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధికి రాబడుల్లో ఉండే వ్యత్యాసం స్వల్పమే. సిప్ విధానంలో... కొంత మందికి రికరింగ్ డిపాజిట్ కట్టడం అలవాటు. నెలనెలా కొంత పొదుపు చేసుకునేందుకు ఇలా ఆర్డీ, చిట్స్‌లో చేరడం చేస్తుంటారు. కానీ, ఇవి కేవలం పొదుపు సాధనాలుగానే ఉపయోగపడతాయి. పొదుపు వేరు, మదుపు వేరన్న విషయం తెలిసే ఉంటుంది. వీటి కంటే డెట్ ఫండ్స్‌లో సిప్ విధానంలో నెలనెలా కొంత మదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది. చాలా స్వల్ప కాల వ్యవధికి ఎఫ్డీలను ఎంచుకుంటే తప్పులేదు గానీ, రిటైర్మెంట్, పిల్లల విద్య తరహా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఎంచుకోవడం ఎంత మాత్రం సరికాదు. మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ వంటివే దీర్ఘకాల అవసరాలను తీర్చగలిగే సాధనాలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ చేయదలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మంచి రాబడులను పొందడానికి అవకాశం ఉంది. అదీ సిప్ విధానంలోనే. ఫండ్ పథకాల్లోనూ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పూర్తి ఈక్విటీ, ఈక్విటీ + డెట్ కలసినవి, ఈక్విటీ పథకాల్లోనూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ ఉన్నాయి. వీటిలో నెలనెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే దీర్ఘకాలంలో వార్షికంగా 14 నుంచి 18 శాతం వరకు రాబడులను పొందడానికి అవకాశం ఉందని చరిత్ర చెబుతోంది. పన్ను రహిత రాబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల్లోనూ రాబడులు 14 శాతం కంటే ఎక్కువే ఉన్నాయి. అందుకే దీర్ఘకాల అవసరాలకు ఎఫ్డీలకు బదులు ప్రత్యామ్నాయాలవైపు చూడడం ద్వారానే సంపద సృష్టి సాధ్యమవుతుంది. -
తిరుగుడే తిరుగుడు
⇒పన్నుల వసూలుకు మిస్తున్న పంచాయతీ సిబ్బంది ⇒ఈనెల 30 వరకు గడువు పెంచడంతో కలెక్షన్‌కు చర్యలు ⇒మిగిలిన రూ.3.19 కోట్ల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక ⇒వంద శాతం లక్ష్యంగా అధికారుల కృషి వరంగల్ రూరల్: ఆర్థిక సంవత్సరం గతనెల 31వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వసూలు కావాల్సిన పన్నులు ఇంకా మిగిలిపోయాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండడంతో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇందులో భాగంగా జిల్లాలో మిగిలిపోయిన రూ.3.19 కోట్ల వసూలుకు అధికా రులు కృషి చేస్తు న్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని జిల్లా పంచాయతీ అధికారి నుంచి కారోబార్ వరకు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. 72.55 శాతం వసూళ్లు.. జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2016–17) రూ.11,64,00,173 మేరకు ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసిన మార్చి 31వ తేదీ వరకు రూ.8,44,47,385(72.55శాతం) పన్నులే వసూలయ్యాయి. అంటే ఇంకా రూ.3.19 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నగదు బకాయిగా పేరుకుపోతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి చాలా జిల్లాల్లో ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు పన్నుల వసూళ్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు బకాయిలు వంద శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పిండి కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు. నోట్లు రద్దుతోనే.. కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీంతో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఉద్యోగులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్యలో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ.11.64 కోట్ల వరకు ఉన్న పన్నుల్లో రూ. 8.44 కోట్ల వరకు వసూలయ్యాయి. అంటే నోట్ల రద్దు అంశం పన్నులు భారీగా వసూలయ్యేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అందరి సహకారంతో ముందుకు.. జిల్లాలో ఆస్తి, నీటి పన్నులు రూ.3 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు వసూలైన పన్నులు లెక్కిస్తే ఈ బాకీ తేలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పన్నుల స్వీకరణకు అవకాశం కల్పించగా అప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నాం. అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓ పీఆర్డీల సహకారం తీసుకుంటూ కార్యదర్శులు పన్నులు వసూళ్లలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన గడువు సద్వినియోగం చేసుకుని వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. -
ఏమేం పన్నులు కడుతున్నాం?
నిజానికి.. దేశంలో పౌరులందరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో నిరంతరం పన్ను కడుతుంటారు. ఆదాయం తక్కువున్న వారు, అసలే ఆదాయం లేని వారు ప్రత్యక్షంగా ఆదాయ పన్ను కట్టకపోవచ్చు. కానీ.. వారు దుకాణంలో కొనే వస్తువుల నుంచి రెస్టారెంట్లో భోజనం చేయడం వరకూ అత్యధిక పర్యాయాలు పరోక్ష పన్నులు కడుతుంటారు. ఆధునిక ప్రభుత్వాలు చాలా వరకూ పన్నుల ద్వారానే నడుస్తుంటాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంటాయి. అవి ఆదాయపన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కావచ్చు. అమ్మకం పన్ను, సేవా పన్ను వంటి పరోక్ష పన్నులు కావచ్చు. స్థానిక ప్రభుత్వాలైన నగర పాలక సంస్థ, పురపాలక సంస్థ, పంచాయతీలు కూడా కొన్ని పన్నులు వసూలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ పన్నులు: ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను రాష్ట్ర ప్రభుత్వ పన్నులు: వ్యాట్, స్టాంప్ డ్యూటీ, భూమి శిస్తు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం స్థానిక సంస్థలు: నీటి పన్ను, ఆస్తి పన్ను, దుకాణం పన్ను వగైరా ప్రత్యక్ష పన్నులు ఇవీ... ఆదాయ పన్ను: నిర్దిష్ట పరిమితిని మించి ఆదాయం ఆర్జించే ప్రతి ఒక్కరూ కట్టే పన్ను ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేస్తుంది. ఈ పన్నును కేంద్రం తరచుగా సవరిస్తుంటుంది. అలాగే.. ఈ పన్ను విషయంలో కొన్ని రాయితీలు, మినహాయింపులు కూడా ప్రకటిస్తుంటుంది. పెట్టుబడి రాబడుల పన్ను: ఆస్తులు, షేర్లు, బాండ్లు, విలువైన వస్తువులను ముందుగా నిర్ణయించిన కాలపరిమితి లోపల అమ్మి లాభం గడిస్తే.. ఆ లాభంపై చెల్లించే పన్ను. ఆయా పెట్టుబడుల రకాన్ని బట్టి ఈ పన్ను శాతం మారుతుంది. ప్రస్తుతం షేర్లపై స్వల్ప కాలిక (ఏడాది లోపు) పెట్టుబడి రాబడి పన్ను 10 శాతం, దాని మీద విద్యా సెస్సు వసూలు చేస్తోంది. దీర్ఘకాలిక (ఏడాది కన్నా ఎక్కువ కాలం) పెట్టుబడి రాబడిపై పన్ను లేదు. ఆస్తుల క్రయవిక్రయాల విషయంలో స్వల్పకాలిక పెట్టుబడి రాబడి పన్ను కాలపరిమితి మూడేళ్లు. ఆ కాలం దాటితే పన్ను ఉండదు. కానుక పన్ను: ఒక వ్యక్తి అందుకునే కానుకల పైనా పన్ను చెల్లించాలి. దానిని ఆదాయం కింద గణిస్తారు. కానుక విలువ ఒక ఏడాదిలో రూ. 50,000 కన్నా మించితే ఈ పన్ను వర్తిస్తుంది. సంపద పన్ను: ఒక వ్యక్తి మొత్తం సంపద మీద వసూలు చేసే పన్ను. అన్ని ఆస్తుల మొత్తం నుంచి.. ఆ ఆస్తులను పొందడానికి చేసిన రుణాలను తీసివేసి సంపదను విలువకడతారు. విలువకట్టే తేదీ నాటికి సంపద విలువను లెక్కించి ఈ పన్ను విధిస్తారు. సంపద విలువ రూ. 30 లక్షలు దాటితే ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. అయితే.. 2015 బడ్జెట్లో సంపద పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఏటా రూ. 1 కోటి, అంతకు మించి ఆదాయార్జన గల వారిపై 12 శాతం సర్ ఛార్జి వసూలు చేస్తోంది. సెక్యూరిటీ (షేర్ల) లావాదేవీల పన్ను: స్టాక్ఎక్సేంజీలో జరిపే ప్రతి లావాదేవీ పైనా ఈ పన్ను విధిస్తారు. ప్రిరిక్విసిట్ పన్ను: ఒక సంస్థ తన ఉద్యోగులకు ఇచ్చే నగదేతర ప్రయోజనాలు- డ్రైవర్‌తో సహా కారు సదుపాయం, క్లబ్ సభ్యత్వం, సంస్థ షేర్లలో వాటా తదితరాలపై పన్ను వసూలు చేస్తారు. టోల్ పన్ను: ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రదేశాలలో టోల్ పన్ను కట్టాల్సి ఉంటుంది. కార్పొరేట్ పన్ను: భారతదేశంలో పనిచేసే ఏదైనా కార్పొరేట్ సంస్థ తన ఆదాయంపై చెల్లించే వార్షిక పన్ను. పన్నుల విధింపు కోసం దేశంలోని కంపెనీలను దేశీయ, విదేశీ సంస్థలుగా వర్గీకరించారు. ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. దాని మీద 3 శాతం సెస్సు కూడా ఉంది. అంటే మొత్తం పన్ను 30.9 శాతం. ఇక ఆదాయం రూ. 1 కోటి కన్నా మించితే ప్రాథమిక పన్ను మీద అదనంగా 12 శాతం సర్ చార్జి వసూలు చేస్తారు. పరోక్ష పన్నులు ఇవీ... కేంద్ర అమ్మకం పన్ను: దేశంలో వస్తు ఉత్పత్తుల విక్రయాలపై విధించే పన్ను ఇది. అంతర్రాష్ట్ర వస్తు విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రంలో అంతర్గత అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసే పన్నును కేంద్ర అమ్మకం పన్ను అంటారు. ప్రస్తుతం కేంద్రం 2 శాతం సీఎస్టీ వసూలు చేస్తోంది. విలువ ఆధారిత పన్ను: రాష్ట్రాలు వసూలు చేసే అమ్మకం పన్నును వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకే తరహా వ్యాట్ అమలులో ఉంది. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లు వంటి ఖరీదైన వస్తువుల మీద 1 శాతం వ్యాట్ ఉంది. ఆటోమేటిక్ వ్యవసాయ పనిముట్లు, పురుగు మందులు, సిమ్ కార్డుల, మైక్రోఫోన్లు, కాఫీ, ఐస్, పేటెంట్లు వంటి వాటిపై 4 శాతం వ్యాట్ ఉంది. ఈ జాబితాలో సుమారు 125 వస్తువులున్నాయి. ఇక నాలుగో షెడ్యూలులోని వస్తువుల మీద వ్యాట్ 22.5 శాతం నుండి 70 శాతం వరకూ ఉంటుంది. మద్యం మీద అత్యధికంగా 70 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీద 33 శాతం, డీజిల్ మీద 22.5 శాతం, పొగాకు మీద 25 శాతం వ్యాట్ ఉంది. ప్రజల, పర్యావరణ ఆరోగ్యం, బాగోగులను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా వస్తువుల మీద వ్యాట్ అధికంగా వసూలు చేస్తున్నారు. పై మూడు రకాలు కాకుండా ఐదో షెడ్యులులో ఉన్న మిగతా వస్తువులన్నింటి మీదా 12.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. సేవా పన్ను: డబ్బు చెల్లించి పొందే సేవల్లో చాలా సేవలకు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులు, ఏసీ రైల్వే టికెట్లు, కార్లు, ఇళ్లు, సినిమా టికెట్లు, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, హోటళ్ల బిల్లులు, వైద్య సేవలు తదితరాలు. ప్రస్తుతం 14 శాతం సేవా పన్ను వసూలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ సెస్సు, కృషి కళ్యాణ్ సెస్సులను కలుపుకుని సేవలపై మొత్తం 15 శాతం పన్ను విధిస్తున్నారు. స్వచ్ఛ భారత్ సెస్సు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2015 నవంబర్ 15 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సును వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు 0.5 శాతంగా ఉంది. కృషి కళ్యాణ్ సెస్సు: రైతుల సంక్షేమాన్ని విస్తరించడం కోసం 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2016 జూన్ 1 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు రేటు 0.5 శాతం. కస్టమ్స్ సుంకం: విదేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పరోక్ష పన్ను ఇది. ఈ పన్నును ప్రధానంగా సదరు వస్తువులను దేశంలోకి దిగుమతి చేసుకునే కేంద్రంలో చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువుల స్వభావాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుంటాయి. ఎక్సైజ్ సుంకం: దేశంలోనే ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే మరొక పన్ను. వస్తువులు తయారు చేసేవారు, వస్తువులు తయారు చేయడానికి కార్మికులను నియమించుకునే వారు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యాంటీ డంపింగ్ సుంకం: ఏదైనా విదేశం ఏవైనా వస్తువులను వాటి సాధారణ విలువ కన్నా తక్కువ ధరకు మన దేశంలోకి భారీగా దిగుమతి చేయడాన్ని నిరోధించడానికి ఈ పన్నును అమలు చేస్తున్నారు. ఇతర పన్నులు... వృత్తి పన్ను: ఆదాయాన్ని ఆర్జించే వృత్తి నిపుణుడు ఈ పన్ను చెల్లించాలి. దీనిని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు విధిస్తాయి. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఈ పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగీ ఈ పన్ను చెల్లించాలి. సదరు ఉద్యోగికి సంబంధించిన సంస్థ స్వయంగా ప్రతి నెలా ఈ పన్నును మినహాయించుకుని మున్సిపల్ కార్పొరేషన్లకు జమచేస్తుంది. డివిడెండ్ పంపిణీ పన్ను: కంపెనీలు తమ పెట్టుబడిదారులకు చెల్లించే డివిడెండ్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఏదైనా కంపెనీ డివిడెండును ప్రకటిస్తే.. అలా ప్రకటించిన డివిడెండ్లపై 16.995 శాతం పన్ను కట్టాలి. ఇది కార్పొరేట్ పన్ను 30.9 శాతానికి అదనం. డివిడెండ్ పన్ను: 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను ఇది. రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం అదనపు పన్ను విధించారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. మున్సిపల్ పన్ను: ప్రతి నగరంలోనూ నగరపాలక సంఘం ఆస్తి పన్ను వసూలు చేస్తుంది. ప్రతి ఆస్తి యజమానీ ఈ పన్ను చెల్లించాలి. ఈ పన్ను రేటును ఆయా నగర పాలక సంస్థలు నిర్ణయిస్తాయి. హైదరాబాద్‌లో నివాస గృహం చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ ఆధారంగా.. ఆ విలువలో 17 శాతం నుంచి 30 శాతం వరకూ ఆస్తి పన్ను కట్టాలి. అందులో సాధారణ పన్ను, కన్జర్వెన్సీ పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ పన్ను కలిసి ఉంటాయి. అదనంగా లైబ్రరీ సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ రూ. 50 కన్నా తక్కువగా ఉంటే ఈ పన్ను వర్తించదు. వినోద పన్ను: వినోదానికీ పన్ను వర్తిస్తుంది. సినిమా టికెట్లు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రసార సేవలు, డీటీహెచ్ సేవలు, కేబుల్ సేవలు వంటి వినోదాల ఆర్థిక లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్ను విధిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో వినోద పన్ను టికెట్ విలువ మీద 20 శాతంగా ఉంది. అదే తెలుగు సినిమాలకైతే కాస్త తక్కువగా 15 శాతం పన్ను ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్ను: ఒక స్థిరాస్తి కొన్నపుడు విక్రేతకు చెల్లించే మొత్తానికి అదనంగా.. స్టాంపు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్నులు చెల్లించాలి. ఆస్తుల పత్రాలు రూపొందించడానికి ఇవన్నీ అవసరం. సులుభంగా చెప్పాలంటే ఒక ఆస్తి యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మార్చడానికి ఈ పన్నులు వసూలు చేస్తారు. ఈ పన్నులు ఆస్తి రకాన్ని బట్టి, దాని విలువను బట్టి ఉంటుంది. విద్యా సెస్సు, సర్ చార్జి: దేశంలో పేద ప్రజల విద్య కోసం విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. దేశంలో ప్రధానంగా ఆదాయ పన్ను, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల మీద విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. అది మొత్తం చెల్లించే పన్ను మీద 3 శాతం ఉంటుంది. సర్ చార్జి అంటే.. అప్పటికే ఉన్న పన్ను రేటుకు అదనంగా కలిపే పన్ను. మౌలిక సదుపాయాల సెస్సు: కార్లు, యుటిలిటీ వాహనాలపై 2016 బడ్జెట్లో ఈ పన్నును ప్రవేశపెట్టారు. నాలుగు మీటర్ల లోపు నిడివి, 1200 సీసీ లోపు సామర్థ్యం గల ఇంజన్లు గల పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్‌జీలతో నడిచే వాహనాలపై 1 శాతం మౌలికసదుపాయాల సెస్సు వసూలు చేస్తున్నారు. 4 మీటర్లకు పైబడిన, 1500 సీసీ లోపు సామర్థ్యం గల వాహనాలపై ఈ సెస్సు 2.5 శాతంగా ఉంది. ఇక పెద్ద కార్లు, ఎస్‌యూవీల మీద 4 శాతం సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రవేశ పన్ను: గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రవేశ పన్నును వసూలు చేస్తున్నాయి. ఈ-కామర్స్ మార్గంలో ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించే అన్ని వస్తువుల మీదా 5.5 శాతం నుండి 10 శాతం వరకూ ప్రవేశ పన్ను వసూలు చేస్తున్నాయి. కొసమెరుపు: ఇన్ని రకాలుగా ఉన్న పన్నులకు, వాటిలో గందరగోళానికి త్వరలో ఒక రూపం రానుంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానం అమలులోకి రానుంది. తప్పక చదవండి: ఈ ఆదాయాలకు పన్ను లేదు... మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం! -
విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు
-
మద్యంతో ముంచేద్దాం..!
⇒ ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి ⇒ మద్యం ధరలు, దుకాణాల సంఖ్య పెంచే యోచన ⇒ విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది మద్యం పొంగి పొర్లనుంది. మద్యం ద్వారా ఏకంగా రూ.20 వేల కోట్లు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్యను పెంచటంతో పాటు మద్యం రేట్లు, లైసెన్సు ఫీజులు, మద్యం అమ్మకాలపై పన్నుల మోత మోగించేందుకు నడుం బిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త బడ్జెట్లో ఈ అంచనాలను అమాంతం 50 శాతానికి పైగా పెం చింది. అదనంగా రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించడం గమనార్హం. భారీగా పెరగనున్న దుకాణాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు న్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో వీటి లైసెన్స్ గడువు ముగియనుంది. ఆశించిన ఆదాయం రాబట్టా లంటే లైసెన్సు ఫీజులను పెంచడంతోపాటు ఇప్పు డున్న దుకాణాల సంఖ్యనూ పెంచాలని సర్కారు యోచిస్తోంది. విదేశీ మద్యం ద్వారా వీలైనంత ఎక్కు వ ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ మద్యం ద్వారా రూ.4,447 కోట్ల ఆదాయం సమకూరనుంది. విదేశీ మద్యం విక్రయాలను విస్తరించటంతో పాటు అదనపు ఫీజుల ను పెంచాలని సర్కారు నిర్ణయించింది. అందుకే విదేశీ మద్యం ద్వారా రూ.8,201 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది. ఎక్సైజ్ ఆదాయమే పెద్ద దిక్కు అమ్మకపు పన్ను తర్వాత ఖజానాకు ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయమే పెద్ద దిక్కు. ఎక్సైజ్ డ్యూటీ, లీజు, లైసెన్సు ఫీజు, ఎక్సైజ్ వ్యాట్, ప్రివిలేజ్ ఫీజు ఇవన్నీ ఈ పద్దులో ఉంటాయి. మద్యం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ డ్యూటీని ఈసారి గణనీయంగా పెంచే అవ కాశం ఉంది. తద్వారా మద్యం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై 70 నుంచి 180 శాతం వరకు వ్యాట్ విధిస్తుండగా, ప్రీమియం, ఫారిన్ లిక్కర్‌పై వ్యాట్‌ను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు లైసెన్సు ఫీజులు ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన సంవత్సరానికి రూ.40 లక్షల నుంచి రూ.1.08 లక్షల వరకు వివిధ స్లాబుల్లో ఉన్నాయి. వీటిని సవరించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం 13 వేల జనాభాకి ఓ మద్యం దుకా ణం ఉండగా, వీటిని విస్తరించే అవకాశాలున్నాయి. బార్ల లైసెన్సులను నగర పంచాయతీల నుంచి మం డల స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది. సుప్రీం ఆదేశాలతో వ్యాపారుల బెంబేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 తర్వాత రహదారులకు ఆనుకుని మద్యం అమ్మకాలు ఉండరాదని స్పష్టం చేసింది. దీంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రహదారులకు దూరంగా వెళితే వ్యాపారాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతుంది. -
శాంతిమయ జీవితం ఎక్కడ?
పంట చేతికి రాకపోతే పస్తులుండే వ్యవసాయ సమాజంలో పుట్టి పెరిగాడాయన. కరువులోనూ ముక్కుపిండి పన్నులు వసూలు చేసే రోమా నియంతృత్వ పాలనకు, యూదు మత పెద్దల దౌర్జన్యం, వేషధారణకు ఆయన ప్రత్యక్షసాక్షి, బాధితుడు కూడా. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరక్క పస్తులుండే జాలరులు ఆయన అంటే యేసుప్రభువు ప్రియ శిష్యులు. యేసు బోధలు అయనెదుర్కొన్న కష్టాలు, సవాళ్లు ఒత్తిళ్ల నుండి వచ్చాయి కాబట్టే అవి ఆచరణాత్మకమైనవిగా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. అందుకే అంత సాధికారికంగా, పరలోకపు తండ్రిగా దేవుడుండగా విశ్వాసులు అసలు చింతించవలసిన పని లేదన్న ఆయన బోధ విప్లవాత్మకమైనది. నిన్నటి తప్పిదాల అపరాధభావన, రేపటి సవాళ్ల తాలూకు అందోళన అనే ఇద్దరు దొంగల మధ్య, దేవుడిచ్చిన అత్యంత ఆశీర్వాదకరమైన ‘నేటిని’ సిలువ వేసుకొంటున్న అభాగ్యులం మనం. అలా మానవాళికి శాపంగా మారిన చింతను యేసు తూర్పారబట్టాడు. పరలోకపుతండ్రిగా దేవుని మానవాళికి పరిచయమవడం ద్వారా యేసుక్రీస్తు ‘చింతించడం’ వెనుక ఉన్నమహా రహస్యాన్ని ఛేదించాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను విశ్వసించినంత తేలికగా, సంపూర్ణంగా మానవాళి దేవుని పరలోకపు తండ్రిగా విశ్వసించకపోవడమే వారి చింతలన్నింటికీ మూలమని యేసు రోగనిర్ధారణ చేశాడు. ఇహలోకపు తండ్రిగా మనకు చాలా పరిమితులున్నాయి. కాబట్టి పిల్లల కోసం ఎన్నో చేయాలనుకున్నా అన్నీ చేయలేని అశక్తులం మనం. అయినా ‘తండ్రీ’ అన్న సంబోధనలోనే పిల్లలు ఎంతో స్వాంతన, ఆదరణ పొందుతారు. అలాంటప్పుడు సర్వశక్తిమంతుడైన దేవవుడే పరలోకపు తండ్రిగా ఉంటే అదెంత భాగ్యం? ‘దైవర్శనం’ కోసం పుణ్యస్థలాలకు, మహా దేవాలయాలకు వెళ్లే సంస్కృతి కొందరికి లాభకరంగా మారింది కాని సగటు విశ్వాసికి చాలా నష్టం చేసింది. దేవుడంటే అక్కడెక్కడో ఉండే అందుబాటులో లేని ‘దూరపుశక్తి’ అన్న భావనే విశ్వాసుల్లో అశాంతికి కారణమైంది. కాని దేవుడు నిరంతరం మనల్ని వెన్నంటి ఉండే పరలోకపు తండ్రి ‘అన్న భావనతో, నా జీవనపథంలో ఎంతటి ప్రతికూలతనైనా ఆయనే ఎదుర్కొంటాడన్న నిర్భయత్వం ఏర్పడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవునికి పరిమితులే లేవు గనుక మన సమస్య ఎంత గడ్డుదైనా దానికి ఆయన వద్ద అద్భుతమైన పరిష్కారముంటుందననది ఆయన పిల్లలముగా మనకు కలిగే భరోసా! అదే మన జీవితాన్ని ‘నిశ్చింతల ద్వీపం’గా మార్చుతుంది. ఆలస్యమెందుకు? ఈ రోజే మీ చేయి పరలోకపు తండ్రి చేతిలో వేయండి. మీ చింతలన్నీ ఆయనకే ‘అప్లోడ్’ చేయండి! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
బకాయిలు కొండంత
నత్తనడకన ఆస్తిపన్ను వసూళ్లు పట్టణాలు, పల్లెల్లో అదే తీరు పంచాయతీల్లో రూ.102 కోట్ల బకాయిలు పట్టణాల్లో రావాల్సింది రూ.51.24 కోట్లు గ్రామాలను వేధిస్తున్న సిబ్బంది కొరత కొరవడుతున్న పర్యవేక్షణ పల్లెలు, పట్టణాలకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ఇచ్చే నిధులతోపాటు.. ఆస్తిపన్నులు కూడా ముఖ్యమైన ఆదాయ వనరు. ఇంత కీలకమైన పన్ను వసూళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించడంలేదు. ఫలితంగా పన్ను వసూళ్లు ఇప్పటికీ నత్తనడకగా సాగుతున్నాయి. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను డిమాండు రూ.107.76 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ మొత్తం రూ.113 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.11 కోట్లు మాత్రమే వచ్చింది. మరో నలభై రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో.. మిగిలిన బకాయిలు వసూలు కావడం అనుమానమే. దీంతో ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : చాలీచాలని సిబ్బంది, పర్యవేక్షణ లోపాలతో గ్రామ పంచాయతీల్లో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అటు ప్రభుత్వం రూపాయి కూడా విదల్చకపోవడం, ఇటు పన్నులు కూడా సరిగా వసూలు కాకపోవడంతో.. గ్రామ పంచాయతీల అభివృద్ధి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. జిల్లాలో 1,063 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో సగానికి పైగా పంచాయతీలు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా మొత్తమ్మీద గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలు రూ.113 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం రూ.11 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రూ.102 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉందన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో కొద్ది రోజులు మాత్రమే గడువుంది. ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద మొత్తాన్ని అధికారులు ఏవిధంగా వసూలు చేయగలరనేది ప్రశార్థకంగా మారింది. గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, బ్లీచింగ్, ముగ్గు వంటివాటి కొనుగోలుకు సాధారణ నిధులు వినియోగించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలు సైతం డబ్బులు లేక విలవిలలాడుతూండగా, మైనర్ పంచాయతీల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. డ్రైనేజీలు, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు తాత్కాలిక సిబ్బందితో పనులు చేయించేవారు. ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. కార్యదర్శుల కొరత కారణంగా సిబ్బందిపై అజమాయిషీ లేదు. దీనికితోడు గత ఏడాదిన్నర కాలంగా పూర్తిస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కూడా లేరు. దీంతో పన్ను బకాయిలపై దృష్టి సారించేవారే కరవయ్యారు. 2015 నవంబర్‌లో డీపీఓగా పని చేసిన కె.ఆనంద్ బదిలీపై వెళ్లారు. అప్పటినుంచీ రెగ్యులర్ డీపీఓను నియమించలేదు. జిల్లా సహకారి అధికారి, సెట్రాజ్ సీఈవో, జిల్లా పరిషత్ సీఈవో, అమలాపురం డీఎల్పీవోలు ఇ¯ŒSచార్్జ డీపీవోలుగా పని చేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ ఇ¯ŒSచార్జ్ డీపీఓగా పని చేస్తున్నారు. బిల్లు కలెక్టర్‌తో సమావేశాలు లేవు గతంలో పన్ను వసూళ్లపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లతో డీపీఓ దాదాపు ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర బిల్లు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి పన్నులు వసూలు చేయకుంటే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ డీపీఓ లేకపోవడంతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో గ్రామ పంచాయతీల్లో భారీగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. పట్టణాల్లో నత్తనడకే మండపేట : జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సం వత్సరం ముగిసేనాటికి నూరు శాతం వసూళ్లు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకూ 52 శాతం మాత్రమే వసూలయ్యాయి. 77.2 శాతంతో తుని మున్సిపాలిటీ ముందంజలో ఉండగా, 41.4 శాతంతో రామచంద్రపురం చివరి స్థానంలో ఉంది. మరో 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. నిధుల విడుదలకు నూరు శాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కాకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతోపాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో 2,35,685 ప్రైవేటు భవనాలున్నాయి. వీటిద్వారా ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ మొత్తం రూ.107.76 కోట్లుగా ఉంది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇది సుమారు 52 శాతంగా ఉంది. 77.2 శాతంతో తుని మున్సిపాల్టీ ముందంజలో ఉంది. మండపేట మున్సిపాల్టీలో 74.7, కాకినాడ నగర పాలక సంస్థలో 58, రాజమహేంద్రవరంలో 55, అమలాపురంలో 58.7, పెద్దాపురంలో 65.6, సామర్లకోటలో 62.5, పిఠాపురంలో 43.6, రామచంద్రపురంలో 41.4 శాతం చొప్పున పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 75.7, ఏలేశ్వరంలో 73.1, ముమ్మిడివరంలో 59.4 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇంకా రూ.51.24 కోట్లు వసూలు కావాల్సి ఉంది. నూరు శాతం వసూలు జరిగేనా? 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థలు నూరు శాతం పన్నులు వసూలు చేయడం తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్ను వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతరం సమీక్ష జరుగుతోంది. దాదాపు మరో 40 రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియనుండగా.. పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నుంచి నూరు శాతం వసూలు గగనమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి పనులపై పడనుంది. -
ఇక నిమిషాల్లో పాన్ కార్డు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ జారీచేసే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్ కార్డు) కావాలంటే వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితికి ఇక చెల్లుచీటి కానుంది. నిమిషాల్లో పాన్ కార్డు ఇక మీ ముందుకు రానుంది. అంతేకాక ఇన్ కమ్ ట్యాక్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లించేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సులువుగా ఆధార్ కార్డు ఈ-కేవైసీ ఫెసిలిటీ ద్వారా పాన్ కార్డును జారీచేసేలా కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ సిమ్ ను ఈ-కేవైసీ ద్వారా జారీచేస్తే, పాన్ కార్డు కూడా ఇవ్వడం కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు, మూడు వారాలు పడుతున్న ఈ పని ఇక ఐదు లేదా ఆరు నిమిషాల్లో ముగించేయొచ్చని పేర్కొంటున్నారు. మొదట నెంబర్ జారీచేసి, తర్వాత కార్డు డెలివరీ చేసేలా చూస్తున్నారు. ఇప్పటికే జతకట్టిన సీబీడీటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కొత్త కంపెనీల స్థాపనకు పాన్ కార్డును నాలుగు గంటల్లో జారీచేసేలా పనిచేస్తున్నాయి. -
పన్నులు వసూలు కాకుంటే పంచాయతీలు విలీనం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో పన్నులు వసూలు చేయడం చేతకాకపోతే పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో పంచాయతీ పన్నులు, పారిశుద్ధ్యం, బయోమెట్రిక్ హాజరు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016–17 పన్నులు ఇంతవరకూ కేవలం 34 శాతం మాత్రమే వసూలు చేశారని, మార్చి 31వ తేదీ నాటికి నూరుశాతం పన్నులు ఎలా వసూలు చేయగలుగుతారని ప్రశ్నించారు. గత ఏడాది పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన ఏలూరు ఈవోఆర్డీని పోలవరానికి, పోలవరం ఈవోఆర్డీని ఏలూరుకు బదిలీ చేయాల్సిందిగా డీపీవో కె.సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు ఉదయం 5.30 గంటలకే క్షేత్రస్థాయికి వెళ్లాలని చెప్పినా ఏ ఒక్కరూ వెళ్లడం లేదని, ఇకపై ఉదయం 5.30 గంటలకే ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీలకు సంబంధించి వెబ్‌సైట్‌ను రూపొందించి పంచాయతీల వారీ సమాచారాన్ని పొందుపరచాలన్నారు. పంచాయతీలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, పన్నులు, నాన్‌టాక్సెస్, ఇతర సమాచారం సేకరించాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలదేనని, ఆ సమాచారాన్ని కంప్యూటర్ ఆపరేటరు ద్వారా నమోదు చేయించాలన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారి సీహెచ్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. తెల్లకార్డుకు అర్హత లేకుంటే గులాబీ కార్డు జిల్లాలో తెల్లరేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతలేదని గుర్తించిన వెంటనే గులాబీకార్డు మంజూరు చేయాల్సిందిగా తహసీల్దార్లను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో తెలుపురంగు రేషన్‌కార్డు పొంది ఉండి స్వచ్ఛందంగా తనకు తెల్లరేషన్‌కార్డు రద్దు చేసి గులాబీ కార్డు మంజూరు చేయాల్సిందిగా లబ్ధిదారుడు కోరినట్లయితే వెంటనే చర్యలు తీసుకుని గులాబీ కార్డు మంజూరు చేయాలన్నారు. ప్రతి దానికి ఆధార్ నెంబరును అనుసంధానం చేస్తారని, ఏవైనా అవకతవకలు జరిగినట్టయితే వెంటనే గుర్తించి సంబంధితాధికారిపై గాని లబ్ధిదారుడుపై గాని చర్యలు తీసుకుంటామని అన్నారు. చేపల చెరువుల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, అర్హత కలిగిన వారికి వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ కె.సుధాకర్, జెడ్పీసీ ఈవో డి.సత్యనారాయణ, నిక్నెట్ అధికారి శర్మ పాల్గొన్నారు. -
3.4 బిలియన్ డాలర్లు పన్నులు చెల్లించిన అలీబాబా
3 కోట్ల మందికి ఉపాధి కల్పన బీజింగ్: చైనా ఈ–కామర్స్ దిగ్గజం ‘అలీబాబా గ్రూప్’ గతేడాది మొత్తంగా దాదాపు 3.41 బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించింది. అలాగే 3 కోట్ల మందికి ఉపాధిని కల్పించింది. ఇక అలీబాబా ప్లాట్‌ఫామ్‌లోని వ్యాపారులు, తయారీదారులు, లాజిస్టిక్స్ కంపెనీలు 2016లో 200 బిలియన్ యువాన్లను పన్నులు రూపంలో చెల్లించాయి. ‘మేము, మా అనుబంధ సంస్థ ఏఎన్‌టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ గతేడాది మొత్తంగా 23.8 బిలియన్ యువాన్లను (3.41 బిలియన్ డాలర్లు= దాదాపు రూ.23,188 కోట్లు) పన్నుల రూపంలో చెల్లించాం. ఇది గతేడాది పోలిస్తే 33 శాతం అధికం’ అని అలీబాబా పేర్కొంది. కాగా అలీబాబా షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 45,000కు పైగా సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. వీరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 142 శాతం మేర వృద్ధి చెందింది. -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ. 123 కోట్ల పన్ను
నిజామాబాద్ నాగారం : నిజామాబాద్ డివిజన్ సర్కిల్ పరిధి సంగారెడ్డి జిల్లా యెద్దు మైలారం గ్రామంలో గల ఆర్డినెన్సు ఫ్యాక్టరీ నుంచి 123 కోట్ల 70 లక్షల 64వేల 553 పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖాజానాకు జమ చేసినట్లు వాణిజ్యపన్నుల శాఖ ఇంటిలిజెన్సు అసిస్టెంట్ కమీషనర్ లక్ష్మయ్య తెలిపారు. దేశ రక్షణకు యుద్ధ ట్యాంకులు తయారు చేసి సరఫరా చేస్తున్న ఆర్డినెన్స్ కంపెనీ పన్నులు చెల్లించకపోవడంతో ఇంటిలిజెన్స్ బృందం క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సుమారు 49 ఆర్డినెన్సు కంపెనీలు ఉన్నాయని, ఎక్కడ కూడా ఈ కంపెనీలు పన్నులు చెల్లించ లేదన్నారు. నిజామాబాద్ డివిజన్లో ఇదే మొదటి సారన్నారు. వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు మదింపు చేసి టాక్స్‌లు వసూలు చేస్తుంటామన్నారు. యెద్దు మైలారంలోని ఆర్డినెన్స్ కంపెనీ గతంలో కేవలం కొన్ని వ్యాపార లావాదేవీలపైన మాత్రమే పన్ను చెల్లించేందన్నారు. ముఖ్యంగా కంపెనీ తయారు చేసి దేశరక్షణకు సరఫరా చేస్తున్న యుద్ధ ట్యాంకర్ వాహనాలపైన మినహాయింపులు పొందుతూ టాక్స్ చెల్లించడం లేదని ఇంటలి జెన్స్ బృందం పరిశీలనలో తేలిందన్నారు. ఆ ట్యాంకర్ల సరఫరాపై పన్నులు విధించినట్లు తెలిపారు. మొదటి విడత రూ. మార్చి 17న రూ. 25 కోట్ల 85 లక్షల 34 వేల 185 వసూలు చేసినట్లు తెలిపారు. రెండవ విడతలో సెప్టెంబర్ 29న రూ.42 కోట్ల 55 లక్షల 11వేల 235 వసూలు చేశామన్నారు. శుక్రవారం నాడు రూ. 55 కోట్ల 35 లక్షల 19వేల 133 వసూలు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 123 కోట్ల 70 లక్షల 64వేల 553 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తెలిపారు. కేవలం ఆడిట్ ద్వారా పన్నులు అత్యధికంగా వసూలు చేసిన ఘనత నిజామాబాద్ వాణిణ్య పన్నుల శాఖ డివిజన్‌కు దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే వ్యాపార సంస్థ ద్వారా పన్నులు వసూలు చేయడం ఇంటిలిజెన్స్ వింగ్ ద్వారానే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా వివిధ వ్యాపార సంస్థలు తమ అమ్మకాలపై రాష్ట్రంలో వ్యాట్, సీఎస్టీ ట్యాక్సులు వసూలు చేస్తాయన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 8 లార్జ్ యూనిట్ సర్కిల్లు ఉన్నాయని, వీటిలో అధిక పన్నులు చెల్లించే 41 మంది డీలర్లు అయిన ప్రముఖ వ్యాపార సంస్థలు ఎంఆర్ఎఫ్, బీహెచ్ఈఎల్, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తదితర కంపెనీలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ జి లావణ్య, గతంలో ఉన్న డీసీ శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఇది సాధించామన్నారు. సమావేశంలో ఏసీటీఓలు జి గంగాధర్, పోతనకర్ లక్ష్మీనారాయణ, ఎస్ జయంత్నాద్, ఆధిత్యకుమార్, జూనియర్అసిస్టెంట్ బి భారతి, తదితరులు పాల్గొన్నారు. -
కార్ల కొనుగోళ్లకూ ఆదాయాలకూ పొంతనేది?
పన్ను పరిధి నుంచి పెద్ద సంఖ్యలో తప్పించుకుంటున్నారన్న విమర్శ.. న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో ప్రజలు పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారని ఒక ఉన్నతాధికారి విశ్లేషించారు. పన్ను రిటర్నుల ప్రకారం దేశంలో వార్షికంగా రూ.10 లక్షల పైబడిన ఆదాయం కలిగిన వారి సంఖ్య కేవలం 24 లక్షల మందేనని ఆ అధికారి పేర్కొంటూ, అయితే కొత్త కార్ల అమ్మకాల సంఖ్య మాత్రం వార్షికంగా 25 లక్షలుగా ఉంటోందన్నారు. వీటిలో లగ్జరీ కార్ల సంఖ్య దాదాపు 35,000. ‘‘ఒక కారు వినియోగ జీవిత కాలం దాదాపు ఏడేళ్లు. సామాన్యుడు ఒక కారు కొన్నాక మళ్లీ ఐదేళ్ల వరకూ కొత్త కారు కొనలేడు. అయినా వార్షికంగా పెద్ద సంఖ్య లో కార్ల కొనుగోళ్లు జరుగుతున్నాయంటే, పన్ను పరిధిలోకి రాకుండా పలువురు తప్పించుకుంటు న్నట్లు అర్థమవుతోంది’’ అని ఆయన విశ్లేషించారు. ట్యాక్స్ రిటర్న్‌లు... 3.65 కోట్లు దేశంలో దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఉంటే, 2014–15 అసెస్మెంట్ ఇయర్లో కేవలం 3.65 కోట్ల మంది వ్యక్తిగతంగా తమ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పన్ను పరిధికి వెలుపల ఉన్నారని అన్నారు. 3.65 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేస్తే, ఇందులో కేవలం 5.5 లక్షల మంది మాత్రమే వార్షికంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినట్లు తెలిపారు. మొత్తం పన్నుల బాస్కెట్లో ఒక్క వీరి వాటానే 57 శాతంగా ఉందన్నారు. అంటే రిటర్న్స్ ఫైల్ చేసే 3.65 కోట్ల మందిలో కేవలం 1.5 శాతం మంది వాటా పన్ను బాస్కెట్లో 57 శాతంగా ఉందని వివరించారు. గత మూడేళ్లలో వార్షికంగా వరుసగా 25.03 లక్షలు, 26 లక్షలు, 27 లక్షల కార్లు అమ్ముడయ్యాయని అధికారి వివరిస్తూ, కారు కొనడానికి ఆదాయం కలిగి ఉన్న పెద్ద సంఖ్యలోని ప్రజలు పన్ను బాస్కెట్ పరిధికి వెలుపల ఉంటున్నట్లు దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడాదికి రూ. కోటి ఆదాయం ఉన్నట్లు చూపుతున్న వారి సంఖ్య 48,417 అయితే, ప్రతి ఏడాదీ బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, మెర్సిడెస్, పోర్షే, మాసిరాటి వంటి లగ్జరీ కార్ల అమ్మకాలు దాదాపు 35,000గా నమోదవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కారు వినియోగ కనీస కాలం దాదాపు ఏడేళ్లయితే, వార్షికంగా ఇన్ని కార్లు ఎలా అమ్ముడవుతాయని ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోల్చితే.. కాగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే భారత్ పన్ను ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఈ నిష్పత్తి కేవలం 16.7 శాతం అయితే, అమెరికాలో 25.4 శాతం, బ్రిటన్‌లో 30.3 శాతంగా ఉందన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని పెద్ద నోట్ల రద్దు ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. దీనివల్ల అనధికార డబ్బును అధికారికంగా మార్చుకోవాల్సిన పరిస్థితి నల్లకుబేరులకు ఏర్పడుతోందని అన్నారు. వారిపై పెద్ద ఎత్తున్న పన్ను కొరడా తప్పదని హెచ్చరించారు. -
మ్యూచువల్ ఫండ్‌లో డివిడెండ్ ఖరారు ఎలా...?
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వృద్ధికి మాత్రమే కాదు, అడపా దడపా అవసరాలకు మధ్యంతరంగా నగదు అందుకునేందుకూ అక్కరకు వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లు ఉంటాయనే విషయం తెలిసిందే. డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మధ్య మధ్యలో డివిడెండ్ రూపంలో ఆదాయం పొందవచ్చు. మరి ఈ డివిడెండ్ ఖరారు ఎలా చేస్తారంటే... ఓ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభం నుంచే డివిడెండ్ పంపిణీ ఉంటుంది. ఫండ్ మేనేజర్ లాభాలను నమోదు చేసినా, కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకున్నా... ఒకవేళ డెట్ ఫండ్స్ అయితే వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం నుంచి ఈ డివిడెండ్ పంపిణీ ఉంటుంది. డివిడెండ్ ఎప్పుడెప్పుడు..? నెలకోసారి, త్రైమాసికంలో ఓ సారి లేదా వార్షికంగా ఒక సారి డివిడెండ్‌ను ప్రకటించే పథకాలు ఉంటాయి. మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు, హైబ్రిడ్ ఫండ్స్‌లో చాలా వరకు క్రమం తప్పకుండా నెలనెలా డివిడెండ్‌ను జారీ చేస్తుంటాయి. ఎంత మొత్తం అంటే... నిర్దిష్టంగా ఇంత అని చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న మ్యూచువల్ఫండ్ పథకంలో యూనిట్ ఎన్ఏవీ... గ్రోత్ ఆప్షన్ యూనిట్ ఎన్ఏవీతో పోల్చి చూస్తే వృద్ధి చెందదు. ఎన్ఏవీ కొంచెం పెరిగిన వెంటనే ఆ మేరకు ఫండ్ మేనేజర్ డివిడెండ్‌ను పంపిణీ చేసేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఫండ్ యూనిట్ రూ.10కి కొనుగోలు చేశారు. ఓ నెల తర్వాత అది రూ.12 అయిందనుకోండి. రూ.2ను డివిడెండ్‌గా ప్రకటించవచ్చు. పన్ను ఉంటుందా...? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జారీ చేసే డివిడెండ్ ఆదాయంపై పన్ను ఉండదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం ఫండ్ నిర్వహణ సంస్థ 28.84 శాతాన్ని డివిడెండ్ పంపిణీ పన్నుగా చెల్లిస్తుంది. డివిడెండ్ ఆప్షన్ సరైనదేనా...? రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఆప్షనే సరైనది. అలాగే క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా ఇదే తగినది. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవాలని కోరుకునే వారు మాత్రం గ్రోత్ ఆప్షన్ ఎంచుకుని సిప్ విధానంలో పెట్టుబడి పెడుతూ వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తుంటారు. డివిడెండ్ విధానంలో కాంపౌండింగ్ వడ్డీ ప్రయోజనం కోల్పోవడం వల్ల సంపద వృద్ధి సాధ్యం కాదు. -
నగదు ర'హితమే'!
నగదు తగ్గడం వలన ఎన్నో లాభాలు - నల్లధనం, అవినీతిపై నియంత్రణ - పన్నుల ఎగవేతకూ చెక్.. లావాదేవీల్లో పారదర్శకత - నకిలీ నోట్ల వంటి సమస్యలూ ఉండవు - సైబర్ నేరాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువశాతం నగదు ఆధారంగానే నడుస్తోంది. అయితే వ్యవస్థ నుంచి నగదు పూర్తిగా తొలగిపోయినా.. లేదా గణనీయంగా తగ్గినా చాలా రకాల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్లధనం, అవినీతికి చెక్ పడుతుంది. పన్నుల ఆదాయం పెరుగుతుంది. అయితే నగదు రహిత వ్యవస్థలో ప్రధానమైన ప్లాస్టిక్ మనీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వంటి వాటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ అంశాలపై ఈ రోజు ఫోకస్.. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ నల్లధనానికి, అవినీతికి చెక్ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువలో నల్లధనం వాటా 25 శాతం వరకూ ఉంటుందని అంచనా. అన్ని లావాదేవీలు నగదు రహితంగా జరిగితే ఈ నల్లధనం వాటా గణనీయంగా తగ్గిపోతుంది. రూపారుు డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది. అమ్మకాలను, ఆదాయాన్ని తక్కువగా చూపడానికి కుదరదు. ప్రతి పైసా లెక్కలోకి వస్తుంది కాబట్టి విధిగా సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నగదు రహిత లావాదేవీలతో పాటు.. ప్రభుత్వ అనుమతుల జారీ, పథకాల అమలు తదితరాలను డిజిటలైజ్ చేయడం వల్ల అధికార యంత్రాంగంలో అవినీతి గణనీయంగా తగ్గిపోతుంది. పన్ను ఆదాయం పెరుగుతుంది దేశ జనాభా 125 కోట్ల వరకూ ఉంటే ఇందులో ఆదాయ పన్ను కట్టే వారు నాలుగు కోట్ల మంది కూడా లేరు. మిగిలిన వారి దగ్గర పన్ను కట్టేంత ఆదాయం లేదని కాదు. లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కువగా ఉందని దీనర్థం. క్రెడిట్, డెబిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా జరిగితే వ్యాపారులు ఆ లెక్కలను ప్రభుత్వానికి చూపాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి పన్నులు కచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. మన దేశంలో స్థూల జాతీయోత్పత్తిలో పన్నుల వాటా పది నుంచి 17 శాతం వరకూ ఉంటుందని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతమున్న పన్ను రేట్లు (కార్పొరేట్, ఆదాయ) ఇదే స్థారుులో కొనసాగిస్తే మాత్రం చాలామంది నగదు రహిత లావాదేవీలకు ఇష్టపడే అవకాశం తక్కువ. ‘నగదు’ ఖర్చులు ఆదా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా ఉంటే నోట్ల ముద్రణ, రవాణా ఖర్చులు చాలా తగ్గుతాయి. ఒక్కో రూ.500 నోటును ముద్రించేందుకు దాదాపు 3.08 రూపాయలు, రూ.1,000 నోటును ముద్రించేందుకు నాలుగు రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇది కూడా నాలుగేళ్ల క్రితం అంచనా. ఇక దేశంలోని నాలుగు ముద్రణ కేంద్రాల నుంచి నోట్లను దేశవ్యాప్తంగా తరలించేందుకు, ఆయా క్యాష్ సెంటర్లలో నిల్వ ఉంచేందుకు, నిర్వహణకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకులు (క్యాష్ మేనేజ్మెంట్కు) ఏటా దాదాపు రూ. 21 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారుు. కరెన్సీ తక్కువగా ప్రింట్ చేస్తే అంత మేరకు ఈ ఖర్చులు తగ్గుతారుు. మాంద్యంలోనూ ఆదుకుంటుంది అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం గుర్తుంది కదా? లావాదేవీలన్నీ నగదు రహితంగా మారితే ఈ రకమైన మాంద్యాలను అధిగమించడం కొంచెం సులువు అవుతుంది. ప్రజల సొమ్ములో అధిక భాగం బ్యాంకుల్లోనే ఉంటుంది కాబట్టి.. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో బ్యాంకులు డిపాజిట్లపై నెగటివ్ పన్నులు విధించడం ద్వారా ప్రజలు ఆ మొత్తాలను ఖర్చు పెట్టేలా చేయవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. నకిలీ నోట్లకు చెల్లుచీటీ డిమాండ్ ఉన్నప్పుడే ఏ వస్తువుకై నా విలువ పెరుగుతుంది. సరఫరాదారులూ ఎక్కువవుతారు. నగదు కూడా దీనికి అతీతం కాదు. లావాదేవీలు ఎక్కువ శాతం నగదు రూపంలో జరిగితే నకిలీల బెడదను తప్పించడం కష్టం. అదే లావాదేవీలన్నీ బ్యాంకులు, డిజిటల్ రూపంలో జరిగితే నగదు అవసరం బాగా తగ్గిపోతుంది కాబట్టి నకిలీలను చలామణీలోకి తీసుకురావడం దాదాపు అసాధ్యమవుతుంది. నేరాలు తగ్గుతాయి నగదు రహిత ఆర్థిక లావాదేవీల వల్ల సమాజంలో నేరాలు తగ్గుతాయని ఒక అంచనా. స్వీడన్నే ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ నగదు రహిత ఆర్థిక లావాదేవీలు పుంజుకున్న తరువాత బ్యాంకు దోపిడీలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నారుు. 2008లో దాదాపు 116 దోపిడీలు జరిగితే 2012 నాటికి 5కు తగ్గారుు. అంతెందుకు నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత ముంబైలో నేరాల సంఖ్య సగానికిపైగా తగ్గినట్లు కథనాలు వచ్చారుు. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి అని అంచనా. ఆర్థిక లావాదేవీలు వేగవంతం నగదు రహితంగా డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీలు వేగవంతమవుతారుు. బ్యాంకు నుంచి వినియోగదారుడికి, వినియోగదారుడి నుంచి బ్యాంకుకు, ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి మరొక వ్యక్తి బ్యాంకు ఖాతాకు నగదును క్షణాల్లో బదిలీ చేయవచ్చు. నగదును జమ చేయడానికి బ్యాంకులకు వెళ్లడం, క్యూలలో నిల్చోవడం వంటి ప్రయాసలు తగ్గిపోతారుు. ఉగ్రవాదానికి గొడ్డలిపెట్టు ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చే వారికి నగదు వ్యవహారాలే ప్రధానం కాబట్టి నగదు రహిత లావాదేవీలు ఈ చర్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సాయపడతాయ నడంలో సందేహం లేదు. నల్లధనం తక్కువవుతున్న కొద్దీ ఉగ్రవాద చర్యలకు నిధులందించే వారికి ఇబ్బందే. అరుుతే నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగే పది దేశాల్లో ఇటీవల జరిగిన అధ్యయనం మాత్రం.. నగదు రహిత లావాదేవీలు ఉగ్రవాద నిధుల ప్రవాహానికి అడ్డంకి కాదని పేర్కొనడం గమనార్హం. -
మున్సిపల్ కార్పొరేషన్‌కు పాతనోట్ల పంట
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దుతో పింప్రి మున్సిపల్ కార్పొరేషన్ దశ తిరిగింది. గత 13 రోజుల నుంచి ఈ కార్పొరేషన్ ఖజానాకు ఆస్తి పన్ను రూపంలో రూ.130 కోట్లు వచ్చి చేరాయి. కేంద్రం నోట్ల రద్దు ప్రకటించిన రెండు రోజులకే పింప్రీ మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) పన్ను చెల్లింపులో పాత నోట్లను అంగీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం నగరవ్యాప్తంగా 15 కార్యాలయాలను ఏర్పాటు చేసి, 200 మంది సిబ్బందిని మోహరించింది. రెండు ప్రైైవేట్ బ్యాంక్‌లకు పన్ను వసూలు అధికారాన్ని కూడా కల్పించింది. దీంతో బుధవారం గడువు ముగిసేటప్పటికి రూ.130 కోట్ల నగదు పన్నుల రూపంలో జమ అయింది. ప్రజల స్పందన భారీగా ఉండటంతో ఈ డ్రైైవ్ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, పెండింగ్ పన్నులను బకాయి దారులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీతో చెల్లిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ చెల్లింపులపై దర్యాప్తు చేపట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. పీఎంసీ ఆస్తి పన్ను విభాగ అధికారి సుహాస్ మపారి మాట్లాడుతూ.. కేవలం 13 రోజుల్లో తాము రూ.130 కోట్లు నగదు రూపంలో పొందగా, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో కలిపి రూ. 910 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. అయితే, ఐటీ విభాగం కోరిక మేరకు.. చెల్లింపుదారుల వివరాలన్నిటినీ వారికి అందించామని వెల్లడించారు. -
గిరిగిరి దందా..ఇక మూతేనా!
► పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ► అక్రమ వడ్డీ వ్యాపారంపై ఐటీ నిఘా ► భయాందోళనలో వడ్డీవ్యాపారులు ►చిరువ్యాపారుల్లో గందరగోళం. జమ్మికుంట : పెద్ద నోట్ల రద్దు ప్రభావం గిరిగిరి దందాపై పడింది. వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక..కొత్తగా ఇవ్వకుండా అయోమయంలో పడ్డారు. ఈ వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం..ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో పెద్ద నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు చిరువ్యాపారులు, దుకాణదారులకు వడ్డీలకిచ్చి ముక్కుపిండి వసూలు చేసిన వడ్డీ వ్యాపారుల చేష్టలు ఇక ముందు సాగడం కష్టమే అనిపిస్తోంది. అక్రమవడ్డీ వ్యాపారం ఇలా.. చేతిలో లెక్కకు మించి డబ్బులున్న వారు చిరువ్యాపారులు, దుకాణదారులకు గిరిగిరి పేరుతో వడ్డీకి డబ్బులిస్తుంటారు. రూ.10వేల నుంచి మొదలుకొని రూ.2లక్షలు వరకు అందిస్తుంటారు. రూ.3 చొప్పున వడ్డీతో డబ్బులు ముట్టేలా వంద రోజులు గడువు పెడతారు. రూ.లక్ష అప్పుగా ఇస్తే మొదటనే రూ.10వేలు తీసుకుని రూ.90వేలు అప్పగిస్తారు. ఇచ్చిన డబ్బుకు రోజుకు రూ.వంద చొప్పున వంద రోజుల వరకు వసూలు చేస్తారు. ఇలా జమ్మికుంటలో దాదాపు వందల మంది వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది రూ.10 లక్షలు మొదలుకొని రూ.కోటి వరకు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఏటా వంద కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పెద్ద మొత్తంలో ఇంట్లో ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల చివరి వరకు నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉండడంతో డిపాజిట్ చేయాలా? వద్దా? అనే సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తుంది. చిట్టీలు ఇలా జమ్మికుంటలో చిట్టీల దందా జోరుగా సాగుతోంది. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు నెలవారీ చిట్టీల దందా సాగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేకుం డానే చిట్టీల దందా నడుస్తోంది. జమ్మికుంట వ్యాపార కేంద్రంలో వంద కోట్లకు పైగా ఈ చిట్టీల దందా కొనసాగుతున్నట్లు ప్రచారం ఉంది. అక్రమ ఫైనాన్సలు, పలువురు బడా వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. అరుుతే చిట్టీలు వేసేవారు... చిట్టీలు ఎత్తుకునే వారికి క్యాష్..టు క్యాష్ ఇచ్చేందుకు ప్రధాని నిర్ణయంతో అడ్డుకట్ట పడినట్లరుుంది. ప్రస్తుతం చిట్టీలు ఇవ్వడం.. నెలవారీ డబ్బులు వసూలు చేయడం నిలిచినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు అవసరాల కోసం డబ్బులు కూడపెట్టి చిట్టీలు వేస్తే నోట్ల రద్దుతో చేతికి డబ్బులు వస్తాయో.. రావోననే అయోమయంలో పడ్డారు. అదే విధంగా ఫైనాల్స్‌లో లక్షల్లో డబ్బులు దాచిన వారు ఎలా గట్టెక్కుతామోనని భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లోనే అక్రమ ఫైనాన్సలతో పాటు వడ్డీవ్యాపారులు బోర్డులు తిప్పేసే పరిస్థితులు కనిపిస్తున్నారుు. చిరువ్యాపారుల విలవిల పెద్ద నోట్ల రద్దుతో బడాబాబులు, వడ్డీవ్యాపారులు నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటే చిరువ్యాపారులు మాత్రం అప్పు దొరక్క బిక్కమొహం వేస్తున్నారు. బడా వ్యాపారులకు కోట్లలో రుణాలు ఇచ్చేందుకు క్యూలు కట్టే బ్యాంకర్లు చిరువ్యాపారులకు రూ.10వేల రుణం ఇవ్వలేకపోతుంటారు. దీంతో కుటుంబ పోషణ, వ్యాపారం కొనసాగించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో వడ్డీవ్యాపారులు దందా చేయకపోవడంతో రుణం లభించక చిరువ్యాపారులు దుకాణాలు మూసేస్తున్నారు. బ్యాంకర్లు స్పందించి ఎలాంటి తిరకాసు లేకుండా రుణాలు ఇవ్వాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. వడ్డీ వద్దు ! వడ్డీ వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను వడ్డీ లేకుండా ఇస్తామంటూ పలువురు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిత్యం చెల్లించే డబ్బులు రూ.వంద నోట్లు ఇస్తే సరిపోతుందని వ్యాపారులను బతిమిలాడుతున్నట్లు తెలిసింది. రద్దరుున నోట్లను తీసుకుంటే చిక్కుల్లో పడిపోతామనే భయంతో ఎవరూ ముందుకురావడం లేదని సమాచారం. ఐటీ నిఘా జమ్మికుంటలో వడ్డీ వ్యాపారుల గిరిగిరి దందాతోపాటు అక్రమ ఫైనాన్సలు, నెలవారీ చిట్టీలు నిర్వహించే వారిపై ఐటీ శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల పేర్లు సేకరించినట్లు సమాచారం. ఆదాయం, ఆస్తుల వివరాలు, ఫైనాన్సల టర్నోవర్ తదితర వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. -
పాత నోట్లతో 24 వరకు పన్నులు..
సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఈ నెల 24వ తేదీ వరకు ప్రస్తుత సంవత్సర ఆస్తిపన్ను, గత బకాయిలు, ట్రేడ్‌లైసెన్స్ లను చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని నగరవాసులు వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని, వీటితో పాటు అన్ని మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల్లో పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లను మాత్రం జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో మాత్రమే జమచేయాలని తెలిపారు. -
పన్నుల విధానంపై అవగాహన అవసరం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(వేదాయపాళెం): వస్తు సేవలు, వాణిజ్యపరమైన పన్నుల విధానంపై ఆయా శాఖల అధికారులకు అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో శుక్రవారం కమర్షియల్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 ఏప్రిల్ చట్టంలోని ప్రధాన అంశాల గురించి వివరించారు. రాజ్యాంగ సవరణ 122 యాక్ట్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడిట్, పన్నులు, పలు విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని వివరించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు. కమర్షియల్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి, సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
సినిమాల నిర్మాణానికి టర్కీ ప్రోత్సాహకాలు
హైదరాబాద్ : విదేశీ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే దిశగా టర్కీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. తమ దేశంలో చిత్రీకరించే సమయంలో చేసే వ్యయాలపై దాదాపు 18 శాతం దాకా పన్ను రీఫండ్ ఇస్తున్నట్లు టర్కీ టూరిజం శాఖలో భాగమైన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ కోఆర్డినేటర్ ఒజ్గుర్ అయ్‌టుర్క్ తెలిపారు. అలాగే చిత్ర నిర్మాణ సామగ్రి సత్వర కస్టమ్స్ క్లియరెన్స్, చిత్రీకరణ లొకేషన్స్ ఎంపిక మొదలైన వాటిలో తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో 8 నగరాల్లో తలపెట్టిన రోడ్ షోలలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒజ్గుర్ ఈ అంశాలు చెప్పారు. దిల్ ధడక్‌నేదో, ఏక్ థా టైగర్ తదితర బాలీవుడ్ సినిమాలు టర్కీలో చిత్రీకరణ జరుపుకున్నాయి. మరోవైపు, గతేడాది మొత్తం 2.6 కోట్ల మంది పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించగా వీరిలో 1.31 లక్షల మంది భారత టూరిస్టులు ఉన్నారని ఒజ్గుర్ తెలిపారు. దేశీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈసారి కొంత తగ్గినా.. వచ్చేసారి భారత టూరిస్టుల సంఖ్య 20 శాతం పైగా వృద్ధి చెందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టూరిజం ద్వారా 31 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందన్నారు. వివాహాలు, హనీమూన్, గోల్ఫ్ వంటి క్రీడలు మొదలైన వాటికి అనువైనదిగా టర్కీని ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్..?
నా ప్రజా భవిష్యనిధి ఖాతా(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్)ను రెండు సార్లు పొడిగించాను. ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ములు విత్‌డ్రా చేసుకుంటే నేను ఏమైనా పన్నులు చెల్లించాలా ? - సీతారామ్, వైజాగ్ పొడిగించిన తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించక్కర లేదు. పన్నుల పరంగా చూస్తే పీపీఎఫ్ ఖాతాను ‘మూడు మినహాయింపులు’(ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఈఈఈ)గా పరిగణిస్తారు. అంటే పీపీఎఫ్ ఖాతాకు మూడు దశల్లో మినహాయింపు లభిస్తుందని అర్థం. పెట్టుబడులు పెట్టేటప్పుడు. వడ్డీ విలువలపై, పెట్టుబడులను ఉపసంహరించుకునేటప్పుడు.. ఇలా ఈ మూడు దశల్లో పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడులకు రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ పెట్టుబడుల వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక పీపీఎఫ్ సొమ్ములను ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఖాతాను పొడిగించినా కూడా విత్‌డ్రాయల్ అప్పుడు ఎలాంటి పన్ను పోటు ఉండదు. డెట్ ఫండ్ అంటే ఏమిటి ? - ప్రసన్న, విజయవాడ బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను డెట్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రిస్క్ తక్కువ. రాబడులు కూడా తక్కువగానే ఉంటాయి. పెట్టుబడి వ్యూహాలు, ఇన్వెస్ట్ చేసే బాండ్ల రకాలను బట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రకాలు ఉన్నాయి. మీడియమ్, లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యురిటీ ఫ్లాన్లు.. ఇలా రకరకాల డెట్ ఫండ్లు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి 3, 4 ఏళ్ల క్రితం కొన్ని బీమా పాలసీలు తీసుకున్నాను. అవి సంతృప్తికరమైన రాబడులివ్వడం లేదు. వీటిలో కొనసాగమంటారా? వైదొలగమంటారా? - కమలాకర్, గుంటూరు పెట్టుబడులు లక్ష్యంగా జీవిత బీమా పాలసీలు ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, మదుపునకు వేర్వేరుగా పెట్టుబడులు పెట్టాలి. రెండింటిని కలగలపకూడదు. మీకేదైనా జరిగితే ఆర్థిక భరోసా కల్పించడమే బీమా పాలసీల లక్ష్యంగా ఉండాలి. జీవిత బీమాపాలసీల విషయానికొస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే సరైనది. రాబడులనిచ్చే యులిప్‌లు, మనీ-బ్యాక్, ఎండోమెంట్ వంటి బీమాపాలసీలు ఇన్వెస్ట్మెంట్ పరంగా, బీమాపరంగా మంచి ప్రయోజనాలనిస్తాయని ఏజెంట్లు ఊరిస్తారు. కానీ అవి మీకు తగిన జీవిత బీమాను, అలాగే తగినంత రాబడులను ఇవ్వలేవు. పైగా అధిక ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి హైబ్రిడ్ ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్మెంట్ పాలసీల నుంచి వైదొలగడం మంచిది. తగినంత బీమా ఉన్న టర్మ్ ప్లాన్‌ను తీసుకోండి. మీ మదుపు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలి? పాలసీబజార్, కోవర్ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా తీసుకోవాలా లేక కంపెనీ వెబ్సైట్ నుంచి నేరుగా తీసుకోవాలా? - నందిని, హైదరాబాద్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. బీమా సంస్థ వెబ్సైట్ నుంచే నేరుగా పాలసీ తీసుకోవచ్చు. లేదా ఆ బీమా సంస్థ ఏజెంట్ ద్వారా కూడా పాలసీ తీసుకోవచ్చు. లేదంటే పాలసీబజార్డాట్కామ్, కోవర్ ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ పాలసీలు తీసుకోవడం ఇప్పుడు అత్యంత సులభం, పైగా రెండు కీలకమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొదటిది వివిధ కంపెనీలు ఆఫర్ చేసే వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూసే వెసులుబాటు ఉంటుంది. ఇలా పోల్చి చూసి, ఏది మంచి ప్లాన్ అది ఎంచుకోవచ్చు. ఆన్లైన్ పాలసీలు చౌకగా లభిస్తాయి. ఈ ఆన్లైన్ పాలసీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. అగ్రిగేటర్ వెబ్సైట్లో పాలసీలను పోల్చిచూసుకుని, మీ అవసరాలకు సరిపడే పాలసీని ఎంచుకోండి. తర్వాత ఆ బీమా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి ఆ పాలసీని తీసుకోండి. చెల్లించాల్సిన ప్రీమియమ్, క్లెయిమ్స్ రేషియో వంటి అంశాల ఆధారంగా పాలసీని ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేముందు పాలసీ ఫీచర్లను, షరతులను,తప్పనిసరిగా చదవాలి. పన్ను ఆదా కోసం యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాను. గత కొన్నేళ్లుగా ఈ ఫండ్ మంచి రాబడులను ఇచ్చింది. పన్ను ఆదా కోసం కాకుండా మంచి రాబడుల కోసం 3-5 ఏళ్ల కాలానికి ఈ ఫండ్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - క్రాంతి, కరీంనగర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లు పన్ను ప్రయోజనాలనే కాకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులను కూడా ఇస్తాయి. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మాదిరిగా వీటి పనితీరు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఫలితంగా వీటిల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలిగే క్రమశిక్షణ ఇన్వెస్టర్లకు అలవడుతుంది. ఈ ఫండ్‌లోనే మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మరో ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను పరిశీలించండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఒకటికి మించి ఫండ్స్ ఉండడం ఎప్పుడూ మంచిదే. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సక్రమంగా పన్ను చెల్లిస్తే సత్కారం!
దశాబ్దాల తర్వాత మళ్లీ సీబీడీటీ శ్రీకారం న్యూఢిల్లీ: నిజాయితీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారిని సత్కరించే కార్యక్రమానికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ మళ్లీ శ్రీకారంచుడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్న దేశంలోని లక్షలాది మంది ట్యాక్స్‌పేయర్లను కేంద్రీయ ప్రత్యక్షపన్నుల విభాగం(సీబీడీటీ) త్వరలోనే సన్మానించనుంది. దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ విధమైన చర్యలను అమలు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలే ఆమోదించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం సీబీడీటీ పన్నుచెల్లింపుదారులను అధిక మొత్తంలో, క్రమం తప్పకుండా, నిబంధనలకు అనుగుణంగా, నిబద్ధతతో వ్యవహరించడం... ఇలా నాలుగు విభాగాలుగా విభజించింది. వీరికి సీబీడీటీ చైర్పర్సన్ సంతకంతో సన్మాన పత్రాలను ఈ-మెయిల్ ద్వారా పంపనున్నారు. అయితే, కొంతమందిని ప్రత్యక్షంగా కూడా సత్కరించి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతులమీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేయనుండటం విశేషం. నిజాయితీగా, క్రమం తప్పకుం డా పన్నులు చెల్లించడం ద్వారా దేశ పురోభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నవారికి ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు తగినవిధంగా గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెడుతున్నట్లు సీబీడీటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సీబీడీటీ తమ అధికారుల కోసం నిర్వహించిన ఒక సదస్సులో ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించే అంశాన్ని చర్చించి.. ప్రతిపాదనలను రూపొందించింది. తమ కార్యాలయ పరిధిలో ఇటువంటి నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారి పేర్లను పంపాల్సిందిగా ప్రాంతీయ ఐటీ కమీషనర్లకు సీబీడీటీ సూచించినట్లు సమాచారం. కాగా, ఈ సత్కారాలకోసం సిఫార్సుచేసే ట్యాక్స్‌పేయర్ల సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఐటీ శాఖ ఈ స్కీమ్‌ను అమలు చేసింది. అయితే, తమకు నేరగాళ్లనుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ కొంతమంది బడా పన్నుచెల్లింపుదారులు ఫిర్యాదులు చేయడంతో ఆతర్వాత దీన్ని నిలిపివేసింది. -
జాతీయాలు
ఘట్టకుటీ ప్రభాతం తప్పించుకోవాలని ప్రయత్నించినా ఏదో విధంగా దొరికిపోయే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. ‘నా నుంచి తప్పించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నించాడు. కానీ ఏంలాభం? చివరికి ఘట్టకుటీ ప్రభాతం అయింది’ అంటుంటారు. ఘట్టం అంటే పన్నులు వసూలు చేసే స్థలం. కుటీ అంటే గుడిసె. ప్రభాతం అంటే తెల్లవారడం. పూర్వం రాజుల కోటల్లో సింహద్వారం ఉండేది. ప్రజల రాకపోకలన్నీ ఈ సింహద్వారం నుంచే కొనసాగేవి. పన్నులు వసూలు చేసే అధికారులు ఇక్కడ ఒక గుడిసెలో ఉండేవారు. రాకపోకలన్నీ సింహద్వారం నుంచే కాబట్టి పన్నులు ఎగ్గొట్టాలనుకునే వారి పప్పులు ఉడికేవి కావు. చచ్చినట్లు పన్ను కట్టాల్సి వచ్చేది. వెనకటికి ఒక వ్యాపారి పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించాడు. పన్నులు వసూలు చేసే అధికారులు మాంచి నిద్రలో ఉండగా వారి కనుగప్పి తప్పించుకుపోదామనుకున్నాడు. అయితే ఊరంతా తిరిగి ఆ పన్నులు వసూలు చేసే గుడిసె దగ్గరికి వచ్చే సమయానికి ప్రభాతమైంది...అంటే తెల్లవారిందన్నమాట. దీనితో ఆ వ్యాపారి పన్ను కట్టక తప్పలేదు! ఈ కథలో నుంచి పుట్టిన జాతీయమే ‘ఘట్టకుటీ ప్రభాతం’. ఘుణాక్షరం ఏదైనా రాయడానికి కాగితం మీద పెన్నుతో రాస్తున్నాం లేదా టైప్ చేస్తున్నాం. పూర్వం మాత్రం తాటాకులు తప్ప వేరే మార్గం లేదు. తాటాకులపై గంటంతో రాసేవారు. అయితే బాగా పాతబడిన తాటాకులకు పురుగులు పట్టేవి. ఆ క్రమంలో కొత్త కొత్త ఆకారాలు తాటాకుల మీద ఏర్పడేవి. కొన్ని అయితే అచ్చం అక్షరాల్లా ఉండేవి. వీటిని ఘుణాక్షరాలు అనేవాళ్లు. ఏ ఉద్దేశం లేకుండా ఒక పని చేయడాన్ని ‘ఘుణాక్షరం’తో పోల్చుతారు. ‘అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు... ఘుణాక్షరం’ అంటుంటారు. చవితి చంద్రుడు! ‘తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేశాను. ఈ మాత్రం దానికే నన్ను చవితి చంద్రుడిని చేశారు’ ‘నన్ను చూడడానికి కూడా భయపడుతున్నావు. నేనేమైనా చవితి చంద్రుడినా ఏమిటి?’....ఇలా రకరకాల సందర్భాలలో ‘చవితి చంద్రుడు’ అనే మాటను ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. చవితి రోజు భూలోకంలో నైవేద్యం ఆరగించిన వినాయకుడు కైలాసం చేరుకొని తల్లిదండ్రులకు నమస్కరించడానికి ప్రయత్నించాడుగానీ భుక్తాయాసం వల్ల అది సాధ్యం కావడం లేదు. వినాయకుడు పడే ఇబ్బందిని చూసి శివుడి తలలోని చంద్రుడు నవ్వాడు. తన కుమారుడిని చూసి నవ్వినందుకు... ‘‘నిన్ను చూసిన వారంతా నీలాపనింద లతో బాధపడుగాక’’ అని శపించింది పార్వతిదేవి. ఆ తరువాత మాత్రం ఈ శాపం శుద్ధ చవితికి మాత్రమే పరిమితమైంది. యక్షప్రశ్నలు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు... దర్మరాజుని పరీక్షించడానికి యక్షుని రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలే యక్షప్రశ్నలు. సూర్యుడిని ఉదయింపచేయువారు ఎవరు? సూర్యుడిని ఆస్తమింపచేయునది ఏది? జీవన్మృతుడెవరు? భూమి కంటే భారమైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? జన్మించి కూడా ప్రాణం లేనిది ఏది? రూపం ఉన్నా హృదయం లేనిది ఏది? మనిషికి ఆత్మ ఎవరు....ఇలా యక్షుని రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు తగిన విధంగా సమాధానం ఇస్తాడు. ఇక వ్యవహారంలోకి వస్తే.... ఎవరైనా చిక్కుప్రశ్నలు, కఠిన ప్రశ్నలు వేసే సందర్భంలో ఉపయోగించే మాట...యక్ష ప్రశ్నలు! -
ప్రజలపై భారం
అడ్డదారిలో పన్ను భారాలు పచ్చ నేతల నిర్ణయాలతో ఇబ్బందులు వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల ధ్వజం విజయవాడ సెంట్రల్ : అడ్డదారిలో పన్ను భారాలు మోపి టీడీపీ పాలకులు నగర ప్రజల్ని దొంగదెబ్బ తీశారని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ధ్వజమెత్తారు. కార్పొరేషన్ కార్యాలయంలోని వైఎస్సార్ సీపీ చాంబర్లో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుల్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సి ఉండగా ఏడాది బిల్లు ఒకేసారి ఇస్తున్నారన్నారు. నీటి, డ్రెయినేజీ చార్జీలు అనూహ్యంగా పెంచేశారని వివరించారు. పూరిపాకలకు సైతం రూ.పది వేలు డిమాండ్ నోటీసులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 21 శాతం మేర నీటి చార్జీలు పెరిగాయని విమర్శించారు. తాజాగా డ్రెయినేజీ చార్జీలను ఏడు శాతం పెంపుదల చేశారని ఆరోపించారు. డిమాండ్ నోటీసుల్ని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో పెంపుదల చేసిన ఏడు శాతం నీటి చార్జీలను ఉపసంహరించుకోవాలని మొదటి కౌన్సిల్లోనే పాలక, ప్రతిపక్షాలు తీర్మానం చేసినా ఇంత వరకు అమల్లోకి రాలేదని వివరించారు. ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపిన మేయర్ కోనేరు శ్రీధర్ అడ్డదారిలో ప్రజలపై పన్ను భారాలు మోపుతున్నారని విమర్శించారు. ప్రైవేటు సర్వే ఆధారంగానే డిమాండ్ నోటీసుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ సిబ్బందిని కాదని ప్రైవేటు సర్వే ఎందుకు చేయించారో మేయర్, కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పన్నులు ఎలా పెంపుదల చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మేయర్ నియంతలా వ్యవరిస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిన టీడీపీ పాలకులు భస్మాసుర హస్తాన్ని మోపుతున్నారన్నారు. పెంచిన పన్ను భారాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజలపక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందని హెచ్చరించారు. కార్పొరేటర్లు బుల్లా విజయ్, అవుతు శ్రీశైలజ, పాల ఝాన్సీలక్ష్మి, కరీమున్నీసా పాల్గొన్నారు. -
సం‘పన్నులు’ కరువు!
రూ.కోట్లలో వాణిజ్యం వసూలు కాని పన్నులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న అధికారులు వ్యాపారులతో రహస్య ఒప్పందాలు? విశాఖపట్నం : ఆర్థిక రాజధాని విశాఖలో వర్తక, వాణిజ్యం ఊపందుకుంది. అయితే ఆ మేరకు పన్నులు వసూలు చేయడంలో మాత్రం వాణిజ్య పన్నుల శాఖ విఫలమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ చేరుకోలేకపోయింది. చెక్‌పోస్టులు లేకపోవడం, వాణిజ్యవేత్తలతో లాలూచీ పడడం వంటి కారణాలతో ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ.2035.20 కోట్లు. కానీ విశాఖ డివిజన్ పరిధిలో రూ.1616.10కోట్లే వసూలు చేశారు. అన్ని సర్కిళ్లలోనూ కలిపి 79 శాతం ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి విశాఖ డివిజన్ పరిధిలో భారీ పరిశ్రమలున్నాయి. అయినా ఆదాయం మాత్రం ఆ మేరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. పన్ను వసూళ్లు, ఆదాయార్జనలో విశాఖ డివిజన్ రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ శాఖలో ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు డివిజన్ మొత్తం మీద 285 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రహస్య ఒప్పందాలు? పన్ను ఎగవేత దారులతో అధికారులు రహస్య ఒప్పందాలు చేసుకుని, వారికి అన్ని విధాల సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ శాఖ అధికారులు కొంతమంది అవినీతి నిరోధక శాఖకు చిక్కడం ఈ అంశానికి బలం చేకూరుస్తోంది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అక్కడే వాణిజ్యశాఖ సిబ్బంది తనిఖీలు చేసి పన్ను ఎగవేత దారులపై జరిమానా విధిస్తుంటారు. కానీ జిల్లా సరిహద్దుల్లో అలాంటి ఏర్పాట్లేవీ లేకపోవడంతో పన్ను చెల్లించకుండానే సరకు రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇలాంటి వాటిపై అడపా దడపా దాడులు చేయగా గతేడాది రూ.120 కోట్లు జరిమానా కింద వసూలైంది. అలాంటిది పూర్తి స్థాయిలో చెక్‌పోస్టులుంటే ఆదాయం మరింత పెరుగుతుందనేది ఎవరికీ తెలియనది కాదు. అయినా ఆదాయార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోతోంది. -
పన్నుబాధ
ప్రభుత్వ భవనాల నుంచి వసూలుకాని పన్ను పేరుకుపోతున్న బకాయి రూ.43.77కోట్లు వసూలు మాతరం కాదంటున్న అధికారులు ఆర్థిక సంక్షోభంలో పురపాలక సంఘాలు చిత్తూరు: ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించే మున్సిపాలిటీ అధికారులు.. ప్రభుత్వశాఖల నుంచి బకాయిలు వసూలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ ఏడాది పన్ను కట్టలేకపోతే ప్రజల ఇంటి ముందు దండోరా వేయించడం, కొళాయి కనెక్షన్ తీసి ముక్కు పిండి వసూలు చేసే మున్సిపల్ అధికారులు సర్కారు చెల్లించాల్సిన పన్నులు ఏళ్ల తరబడి పెం డింగ్‌లో ఉన్నా చేష్టలుడిగి చూస్తున్నారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలతో అధికారులకు పెద్ద పని లేకుండా పోయింది. వీటికి భవన యజమానులు పక్కాగా పన్నులు చెల్లిస్తున్నారు. కాబట్టి దర్జాగా వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలైతే.. బకాయిల వసూలుకు చుక్కలు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నామమాత్రంగా వస్తున్న నిధులతో మున్సిపాలిటీలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. సిబ్బందికి వేతనాలు చెల్లించడమే గగనంగా మారిం ది. జిల్లావ్యాప్తంగా తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ భవనాల అద్దె సుమారు రూ.26 కోట్లు వసూలు కా వాల్సి ఉంది. దా దాపుఅన్ని శాఖలు అంతో ఇంతో బకాయిలు ఉన్నాయి. టీటీడీ అయి తే శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసంల పన్ను రూ. 17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ అతిథి గృహాల్లో ఉండాలంటే రూ.200 నుంచి రూ.1000 వరకు భక్తుల నుం చి వసూలు చేస్తున్నారు. అయినా తిరుపతి కార్పొరేషన్‌కు పన్ను కట్టడానికి టీటీడీకి చేతులు రావడం లేదు. దండిగా ఆదాయం ఉన్నా... ప్రభుత్వానికి వివిధ రూపాల్లో దండిగా ఆదాయం ఉన్నా ప్రభుత్వ భవనాల పన్నులు మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. వివిధ పురపాల సంఘాల నుంచి పన్ను బకాయిలు రూ.25.47 కోట్లు ఉంటే తిరుపతి కార్పొరేషన్‌కు టీటీడీ చెల్లించాల్సిన బకాయిలు మాత్రమే రూ.17 కోట్లుగా ఉంది. మిగతా పురపాలక సంఘాల్లో వాటి స్థాయిని బట్టి భారీగానే బకాయిలు ఉన్నాయి. అధికారులు పలుమార్లు కమిషనర్లతో మాట్లాడినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వ శాఖలకు అనేక రకాలుగా నిధులు వస్తున్నాయి. వాటినంన్నిటినీ అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనుల పేరుతో దిగమింగుతున్నారు. అంతే తప్ప పన్నుల చెల్లింపులో కార్యాచరణ శూన్యం. టీటీడీకి వచ్చే ఆదాయాన్ని గమనిస్తే ఒక్కరోజుకు సుమారు రూ.3 కోట్లు వస్తుంది. వీటిని అనేక ధార్మిక పనులకు ఖర్చు చేయడం సరైన పనే. అయితే ఇంత ఆదాయం వస్తున్నా చిన్నపాటి మొత్తం చెల్లించకుండా మొండికేయడం విమర్శలకు దారితీస్తోంది. మున్సిపాలిటీలు వీధిదీపాల విద్యుత్ బిల్లులు నిధుల కొరతతో చెల్లించలేకపోతుండటంతో ఆ రెండు శాఖల మధ్య వివాదం రాజు కుంటోంది. ‘మీరు పన్ను చెల్లిస్తే విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని చెప్పడం.. వారు ససేమీరా అంటుండంతో రగడ రాజుకుంటోంది. టీటీడీ చెల్లించాల్సింది రూ.33 కోట్లు.. తిరుపతి కార్పొరేషన్‌కు వడ్డీతో కలిపి సుమారు.33 కోట్ల ఆస్తి పన్నును టీటీడీ చెల్లించాలి. ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మాధవం, విష్ణునివాసం, శ్రీనివాసానికి పన్నులు చెల్లించబోమని టీటీడీ కోర్టుకు వెళ్లింది. భక్తులకు ఉచితంగా వసతి కల్పించలేదు కాబట్టి కచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందేనని తిరుపతి కార్పొరేషన్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?
విభిన్నమైన ప్రయోజనాలు అందించే నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను (ఎన్పీఎస్) ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చి ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విత్‌డ్రాయల్స్‌లో కొంత మొత్తంపై పన్నులు విధించే ప్రతిపాదన ద్వారా ఎన్‌పీఎస్‌తో దీన్ని సమం చేసేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను అటువైపు కూడా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈపీఎఫ్‌కు, ఎన్పీఎస్ లక్షణాలేంటి? వీటి మధ్య ఉన్న తేడాలేంటి? చూద్దాం... * ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడొద్దు * రెండింటితోనూ వేర్వేరు ప్రయోజనాలు పెట్టుబడుల విధానం.. * ఈపీఎఫ్‌కు క్రమం తప్పకుండా బేసిక్ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమచేయాలి. కంపెనీయే ఉద్యోగి జీతం నుంచి ఈ మొత్తాన్ని కట్ చేసి తన ఈపీఎఫ్ ఖాతాకు జమచేస్తుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా జోడిస్తుంది. * ఎన్పీఎస్ మాత్రం పూర్తిగా స్వచ్ఛందం. ఇన్వెస్టర్లు ఏకమొత్తంగానైనా లేదా ఇతరత్రా వాయిదాల పద్ధతిలోనైనా తమ ఇష్టప్రకారం కట్టుకోవచ్చు. కనిష్ట, గరిష్ట పెట్టుబడి.. * ఈపీఎఫ్‌కు ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో కొంత మొత్తం చెల్లించాలి. కంపెనీ కూడా అంతే చెల్లిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా ఎక్కువ కూడా కట్టుకోవచ్చు. * ఎన్‌పీఎస్‌కి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6,000 కట్టాలి. గరిష్ట పరిమితులేమీ లేవు. అసెట్ కేటాయింపులు.. * ఇప్పటి దాకా ఈపీఎఫ్ 100 శాతం పెట్టుబడుల్ని రుణ సాధనాల్లోనే పెట్టేది. ఈ మధ్యే పీఎఫ్ నిధిలో 5 శాతం మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్‌వో ఇన్వెస్ట్ చేస్తోంది. గరిష్టంగా 15 శాతం దాకా పరిమితి ఉంది. * ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్టరే తన పెట్టుబడి మొత్తాన్ని ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా డిఫాల్ట్ ఆప్షన్ కింద సదరు ఇన్వెస్టరు రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరవుతున్న కొద్దీ.. ఏటా కొంత కొంతగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతుంటాయి. మరో ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా యాభై శాతమే కేటాయింపులు జరిపే వీలుంది. దీన్ని ఆరు పెన్షన్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తుం టాయి కనుక మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఆశించతగ్గ రాబడులు.. * ఈపీఎఫ్‌లో చందాదారులందరికీ వడ్డీ ఒకే రకంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.7 శాతం. దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇది కాస్త తగ్గొచ్చు లేదా అదే స్థాయిలోనూ కొనసాగవచ్చు. * ఈక్విటీల్లోనూ పెట్టుబడులు ఉంటా యి కనుక.. ఎన్పీఎస్ చందాదారులకు కొంత అధిక రాబడులొచ్చే అవకాశాలున్నాయి. పదేళ్లు ఆపైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడి తే ఈపీఎఫ్ కన్నా ఎన్పీఎస్ స్కీము ద్వారా 2-3 శాతం మేర ఎక్కువ రాబడులు రావొచ్చు. అర్హత * ఈపీఎఫ్ అనేది ప్రైవేట్ సంస్థల్లోని వేతన జీవులకు మాత్రమే పరిమితం. 20 మంది పైగా ఉద్యోగులున్న సంస్థలకు ఇది తప్పనిసరి. * ఎన్పీఎఫ్ విషయానికొస్తే.. ఏప్రిల్ 2004 తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వోద్యోగులందరికీ ఇది తప్పనిసరి. వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే వారు, గృహిణులు, సంఘటిత.. అసంఘటిత రంగాల్లో పనిచేసే సాధారణ ప్రజలు కూడా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఇటు ఈపీఎఫ్ అటు ఎన్పీఎస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి పొందే వారికి ఈపీఎఫ్ ఉండదు. వారు ఎన్పీఎస్ లేదా పరిమిత స్థాయిలో పీపీఎఫ్ మాత్రమే వినియోగించుకోగలరు. పన్ను ప్రయోజనాలు.. * ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈపీఎఫ్ దీని పరిధిలోకే వస్తుంది. అయితే, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, బీమా పథకాలు, ట్యూషన్ ఫీజులు, 5 ఏళ్ల కాలపరిమితి బ్యాంకు డిపాజిట్లు అన్నీ సెక్షన్ 80సీ కిందికే వస్తాయి. * ఎన్పీఎస్ మాత్రం సెక్షన్ 80సీ పరిధిలోకి రాదు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కిందికి వస్తుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50,000 దాకా మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80సీకి అదనమని గుర్తుంచుకోవాలి. * రిటైరైనప్పుడు మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఈపీఎఫ్‌ను పన్ను ప్రసక్తి లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. * ఎన్పీఎస్ నుంచి మొత్తం నిధిని విత్‌డ్రా చేసుకోవటం కుదరదు. నిధిలో 40 శాతాన్ని పన్నుల్లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 60 శాతాన్ని కచ్చితంగా పెన్షన్ ప్లాన్ వంటి యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కావాలనుకుంటే పూర్తి మొత్తాన్ని కూడా యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. * స్థూలంగా చూస్తే ఎన్పీఎస్, ఈపీఎఫ్లనేవి ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. ఒకదానికి మరొకటి తోడుగా పరిగణించాలి. రెండూ ఉంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటి యాపిల్ అయితే మరొకటి నారింజలాంటిది. రెండిటినీ పోల్చలేం. కానీ ఈ రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. -
ఇక్కడ సంపాదించే ఇన్వెస్టర్లు... ఇక్కడే పన్నులు చెల్లించాలి..
* మారిషస్‌తో తాజా డీల్‌తో ఎఫ్‌డీఐలు తగ్గవు... * ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులపై సంపాదించే ఇన్వెస్టర్లు ఎవరైనాసరే ఇక్కడ పన్నులు చెల్లించాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను ఎగవేతల నిరోధానికిగాను మారిషస్‌తో తాజాగా సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీని ప్రకారం మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందం కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గుతాయన్న ఆందోళనలను జైట్లీ కొట్టిపారేశారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తగినంత పటిష్టంగా ఉంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పన్ను ప్రోత్సాహకాలు ఇతరత్రా రాయితీలు వంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. మారిషస్‌తో తాజా డీల్ కారణంగా ఇన్వెస్టర్లు తమ బేస్(పెట్టుబడులకు మూల కేంద్రం)ను ఇతర పన్ను స్వర్గధామ దేశాలకు తరలిస్తాయని భావించడం లేదు’ అని జైట్లీ తెలిపారు. దేశీయ వినిమయానికి బూస్ట్... కాగా, మారిషస్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందం(డీటీఏఏ)లో సవరణల కారణంగా రౌండ్ట్రిప్పింగ్(నిధులను ఇతర దేశాల ద్వారా తీసుకురావడం)కు అడ్డుకట్టపడుతుందని జైట్లీ చెప్పారు. తద్వారా దేశీయంగా వినిమయానికి(కన ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని జైట్లీ వివరించారు. ‘పన్ను స్వర్గధామ దేశాలను పన్ను ఎగవేతలకు ఆవాసంగా మార్చుకుంటున్న ఇన్వెస్టర్లకు ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాలను సవరించడం ద్వారా చెక్ చెప్పనున్నాం. ఈ చర్య కారణంగా స్టాక్ మార్కెట్లలో కొంత కుదుపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో మార్కెట్ల గమనం భారత్ ఆర్థిక వ్యవస్థకు స్వతహాగా ఉన్న బలం ఆధారంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్నుల విధింపు అనేది దశలవారీగా ఉంటుందని.. అందువల్ల విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయన్న ఆందోళలు అనవసరమని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా, మారిషస్‌లోని తమ సంస్థల ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల విషయంలో ఈ తాజా సవరించిన ఒప్పందం వల్ల మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. మూడో వంతు ఎఫ్‌డీఐలు మారిషస్ నుంచే... ప్రస్తుతం భారత్‌కు వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా మారిషస్ రూట్ ద్వారానే వస్తున్నాయి. 1991లో భారత్ ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు దశాబ్దం ముందే మారిషస్‌తో డీటీఏఏ కుదిరింది. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే ఈ డీల్ ముఖ్యోద్దేశం. గడిచిన 15 ఏళ్లలో భారత్‌కు వచ్చిన 278 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.19 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐల్లో మూడోవంతు మారిషస్ రూట్లోనే రావడం గమనార్హం. మారిషస్ డీటీఏఏ సవరణ నేపథ్యంలో సింగపూర్‌తో ఉన్న ఇదేవిధమైన ఒప్పందాన్ని కూడా సవరించే అవకాశం ఉంది. 2015 ఏడాది ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్‌కు వచ్చిన 29.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలలో ఈ రెండు దేశాల ద్వారా మొత్తం 17 బిలియన్ డాలర్లు లభించడం విశేషం. -
ఫండ్స్ రాబడులపై పన్నులు ఎంత?
మ్యూచువల్ ఫండ్స్, షేర్ల రాబడులకు సంబంధించి ప్రస్తుత పన్ను నిబంధనలు ఎలా ఉన్నాయి? మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌కు సంబంధించి దీర్ఘకాల, స్వల్పకాల లాభాల పన్నును ఎలా నిర్ణయిస్తారు ? - మాన్విత, సికింద్రాబాద్ మీరు కొనుగోలు చేసిన షేర్లు/మ్యూచువల్ ఫండ్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే, వాటిపై వచ్చిన రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం షేర్లు/మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధించడం లేదు. అలా కాకుండా మీరు కొనుగోలు చేసిన షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. 15 శాతం చొప్పున పన్ను విధిస్తారు. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తేనే వాటిపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు. ఈ లాభాలపై 20 శాతం(ఇండెక్సేషన్ ప్రయోజనంతో) పన్ను విధిస్తారు. ఇక ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపే విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను గత నాలుగేళ్లుగా ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎంత కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్ నుంచి రుణం తీసుకోవచ్చు? వడ్డీరేట్లు ఎంత ఉంటుంది? - నిరంజన్, విశాఖ పట్టణం ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)..ప్రారంభించిన 15 ఆర్థిక సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ ఖాతాను ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మీరు రుణం పొందవచ్చు. ఈ రుణ సౌకర్యం పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన మూడు నుంచి ఆరేళ్లలోపే ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం వరకూ రుణం పొందవచ్చు. మీరు పీపీఎఫ్ ఖాతాపై పొందే వడ్డీ కంటే 2 శాతం అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న రుణాన్ని మూడేళ్లలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించలేకపోతే, మీరు చెల్లించాల్సిన వడ్డీరేటు మీరు పొందే వడ్డీరేటుకన్నా 6 శాతం అధికంగా ఉంటుంది. మీ ఖాతా ప్రారంభమై ఏడేళ్లు దాటితే, మీరు పాక్షికంగా సొమ్ములను తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో 25 శాతం పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది కదా. దీనిపై పన్నులు ఎలా ఉంటాయి? - నారాయణ రావు, కరీంనగర్ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించిన పదేళ్ల తర్వాత మీరు 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో అప్పటివరకూ ఉన్న మొత్తంలో 25 శాతం కాకుండా, మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 25 శాతాన్నే విత్‌డ్రా చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యావసరాలు, లేదా వివాహం(చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది), మొదటి ఇల్లు కొనుగోలు/నిర్మాణం, భార్య/పిల్లలు/ తల్లిదండ్రులకు 13 క్లిష్టమైన రుగ్మతలకు చికిత్స వంటి నిర్దేశిత అవసరాలకే 25 శాతం సొమ్ము విత్‌డ్రాకు అనుమతిస్తారు. ఒక్కో విత్‌డ్రాయల్‌కు ఐదేళ్ల విరామంతో మూడు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. క్లిష్టమైన జబ్బులకు ఐదేళ్ల విరామం నిబంధన వర్తించదు. ఇక ఈ పాక్షిక విత్డ్రాయల్స్పై పన్ను విషయాల గురించి ప్రస్తావన కొత్త నియమనిబంధనల్లో లేదు. మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని మీ ఆదాయపు పన్ను స్లాబ్‌కు కలిపి పన్ను చెల్లించాల్సి రావచ్చు. నేను 2011లో ఎల్ఐసీ జీవన్ తరంగ్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీని సరెండర్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. - మోహన్, ఈ మెయిల్ ద్వారా జీవన్ తరంగ్ అనేది హోల్ లైఫ్ ప్లాన్. ఈ పాలసీని సరెండర్ చేస్తే మీకు నష్టాలు బాగానే వస్తాయి. మీకు వచ్చే గ్యారంటీడ్ సరెండర్ విలువ ఎంత ఉంటుందంటే ... మీరు చెల్లించిన మొత్తం ప్రీమియంల్లో తొలి ఏడాది ప్రీమియంను మినహాయించిన మొత్తంలో 30 శాతంగా ఉంటుంది. ఎల్ఐసీ స్పెషల్ సరెండర్ విలువను మీకు చెల్లించవచ్చు. ఇది గ్యారంటీడ్ సరెండర్ విలువ కంటే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకొని మూడేళ్లు అయినందున ఈ పాలసీని మీరు సరెండర్ చేయవచ్చు. జీవిత బీమా పాలసీ తీసుకోవాలంటే టర్మ్ బీమా ప్లాన్ తీసుకోవడమే ఉత్తమం. టర్మ్ ప్లాన్లకు పెద్ద మొత్తం బీమాకు తక్కువ ప్రీమియం చెల్లించవచ్చు. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
గ్రావు పంచాయుతీల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పారదర్శకంగా జరగాలి. మేడ్చల్ రూరల్ : ‘పన్నుల విధింపు, ఆస్తి విలువ లెక్కింపు తదితర అంశాలపై అవగాహన లేకుంటే ఎలా..? సాధారణ అంశాలపై కనీస అవగాహన లేకుంటే ఎలా.. గ్రామాధికారులుగా మీరేం చేస్తున్నా రు..’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బిల్‌కలెక్టర్, గ్రామకార్యదర్శిలకు చురకలంటించారు. శని వారం ఆయన మండలంలోని ఎల్లంపే ట్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయుతీ కార్యాల యుంలో రికార్డులు పరిశీలించారు. గ్రా వుంలో ఎన్ని కుటుంబాలు ఉన్నారుు? వంద శాతం వురుగుదొడ్లు ఉన్నాయూ? లేవా? పన్నులు వసూలు ఏవిధంగా ఉంది? తదితర అంశాలపై బిల్‌కలెక్టర్ తిరుపతిరెడ్డి, కార్యదర్శి నరసింహులను మంత్రి ప్రశ్నించారు. ఇందుకు వారు సమాధానమిస్తూ 90 కుటుంబాలు మ రుగుదొడ్లు లేవని చెప్పడంతో.. ‘గ్రామ అధికారులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారు..? వంద శాతం పూర్తి చేసే బాధ్యత మీదే’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రి కార్డులను పరిశీలిస్తుండగా.. గ్రావు పరిధిలోని ఆర్కే డిస్టిలర్స్ కంపెనీ పన్ను బకారుు ఉన్నట్లు తేలడంతో ఇంత వ రకు ఎందుకు వారి నుంచి పన్ను వసూ లు చేయలేదని ప్రశ్నించారు. ఇం దుకు వారి నుంచి సమాధానం రాకపోవడం తో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసిన పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం శానిటేషన్‌పై సమీక్షించారు. అనంతరం గ్రామం లో ఏవైనా సమస్యలున్నాయా.. అంటూ సర్పంచ్ చిన్నలింగం, ఎంపీటీసీ సభ్యురాలు రేణుకలను ప్రశ్నించారు. కాగా.. గ్రావుంలో నీటి సవుస్య తీవ్రంగా ఉం దని తెలుపగా సవుస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్యదర్శి న ర్సింహ, బిల్‌కలెక్టర్ తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు కువూర్లు పాల్గొన్నారు. -
పన్నుల ఆదాయానికి భారీగా గండి
ఖజానాకు రూ.393కోట్లు నష్టం చేకూరిందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: పలు శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిందని కాగ్ వెల్లడించింది. అసలు పన్నులే విధించకపోవడం, తక్కువగా విధించడం, ఆదాయానికి గండి కొట్టడం ఫలితంగా ప్రభుత్వం ఖజానాకు చేరాల్సిన రూ.393.43కోట్లను కోల్పోయిందని పేర్కొంది. 2014-15లో వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్, స్టాంపులు, భూమి శిస్తు, రవాణా శాఖలకు చెందిన 216 యూనిట్ల (కార్యాలయాల) రికార్డులను కాగ్ పరిశీలించింది. మొత్తంగా 1,299 కేసుల్లో పన్నులు, సుంకాలు విధించకపోవడం, తక్కువగా విధించడం వంటివి వెల్లడయ్యాయని కాగ్ పేర్కొంది. వ్యాట్ ఆడిట్ మాన్యువల్‌లో పేర్కొన్న తనిఖీ నిబంధనలను పాటించకపోవడంతో రూ.45.92 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని వెల్లడించింది. ఇక 2,644 రవాణా వాహనాల యజమానుల నుంచి రూ.4.23 కోట్ల త్రైమాసిక పన్ను సహా రూ.8.45 కోట్ల జరిమానాను రవాణాశాఖ రాబట్టలేదని కాగ్ పేర్కొంది. అలాగే ఆబ్కారీ శాఖ పరిధిలో కల్లు అద్దెలు తక్కువగా విధించడం, బార్లు, రెస్టారెంట్లపై అదనపు లెసైన్సు ఫీజు విధించకపోవడంతో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలు ఐదు జిల్లా రిజిస్ట్రార్లు, 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి 134 దస్తావేజుల్లో ఆస్తులను తక్కువ విలువ కట్టిన ఫలితంగా రూ.2.50కోట్ల స్టాంపు డ్యూటీ, బదిలీ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నష్టపోయినట్లు కాగ్ పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, 10 రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో 28 దస్తావేజులు తప్పుగా వర్గీకరించారని ఆడిట్ తే ల్చింది. దీనివల్ల రూ.1.84 కోట్ల స్టాంపు డ్యూటీ, బదిలీ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కోల్పోయినట్లు తెలిపింది. 20 భూసేకరణ అధికారుల కార్యాలయాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అనేక జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.294.78 కోట్ల మేర డిపాజిట్లు చేశారని... వాటిపై వచ్చిన రూ.2.93కోట్ల వడ్డీని భూసేకరణకు కాకుండా ఇతరత్రా వాడుకున్నారని తేల్చింది. 19 కేసుల్లో 462.41 ఎకరాల భూమిని సేకరించేప్పుడు ధర నిర్ణయంలో నిబంధనలను పట్టించుకోలేదని, దాంతో రూ.12.18 కోట్ల ప్రతిఫలం అధికంగా చెల్లించారని స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా లోపభూయిష్టమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. నిధుల కేటాయింపులకు, ఖర్చుకు అసలు పొంతనే ఉండడం లేదని ఎండగట్టింది. కాగ్ నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభకు వెల్లడించకుండా ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని తప్పుబట్టింది. పన్ను ఆదాయ అంచనాల్లో నేలవిడిచి సాము చేయడాన్ని ఆక్షేపించింది. పాఠశాల, ఉన్నత విద్య, మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణలో నిర్లిప్తతను కాగ్ ప్రశ్నించింది. జెన్కో విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం, నిర్వహణలో లోపాలను, పన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. పశుసంవర్థక శాఖలో పథకాలు నిలిపివేత, రవాణా, అబ్కారీ శాఖల ఫీజు వసూళ్లలో అక్రమాలపై మండిపడింది. ప్రణాళిక లోపాలతో ప్రజాధనం వృథా పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అవసరమన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఆర్థికస్థితిని ఒక సమగ్ర రూపానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మంచి ప్రణాళికను తయారు చేయాల్సి ఉందని కాగ్ పేర్కొంది. సామాజిక తనిఖీల్లో గుర్తించిన నిధుల మళ్లింపును తిరిగి రాబట్టుకోవడం లేదని, శాఖాధికారులు తనిఖీలు చేయడం లేదని, స్టాక్ రిజిష్టరు, క్యాష్బుక్లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఆక్షేపించింది. ఇలాంటి కారణాలతో మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో రూ.15.18 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు నీరందించే సమగ్ర రక్షిత మంచినీటి పథకం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించకపోవడం, జలమండలిని ఒప్పించకపోవడంతో రూ.18.29 కోట్లు వృథా అయ్యాయని ఎండగట్టింది. చెత్తసేకరణ దశలో వేరుచేసి శాస్త్రీయ విధానంలో నిర్మూలించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలేవీ రాష్ట్ర మున్సిపల్ విభాగం రూపొందించలేదని కాగ్ ఎండగట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించడం కానీ... తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించే విధానం కానీ ఎక్కడా అమలు కావడం లేదని తెలిపింది. చాలా చోట్ల చెత్త సేకరణ రుసుమును కూడా వసూలు చేయడం లేదని, రెండు పట్టణాల్లో పరిశీలన చేస్తే రూ.1.22 కోట్ల ఆదాయం కోల్పోయినట్లుగా తేలిందని పేర్కొంది. ‘సామాజిక’ బాధ్యత మరిచారు పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో తాగునీరు సహా సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిం చాల్సి ఉందని కాగ్ అభిప్రాయపడింది. మరుగుదొడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), సామాజిక వినియోగ కేంద్రాల(సీయూసీ) ఏర్పాటులో లోటుపాట్లున్నాయని పేర్కొంది. వాటిని సంస్కరించి ఆశించిన ప్రయోజనాల దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. ఆ మురికివాడల్లో 2015 జూలై నాటికి ఉన్న 8.15 లక్షల ఇళ్లకుగాను 83 వేల (10%) ఇళ్లవారు బహిరంగ మల విసర్జన కొన సాగిస్తున్నారని పేర్కొంది. మొత్తంగా 2,714 మురికివాడలకుగాను 778 (29%) చోట్ల పీహెచ్‌సీలు లేవని పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 209 మురికివాడల్లో నమూనా తనిఖీ చేయగా... 79 (38%) చోట్ల పీహెచ్‌సీలు లేవని తెలిపింది. శిశువిద్య, వయోజన విద్య, సాంప్రదాయేతర విద్య, మనోవికాస కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే సీయూసీ సైతం 2,714 మురికివాడలకుగానూ 739 చోట్ల ఉన్నాయని... అనువైన స్థలాలు లేవంటూ చాలా చోట్ల వీటి నిర్మాణం చేపట్టలేదని పేర్కొంది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలని సూచించింది. బీబీనగర్ నిమ్స్‌ను గాలికొదిలేశారు బీబీనగర్ నిమ్స్ ను మధ్యలోనే నిలిపివేయడంతో ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 80.39 కోట్లు వృథా అయ్యాయని కాగ్ తన నివేదికలో ఆక్షేపించింది. 2008 ఏప్రిల్‌లో మొదలుపెట్టిన భవనాల నిర్మాణం ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా ఆగిపోయిందని పేర్కొంది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో నిధుల విడుదల కోసం నిమ్స్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా 2015 అక్టోబర్ వరకూ నిధులు విడుదల చేయలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ నిమ్స్‌లో ప్రమాణాల లేమి హైదరాబాద్ నిమ్స్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.125.91 కోట్లతో నిర్మించిన భవనాలు అధికారుల లోపభూయిష్టమైన ప్రణాళిక కారణంగా ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయాయని కాగ్ వేలెత్తి చూపింది. ఆరోగ్యశ్రీ పథకంలో నిర్ణయించిన ప్రమాణాలను పాటించకపోవడంతో రూ.11.72 కోట్లను ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి నిమ్స్ తిరిగి రాబట్టుకోలేక పోయిందని.. ఇది నిమ్స్ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిందని స్పష్టం చేసింది. 2011-15 మధ్య రోగుల కేసు షీట్లు సమర్పించకపోవడం, బయోమెట్రిక్, శస్త్రచికిత్స సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు సరిగా ఉండకపోవడం తదితర సాంకేతిక సమస్యలే దీనికి కారణమని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి వైద్యశాలకు 2013 మార్చిలో రూ.90లక్షల వ్యయంతో సరఫరా చేసిన వైద్య పరికరం నిరుపయోగంగా ఉందని పేర్కొంది. -
చిన్న సంస్థలకు రాయితీలున్నాయ్..
ఎంఎస్ఎంఈలకు పలు ప్రోత్సాహకాలు పన్నులు, ఖాతాల విషయంలో మినహాయింపులు మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలదే (ఎంఎస్ఎంఈ) కీలక పాత్ర. ఎగుమతుల్లో 45 శాతం వాటా వీటిదే. స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతం వస్తున్నది వీటి నుంచే. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఉన్న ఎంఎస్ఎంఈలు అనేక కోట్ల మందికి ఉపాధినిస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయరంగం తర్వాత రెండో అతిపెద్ద రంగం ఇదే. ఈ రంగానికి కేంద్రం అనేక రాయితీలిస్తోంది. ప్రత్యేక చట్టాన్ని కూడా తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏ సంస్థలను ఎంఎస్ఎంఈలుగా పరిగణిస్తారు? పన్నులకు సంబంధించి అవి పాటించాల్సిన పద్ధతులేంటి? వాటికి ఎలాంటి రాయితీలు లభిస్తాయి? ఇవన్నీ చట్టంలో వివరంగా పొందుపర్చారు. వాటి వివరణే ఇది... ఒక సంస్థను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థగా గుర్తించాలంటే ఏఏ అర్హతలుండాలన్నది ఎంఎస్ఎంఈడీ చట్టంలో నిర్వచించారు. తయారీ రంగానికి, సేవా రంగానికి ఈ నిర్వచనాలు వేరువేరుగా ఉన్నాయి. వీటి వివరాలను పట్టికలో ఇవ్వడం జరిగింది. స్టార్టప్‌లు, ఎస్ఎస్ఐ, ఎస్ఎంఈ ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఇవన్నీ వీటి పరిధిలోకే వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.4 కోట్లకు మించకుండా ఉంటే, ఈ సంవత్సరం టర్నోవరు నుండి మొదటి రూ.1.5 కోట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.నెలవారీ చెల్లింపులు, రిటర్నులు చేయాల్సిన పనిలేదు. మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు, రిటర్నులు చేయొచ్చు. దీనివల్ల తయారీ దారులు పాటించాల్సిన నిబంధనలకయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది. నగదు ప్రవాహాన్ని మెరుగుపర్చుకోవడానికి అదే సంవత్సరంలో చెల్లించిన ఎక్సైజ్ పన్నును పూర్తి క్రెడిట్‌గా తీసుకోవచ్చు. అదే ఏడాదిలో టర్నోవర్ రూ.90 లక్షలు దాటని సంస్థలు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోనవసరం లేదు. అదే సేవా రంగంలో అయితే టర్నోవర్ రూ.9 లక్షలు దాటకపోతే సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకోనవసరం లేదు. వ్యాట్‌లో ప్రోత్సాహకాలు దేశంలో అనేక రాష్ట్రాలు ఎస్ఎంఈ రంగాలకు పలు మినహాయింపులు, రాయితీలు అందిస్తున్నాయి. రూ.10 లక్షలలోపు టర్నోవర్ కలిగిన సంస్థలను చాలా రాష్ట్రాలు వ్యాట్ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ‘కాంపోజిషన్ స్కీము’ను ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం ఒక లిమిట్ దాటని ఎస్ఎంఈ సంస్థలు వ్యాట్ కట్టేటప్పుడు ‘కన్సిషనల్ రేటు’ను వినియోగించుకోవచ్చు. అంటే వ్యాట్ శాతం కన్నా తక్కువ శాతం పన్ను చెల్లించవచ్చన్నమాట. ఫైనాన్షియల్ బేసిక్స్.. పిల్లలకు ఆరోగ్య బీమా ఎప్పుడు తీసుకోవాలి? పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. పిల్లలు కూడా ఈ కోవలోకే వస్తారు. వారికి కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలి. వీరికి పుట్టిన 90 రోజుల తర్వాత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం. అప్పుడు వారికి భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనా, వాటికయ్యే ఆరోగ్య ఖర్చులకు పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బీమా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా పలు రకాల హెల్త్ పాలసీలు అందిస్తున్నాయి. వీటిలో మన అవసరాలకు అనువైన పాలసీని ఎంచుకోవాలి. అలాగే ఒక బీమా కంపెనీ ఆరోగ్య బీమా పాలసీలను మరొక బీమా కంపెనీ పాలసీతో పోల్చి చూసుకోండి. సర్వీసులు, ప్రీమియం వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోండి. పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోండి. అవసరమైతే ఆయా విషయాలపై ఈ రంగంలో నిపుణుల సలహాలను తీసుకోవాలి. తద్వారా ఈ అంశంపై ఒక అవగాహనకు రావడానికి అవకాశం లభిస్తుంది. మొన్నటి బడ్జెట్ సానుకూలం... ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 44 ఏడీ ప్రకారం చిన్న వర్తకులు చేసే వ్యాపారంపై లాభాన్ని ఊహించుకుని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ నిర్వహించాల్సిన పనిలేదు. తాజా బడ్జెట్లో ఈ పరిమితిని రెట్టింపు చేశారు. గతంలో కోటి రూపాయల లోపు టర్నోవర్ ఉన్న వారు వాస్తవ లాభాల మార్జిన్‌తో సంబంధం లేకుండా ఆదాయంపై 8% లాభాన్ని చూపించుకునేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 2 కోట్లకు పెంచారు. అంటే ఇక నుంచి రెండు కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వారు 8 శాతం లాభాన్ని చూపించి ఆ మేరకు పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 33 లక్షల ఎంఎస్ఎంఈలు అకౌంటింగ్ బుక్స్, ఆడిటర్ల విషయంలో మినహాయింపు పొందారు. పన్ను మినహాయింపు బ్రాకెట్లో ఉంటూ రాయితీలు పొందుతున్న ఎస్ఎంఈలు వారి ఉత్పత్తిని పెంచడానికి సంకోచిస్తున్నాయి. టర్నోవర్ రూ. 5 కోట్లు దాటని సంస్థలకు (2015, మార్చి నాటికి) కార్పొరేట్ ఆదాయ పన్నుని 29 శాతానికి తగ్గించింది. అయితే విధిగా సెస్, సర్ చార్జీ కట్టాల్సి ఉంటుంది. స్టార్టప్‌లకు మొదటి మూడేళ్లు 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ( ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2019 వరకు ). ఇప్పుడు అన్‌లిస్టెడ్ కంపెనీల విషయంలో (అంటే స్టార్టప్ మరియు ప్రైవేటు సంస్థల విషయంలో) లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ హోల్డింగ్ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. కహానీ... గోల్డ్ లైవ్.. మనం బాగా విలువనిచ్చే లోహం బంగారం. దాని ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి పెరుగుతుంది. మరొకసారి తగ్గుతుంది. ఒక్క క్లిక్‌తో ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా స్పాట్లో బంగారం ధరను తెలుసుకోవాలంటే మీరు ‘గోల్డ్ లైవ్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ యాప్‌లో అంతర్జాతీయ దిగ్గజ ఇండెక్స్‌లను, క్రూడ్, ఫారెక్స్ వివరాలను తెలుసుకోవచ్చు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు బంగారం ధర లైవ్‌లో చూడొచ్చు. ప్రతి 10 నిమిషాలకు బంగారం ధర అప్డేట్ అవుతూ ఉంటుంది. బంగారం సహా వెండి, ప్లాటినం, కాపర్, నికెల్, అల్యూమినియం, జింక్, లెడ్, యురేనియం వంటి తదితర లోహాల ధరల్ని కూడా తెలుసుకోవచ్చు. ఆయిల్ ధరను కూడా పొందొచ్చు. అంతర్జాతీయ దిగ్గజ ఇండెక్స్‌లు, గోల్డ్ సూచీలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడొచ్చు. మైనింగ్ స్టాక్స్ ఎలా కదులుతున్నాయో తెలుసుకోవచ్చు. ఆయిల్ ధర, సూచీలు, బంగారం విలువకు సంబంధించి అలర్ట్స్‌ను సెట్ చూసుకోవచ్చు. బంగారం, ఇతర లోహాల విలువను వివిధ కరెన్సీల్లోనూ, పరిమాణాన్ని గ్రాము, కేజీ, ఔన్స్లోనూ చూడొచ్చు. పలు దేశాల కరెన్సీలకు చెందిన ఎక్స్చేంజ్ రేట్లను పోల్చి చూసుకోవచ్చు. బంగారం, ఇతర లోహాలు, క్రూడ్ ధరలకు సంబంధించిన టెక్నికల్ చార్ట్స్‌ను చూడొచ్చు. మార్కెట్ వార్తలను చదవొచ్చు. -
ఓ రూ.10 వేల కోట్లు లాగేద్దాం!
కొత్త బడ్జెట్లో పన్నులద్వారా రాబట్టాలని ప్రభుత్వ నిర్దేశం వ్యాట్‌లో ఏకంగా రూ.8,500 కోట్లు లక్ష్యం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.1,600 కోట్లు.. మద్యంపైనా భారీగా ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యం భారీగా ఆదాయ లక్ష్యాల నిర్దేశం పట్ల ఆదాయ వనరుల శాఖల గగ్గోలు ఆచరణ సాధ్యం కాదని స్పష్టీకరణ పన్నులు పెంచితేనే సాధ్యమని కుండబద్దలు అయితే పన్నులు పెంచేందుకు వీల్లేనందున బడ్జెట్ అమల్లో తిప్పలు తప్పవని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్లో పన్నుల రూపంలో అదనంగా రూ.పదివేల కోట్లకుపైగా ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించడం పట్ల ఆదాయ వనరుల శాఖలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా వచ్చిన ఆదాయానికి అనుగుణంగా పదిశాతం వృద్ధితో ఆదాయ లక్ష్యాల్ని నిర్ధారించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఆర్థిక శాఖ భారీ లక్ష్యాల్ని నిర్దేశించిందని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి. బడ్జెట్లో ప్రధానంగా ఆదాయ వనరులు ఆర్జించే వ్యాట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, ఎ క్సైజ్ రంగాల లక్ష్యాలు అశాస్త్రీయంగా, ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఆయా శాఖల అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఆయా శాఖలతో సంప్రదింపులు జరపకుండానే ఆర్థికశాఖ ఏకపక్షంగా లక్ష్యాల్ని నిర్ధారిస్తూ వచ్చే బడ్జెట్‌ను రూపొందించిందని, దీంతో ఆ బడ్జెట్ అమల్లో తిప్పలు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంత భారీస్థాయిలో వ్యాట్ లక్ష్యమా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా రూ.32,840 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా.. ఫిబ్రవరి నాటికి రూ.27,600 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు ఇది రూ.29,200 కోట్లకు మించదని వాణిజ్య పన్నులశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యాట్ లక్ష్యాన్ని రూ.37,435 కోట్లుగా ఆర్థికశాఖ నిర్ణయించడం గమనార్హం. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చిన ఆదాయంకంటే అదనంగా రూ.8,500 కోట్లకుపైగా ఆర్జించాలని ఆర్థికశాఖ నిర్ధారించింది. ఇంత పెద్ద మొత్తంలో అదనంగా వ్యాట్ ద్వారా ఆదాయం సముపార్జన సాధ్యమవదని వాణిజ్య పన్నులశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాట్ పన్ను ఇప్పటికే ఎక్కువగా ఉందని, అదనంగా పన్ను పెంచడానికి ఆస్కారం లేదని వారంటున్నారు. ఒకవైపు రాష్ట్రప్రభుత్వమే బియ్యం, పప్పుల మిల్లర్లు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిల్ని రూ.500 కోట్ల మేరకు రద్దు చేసిందని, ఇలా రాయితీలిచ్చుకుంటూ మరోవైపు పన్నులు పెంచకుండా వ్యాట్ ఆదాయం పెంచడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా అదనంగా రూ.1,600 కోట్లు లక్ష్యం.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా ఫిబ్రవరికి రూ.3,200 కోట్ల ఆదాయం లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4,060 కోట్ల ఆదాయం ఆర్జించగలమని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేయగా ఆర్థికశాఖ మాత్రం ఏకంగా రూ.5,180 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. అంటే ప్రస్తుత సంవత్సరం లక్ష్యం కంటే ఏకంగా రూ.1,600 కోట్లు అదనంగా ఆర్జించాలని నిర్ధారించారు. అయితే ఇంత పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చడం సాధ్యపడదని ఆ శాఖ అధికారులంటున్నారు. గతేడాది ఆగస్టులోనే భూముల విలువల్ని పెంచినందున వచ్చే ఏడాదిదాకా మళ్లీ పెంచేందుకు ఆస్కారం లేదంటున్నారు. 'మద్యం' లక్ష్యం సాధించాలంటే మరింత మందితో తాగించాలి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.4,680 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టగా.. రూ.4,400 కోట్లు ఆర్జించారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5,756 కోట్లు లక్ష్యంగా పెట్టారు. ఆ మేరకు ఇప్పటికంటే అదనంగా రూ.1,300 కోట్లు ఆర్జించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆర్జించాలంటే వీలైనంత ఎక్కువ మందితో మద్యం తాగించాలని, లేదంటే ధరలు పెంచాలని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇక రవాణా ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,977 కోట్లు ఆర్జించాలనేది లక్ష్యంకాగా ఫిబ్రవరి నాటికి రూ.1,950 కోట్లు వచ్చింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2,412 కోట్లు ఆర్జించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. అమలు తలకిందులవక తప్పదా? ఆచరణ సాధ్యం కాని, వ్యూహలతో కూడిన ఆదాయ లక్ష్యాల్ని నిర్ధారిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో దీని అమలు తలకిందులు కాక తప్పదనే భావనను ఆయా శాఖల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెంచితేనే ఆదాయ లక్ష్యాల్ని చేరుకోవడం సాధ్యమని, కానీ ఇప్పటికే పన్నులు పెంచినందున.. ఇప్పుడు పెంచడం సాధ్యపడదని వారు చెబుతున్నారు. రెవెన్యూ మిగులుతోపాటు 53 శాతం ఆదాయం వచ్చే తెలంగాణ సర్కారు వచ్చే బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.54,849 కోట్లుగా నిర్ధారించగా.. 47 శాతం ఆదాయం వచ్చే ఆంధ్రప్రదేశ్ సర్కారు వచ్చే బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.57,800 కోట్లుగా నిర్ధారించడంలోనే బడ్జెట్లోని డొల్లతనం బయటపడుతోంది. -
‘ఆదాయ’శాఖకు అధికారులు కరువు!
♦ వాణిజ్య పన్నుల శాఖలో 1,106 ఖాళీలు ♦ నేటికీ పాత డివిజన్లు, సర్కిళ్లవారీ పోస్టులు ♦ జీరో దందాపై తగ్గిన నిఘా ♦ కొత్త డీలర్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి ♦ విషయం సీఎం దృష్టికి... కదులుతున్న ఫైలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్నిచ్చే వాణిజ్యపన్నులశాఖకు అధికారులు, సిబ్బంది కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రం లో పోస్టులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజిం చాక అధికారుల సంఖ్య గణనీయంగా తగ్గగా భర్తీ చేసుకునే ప్రయత్నాలేవీ జరగడం లేదు. దీంతో అక్రమ రవాణా, జీరో దందాపై నిఘా తగ్గడంతోపాటు కొత్తగా పన్నులు విధించేందుకు అవకాశాలున్న సంస్థలు, డీలర్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. వాణిజ్యపన్నులశాఖకు ఉమ్మడి రాష్ట్రంలో కమిషనర్, అదనపు కమిషనర్, సంయుక్త కమిషనర్ పోస్టులు కాకుండా 8,882 మంది అధికారులు, ఇతర ఉద్యోగులను కేటాయించారు. రాష్ట్ర విభజన తరువాత జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 3,539 మందిని కేటాయించగా వీరిలో ప్రస్తుతం విధుల్లో 2,433 మందే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సీటీవో, డీసీటీవో, ఏసీటీవో వంటి కీలక పోస్టుల నుంచి ఆఫీస్ సబార్డినేట్ల వరకు 18 విభాగాల్లో ఏకంగా 1,106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియారిటీ జాబితా తయారీలో నిర్లక్ష్యం కారణంగా పదేళ్లుగా పదోన్నతులు లేవు. దీంతో 40 సీటీవో పోస్టులు, 50 చొప్పున డీసీటీవో, ఏసీటీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 298 జూనియర్ అసిస్టెం ట్ పోస్టులు, 158 సీనియర్ అసిస్టెంట్, 254 ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. భారీగా డీలర్లు... పెరగని సర్కిళ్లు వాణిజ్యపన్నులశాఖకు వచ్చే ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ పరిధిలోని 7 డివిజ న్ల నుం చే సమకూరుతోంది. టర్నోవర్ టాక్స్ (టీవోటీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లిస్తున్న టిన్ (టాక్స్ పేయర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్) డీలర్లు హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది టిన్ రిజిస్ట్రేషన్ డీలర్లు ఉండగా వారిలో సికింద్రాబాద్ నోడల్ డివిజన్ (హైదరాబాద్ సిటీ) పరిధిలోని ఐదు డివిజన్లలో ఉన్న 43 సర్కిళ్లలోనే 56,980 మం ది డీలర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది డీలర్లకు ఒక సర్కిల్ ఉండాల్సి ఉండగా హైదర్‌నగర్‌లో 6,086 మంది, మాదాపూర్‌లో 6,323 మంది డీలర్లు రిజిస్టరై ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్‌లో 463 మంది, మహారాజ్‌గంజ్‌లో 468 మంది, రాంగోపాల్‌పేట్‌లో 443 మంది, హిస్సామ్గంజ్లో 496 మంది డీలర్లే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తక్కువ డీలర్లున్న సర్కిళ్లను కలపాలని, ఎక్కువ ఉన్న చోట కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి సీఎం దృష్టికి... రాష్ట్ర ఖజానాకు ఈ వార్షిక సంవత్సరంలో రూ. 36 వేల కోట్ల ఆదాయం అందించాలని పెట్టుకున్న లక్ష్యంలో వాణిజ్యపన్నులశాఖ సుమారు రూ. 28 వేల కోట్లు చేరుకోవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం కూడా రూ. 27 వేల కోట్ల మార్కు వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సంస్థ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు...శాఖలోని పరిస్థితిని మంత్రుల బృందం ముందుకు తీసుకెళ్లారు. ఈ శాఖలోని పరిస్థితి సీఎం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు సర్కార్ కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. -
‘కూలి’ పోతున్నారు
దుర్భరమవుతున్న ఇటుక బట్టీ కూలీల జీవనం ఒక ఇటుక తయారీ కూలీ 25 పైసలు అలా 1000 చేస్తే వచ్చేది రూ.250 రామచంద్రాపురం: ఇల్లు నిర్మించాలంటే ఇటుకలు కావాలి. కానీ ఇటుకలు తయారీ అంత ఆషామాషీ కాదు. ఎర్రని ఎండలో ఇటుక కూలీలు రోజుల తరబడి కష్టపడితే గాని ఇటుక తయారీ సాధ్యపడదు. కానీ ఇంతా చేసిన ఆ కూలీల బతుకులు మాత్రం నానాటికీ దుర్భరమవుతున్నాయి. మండలంలోని సొరకాయలపాలెం, అనుప్పల్లి, సి.రామాపురం, గంగిరెడ్డిపల్లి, నడవలూరు గ్రామ పంచాయతీలలో ఇటుకల తయారీ కంపెనీలు ఉన్నాయి. కానీ ఇటుకలు తయారు చేయడానికి అనంతపురం, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూలీలు తరలివచ్చి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యజమానులు కూలీలు తక్కువగా ఇచ్చి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఒక ఇటుక తయారీకి 25 పైసలు ఒక ఇటుకరాయిని తయారు చేస్తే కూలీలకు ఇచ్చేది 25 పైసలే. రోజుకు 1000 రాళ్లు చేస్తే రూ.250 మాత్రమే ఇస్తున్నారు. కానీ మార్కెట్లో ఇటుకరాయి రూ.5కు అమ్ముతున్నారు. దీంతో రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదని కూలీలు వాపోతున్నారు. కాస్త వయసు మళ్లినవారు రోజుకు 1000 ఇటుకలు చేయడం సాధ్యం కాదని, ఇచ్చే కూలీ మరీ తక్కువ ఉండడం వల్ల మూడు పూటల అన్నం తినలేకపోతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా ఇటుక బట్టీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కూడా చెల్లించడం లేదు. ఇటుకలు కాల్చడానికి గ్రామాల్లో దొరికే బొగ్గు, కలపను వాడుతున్నారు. ఇలా ఇటుక బట్టీల యజమానులు కూలీలు కష్టాన్ని దోచుకుని లాభాలను గడిస్తున్నారు. కష్టానికి తగ్గ కూలీ ఇవ్వడం లేదు ఇటుక తయారీకి చాలా కష్టపడాలి. కానీ చాలీ చాలని కూలీలతో కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నాం. ఈ పనే మాకు అల వాటైపోయింది. వేరే వృత్తి చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ మా కష్టానికి తగ్గ కూలీ ఇవ్వడం లేదు. - బి.రామాంజనేయులు, తాడిపత్రి, అనంతపురం జిల్లా ఇటుకల తయారీనే జీవనం తరతరాలుగా మా కుటుంబాలకు తెలిసింది ఇటుకల తయారీ చేయడమే. అందుకే మమ్మల్ని ఇటుకల తయారీ పనులకు పంపారు. ఇటుకల తయారీ పనులు రెండు నెలల పాటు నిరంతరంగా ఉంటాయి. కూలీలు పెంచితే సంతోషంగా వుంటుంది. - సూరిబాబు, తాడిపత్రి, అనంతపురం జిల్లా -
పన్నుల్లో ఊరట తక్కువే!
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇది మధ్య తరగతిని నిరాశపరిచేదే. కాకపోతే కాస్త తక్కువ ఆదాయం ఉన్నవారిపై మాత్రం జైట్లీ కొంత కనికరం చూపించారు. బాగా ఎక్కువ ఆదాయం ఉన్నవారిని ఇంకాస్త మొత్తారు. తొలిసారి రుణంతో ఇంటిని కొనుక్కునేవారికి మరిన్ని వడ్డీ ప్రయోజనాలిచ్చారు. టీడీఎస్‌తో చిన్న పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే సరళమైన విధానాన్ని తెస్తామని చెప్పారు జైట్లీ. 80 జీజీ కింద హెచ్ఆర్ఏ పరిమితి రూ.60,000కు పెంపు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5,000 ట్యాక్స్ రిబేట్ తొలిసారి ఇల్లు కొంటే వడ్డీపై అదనంగా 50,000 మినహాయింపు ఎన్పీఎస్ నుంచి విత్‌డ్రా చేసుకునే 40 % మొత్తానికి పన్నుండదు కోటిరూపాయల ఆదాయం దాటితే సర్ చార్జీ ఇక 15 శాతం తక్కువ ఆదాయం... తక్కువ ఊరట రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఇప్పటిదాకా పన్నులో రూ.2,000 రిబేటు ఇస్తున్నారు. దీన్నిపుడు రూ.5,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3,000 అదనపు ప్రయోజనం లభించనుంది. 2013లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటును ప్రవేశపెట్టారు. అంటే నెలకు రూ.41 వేలు ఆదాయంలోపు ఉన్నవారికే ఈ ప్రయోజనం. అది దాటితే ఎలాంటి రిబేటూ ఉండదు. అదీ లెక్క. హెచ్ఆర్ఏ అలవెన్స్ లేనివారికి.. కంపెనీలన్నీ హెచ్ఆర్ఏ ఇవ్వవు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నా వారికి హెచ్ఆర్ఏ ప్రయోజనం లభించదు. అలాంటివారు ఇప్పటి వరకూ సెక్షన్ 80 జీజీ కింద రూ.24,000 మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద తగ్గించి చూపించుకునే అవకాశం ఉండేది. ఇపుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అంటే హెచ్ఆర్ఏ లేని ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.36,000 మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత ట్యాక్స్ శ్లాబుల్నిబట్టి గరిష్ఠంగా 10,800 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇలా పెంచటం ఊరటే అయినా... ఏడాదికి రూ.60 వేలంటే నెలకు రూ.5వేల కింద లెక్క. ప్రస్తుత ధరల ప్రకారం రూ.5వేల అద్దెకు మంచి ఇల్లు ఎక్కడైనా వస్తోందా? మరి ఇది నిజంగా ఊరటేనా? తొలిసారి ఇంటిని కొంటే ఒకవంక రియల్ ఎస్టేట్ దెబ్బతినటంతో దేశీయంగా డిమాండ్ పెంచటానికి, నిర్మాణ రంగానికి ఊతమివ్వటానికి జైట్లీ మరో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకుని ఇల్లు కట్టుకునేవారికి వడ్డీ విషయంలో అదనపు ప్రయోజనం కల్పించారు. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షలకు అదనంగా రూ.50,000 ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని కోసం కొన్ని షరతులు విధించారు. ఇంటి ధర రూ. 50 లక్షలు దాటకుండా... తీసుకునే రుణం రూ.35 లక్షలు దాటకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయం.. ఎక్కువ వడ్డన ఏడాదికి కోటి రూపాయలు దాటి సంపాదించేవారిపై వడ్డన మరికాస్త పెంచారు. అలాంటివారు ఇప్పటిదాకా పన్ను చెల్లించటంతో పాటు... సూపర్ రిచ్ సర్‌ఛార్జీ పేరిట 12 శాతాన్ని చెల్లించేవారు. ఇపుడు ఈ సర్ఛార్జిని 15 శాతానికి పెంచారు. 2013లో అప్పటి ఆర్థిక మంత్రి తొలిసారిగా ఈ సూపర్ రిచ్ సర్చార్జిని 10 శాతంగా ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లో జైట్లీ వెల్త్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసి సూపర్ రిచ్ సర్ చార్జీని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 15 శాతం అయ్యింది. ఎన్పీఎస్ విత్‌డ్రా.. ట్యాక్స్ ఫ్రీ నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను (ఎన్పీఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇతర పింఛన్ పథకాల మాదిరిగానే ఎన్పీఎస్ నుంచి చేసే విత్ డ్రాయల్స్‌పై కూడా పన్ను భారాన్ని తీసేశారు. 60 ఏళ్లు దాటాక ఎన్పీఎస్ కార్పస్ నుంచి మామూలుగా 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేయొచ్చు మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. తద్వారా పింఛన్ వస్తుంది. అయితే విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఇప్పటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై మాత్రం విత్‌డ్రా చేసుకునే మొత్తం 40 శాతందాకా ఉంటే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. 60 శాతమైతే మాత్రం... మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎన్పీఎస్ మాదిరిగా 1-4-2016 నుంచి ఈపీఎఫ్‌లో కూడా మార్పులు జరుగుతాయి. విత్డ్రాయల్స్పై 40 శాతం వరకు మాత్రమే పన్ను మినహాయింపులుంటాయి. అలాగే సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీపై సర్వీస్ ట్యాక్స్‌ను 3.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగమిస్తే ఈపీఎఫ్ సాయం.. కొత్త ఉద్యోగాలు కల్పించడానికి, పరిశ్రమలన్నీ ఈపీఎఫ్ పరిధిలోకి రావటానికి కేంద్రం కొత్త ప్రోత్సాహకాలు కల్పించింది. కొత్త ఉద్యోగి కనక ఈపీఎఫ్‌లో చేరితే... మూడేళ్లపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను (జీతంలో 8.33 శాతం) కేంద్రమే ఈపీఎఫ్‌కి జమ చేస్తుంది. అయితే ఉద్యోగి జీతం రూ.15,000 దాటి ఉండకూడదు. దీని వల్ల జీతంలో కనీసం 8.33 శాతం ఈపీఎఫ్‌కి జమచేయాలన్న నిబంధన నుంచి కంపెనీలకు మూడేళ్లు ఊరట లభిస్తుంది. ఉద్యోగికీ లాభం ఉంటుంది. ఇందుకోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది. చౌక ఇళ్లకు ప్రోత్సాహకాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేలా అందుబాటు ధరల్లో నిర్మించే ఇళ్లకు ఈ బడ్జెట్లో ప్రోత్సాహకాలిచ్చారు. చౌక ఇళ్లను నిర్మించే సంస్థలకు వచ్చే లాభాల్లో 100 శాతం డిడక్షన్‌కు వీలు కల్పించారు. మెట్రో నగరాల్లో 30 చదరపు అడుగుల్లో, మిగిలిన పట్టణాల్లో 60 చదరపు అడుగుల్లో నిర్మించే ఫ్లాట్స్‌కి ఈ ప్రయోజనం లభిస్తుంది. బీమా ఏజెంట్లకు టీడీఎస్ ఊరట ముందస్తు పన్ను మినహాయింపు (టీడీఎస్) నుంచి ఊరట దొరికింది. ముఖ్యంగా బీమా ఏజెంట్ల కమీషన్‌పై విధించే టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంతకాలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయం రూ.20,000 దాటితేనే టీడీఎస్ వర్తించేది. దీన్నిప్పుడు రూ.15,000కు తగ్గించారు. బీమా పాలసీకి చేసే చెల్లింపులపై విధించే టీడీఎస్‌ను 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్ స్కీం (ఎన్ఎస్ఎస్) కమీషన్లపై టీడీఎస్‌ను 20 నుంచి 10 శాతానికి, బ్రోకింగ్ కమీషన్లపై టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఎస్ఎంఈలు, వృత్తి నిపుణులకు ఊరట చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వృత్తి నిపుణులకు పెద్ద ఊరటే ఇచ్చారు. రెండు కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వారు... తమ టర్నోవర్‌లో 8% లాభం వస్తుందని అంచనా వేసుకుని... దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాంటివారు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ రాయాల్సిన పని కూడా లేదు. గతంలో ఈ పరిమితి కోటి రూపాయలుగా ఉండేది. దీనివల్ల సుమారు 30లక్షల మంది చిరు వ్యాపారులకు ఊరట లభించనుంది. అలాగే డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వృత్తి నిపుణులు తమ ఆదాయం కనక రూ.50 లక్షల లోపు ఉంటే... ఆదాయంలో 50 శాతాన్ని లాభంగా అంచనా వేసుకుని, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. వీరు కూడా అకౌంట్ బుక్స్ రాయాల్సిన పని ఉండదు. ఇప్పుడు పన్ను శ్లాబులు ఎలా ఉన్నాయంటే... -
చంద్రన్న కానుకకు పన్ను పోటు
చౌకడిపో డీలర్ల కమీషన్లో కోత నేడు బందరులో సమావేశం జేసీకి సమస్యలు నివేదించేందుకు సిద్ధం విజయవాడ బ్యూరో : చంద్రన్న కానుక కిట్లు పంపిణీ చేసిన డీలర్ల కమీషన్లో పలు రకాల పన్నుల పేరిట కోత విధించడంతో చౌక డిపో డీలర్లు డీలాపడ్డారు. చందన్న కానుకను లబ్ధిదారులకు అందించినందుకు డీలర్లకు ఒక్కో ప్యాకెట్‌కు రూ.5 కమీషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 13 లక్షల 17 వేలకు పైగా రేషన్ కార్డుల్లో 90 శాతానికి పైగా కానుకలు డీలర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇందుకు తమకు కమీషన్ వస్తుందనుకున్న డీలర్ల ఆశలు ఆవిరవుతున్నాయి. వచ్చిన కమీషన్ కంటే ఖర్చులు తడిసిమోపెడయ్యాయంటూ లబోదిబోమంటున్నారు. సరుకులను తరలించేందుకు ఒక్కో షాపునకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు కిరాయి, జట్టుకూలీ అయ్యాయని డీలర్లు వాపోతున్నారు. దీనికితోడు క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాల్లో త్వరగా పంపిణీ చేయాలని ఆదేశాలివ్వడంతో రూ. వెయ్యి ఖర్చుపెట్టి ప్రత్యేకంగా సహాయకుల్ని పెట్టుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వృత్తిపన్ను, ఆదాయపు పన్ను, సర్వీసు ట్యాక్స్ పేరుతో ఒక్కో డీలర్‌కు రూ.500 చొప్పున కోత పెడుతున్నట్టు తెలిసింది. మిగిలిన కమీషన్ మొత్తాన్ని సరుకుల డీడీల్లో తగ్గించి తీసుకునేలా ఈ నెలలో డీలర్లకు అధికారులు చెప్పారు. కమీషన్లో ట్యాక్స్ కోత గురించి అడిగితే అందుకు సరైన సమాధానం లభించక డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్లేందుకు సోమవారం మచిలీపట్నంలో జిల్లా స్థాయి డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా డీలర్ల సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. -
పల్లె జనంపై పన్ను పోటు
పట్టణ తరహాలో పంచాయతీల్లోనూ పన్నులు చట్టాన్ని సవరించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో పల్లె ప్రజలపై అదనపు బారం కర్నూలు సిటీ: ఇంటి నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర వాటికి సంబంధించి ఇకపై పల్లె జనం కూడా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భూ అభివృద్ధి చట్టం- 2002కు ప్రభుత్వం సవరణలు చేసింది. గ్రామ పంచాయతీల్లో కూడా సొంతిళ్లు నిర్మించుకోవాలనుకునే వారు నిర్దేశించిన మేరకు పన్ను చెల్లించేలా ఈ నెల 8వ తేదీన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జీఓ ఎంఎస్ 12ను జారీ చేశారు. ఫలితంగా ఇంతకాలం నిధులు లేక నీరసించిన పంచాయతీ ఖజానాకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిధులు సమకూరుతాయని సంబరపడాలో పల్లెజనంపై పన్నులవాత మొదలవుతుందని బాధపడాలో తెలియని పరిస్థితి సర్పంచ్‌ల్లో నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా ప్రజలపై పన్నుల భారం పడేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చట్టానికి సవరణ ఇలా.. తాత్కాలిక నిర్మాణాలకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోగా ఇకపై రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంది. శాశ్వత భవన నిర్మాణాలకు సంబంధించి స్క్వేర్ మీటర్‌కు గతంలో రూ. 2 చెల్లింస్తుండగా రూ. 20 కి పెంచారు. నివాసేతర భవన నిర్మాణానికి స్క్వేర్ మీటర్‌కు రూ.40 లేదా రూ. 2 వేలు చెల్లించాలి. గతంలో స్క్వేర్ మీటర్‌కు రూ. 8 లేదా మొత్తంగా రూ. 400 మాత్రమే ఉండేది. లేఆవుట్ ఫీజు స్క్వయర్ మీటర్‌కు రూ.4 లేదా రూ.5 వేలు ప్రకారం, గతంలో రూ.2 లేదా రూ.3 వేలు చెల్లించే వారు. లేఆవుట్ భూమి అప్రూవల్ కోసం స్క్వేర్ మీటర్‌కు రూ. 5 నుంచి రూ.10కి పెంచారు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల విలువలో 14 శాతం కాంట్రిబ్యూట్ చేయాలి. గ్రై డ్ పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ అనుమతి కోసం రూ.4 వేల నుంచి రూ.5 వేలు, మైనర్ పంచాయతీల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే వెయ్యి నుంచి రూ.2 వేల వరకు, నిబంధనలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తే రూ. 20 వేల వరకు జరిమానా విధించవచ్చు. -
వ్యాపారానికి మెరుగైన పరిస్థితులే లక్ష్యం
జీఎస్టీ, పన్నుల హేతుబద్ధీకరణ కూడా * కొత్త ఏడాదిలో వీటిపైనే అత్యధికంగా దృష్టిపెడతాం... * ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ మెరుగ్గా నిలిచాం * పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులను కల్పించడం... కొత్త ఏడాది(2016)లో ఇవే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులను వెచ్చిస్తామని హామీనిచ్చారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, సంక్షోభం కారణంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన రీతిలో రాణించిందని.. రానున్న నెలల్లో వృద్ధి రేటు మరింత పుంజుకుంటుందని జైట్లీ పేర్కొన్నారు. ప్రధానంగా వచ్చే ఏడాది నిర్మాణాత్మక సంస్కరణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ‘మూడు అంశాలను ప్రభుత్వం కీలకంగా తీసుకోనుంది. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను వెచ్చించనున్నాం. అదేవిధంగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి(ఇరిగేషన్) రంగంలో కూడా ప్రభుత్వం మరింతగా పెట్టుబడి చేయనుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సంబంధించి నిబంధనలను మరింత సరళీకరించడంతోపాటు ప్రస్తుత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. భారత్ వెలుగురేఖ... ప్రపంచ మందగమనంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వెలుగురేఖగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. ‘7-7.5 శాతం వృద్ధి అవకాశాలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పరుగులు తీస్తోంది. అయితే, మేము నిర్దేశించుకున్న 8 శాతం లక్ష్యం కంటే ఇది తక్కువే. వర్షాలు తగినంతగా కురిసుంటే ఇది సాకారమయ్యేదే. మొత్తంమీద 2015 ఏడాది అత్యంత సంతృప్తికరంగా ముగుస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు అంత్యంత పటిష్టంగా ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎకానమీ ఇంకా పూర్థిస్థాయిలో గాడిలో పడలేదన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. నిజంగా పుంజుకోకుంటే పన్ను వసూళ్లు ఎలా మెరుగవుతాయని ఆయన ప్రశ్నించారు. భారత పారిశ్రామిక వర్గాల్లో కూడా కొంత నిరాశావాదం వ్యక్తమవుతోందన్న ప్రశ్నకు.. కొంతమంది అతిగా చిత్రీకరిస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. మరోపక్క, కొన్ని కీలక బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన కుయుక్తులను కట్టిపెట్టకపోతే.. తగిన ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాల్సి వస్తుందని కూడా జైట్లీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంది... అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుదలవల్ల లభిస్తున్న ప్రయోజనాన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకుంటున్నామని జైట్లీ చెప్పారు. ముఖ్యంగా హైవేలు, గ్రామీణ రోడ్లు, రైల్వేలలో పెట్టుబడులను గణనీయంగా పెంచుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోర్టుల్లో కూడా ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ‘ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలో ఉంది. ఆర్బీఐ వడ్డీరేట్లు(రెపో) ఈ ఏడాది 1.25 దిగొచ్చాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశం. డాలరుతో మారకం విలువ విషయంలో పలు దేశాలతో పోలిస్తే మనం మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాం’ అని జైట్లీ తెలిపారు. బ్యాంకుల్లో మొండిబకాయిలు పెరిగిపోవడంపై మాట్లాడుతూ... ఈ సమస్య చాలా పెద్దదే అయినా.. బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చడం సహా తాము ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. -
ఎన్పీఎస్ ఉపసంహరణపై ట్యాక్స్ ఉంటుందా?
నేను రూ.5 లక్షలు లిక్విడ్ ఫండ్‌లో ఏడాది పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎంత మొత్తం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌గా నేను చెల్లించాల్సి ఉంటుంది? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పించుకునే మార్గాలున్నాయా? - రవి కుమార్, విజయవాడ మీరు స్వల్ప కాలానికే లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక. వాటిపై వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాదరబందీ ఏమీ లేకుండా ఉండాలంటే, లిక్విడ్ స్కీమ్‌కు సంబంధించి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద లాభాలను డివిడెండ్‌గా పంపిణి చేస్తారు. ఫలితంగా ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు. డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీయే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్-డీడీటీ(28.8 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు మీ రాబడులపై ప్రభావం పడుతుంది. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి ఆందోళన చెందక్కర లేదు. అయితే 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉండే వాళ్లకు డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ఉపసంహరణలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎన్పీఎస్ నుంచి ఉపసంహరించుకున్న మొత్తానికి పన్నులు చెల్లిం చాల్సి ఉంటుందా? లేకుంటే క్యాపిటల్ గెయిన్స్ మీదనే పన్ను చెల్లించాల్సి ఉంటుందా? యాన్యుటీ కొనుగోలుపై సర్వీస్ చార్జీ ఉంటుందా ? - సరస్వతి, కడప మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్పీఎస్ను ఉపసంహరించుకుంటే, మెచ్యూరిటీ మొత్తంలో 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ 40 శాతం యాన్యుటీ వల్ల మీకు నెలా నెలా క్రమం తప్పకుండా కొంత పింఛన్ వస్తుంది. ఇక 60 శాతం మొత్తాన్ని ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు.ఒకేసారి విత్‌డ్రా చేసుకున్న ఈ మొత్తంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 60 సంవత్సరాలకు ముందే ఎన్పీఎస్ను ఉపసంహరించుకోవాలంటే, 80 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఒకేసారి ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీ కొనుగోలుపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు యాన్యుటీని కొనుగోలు చేసినప్పటి రేట్ల ఆధారంగా ఈ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది నుంచి ఐసీఐసీఐ ప్రు లైఫ్-మ్యాగ్జిమైజర్ ఫైవ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.50,000 చొప్పున రెండు వార్షిక ప్రీమియంలు చెల్లించాను. ఈ ఫండ్ వాల్యూ ప్రస్తుతం రూ.92,000గా ఉంది. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేకుంటే ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? - అర్జున్ రావు, వరంగల్ యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు పేరుకు తగ్గట్టుగా బీమా, ఇన్వెస్ట్మెంట్స్ కలగలసిన ఇన్వెస్ట్మెంట్ పాలసీలు. ఈ పాలసీలు స్వల్పమైన బీమా కవర్‌ను మాత్రమే అందిస్తాయి. ఈ పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి కనుక రాబడులు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. మీ పాలసీలో అధిక చార్జీలు కారణంగా మీరు చెల్లించిన ప్రీమియం కంటే కూడా మీ పాలసీ విలువ తక్కువగా ఉంది. ఈ తరహా పాలసీల నుంచి వైదొలగడమే ఉత్తమం. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపకండి. ఇవి రెండూ పూర్తిగా వేర్వేరు. బీమా కోసమైతే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 32 సంవత్సరాలు. మూడేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి రాబడులు ఇస్తాయని మిత్రులంటున్నారు. డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే, పన్ను భారం కూడా ఉండదని చెబుతున్నారు. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా లేక న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ)ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? - నందిని, హైదరాబాద్ కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీలలో 65%, మిగిలినది డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్ కొంత ఒడిదుడుకులకు గురవుతాయి. పన్ను భారం తగ్గించుకోవడానికి డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోనక్కరలేదు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిపైగా కొనసాగిస్తే ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మీరు చెల్లించాల్సిన పనిలేదు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డివిడెండ్ ఆప్షన్ సరైనది కాదని చెప్పవచ్చు. న్యూ ఫండ్ ఆఫర్ పనితీరు ఎలా ఉం టుందో తెలియదు కదా. అప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మంచి ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
హానికారక ఉత్పత్తుల మీద పన్నులపై ఆందోళన అక్కర్లేదు
జీఎస్టీ రేట్లు సరైనవే: సీఈఏ అరవింద్ సుబ్రమణ్యన్ న్యూఢిల్లీ: పొగాకు వంటి హానికారక ఉత్పత్తులు, ఖరీదైన కార్లపై అధిక పన్నుల ప్రతిపాదనలు సహా మూడంచెల వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం సరైనదేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ సమర్థించారు. ప్రస్తుత పన్నుల విధానాలకు అనుగుణంగానే దీనిపై సిఫార్సులు చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పుడు చాలా మటుకు లగ్జరీ ఉత్పత్తులపై అత్యధిక పన్నుల శ్రేణిలోనే ఉన్నాయని, యథాతథ స్థితిని కొనసాగించేలాగే తమ సిఫార్సులున్నాయన్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని సుబ్రమణ్యన్ చెప్పారు. హానికారక ఉత్పత్తులపై అధిక పన్ను (‘సిన్’ ట్యాక్స్) పరిధిలో కేవలం కొన్ని ఉత్పత్తులను కమిటీ ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. వివిధ వస్తువులు, సేవలపై 12-40 శాతం శ్రేణిలో కనిష్ట, గరిష్ట పన్నులను, 17-18 శాతం స్థాయిలో ప్రామాణిక పన్నుల రేట్లను ప్రతిపాదిస్తూ సుబ్రమణ్యన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని సాకారం చేసే లక్ష్యంతోనే అంతర్రాష్ట్ర స్థాయిలో వస్తువులపై అదనంగా 1 శాతం లెవీని తొలగించాలని ప్రతిపాదించినట్లు సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. ఇక రాజ్యాంగంలో జీఎస్టీ రేటును పొందుపర్చరాదన్న కమిటీ ప్రతిపాదనను సమర్థిస్తూ.. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ రాజ్యాంగంలోనూ పన్ను విధానానికి సంబంధించిన అత్యంత సూక్ష్మ వివరాలను కూడా పొందుపర్చడం జరగదని ఆయన చెప్పారు. రాజ్యాంగంలో పొందుపర్చిన పక్షంలో భవిష్యత్‌లో ఎప్పుడైనా రేట్లను మార్చాల్సిన పరిస్థితి తలెత్తితే కష్టమయ్యే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమన్నారు. సరైన దిశలోనే వెళుతున్నాం: అరవింద్ పనగారియా భారీ సంస్కరణలను ప్రవేశపెట్టే క్రమంలో జీఎస్టీ అమలుపై భారత్ సరైన దిశలోనే వెళుతోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పన్‌గారియా వ్యాఖ్యానించారు.ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) భారతీయ పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా పనగారియా ఈ విషయాలు తెలిపారు. -
జీఎస్టీ... మనకేంటి?
వస్తు సేవల పన్ను. సంక్షిప్తంగా జీఎస్టీ. దేశవ్యాప్తంగా అన్ని వస్తువులపైనా, అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్ను ఉండాలనేది దీని లక్ష్యం. 2006లో కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన ఈ పన్ను ఇంకా పార్లమెంటు ఆమోదానికి ఎదురుచూస్తూనే ఉంది. లోక్‌సభ ఆమోదించినా... రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేక ప్రతిపక్ష కాంగ్రెస్ సాయం కోరుతోంది. కాంగ్రెస్ మాత్రం కీలకమైన కొన్ని సవరణలకు పట్టుబడుతోంది. వాటికి అంగీకరించని పక్షంలో బిల్లుకు సహకరించేది లేదంటోంది. కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైనది... జీఎస్టీ గరిష్ట రేటును 18 శాతానికి పరిమితం చేసి... ఆ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట అకస్మాత్తుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ జీఎస్టీపై కీలక సిఫారసులు చేసింది. అత్యధిక వస్తువులకు, సేవలకు వర్తించేలా జీఎస్టీ ప్రామాణిక రేటును 17-18 శాతానికి పరిమితం చేయాలని సూచించింది. కొన్ని తక్కువ రేటు వస్తువులపై కనిష్టంగా 12 శాతం, లగ్జరీ వస్తువులపై గరిష్టంగా 40 శాతం పన్ను విధించవచ్చని సిఫారసు చేసింది. ఒకరకంగా 17-18 శాతం రేటును ప్రామాణిక రేటుగా పేర్కొనటమంటే కాంగ్రెస్ డిమాండ్‌కు అంగీకరించినట్లే. కాకపోతే దీన్ని సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడానికి మాత్రం ప్రభుత్వం సుముఖంగా లేదు. నిజానికి జీఎస్టీ రేటు 23-26 శాతం వద్ద ఉండొచ్చని పలువురు అంచనా వేశారు. వీటన్నిటినీ తల్లకిందులు చేస్తూ 17-18 శాతంగా సిఫారసు చేయటం వల్ల... ఇదే గనక అమల్లోకి వస్తే చాలా రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అధికశాతం వస్తువులపై, కొన్ని వస్తు సేవలపై కేంద్ర, రాష్ట్రాలు కలిసి 29 శాతం వరకూ పన్ను విధిస్తున్నాయి. తాజా సిఫారసులు అమలైతే అది 17-18 శాతానికి దిగి వస్తుంది. ఆ మేరకు వస్తు, సేవల ధరలు తగ్గుతాయి. వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గటంతో విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయి. ధరలు తగ్గితే మరింత మంది వాటిని అందుకుంటారు కనక ఈ చర్య ఆర్థిక రంగానికి ఊతమిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ దేనిపై విధిస్తారు? అది వస్తే ఏఏ పన్నులు తొలగిపోతాయి? సామాన్యులకు లాభమా.. నష్టమా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం * ప్రామాణిక రేటును 18 శాతంగా సిఫారసు చేసిన కమిటీ * అదే అమలైతే హోటల్ బిల్లులతో సహా పలు బిల్లుల తగ్గుదల * కొన్ని సేవలపై పన్నులు పెరగొచ్చు * కనిష్ట రేటు 12% గరిష్ట రేటు 40%గా పేర్కొంటూ సిఫారసులు * ప్రస్తుతం పెట్రోలు సహా పలు ఉత్పత్తులపై భారీ పన్నులు * ఇవి అమల్లోకి వస్తే నష్టపోనున్న రాష్ట్రాలు.. రాష్ట్రాలకు వెసులుబాటిస్తే ఈ చట్టమే వృథా!? దేశ వ్యాప్తంగా ఒకే ధర... ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒకేరకమైన పన్నులుంటాయి. కానీ మన దేశానికి వచ్చేసరికి ఈ పరిస్థితి లేదు. ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పన్నులు విధించుకుంటున్నాయి. దీనికి చక్కటి ఉదాహరణ పెట్రోల్, డీజిల్ ధరలే. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో లీటరు పెట్రోల్ ధర రూ.57.64 ఉంటే, ఢిల్లీలో రూ. 60.48గా ఉంది. అదే హైదరాబాద్‌కు వచ్చేసరికి రూ. 65.48గా, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రూ. 66.68గా ఉన్నాయి. మహారాష్ట్రలో పప్పు దినుసులు, బియ్యంపై పన్ను లేదు. కానీ తమిళనాడులో ఇది 1 శాతంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతంగా ఉంది. ఒక వస్తువు ధర రాష్ట్రం మారినప్పుడల్లా మారడానికి కారణం ఆయా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే. దేశంలో ఏ మూలకెళ్లినా వస్తువుల ధరలు ఒకే విధంగా ఉంచే విధంగా ఏకీకృత పన్నుల విధానాన్ని అమలు చేయడమే జీఎస్టీ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు! పన్నులను తగ్గించడం వల్ల జాతీయోత్పత్తి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాగంటే పన్నులు తగ్గిస్తే ధరలు దిగివస్తాయి. దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. పన్నులు తక్కువగా ఉంటే పోటీని సమర్థవంతంగా తట్టుకొని దేశీయ కంపెనీలు ఎగుమతులు కూడా పెంచుకునే అవకాశముంటుంది. అంతేకాక విదేశీ కంపెనీలు కూడా ఇక్కడే తయారీ యూనిట్లను నెలకొల్పడానికి ముందుకొస్తాయి. దీనివల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఒకసారి దేశంలో జీఎస్టీ అమల్లోకి వస్తే దేశ జీడీపీ 1.5 శాతం నుంచి రెండు శాతం పెరుగుతుందని, ఎగుమతుల ద్వారా 15 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందనేది నిపుణుల అంచనా. ధరలెందుకు తగ్గుతాయి? ప్రస్తుతం మన పన్నుల వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పన్నులు విధిస్తున్నాయి. కేంద్రం వ్యాట్, ఎక్సైజ్, కస్టమ్ సుంకాలు, కౌంటర్వీలింగ్ డ్యూటీలు (సీవీడీ), సర్వీస్ ట్యాక్స్‌లతో పాటు సర్ చార్జీలు, వివిధ రకాల సుంకాలను వేస్తుంటే, రాష్ట్రాలు అమ్మకం పన్ను, రాష్ట్ర వ్యాట్, వినోద, విలాస పన్నులు, అక్ట్రాయ్ వంటివి విధిస్తున్నాయి. ఇలా చెల్లించిన పన్నులపైనే పరోక్షంగా పన్నులు చెల్లించాల్సి రావడంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి ఒకసారి జీఎస్టీ అమల్లోకి వస్తే కస్టమ్స్ మినహా కేంద్రం విధిస్తున్న పన్నులన్నీ దీన్లో కలుస్తాయి. అలాగే రాష్ట్రం విధిస్తున్న వివిధ పన్నులూ దీన్లో విలీనమవుతాయి. దీంతో పన్నుపైన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు ధరలు తగ్గుతాయి. కంపెనీలకు లాభమా? నష్టమా? జీఎస్టీ అమల్లోకి వస్తే కంపెనీలకు నిర్వహణా వ్యయం బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు కేంద్ర అమ్మకం పన్నును తప్పించుకోవడానికి ప్రతీ రాష్ట్రంలోనూ గిడ్డంగులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ అవసరం ఉండదు. కంపెనీలు వ్యూహాత్మక ప్రాంతంలో ఒకేచోట భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరుకును రవాణా చేస్తాయి. దీనివల్ల గిడ్డంగుల నిర్వహణ భారం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కంపెనీలు పన్ను భారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో గిడ్డంగులు ఏర్పాటు చేసుకొని దొంగతనంగా పక్క రాష్ట్రాలకు విక్రయించడాలు కూడా ఆగిపోతాయి. ఇలా పన్నులు ఎగ్గొట్టే వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్న చెక్‌పోస్టుల అవసరం ఉండదు. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభిస్తుంది కనుక విదేశీ కంపెనీలూ ఇక్కడ తయారీ యూనిట్లు పెట్టడానికి వస్తాయి. 10 శాతం పన్నును లెక్కలోకి తీసుకొని జీఎస్టీకి ముందు, జీఎస్టీ వచ్చాక వస్తువు ధరలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం..సామాన్యుడికి ఊరట..! సుబ్రమణ్యన్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే జీఎస్టీలో పన్ను శ్లాబుల్ని మూడు రకాలుగా వర్గీకరించినట్లు కనిపిస్తోంది. నిత్యావసర వస్తువులను 12 శాతం బ్రాకెట్లోకి, ఇతర వస్తువులపై 17-18 శాతం విధించాలని సూచించింది. అలాగే ఆరోగ్యానికి హాని చేసే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటితో పాటు విలాసవంతమైన కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై 40 శాతం గరిష్ఠ పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. ఇవే రేట్లు కనుక అమల్లోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం ద్వారా సామాన్యుడికి పెద్ద ఊరట లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని వస్తువులపై సగటున 29 శాతం పన్నులు చెల్లిస్తున్నారని, ఇప్పుడది గణనీయంగా తగ్గి సామాన్యుడి జేబులోకి డబ్బులొస్తాయని ట్యాక్సేషన్ నిపుణులు పి.వి.సుబ్బారావు తెలిపారు. ఉదాహరణకు ఇపుడు ఆల్కహాల్‌పై 190 శాతం వరకూ పన్ను ఉంది. పెట్రోల్‌పై కూడా భారీ పన్నులున్నాయి. ఇవి గరిష్ఠ బ్రాకెట్ 40 శాతంలోకి వచ్చినా ధరలు భారీగా తగ్గుతాయని చెప్పొచ్చు. కొన్ని సర్వీసులు ప్రియం జీఎస్టీ ప్యానెల్ ప్రతిపాదనల ఆధారంగా జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, బ్యాంకింగ్‌లో పొందే సేవలు ఖరీదవుతాయి. ప్రస్తుతం ఈ సేవలపై 14.5 శాతం పన్ను రేటు ఉంది. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను రేటును 17-18 శాతంగా ఉంచాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ జీఎస్టీ ప్యానెల్ ప్రతిపాదించింది. అ మేరు ఈ సేవల ధరలు పెరుగుతాయి. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. 1994లో సర్వీస్ ట్యాక్స్‌ను ప్రభుత్వం ప్రవేశం పెట్టింది. అప్పుడు సర్వీస్ ట్యాక్స్ 5 శాతంగానే ఉండేది, పరిమితమైన సేవలపైనే ఈపన్ను ఉండేది. ఇప్పుడు ఇది 14 శాతానికి పెరిగింది. కొన్ని మినహాయింపులు తప్ప దాదాపు అన్ని సేవలపైనే ఈ పన్ను ఉంది. స్వచ్ఛ భారత సెస్‌ను కూడా కలుపుకుంటే ఇది 14.5 శాతానికి పెరిగింది. కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గల జీఎస్టీ కౌన్సిల్ తుది జీఎస్టీ రేట్‌ను నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు ఒప్పుకుంటాయా?... మన దేశంలో చాలా రాష్ట్రాలకు పెట్రో ఉత్పత్తులు, ఆల్కహాల్ ఉత్పత్తులపై వేస్తున్న పన్నులే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. జీఎస్టీ నుంచి వీటిని తప్పించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ సుబ్రమణ్యన్ కమిటీ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇదే జరిగితే రాష్ట్రాలు ఆదాయాన్ని గణనీయంగా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోఆల్కహాల్పై 190 శాతం వరకు పన్ను ఉంది. కానీ జీఎస్టీలో గరిష్ట పన్ను 40 శాతం మించి లేదు. మరి ఈ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవడానకి రాష్ట్రాలు సిద్ధపడతాయా అన్నది ప్రధాన సమస్య. జీఎస్టీ బిల్లు అమల్లోకి రావాలంటే 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ జీఎస్టీ అమల్లోకి వచ్చినా కొన్ని వస్తువులపై ఆయా రాష్ట్రాలు పన్నులు విధించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తే అసలు జీఎస్టీ ఉద్దేశమే దెబ్బ తింటుంది. దీంతో జీఎస్టీ అమల్లోకి వచ్చినా తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులు పొందలేరు. గతంలో వ్యాట్ అమలైన ప్పటి అనుభవాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జీఎస్టీని ప్రభుత్వాలు ఎంత నిబద్ధతతో అమలు చేస్తాయన్నది రానున్నకాలంలో తెలుస్తుంది. -
ప్రజలపై ‘స్వచ్ఛ’ భారం
అన్ని సేవలపై స్వచ్ఛభారత్ పేరిట 0.5 శాతం పన్ను ఈనెల 15 నుంచి అమలు కేంద్రానికి అదనంగా ఏటా రూ.4,000 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి నిధుల సేకరణే లక్ష్యంగా తాజాగా అన్ని సేవలపై 0.5 శాతం ‘స్వచ్ఛభారత్’ పన్నును విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కొత్త పన్ను అమల్లోకి రానుంది. పన్ను అమల్లోకి వస్తే ప్రతీ రూ.100 విలువైన సేవలపై 50 పైసలు సెస్ రూపంలో వసూలు చేస్తారు. విమాన ప్రయాణాలు, టెలిఫోన్ సేవలు, హోటల్ భోజనాలు, బ్యాంకింగ్ ఇలా ప్రతీ సేవ పైనా ‘స్వచ్ఛ భారత్’ పన్నును విధిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తగా వసూలు చేస్తున్న 14 శాతం సేవా పన్నుకు ఇది అదనం. ఈ పన్ను ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా రూ.4,000 కోట్లు కేంద్రం సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కేవలం స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్నారు. ఫిబ్రవరి 28న 2015-16 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. అవసరమైతే 2 శాతం స్వచ్ఛభారత్ సెస్ వసూలుచేస్తామని వ్యాఖ్యానించడం తెలిసిందే. స్వచ్ఛభారత్ అభియాన్ నీతి ఆయోగ్ ఉప కమిటీ కన్వీనర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నివేదికను ప్రధాని మోదీకి అందచేసిన విషయం విదితమే. ఆ నివేదికలో 2019 నాటికి దేశాన్ని స్వచ్ఛభారత్‌గా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన అంశాలను సిఫార్సుల రూపంలో కేంద్రానికి నివేదించింది. స్వచ్ఛభారత్‌కు నిధుల సమీకరణ విషయంలో కార్పొరేటు సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, చమురు సంస్థలు, ఇతరత్రాల నుంచి సెస్‌ల రూపంలో వసూలు చేయడానికి సిఫార్సులు చేసినట్టు బాబు చెప్పడం ప్రస్తావనార్హం. కానీ శుక్రవారం కేంద్రం అన్ని సేవలపై సెస్ రూపంలో ప్రజలపై భారం వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, స్వచ్ఛభారత్ సెస్ ఎలాంటి పన్ను కాదని శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదలచేసింది. స్వచ్ఛభారత్‌లో దేశ ప్రజలందరినీ భాగస్వాములను చేసే దిశలో కేంద్రం వేసిన ముందడుగు అని అభివర్ణించింది. ఈ దిశగా దేశంలో ఇప్పుడు అమలులో ఉన్న అన్ని రకాల సేవలపై స్వచ్ఛభారత్ సెస్‌గా విధిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. 2015-16 బడ్జెట్లో స్వచ్ఛభారత్‌కు సంబంధించి సెస్ వసూలకు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో సేవా పన్ను పెరగడంతోపాటు, కార్పోరేట్ సంస్థలు సెస్‌కు తగ్గట్లుగా తమ వ్యాపార ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ట్యాక్స్ పార్ట్నర్ బిపిన్ సాప్రా అభిప్రాయపడ్డారు. కొత్త సెస్‌తో భారత్‌లో వ్యాపార ఖర్చు పెరుగుతుందని డెలాయిడ్ ఇండియా సీనియర్ డెరైక్టర్ సలోని రాయ్ చెప్పారు. -
విద్యుత్ పన్నుల వాత!
- ప్రభుత్వ పరిశీలనలో కొత్త విద్యుత్ సుంకం చట్టం - ప్రస్తుతం యూనిట్‌పై 6 పైసల పన్ను - దానిని 10 నుంచి 20 పైసలకు పెంచే యోచన - ఏటా ప్రజలపై రూ. 350 కోట్ల భారం - బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే 12 శాతం వడ్డీ! - ప్రభుత్వ ఆమోదం పొందితే త్వరలోనే అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యుత్ పన్నులపై కన్నేసింది. విద్యుత్ చార్జీలతో సంబంధం లేకుండా నేరుగా విద్యుత్ వినియోగంపై పన్నును పెంచి.. దాదాపు రూ. 350 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ సుంకం చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం చట్టం ప్రకారం... ఒక్కో యూనిట్ వినియోగంపై సాధారణ వినియోగదారుల నుంచి 6 పైసలు, స్వీయ (కాప్టివ్) వినియోగదారుల నుంచి 25 పైసలు చొప్పున విద్యుత్ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. తాజాగా సాధారణ వినియోగదారులపై విధిస్తున్న విద్యుత్ సుంకాన్ని 6 పైసల నుంచి కనీసం 10 నుంచి 20 పైసల వరకు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. విద్యుత్ టారిఫ్‌పై 3 శాతం నుంచి 8 శాతం వరకు విద్యుత్ సుంకాన్ని వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థలు ఇంతకుముందే ప్రభుత్వ అనుమతి కోరాయి. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఈ పెంపు అమలులోకి రానుంది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులపై ఏటా రూ. 350 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులందరిపైనా దీని ప్రభావం పడుతుంది. అయితే సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసి స్వీయ అవసరాలకు వినియోగించుకునే కాప్టివ్ వినియోగదారులకు విద్యుత్ సుంకం యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారిపై విద్యుత్ సుంకం పెంపునకు సంబంధించిన ప్రస్తావన ప్రతిపాదనల్లో లేదు. అది రాష్ట్ర ఖజానాకు.. వినియోగదారుల నుంచి ప్రతి నెలా విద్యుత్ చార్జీలతో పాటే విద్యుత్ సుంకాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) వసూలు చేస్తున్నాయి. విద్యుత్ చార్జీలు డిస్కంలకు వెళుతుండగా... విద్యుత్ సుంకం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. విద్యుత్ సుంకాన్ని చాలా ఏళ్లుగా పెంచిన దాఖలాలు లేవని... కొన్ని దశాబ్దాలుగా యూనిట్‌పై 6 పైసల చొప్పున సుంకం కొనసాగుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో సాధారణ వినియోగదారుల నుంచి ఒక్కో యూనిట్‌పై కనీసం 10 పైసల నుంచి గరిష్టంగా 20 పైసల వరకు విద్యుత్ సుంకం విధిస్తున్నారు. ఆ తరహాలోనే రాష్ట్రంలో వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే విద్యుత్ సుంకంపై 12 శాతం వడ్డీతో కలిపి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా జరిమానాలు..: కొత్త విద్యుత్ సుంకం అమల్లోకి వస్తే విద్యుత్ వినియోగదారులపై జరిమానాలు సైతం భారీగా పెరగనున్నాయి. విద్యుత్ మీటర్లు లేకపోయినా, మీటర్లను ట్యాంపరింగ్ చేసినా కనీసం రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించడంలో జాప్యం చేస్తే రోజుకు రూ. 5 వేలదాకా అదనంగా వసూలు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆదాయం రికార్డుల్లో నమోదు కాలేదు
- నిధుల దుర్వినియోగానికి కమిషనరే బాధ్యుడు - రూ.2.50 కోట్ల అవకతవకలు - జిల్లా ఆడిట్ అధికారి సీహెచ్ వేణుగోపాల్‌రావు - తాండూరు మున్సిపల్ రికార్డు తనిఖీ - బిల్లు పుస్తకాలు అందజేయని బిల్కలెక్టర్లు తాండూరు : మున్సిపాలిటీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పూర్తి స్థాయిలో రికార్డుల్లోకి ఎక్కడం లేదని జిల్లా ఆడిట్ అధికారి సీహెచ్ వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఆడిట్ అధికారులు కే శేఖర్‌రెడ్డి, సీహెచ్ సత్యనారాయణలు తాండూరు మున్సిపాలిటీలో రికార్డులను తనిఖీ చే శారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం పూర్తిగా జమ కావడం లేదని ప్రాథమికంగా మా దృష్టికి వచ్చిందన్నారు. ఆయా పన్నుల వసూలుకు సంబంధించిన రసీదు పుస్తకాలను బిల్ కలెక్టర్లు కార్యాలయంలో అందజేయడం లేదన్నారు. నిధుల దుర్వినియోగానికి మున్సిపల్ కమిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాండూరు మున్సిపాలిటీలో బిల్కలెక్టర్లు మల్లికార్జున్, కుమార్‌లు మూడు రసీదు పుస్తకాలు నేటికీ అందజేయాలేదన్నారు. ఆయా రసీదు పుస్తకాలకు సంబంధించిన పన్ను వసూలు ద్వారా వచ్చిన ఆదాయం సర్‌చార్జితో రెండు నెలల్లో చెల్లించాలని కమిషనర్ లేఖ రాస్తామన్నారు. ఐదు శాతం దుర్వినియోగం జిల్లాలో మొదటి విడత 25 శాతం పంట రుణమాఫీలో 5 శాతం దుర్వినియోగం అయ్యిందని ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలతో జిల్లాలో పంట రుణాల మాఫీపై ఆడిట్ చేసినట్టు చెప్పారు. ఒక కుటుంబానికి రూ.1 లక్ష రుణమాఫీకి బదులు భార్యాభర్తలు, తండ్రీకొడుకులకు రుణమాఫీ అయినట్టు ఆడిట్లో తేలిందన్నారు. బోగస్ పట్టాపాసుపుస్తకాలతో కూడా రుణమాఫీ పొందినట్టు గుర్తించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 5 శాతం అనర్హులు రుణమాఫీ పొందినట్టు, రూ.2.50 కోట్ల దుర్వినియోగం అయ్యిందన్నారు. ఈ విషయంలో రెవెన్యూ, బ్యాంకర్ల పొరపాట్లు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. -
ఇక ఇళ్ల వద్దే..
విశాఖపట్నం (మర్రిపాలెం ) : ఆయా పన్నులు చెల్లించని వాహనదారులపై కొరడా రుళిపించడానికి రవాణా అధికారులు సిద్ధమయ్యారు. గతంలో రోడ్లపై తనిఖీల సమయంలో పట్టుబడినప్పుడు వాహనాలు సీజ్ చేసేవారు. ఇప్పుడు నేరుగా ఇళ్లకు వెళ్లి వాహనాలు అదుపులోకి తీసుకుంటున్నారు. దీనివల్ల రవాణా శాఖకు ఆదాయం సమకూరగా, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రవాణా వాహనాలుగా లారీలు, జీపులు, మ్యాక్సీ క్యాబ్‌లు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు ప్రతీ మూడు నెలలకు త్రైమాసిక పన్నులు చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల వాహనాలు పన్నులు చెల్లించడం లేదని రవాణా అధికారులు గ్రహించారు. ఇక నుంచి ప్రతీ 2, 3 మండలాలకు ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేయడానికి డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. టీమ్‌లు వాహన యజమాని చిరునామా ఆధారంగా వెళ్లి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ బకాయిల చెల్లింపులు పూర్తి అయ్యేవరకూ కొనసాగిస్తారు. ఆయా వాహనాల బకాయిల వివరాలు రవాణా శాఖ కార్యాలయాలు, మీ-సేవల్లో తెలుసుకోవచ్చని డీటీసీ సూచించారు. యజమానులు స్వయంగా పన్నులు చెల్లిస్తే ఎటువంటి అపరాధ రుసుం ఉండదని, తనిఖీలలో పట్టుబడితే ప్రతీ రూ.100లకు రూ. 200 ఫెనాల్టీ కట్టాలని స్పష్టం చేశారు. ఒకవేళ వాహనం వినియోగించని పక్షంలో కార్యాలయంలో దరఖాస్తు అందచేయాలన్నారు. కాలం చెల్లిన, పాత వాహనాలు తుక్కు విలువకు అమ్మితే వాహన రికార్డులు కార్యాలయంలో సమర్పించడంతో రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని తెలి పారు. అలా చేయని పక్షంలో ఆయా పన్నులు యజమాని చెల్లించాలన్నా రు. ట్రాక్టర్ తొట్టికి పన్ను చెల్లించి సహకరించాలని కోరారు. ఇంకా తని ఖీల్లో ఫిట్నెస్ లేదా పర్మిట్ లేకుంటే రూ.5 వేలు, పొల్యూషన్, డ్రైవింగ్ లెసైన్స్ లేకున్నచో రూ.2 వేలు వసూలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు గురువారం జరిపిన దాడుల్లో 74 వాహనాలు సీజ్ చేశారు. -
పన్నులు చెల్లిస్తేనే.. పనులట
అలంపూర్ : ప్రభుత్వం రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) సమస్య ప రిష్కారం దిశగా తుమ్మిళ్ల ఎత్తిపోతల ప థకం నిర్మాణానికి సన్నహాలు చేస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ.. పోరాటాల ఫలితంగా ఆర్డీఎస్ సమస్య పరిష్కారంలో ఒక కదలిక వచ్చింది. అయితే ఆర్డీఎస్ కాలువల నిర్వహణ విషయంలో కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆర్డీఎస్ రైతుల నుంచి పన్నులు వసూలు చేసి కాలువల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భా విస్తోంది. కాలువల్లో ముళ్ల పొదలు, సి ల్టు తొలగింపు పనులకై ప్రతిపాదనలు చేసినా నిధులు మంజూరు కావడం లే దు. దీంతో కాలువల నిర్వహణపై అ యోమయం నెలకొంది. ఆర్డీఎస్ పరిస్థితి ఇది....! అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, అ యిజ మండలాల్లో 87,500ఎకరాలు, క ర్ణాటక రాష్ట్ర పరిధిలోని 5879 ఎకరాల ఆయకట్టుకు ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఆనకట్ట వ ద్ద సిల్టు పేరుకుపోవడం, ఆనకట్ట ఎత్తు పెంచే పనులు అసంపూర్తిగా ఉండడం, కర్ణాటక పరిధిలో ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడం, కర్ణాటకలో నాన్‌ఆయకట్టు పెరగడం వంటి సమస్య ల కారణంగా ఆర్డీఎస్ ద్వారా కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేని పరిస్థితి నెలకొంది. 17.1 టీఎం సీల్లో కేవలం 3 నుంచి 4 టీఎంసీల నీరు మాత్రమే వస్తున్నది. ఈ నీటితో 20వేల నుంచి 30 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. నీళ్లే రావు.. పన్నుల వసూళ్లు ఎలా...? ఆర్డీఎస్ ద్వారా అందాల్సిన సాగు నీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సుమారు 35 ఏ ళ్లుగా సాగు నీరందడం లేదు. ఆర్డీఎస్ ప రిధిలోని 29వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీళ్లు రావడమే గగనంగా మారింది. ఈ ప రిస్థితితో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్లపొద లు పెరిగాయి. వర్షపు నీరు, ముళ్ల కంప, చెత్తా చెదారంతో కాలువలు అధ్వాన స్థితి చేరాయి. అనేకచోట్ల కాలువలు శిథిలమయ్యాయి. కాలువల ద్వారా సాగునీరు పుష్కలంగా అందిస్తే రైతుల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో ముళ్ల పొదలు తొలగించడం, డిస్ట్రిబ్యూటరీల వద్ద సిల్టు తొలగించడం వంటి పనులు చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం నీళ్లు అందని పరిస్థితి ఉండటంతో రైతుల నుంచి పన్నులు వసూళ్లు చేసే పరిస్థితి ఇక్కడ లేదు. కానీ ఈ విషయం మరిచిన ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో కాలువల నిర్వహణ చేపట్టాలని చెబుతుంది. కాలువల్లో సిల్టు పనులు, ముళ్ల పొదలు తొలగించడానికి పంపుతున్న ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావడం లేదని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాలువలు నిర్వహణ లేక అవి చాలావరకు కూలిపోతున్నా యి. ఇదే పరిస్థితి కొనసాగితే డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు మరింత శిథిల మయ్యే ప్రమాదం ఉండడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలు పంపాం ఆర్డీఎస్ ప్రధాన కాలువల్లో సిల్టు తొలగించే పనుల కోసం రూ.1.30 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో సిల్టు తొలగించే పనులు, ముళ్ల పొదల తొలగింపు కోసం ప్రతిపాదనలు చేసినా నిధులు మాత్రం ఇంకా మంజూరు కాలేదు. - రాజేంద్రం, ఆర్డీఎస్ ఈఈ -
గ్రీస్‌లో పన్నుల మోత
- మళ్లీ తెరుచుకున్న బ్యాంకులు... - ఏటీఎం పరిమితుల సడలింపు... ఏథెన్స్: తాజాగా తీసుకుంటున్న బెయిలవుట్ ప్యాకేజీకి ప్రతిగా రుణదాతల షరతుల ప్రకారం గ్రీస్ కఠిన సంస్కరణల అమలు, పన్నుల మోత మోగింపు మొదలుపెట్టింది. చక్కెర మొదలుకుని కండోమ్స్, ట్యాక్సీలు, దహన సంస్కారాల దాకా అన్ని రకాల వస్తువులు, సేవలపైనా పన్నులను 13% నుంచి ఏకంగా 23%కి పెంచేసింది. అయితే, ఔషధాలు, పుస్తకాలు, పత్రికలు వంటి కొన్నింటిపై మాత్రం 6.5% నుంచి 6%కి తగ్గించింది. మరోవైపు, 3 వారాలుగా మూతబడిఉన్న గ్రీస్ బ్యాంకులు మళ్లీ తెరుచుకున్నాయి. 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కాస్త సడలించి శుక్రవారం దాకా రోజుకు గరిష్టంగా 300 యూరోల దాకా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గ్రీస్ బ్యాంకుల అసోసియేషన్ హెడ్ లూకా కట్సెలీ తెలిపారు. ఆ తర్వాత నుంచి దీన్ని 420 యూరోలకు పెంచనున్నట్లు వివరించారు. విదేశీ బ్యాంకులకు నగదు బదలాయింపు, కొత్త అకౌంట్లను తెరవడంపై నిషేధం మొదలైనవి కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున విత్‌డ్రాయల్స్ చేయకుండా జూన్ 29 నుంచి బ్యాంకులను మూసివేసిన సంగతి తెలిసిందే. మూసివేత కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న గ్రీస్ ఆర్థిక వ్యవస్థకి సుమారు 3 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు రుణాల చెల్లింపును గ్రీస్ ప్రారంభించింది. తమకు రావాల్సిన 2 బిలియన్ యూరోలను గ్రీస్ చెల్లించినట్లు ఐఎంఎఫ్ తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి 7.16 బిలియన్ డాలర్ల తాత్కాలిక రుణం లభించడంతో పాత బకాయిల చెల్లింపులకు గ్రీస్‌కు వెసులుబాటు లభిస్తోంది. -
‘పాత’ లావాదేవీలపై ‘కొత్త’ పన్ను కూడదు
ఆందోళనలు అక్కర్లేదని అమెరికా ఇన్వెస్టర్లకు జైట్లీ హామీ న్యూయార్క్ : పాత లావాదేవీలపై పన్నులు విధించడానికి (రెట్రాస్పెక్టివ్ పన్ను) సంబంధించిన నిర్ణయాలు, ఆయా నిర్ణయాలు ఇన్వెస్టర్లపై కొత్త భారాలను మోపడం ఎంతమాత్రం ఆమోదనీయంకాదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆందోళన అక్కర్లేదని మంత్రి అమెరికా వ్యాపార వర్గాలు, ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ఏవో కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే.. రెట్రాస్పెక్టివ్ పన్ను భారాలు ఎంతమాత్రం ఆమోదనీయం కాదన్నది తన అభిప్రాయమని అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలు ‘రెట్రాస్పెక్టివ్’ పన్నుల గురించి తమ ఆందోళనలను జైట్లీ ముందు ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. మౌలికంపై... మౌలిక రంగంపై అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ, ఈ రంగంలో కేంద్రం భారీ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిందని అన్నారు. ఈ రంగం పురోభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పెట్రోల్,డీజిల్‌పై పన్నుల పెంపు ఇందుకు సంబంధించి వనరుల సమీకరణలో ఒకటని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల రెండేళ్లక్రితం పూర్తిగా నిలిచిపోయిన ఈ రంగం, తిరిగి పునరుత్తేజం పొందిందని అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు... కాగా వ్యవసాయ రంగంపై తక్కువమంది ఆధారపడే విధంగా.. ఈ రంగంలో సంస్కరణలు తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రంగంలో అదనంగా ఉన్న వారికి వేరొక రంగాల్లో ఉపాధి కల్పించడం ద్వారా ఈ దిశలో పురోగమించాలన్నది కేంద్రం వ్యూహమన్నారు. వ్యవసాయ రంగంపై అధిక జనాభా ఆధారపడ్డం వల్ల జీవన ప్రమాణాల మెరుగుదల విషయంలో ఒత్తిడి నెలకొన్న పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. ఆయా అంశాల్లో పురోగతి లక్ష్యంగా తీసుకువచ్చిందే... ‘తాజా భూ సేకరణ సవరణ బిల్లు’ అన్నారు. దీనిపై దేశంలో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతున్న విషయాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2013 లాండ్ లా గ్రామీణ రంగానికి ఎంతమాత్రం స్నేహపూర్వకమైనది కాదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను. గ్రామీణ రహదారులు, విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి లక్ష్యాన్ని ఇది పూర్తిగా విస్మరించిందని తెలిపారు. -
ఈ-కామర్స్‌తో రాష్ట్రాలకు ఆదాయం
రాష్ట్రాల ఆర్థికాంశాలపై ఆర్బీఐ నివేదికలో సూచన ముంబై: భారీ వేల్యుయేషన్లతో ఎదుగుతున్న ఈ-కామర్స్ సంస్థలపై రాష్ట్రాలు పన్నులు విధించవచ్చని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. తద్వారా రాష్ట్రాలు తమ ఆదాయాలను పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నియమ, నిబంధనల్లో మరింత స్పష్టత ఉండాలని అభిప్రాయపడింది. ‘రాష్ట్రాల ఆర్థికాంశాలు: 2014-15 బడ్జెట్ల అధ్యయనం’ నివేదికలో ఆర్బీఐ ఈ విషయాలు తెలిపింది. వివిధ ఈ-కామర్స్ పోర్టల్స్‌పై కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు పన్నులు విధించిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ-కామర్స్ సంస్థలపై పన్నుల విధింపు సంక్లిష్టమైన అంశమని, రాష్ట్రాలన్నీ ఒకే రీతి విధానాన్ని రూపొందించుకుంటే, అమలు సులువవుతుందని ఆర్బీఐ తెలిపింది. రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటు మెరుగుపడింది రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్ పిలుపునిచ్చింది. అధిక మూలధన కేటాయింపులపై దృష్టి సారించాలని, నిరంతరం ద్రవ్య స్థిరీకరణ ప్రయత్నాలు చేయాలని, అలాగే రుణ-జీడీపీ నిష్పత్తిని పరిమితం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-2014-15 బడ్జెట్ల పరిశీలన పేరుతో ఆర్బీఐ ఒక నివేదికను మంగళవారం వెలువరించింది. ఇటీవల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన 17 రాష్ట్రాల బడ్జెట్ డాక్యుమెంట్లు ఆధారంగా ఆర్బీఐ ఈ నివేదికను రూపొందిం చింది. 2013-14లో 2.5%గా ఉన్న రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటు గత ఆర్థిక సంవత్సరంలో 2.3 శాతానికి మెరుగుపడిందని పేర్కొంది. అలాగే స్థూల రెవెన్యూ మిగులు సున్నా శాతం నుంచి 0.4%కి పెరిగిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో ఐదు రాష్ట్రాలు రెవెన్యూ లోటు బడ్జెట్లను రూపొం దించాయని, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3 శాతం కంటే అధికంగా 10 రాష్ట్రాల్లో ఉందని ఈ నివేదిక పేర్కొంది. వసూలయ్యే పన్నులు, చేయబోయే వ్యయాలు, ఇతర ఆర్థిక అంశాలపై అంచనాల్లో వాస్తవికత మెరుగుపడే చర్యలు రాష్ట్రాలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆర్బీఐ సూచించింది. -
పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి
- జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి వికారాబాద్ రూరల్: గ్రామ పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లను జూన్ 30లోపు పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి సూచించారు. శుక్రవారం స్థానిక రవీంద్ర మండపంలో ఈఓపీఆర్డీలు, డివిజన్‌స్థాయి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్నుల వినియోగంలో అవకతవకలు జరిగితే సస్పెండ్ చేయడంతోపాటు కార్యదర్శుల నుంచి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. వసూలైన పన్నులను గ్రామాల్లో మంచినీటి సమస్యలు తీర్చేందుకు ఉపయోగించాలన్నారు. దోమ మండలంలో అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి నుంచి రూ. రెండు లక్షలు రికవరీ చేశామని, ఒకసారి అక్రమాల్లో దొరికితే ఇంక్రిమెంట్లు ఉండవని, సస్పెండ్ అవుతారని అన్నారు. మే 15 తేదీలోపు జీపీ రికార్డులను కంప్యూటర్లలో అప్లోడ్ చేయాలన్నారు. వికారాబాద్, నవాబుపేట మండలాలకు సంబంధించిన పంచాయతీ రికార్డులను కంప్యూటరీకరణ వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన యాలాల ఈఓఆర్డీపై డీపీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఈఓపీఆర్డీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ముక్కు పిండుతారిక!
సాక్షి, కడప : అభివృద్ధి పేరిట గ్రామ పంచాయతీల్లో ఎడాపెడా పన్నులు బాదేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులే కాకుండా 48 రకాల పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరులను పెంచుకుని గ్రామాలను అభివ ృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయంతోనే పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని రకాల పన్నుల వసూలుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 793 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఇళ్లు, ఆస్తి, కుళాయి పన్నులే ఆదాయ వనరులుగా ఉన్నాయి. వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక ద్వారా అదనపు ఆదాయ వనరులు ఏవిధంగా పొందాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్దారణకు వచ్చారు. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నెట్ సమస్య వెంటాడుతోంది. 48 రకాల పన్నులు! వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా ఇంటి పన్ను, ప్రకటనల పన్ను, వ్యవసాయ భూమి పన్ను, ఖాళీ స్థలానికి పన్ను, వాహనాలకు పన్ను, నీటి పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ నిర్వహణ పన్ను, ప్రయివేట్ కుళాయి పన్ను, షాపులు, వ్యాపారాలకు లెసైన్సు ఫీ, కాటా రుసుం, లే అవుట్ అప్రూవల్ ఫీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఫీ, సెల్ టవర్లకు పన్ను, కూరగాయల అంగళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కంపోస్ట్ యార్డు, పొరంబోకు ల్యాండ్స్, స్టాంప్ డ్యూటీ సర్‌ఛార్జి, ప్రొఫెషన్ ట్యాక్స్, వినోదపు పన్ను తదితర 48రకాల పన్నులు వేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులను విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకుంటారు. మున్సిపాలిటీలలో సైతం ఆదాయ మార్గాలను పెంచడానికి అధికారులు అన్వేషణ ప్రారంభించారు. కనీసం 50 శాతం ఆదాయం పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. -
సీఎస్టీ చెల్లించాకే జీఎస్టీ
ఆర్థిక మంత్రులతో సదస్సులో తెలంగాణ మంత్రి ఈటల కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశంలో తెలంగాణకు స్పెషల్ స్టేటస్, అభివృద్ధి నిధులపై చర్చ కేంద్ర వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రులతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ)ను అమలు చేయాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2016 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మొదట రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు ఇస్తే భరోసా కలుగుతుందని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో బుధవారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ అమలును స్వాగతిస్తోందని, అయితే పొగాకు ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, ఎకై్సజ్, ప్యాడీ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తోనూ ఈటల సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీ ఏపీభవన్ గురజాడ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు సీఎస్టీ బకాయి మొత్తం రూ.7,049 కోట్లు రావాల్సి ఉండగా, మొదటి విడతగా 2010-11 బకాయి రూ. 454.6 కోట్లు బుధవారం విడుదల చేసినట్టు ఈటల పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని మరో రెండు విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినా, కేంద్ర పథకాల నిధుల్లో కోత విధించడంతో తెలంగాణకు ఏటా రావాల్సిన ఆదాయానికి రూ. 2,389 కోట్లమేర గండి పడిందన్నారు. గతేడాదితో పోలిస్తే తెలంగాణకు ఈ ఏడాది కేంద్ర నుంచి వచ్చే నిధులు రూ. 4,622 కోట్లు తగ్గాయని పేర్కొన్నారు. పేదలను 1.91 కోట్లుగా గుర్తించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల ప్రకారం తెలంగాణలో పేదల సంఖ్య 1.91 కోట్లుగా గుర్తించారని, తెలంగాణలో పేదల సంఖ్య వాస్తవానికి 2.86 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ కేంద్ర నుంచి బియ్యం కోటా ఇవ్వాలని ఈటెల కేంద్ర మంత్రి పాశ్వాన్‌ను కోరారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం కోటా పెంచాలని, చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపకంలో అక్రమాలకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే రూ. 225 కోట్లు కేటాయించాలని, హమాలీ చార్జీలను పెంచాలని, పాత లెవీ విధానాన్ని అమలు చేసేలా పునరాలోచించాలని కోరారు. కేంద్ర సాయం అందేవరకు రాష్ట్ర నిధులు వాడుకోండి అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి రాధామోహ న్సింగ్ సూచించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రిని బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచామని, అప్పటి వరకు ఆ నిధులను వాడుకోవాలని ఆయన సూచించారు. త్వరలో బిల్లు తెస్తాం: జైట్లీ జీఎస్టీపై బుధవారం రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ...త్వరలోనే పార్లమెం టులో బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చిందని, అందరికీ లాభదాయకమైన ఏకీకృత జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వీలుగా రెండు, మూడు రోజుల్లో రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్టీ మూలంగా తమకు వాటిల్లే ఆదాయ నష్టానికి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పరిహారమివ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరాయి. మహారాష్ట్ర, గుజ రాత్ లాంటి రాష్ట్రాలు జీఎస్టీపై అదనంగా 2 శాతం పన్ను వేసుకునేందుకు రాష్ట్రాలకు వీలుండాలని కోరాయి. ప్రస్తుత జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రాలకు ఒక శాతం మాత్రమే అదనంగా పన్ను వేసుకునే అధికారం ఉంది. -
సం‘పన్నులు’ కట్టని ఘనులు
పెద్దల కంటే పేదలే నయం బడా బాబుల కంటే సామాన్యులు చెల్లించిందేఅధికం జీహెచ్ంఎసీ ఆస్తిపన్ను వసూళ్లలో వెలుగు చూసిన నిజం సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ అధికారుల మంత్రాలు బడాబాబుల ముందు అంతగా పని చేయలేదు. వారి ప్రయోగాలన్నీ సామాన్యులు, పేదలకే పరిమితమయ్యాయి. ఫలితంగా మొండి బకాయిదారులు అలాగే ఉండిపోయారు. సామాన్యులు ఎప్పటిలా పన్ను చెల్లింపులో ముందు వరుసలో నిలిచారు. సంపన్నుల కాలనీలు.. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఉన్న ప్రాంతాల కంటే సామాన్యులు, పేదలు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలోనే అధిక శాతం ఆస్తిపన్ను వసూలైంది. మొండి బకాయిలన్నీ బడాబాబులవేనని గుర్తించినందునే జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లకు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు. అయినా ఫలితం అంతంతే. మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను మినహాయించి ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి వసూలైన మొత్తం రూ.1079 కోట్లు. ఇందులో ఎక్కువ శాతం చెల్లించింది సామాన్యులే. ధనికులు, రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఉండే సర్కిల్-10 (ఖైరతాబాద్)లో లక్ష్యంలో 66 శాతం ఆస్తిపన్ను వసూలు కాగా, సామాన్యులు అధికంగా ఉండే మల్కాజిగిరి సర్కిల్లో 80 శాతం వసూలైంది. చిన్న సర్కిల్ అయిన రామచంద్రాపురంలో 88 శాతం వసూలైంది. వ్యాపార , వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్న సర్కిల్-9 (అబిడ్స్)లో అన్ని సర్కిళ్ల కంటే తక్కువగా వసూలైంది. అక్కడ అధికారులు ఎంత చెమటోడ్చినా.. కనాకష్టంగా లక్ష్యంలో 55 శాతం మాత్రమే వసూలైంది. దీని తరువాతి స్థానంలో సర్కిల్-5(చార్మినార్) ఉంది. అక్కడి వసూళ్ల లక్ష్యంలో 58 శాతం ఆస్తిపన్ను వసూలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో 86 శాతం వసూలైంది. జోన్ల వారీగా పరిశీలిస్తే.. సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్న వెస్ట్‌జోన్‌లో 76 శాతం వసూలు కాగా, వీఐపీలు గల సెంట్రల్‌జోన్‌లో 64 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పాతబస్తీ ఉండే సౌత్జోన్లో పన్నులు సరిగా చెల్లించరనే అపప్రధఉంది. ఈసారి ఆ జోన్లో 68 శాతం వసూలు కావడం విశేషం. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి. -
రైట్ రైట్..
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు {పైవేట్ బస్సులకు కాస్త ఊరట రోడ్డెక్కిన ప్రైవేట్ బస్సులు ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు సరుకు వాహనాలకు తప్పని పన్ను పోటు విశాఖపట్నం: తెలంగాణవైపు వాహనాలు ఎట్టకేలకు బుధవారం కదిలాయి. ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తెలంగాణలో ప్రవేశం కోసం అంతరాష్ట్ర పన్ను చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రైవేట్ బస్సులను ఆపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాహన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన ఆపరేటర్లు పన్నులు చెల్లిస్తామని హామీ పత్రాలు ఇస్తే సరిపోతుంది. ఈనెల 7న విచారణ అనంతరం పన్ను చెల్లింపుపై ప్రకటన ఉంటుందని కోర్టు తెలపడంతో బస్సుల ఆపరేటర్లు విశాఖలో బుకింగ్‌లు తెరిచారు. సరుకు వాహనాలపై ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో లారీలు, ట్రాలర్లు, ఆయిల్ ట్యాంకర్లు విశాఖ నుంచి తెలంగాణాలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపడం లేదు. విశాఖ నుంచి ఆయా ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల నుంచి వేలాది టన్నులుగా స్టీల్ ప్లాంట్ ఐరన్, ఎరువులు, బొగ్గు, పోర్టుల నుంచి ముడి సామాగ్రి తెలంగాణా జిల్లాలకు సరఫరా అవుతోంది. తెలంగాణాలోని వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు స్లాగ్, తదితర సామాగ్రి వెళ్తోంది. సరుకు రవాణా గణనీయంగా తగ్గింది. టన్ను కిరాయిలో మార్పులేకపోవడంతో పన్ను అదనపు భారంగా భావిస్తోన్న యజమానులు వాహనాలను పంపించడంలేదు. దరలు ఇలా ఉండవచ్చు... నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు, భారీ తరహా వాహనాలకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర పరిధి గల పర్మిట్లకు తెలంగాణాలోకి ప్రవేశం కోసం పర్మిట్ రుసుం చెల్లించాలి. కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.2,650 ఉండగా ఇకపై అదనంగా దాదాపు వెయ్యి రూపాయలు పెరగనుంది. లారీలకు టన్నుల సామర్థ్యం, యాక్సిల్ సంఖ్యను బట్టి కనిష్టంగా పది టన్నుల లారీకి రూ.1,500 గరిష్టంగా ఐదు యాక్సిల్ వాహనాలకు రూ.6,500 తెలంగాణాలో పన్ను విధించవచ్చు. నేషనల్ పర్మిట్ కలిగి ఉంటే రాష్ట్రంలో ప్రవేశం కోసం మెకానికల్, యూజర్, సర్వీస్ ఛార్జీలుగా రూ.500 నుంచి రూ.1,500 వసూలు చేయవచ్చు. త్రైమాసిక పన్నుల చెల్లింపు వాహనం రిజిస్ట్రేషన్ కాబడ్డ రాష్ట్రానికి పరిమితం కాగా అంతరాష్ట్ర వాహనాలకు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం సరిహద్దులలో ఛార్జీలు వసూలు చేస్తారు. ఆర్టీసీకి పెరిగిన గిరాకీ... విశాఖ నుంచి హైద్రాబాద్‌కు ప్రైవేట్ టావెల్స్ ద్వారా దాదాపు 40 సర్వీసులు నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు రాకపోకలకు వెనక్కి తగ్గడంతో మంగళ, బుధవారం ఆర్టీసీకి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం హైద్రాబాద్‌కు మూడు వాల్వో, మూడు ఐదు లగ్జరీ, సెమి లగ్జరీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆర్టీసీ నడుపుతోంది. బుధవారం అదనంగా ఒక వాల్వో, మూడు లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది. టికెట్ ధరలో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్టీసీ ప్రయాణికులను ఆహ్వానించింది. నేషనల్ పర్మిట్‌తో కాస్త ఊరట... \సరుకులతో ప్రయాణించే నేషనల్ పర్మిట్ వాహనాలకు కాస్త ఊరట లభిస్తోంది. నేషనల్ పర్మిట్ కలిగి ఉన్న వాహనాలు ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించవచ్చు. కొన్ని రాష్ట్రాలలో మెకానికల్ ఛార్జీలు నామమాత్రంగా చెల్లించి రాకపోకలు చేయవచ్చు. తెలంగాణాలో పర్మిట్ కోసం పన్నులు చెల్లించాలని ఆంక్షలు ఉండటంతో నేషనల్ పర్మిట్ గల వాహనాలను అనుమతిస్తారు. లారీ ఆపరేటర్ల ఖండన తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశం కోసం ప్రవేశపెట్టిన పన్నుల విధానం విరమించుకోవాలని ది విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీలా అప్పలరాజు, కోరుకొండ అర్జున్ డిమాండ్ చేశారు. పెరిగిన టోల్ ఛార్జీలు, వాహన పన్నులు, భీమా, ఇంధనం ధరలతో రవాణా రంగం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా తెలంగాణా ప్రభుత్వం వాహనాలకు పన్నులు విధించడం సబబుగా లేదన్నారు. వాహనాల నుంచి పన్నులు రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడాన్ని విమర్శించారు. -
ఓవర్ లోడ్
సాక్షి, చిత్తూరు: జిల్లాలో విలువైన గ్రానైట్‌ను వ్యాపారులు కొందరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో గ్రానైట్ తరలిపోతున్నా రవాణాశాఖ పట్టించుకోవడంలేదు. సుమారు 400 లారీలు గ్రానైట్‌ను రవాణా చేస్తుండగా, అందులో అధిక శాతం లారీలు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో తీసుకెళుతున్నాయి. ఆ శాఖలోని కొందరు అధికారులు లక్షల్లో నెల మామూళ్లు పుచ్చుకుంటూ గ్రానైట్ వ్యాపారులకు,ఇటు లారీ యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రానైట్ అక్రమ ఎగుమతుల పుణ్యమాని ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. పన్నుల రూపంలో ఏడాదికి సుమారు *220 కోట్లకు పైగా రావాల్సివుండగా *30 నుంచి 40 కోట్లకు మించి రావడంలేదు. చిత్తూరు రవాణాశాఖ తోపాటు గనులశాఖకు చెందిన కొందరు అధికారులు సొంత లాభం చూసుకుంటూ ప్రభుత్వాదాయం సంగతి గాలికి వదిలారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులపాటు మొక్కుబడిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు తప్పించి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంలేదు. ఒక్క రవాణాశాఖ నెల మామూళ్లు లక్షల రూపాయల్లో ఉన్నాయంటే అక్రమరవాణా ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 230కి పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లిష్ టీక్, మేఫ్లవర్, మదనపల్లె వైట్, పుంగనూరు వైట్,గ్రీన్,పీకార్గ్రీన్,వైట్‌రోజ్,చిత్తూరు ప్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు చెన్నై హార్భర్ ద్వారా ఇతర దేశాలకు నిత్యం ఎగుమతి అవుతుంది. ప్రధానంగా క్వారీల నుంచి తీసిన 270,150,100 అడుగుల పైబడిన సైజుల గ్రానైట్ రాయి మాత్రమే ఎగుమతి చేస్తారు. రోజుకు సరాసరి వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా గ్రానైట్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక ఇంతకు మించి తక్కువ సైజు గ్రానైట్ రాళ్లు కనీసం 2100 క్యూబిక్ మీటర్ల వరకూ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు (కటింగ్‌కు) తోలతారు. గనులనుండి రోజుకు సరాసరి 3100 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయి అవసరమవుతుంది.ఈ లెక్కన 330 గనుల పరిధిలో ఒక్కో గని నుంచి రోజుకు 10 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయిని తీయాల్సివుంది. రావాల్సిన రాయల్టీ: గ్రానైట్ కలర్ రాయికి సంబంధించి ఒక్క క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రాయల్టీ * 1750 లు,బ్లాక్ రాయికి * 2250 లు చెల్లించాల్సివుంది. సరాసరి క్యూబిక్ మీటరుకు * 2 వేలు వేసుకున్నా 93 వేల క్యూబిక్ మీటర్లకు నెలకు * 18 కోట్ల 60 లక్షలు రాయల్టీ వస్తుంది. ఏడాదికి * 223 కోట్లకుపైగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సివుంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం: భూగర్భ గనులశాఖ లెక్కల ప్రకారం చిత్తూరు పరిధిలోని 36 మండలాల్లో 2012-13కు గాను టార్గెట్ *10.42 కోట్లు కాగా * 11.70 కోట్లు,2013-14 కు గాను టార్గెట్ * 12.56 కోట్లు కాగా * 13.04 కోట్లు రాయల్టీ రూపంలో రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2014-15 ఏడాదికి సంబంధించి * 14.6 కోట్లు లక్ష్యంకాగా ఇప్పటివరకూ * 13 కోట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గంగవరం భూగర్భ గనులశాఖ పరిధిలోని 30 మండలాల పరిధిలోని గనులు,ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆదాయంతో కలిపినా ఏడాదికి సరాసరి * 30 కోట్లకు మించి రాయల్టీ ప్రభుత్వానికి రాలేదు. -
షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ బెటరా..?
ఇల్లు కొందామని రూ.4 లక్షలు పోగేశాను. కానీ దానిని ఏడాది పాటు వాయిదా వేశాను. ఈ సొమ్మును బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో వేద్దామనుకుంటున్నాను. కానీ మిత్రుడొకరు ఆల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచించాడు. సేవింగ్స్ ఖాతాలో అయితే 4 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని, ఈ డెట్‌ఫండ్స్‌లో అయితే అంతకంటే ఎక్కువే రాబడి వస్తుందని పేర్కొన్నాడు. అతడు చెప్పింది నిజమేనా? ఈ డెట్ఫండ్స్కు సంబంధించి ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. -ముక్తేశ్వర రావు, నిజామాబాద్. మీ మిత్రుడు చెప్పింది నిజమే. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కంటే ఆల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్స్‌లో మంచి రాబడులే వస్తాయి. స్వల్పకాలిక వడ్డీరేట్ల ప్రయోజనాలను వినియోగించుకోవడం వల్ల ఇవి మంచి రాబడులనిస్తాయి. కార్పొరేట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే వీటికి కొంత రిస్క్ లేకపోలేదు. వడ్డీరేట్లు అధికంగా ఉన్నందున గత ఏడాది కాలంలో ఈ ఫండ్స్ చెప్పుకోదగ్గ రాబడుల (9 శాతానికి పైగా)నిచ్చాయి. వడ్డీరేట్లు తగ్గితే ఈ రాబడులు తగ్గుతాయి. అయితే బ్యాంక్ సేవింగ్స్ ఖాతా రాబడుల(4 శాతం) కంటే అధికంగానే వస్తాయని చెప్పవచ్చు. ఇక పన్ను విషయానికొస్తే, సేవింగ్స్ ఖాతా నుంచి ఆర్జించిన వడ్డీలో రూ.10,000 వరకూ ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. అయితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడు సంవత్సరాల లోపు ఉపసంహరించుకుంటే ఈ ఫండ్స్ రాబడులపై పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్(10/20/30 శాతంగా)ననుసరించి ఉంటుంది. గ్రోత్ ఆప్షన్ తీసుకుంటే ఈ స్థాయి పన్ను మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే అదనంగా 28.33 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) కూడా చెల్లించాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీరేటు 4 శాతం, ఆల్ట్రాషార్ట్ టర్మ్ డెట్ ఫండ్ రాబడి 8 శాతంగా భావించి ఏడాది కాలానికి ఈ రెండు మార్గాల్లో వచ్చే రాబడుల వివరాలను కింది పట్టికలో పొందుపరిచాము. ఆదాయపు పన్ను స్లాబ్ 20 శాతంగా పరిగణించాం. నేను ఒకేసారి పెద్ద మొత్తాన్ని యాక్సిస్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రు ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఏజెంట్‌కు ఎంత మొత్తం కమీకషన్ చెల్లించాల్సి ఉంటుంది. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి పెట్టే మార్గాలేమైనా ఉన్నాయా? ఒకవేళ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)విధానాన్ని అనుసరిస్తే కంపెనీకి గానీ, ఏజెంట్‌కు గానీ ట్రయల్ కమీషన్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందా? - మనోరమ, విజయవాడ మీరు పేర్కొన్న స్కీమ్‌లకు సంబంధించి డెరైక్ట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏజెంట్లకు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సి ఉండదు. ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా సిప్ విధానంలో గానీ ఇన్వెస్ట్ చేసినా ఇది వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్సైట్ ద్వారా కానీ, మ్యూచువల్ ఫండ్ హౌస్ బ్రాంచ్ ఆఫీస్ ద్వారా గానీ ఈ డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్లకు మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి రెండు రకాలైన కమీషన్లు లభిస్తాయి. ఒకటి అప్‌ఫ్రంట్ కమిషన్. దీనిని మ్యూచువల్ ఫండ్ సంస్థ చెల్లిస్తుంది. ఇంకొకటి ట్రయల్ కమీషన్(ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోలోనే ఇది ఉంటుంది).. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో కొనసాగినంత కాలం ఇది ఏజెంట్‌కు చెల్లిస్తారు. మీరు కనుక డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి, ఎలాంటి కమీషన్లు చెల్లించాల్సి ఉండదు. ఎఫ్ఎంపీ(ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్)ల ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించితేనే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును గతంలో చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు పొందాలంటే ఎఫ్ఎంపీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం కాక మూడేళ్లపాటు కొనసాగించాలి. అయితే బడ్జెట్‌కు ముందు మెచ్యూర్ అయ్యే వాటికి పాత నిబంధనలే వర్తిస్తాయని ఆర్థిక మంత్రి గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నా ఎఫ్ఎంపీ ఇన్వెస్ట్మెంట్స్ 2014, జూలై తర్వాత మెచ్యూర్ అయ్యాయి. నేను దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేక స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను.. ఏది చెల్లించాలి? -భవానీ శంకర్, హైదరాబాద్ 2014, జూలై 10కు ముందు మెచ్యూర్ అయ్యే ఎఫ్ఎంపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పాత పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఏడాది కాలానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. 2014, జూలై 10 తర్వాత మెచ్యూర్ అయ్యే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లపాటు కొనసాగిస్తేనే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. -
ఎలక్షణాకర్ష...
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2015- 16 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్‌ను విధానసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12.30గంటలకు బడె ్జట్ ప్రసంగాన్ని ప్రారంభించి సాయంత్రం 3.30గంటలకు ముగించారు. విధానసభలో సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది పదోసారి కాగా, ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మూడోసారి. ఇక బడ్జెట్ రూపకల్పన స్వరూపాన్ని ఓ సారి పరిశీలిస్తే....త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బృహత్ బెంగళూరు మ హానగర పాలికెకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొం దించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ఎక్కువగా ఆకర్షించడంతో పాటు బీబీఎంపీ పరి దిలో పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా చిట్టా పద్దులను పొందుపరిచారు. ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా మందుబాబులు, పొగరాయుళ్లపై పన్నులు వేశారు. ఇక పెట్రోలు, డీజల్‌పై ఏకంగా ఒక శాతం పన్నును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.1,42,534 కోట్ల పరిమాణంతో బడ్జెట్‌ను రూపొం దిచారు. గత ఆర్థిక ఏడాది బడ్జెట్ (రూ.1,38,008 కోట్లు) తో పోలిస్తే ఇది 3.28 శాతం ఎక్కువ. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించక పోవడంతో ఈ ఏడాది బడ్జెట్‌కు అన్ని రంగాల నిపుణులు వందకు 50 మార్కులను వేస్తున్నారు. బడ్జెట్లో కొన్ని ప్రముఖమైన విషయాలు..... షూ భాగ్య- ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏడాదికి ఒక జత షూ, రెండు జతల సాక్సులు ఉచితంగా వితరణ పశుభాగ్య - ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం సబ్సిడీ, అదే మిగిలిన చిన్న,సన్నకారు రైతులైతే 25 శాతం సబ్సిడీ నీరా భాగ్య - కొబ్బరి రైతులకు నీరా తయారీకి అనుమతించేలా ఎక్సైజ్చట్టంలో సవరణలు సులభ నొందిని - జిల్లాలోని ఏ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలోనైనా ఆస్తులను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం రూ.15,000 కంటే తక్కువ జీతం వస్తున్న వారికి వృత్తి పన్ను నుంచి మినహాయింపు. ప్రస్తుతం అది రూ.10 వేలుగా ఉంది. మందుబాబుల జేబుకు చిల్లు - మద్యం పై ప్రస్తుతం ఉన్న 6 శాతం ఎక్సైజ్ డ్యూటీని 20 శాతానికి (17 స్లాబులకూ వర్తిస్తుంది) పెంచుతూ నిర్ణయం. పొగరాయుళ్లకు షాక్ - పొగాగు ఉత్పత్తులైన సిగరెట్, గుట్కా పై ప్రస్తుతం ఉన్న వ్యాట్‌ను 17 నుంచి 20 శాతానికి పెంచుతూ నిర్ణయం. అంకెల్లో బడ్జెట్ (రూ.కోట్లలో) బడ్జెట్ పరిమాణం - 1,42,534 ప్రణాళికేతర వ్యయం - 75,840 ప్రణాళిక వ్యయం - 72,597 రుణాల చెల్లింపులకు - 5,788 కేంద్ర పన్నుల వాట - 24,789.78 గ్రాంట్ ఇన్ ఎయిడ్ - 9,918.97 రాష్ట్ర పన్నేతర ఆదాయం - 5,206.17 రాష్ట్ర పన్నుల ద్వారా ఆదాయం - 76,445.40 రెవెన్యూ మిగులు - 911 ద్రవ్యలోటు - 20,220 రెవెన్యూ వ్యయం - 1,15,450 మొత్తం రాబడి - 1,39,476 -
పనులు చేస్తేనే పన్నులు చెల్లిస్తారు
సొంతగా వనరుల సేకరణపై దృష్టిపెట్టండి శ్వేతపత్రాలు విడుదల చేయండి ‘స్వచ్ఛ భారత్’ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ సెంట్రల్ : పనులు సరిగా చేస్తే ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సొంత వనరుల సేకరణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛ భారత్ వర్క్‌షాపును శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. ఆదాయ వనరులను ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిపుష్టికి సహకారం కోరాలని సూచించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటుందన్నారు. ఎక్కువ సౌకర్యాలు కావాలని కోరుకున్నప్పుడు పన్నుల భారాలు తప్పవని పేర్కొన్నారు. విద్యుత్, నీరు, గృహ వసతి పేదలకు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వారిని నడిపించగలిగినవాడే నిజమైన నాయకుడన్నారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థల నుంచి వెలువడే చెత్తను ఆయా సంస్థలే పరిష్కరించుకొనే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పారిశుధ్యం, చెత్త తొలగింపులో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ నుంచి కేంద్రం వ్యక్తిగత టాయ్లెట్ల నిర్మాణానికి రూ.4 వేలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,333 అందజేస్తుందని, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా రెండు శాతం సొమ్మును చెల్లించాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సొంతబిడ్డలా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు రాష్ట్ర మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఐదు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్రం అందించే రూ.4 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేలు అందిస్తోందన్నారు. పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరాయిస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ డెరైక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ వాణీమోహన్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ డెరైక్టర్ అనిమేష్ భార్తి, సెంటర్ పబ్లిక్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ జాయింట్ అడ్వయిజర్ వీకే చౌరాసియా, డెప్యూటీ సలహాదారు రోహిత్ కక్కుర్, ఉపాధ్యక్షుడు సుమన్ చహర్, రాంకీ ఎన్విరాన్ ఇంజినీర్స్ సంస్థ జాతీయ ప్రతినిధి ఆర్.మోహనరావు, 13 జిల్లాలకు చెందిన 99 మంది మున్సిపల్ కమిషనర్లు, 47 మంది మేయర్లు, చైర్పర్సన్లు హాజరయ్యారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
-
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
⇒ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ⇒ వారసుల ఆస్తులపై పన్నులు వేయటం సరికాదు ⇒ సర్కారు బలంగా ఉన్నంత మాత్రాన మేలు జరగదు ⇒ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు పనాజీ: చట్టాలను క్రమబద్ధీకరించడం, పటిష్టంగా అమలు చేయడం ద్వారా నల్లధనం కుబేరులను శిక్షించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.చట్టాలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం డీడీ కోసాంబి ఐడియాస్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా భారీ ఎత్తున బ్లాక్ మనీ మూలుగుతోందని రాజన్ పేర్కొన్నారు. విదేశాల్లో దాచుకున్న వారినే కాకుండా ఇలా దేశీయంగా దాచుకున్న నల్ల ధనం కుబేరులను కూడా పట్టుకుని, శిక్షించాలన్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం సహేతుక స్థాయిలోనే ఉన్నాయని రాజన్ తెలిపారు. వీటిని కూడా ఎగ్గొడితే పన్నుల వ్యవస్థను అవహేళన చేసినట్లేనన్నారు. ‘ప్రజలు పన్నులు కట్టేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. అప్పటికీ కట్టకపోతే అప్పుడు శిక్షించాలి. పన్నులు ఎగ్గొడితే శిక్ష తప్పదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. ఇందుకోసం పన్నుల వ్యవస్థను పటిష్టం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమని, ఇందుకోసం ప్రభుత్వం సరైన విధానాలను రూపొందించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారసత్వ ఆస్తి పన్నులు సరికాదు.. వారసత్వ ఆస్తిపై పన్నుల విధానాన్ని తప్పుపడుతూ .. ప్రభుత్వం ప్రజలను సంపన్నులుగా చేయడంపైనే దృష్టి పెట్టాలే తప్ప వారసత్వంగా సంపద దక్కించుకున్న వారిని సాధారణ స్థాయికి దిగజార్చకూడదన్నారు. అసలు ఇలాంటి పన్నులు విధిస్తే సంపద సృష్టించే వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా పోతాయన్నారు. అటు ఆర్థిక రంగ చట్టాల సంస్కరణల కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) చేసిన సిఫార్సులపైనా పరోక్షంగా ఆయన విమర్శలు సంధించారు. లెసైన్స్ పర్మిట్ జమానా నుంచి బైటపడిన దేశం తాజాగా అపీలేట్ జమానా బారిన పడకూడదన్నారు. ఆర్బీఐ సహా ఆర్థిక రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థలన్నిటీకీ ఒకే అపీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫార్సు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే సరిపోదు.. ప్రభుత్వం పటిష్టంగా ఉన్నంత మాత్రాన సరైన దిశలోనే పాలిస్తుందని ఏమీ లేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనికి నియంత హిట్లర్ ఉదంతమే నిదర్శనమన్నారు. ‘హిట్లర్ జర్మనీలో అత్యంత సమర్ధమైన పాలనే అందించాడు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ విధించినప్పుడు మన దగ్గర నడిచినట్లే.. ఆయన పాలనలో కూడా రైళ్లు సరిగ్గా సమయానికి నడిచేవి. ఆయన ప్రభుత్వం చాలా పటిష్టమైనది కూడా. కానీ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి ఆయన జర్మనీని పతనం వైపుగా నడిపించాడు’ అని రాజన్ చెప్పారు. కాబట్టి.. చిత్తశుద్ధి, నైపుణ్యం, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం గలవారే పటిష్టమైన ప్రభుత్వానికి సారథ్యం వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం వంటివి కల్పించినప్పుడే సమ్మిళిత వృద్ధిని సాధ్యమన్నారు. -
పన్నులు వేయక తప్పదు: మంత్రి నారాయణ
విజయనగరం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే పన్నులు వేయక తప్పదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 70 మున్సిపాలిటీలు అప్పుల్లో ఉన్నాయని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ రూ. 350 కోట్లు, నెల్లూరు కార్పొరేషన్ రూ. 50 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకొక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జూన్‌లో టెండర్లు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తామని, విద్యుత్‌ను పొదుపు చేసేందుకు 5,50,000 ఎల్ఈడీ బల్బ్‌లు ఇస్తామని చెప్పారు. మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల ఎన్నికలు నిలిచాయని, కేసులు వేసిన వారిని వెనక్కి తీసుకోవాలని కోరామన్నారు. -
పెరుగుతున్న నిషిద్ధ పొగాకు ఉత్పత్తుల వాడకం
సిగరెట్ల మీద పన్నులపై ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ న్యూఢిల్లీ: సిగరెట్లపై ఎంత ఎక్కువగా పన్నులు విధిస్తే.. నిషిద్ధ పొగాకు ఉత్పత్తుల వాడకం అంత ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ హెచ్చరించారు. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు భారతీయ బ్రాండ్‌కి అపార నష్టం కూడా వాటిల్లుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాబోయే బడ్జెట్లో సిగరెట్లపై పన్నులు ఒక మోస్తరు స్థాయిలోనే ఉంచగలరని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మకాలు ఒక మోస్తరుగా మాత్రమే పెరగడానికి.. ఇటు ఎక్సైజ్ సుంకాలు, అటు విలువ ఆధారిత పన్నులు పెరగడం కారణం అవుతున్నాయని దేవేశ్వర్ పేర్కొన్నారు. ఈ చర్య.. చట్టబద్ధమైన సిగరెట్ల వ్యాపార పరిశ్రమ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా మొత్తం పొగాకు పరిశ్రమ ఆదాయ అవకాశాలను కూడా దెబ్బతీస్తోందని ఆయన వివరించారు. -
'వాజ్‌పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు'
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు పొడుస్తోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయని రఘువీరారెడ్డి ఆ పార్టీలపై మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. మోదీ సర్కారు దొంగచాటుగా మూడు దఫాలుగా పన్నులు పెంచి ప్రజలను దోపిడి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు సర్కారు ప్రశ్నించకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతామనడం అన్యాయమన్నారు. -
పేరుకుపోతున్న పంచాయితీ బకాయిలు
విద్యుత్ శాఖకు పంచాయతీల బకాయిలు రూ. 92.49 కోట్లు కర్నూలు(రాజ్‌విహార్) : పంచాయతీల్లోని విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లింపు వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి అధికారులు సిద్ధం కాగా.. పల్లెల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు కూడా పన్నులు వేస్తామని సర్పంచులు తెగేసి చెబుతున్నారు. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాల విద్యుత్ నెల వారీ బిల్లులు చెల్లించకపోవడంతో పల్లెల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. మంగళవారం కర్నూలు డివిజన్ పరిధిలోని 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జిల్లాలలో పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా మంజూరు చేయడంలేదు. 13వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసుకొని బిల్లులను చెల్లించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే గ్రామ సర్పంచులు దీనికి అంగీకరించడం లేదు. కేంద్రం ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులకు ఉపయోగించబోమని, బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సర్పంచుల మధ్య నలుగుతున్న ఈ సమస్య కారణంగా బకాయిలు రూ. 92.49 కోట్లకు చేరాయి. జిల్లాలోని 918 గ్రామాల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలు (స్ట్రీల్ లైట్స్), వాటర్ వర్క్ (తాగునీటి సరఫరా)కు ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను పంచాయతీలే చెల్లించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో నెలల తరబడి బిల్లులు బకాయిపడ్డాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు బకాయిలు ఉన్న గ్రామాల్లోని వీధి దీపాలకు సరఫరా నిలిపివేయడానికి స్థానిక అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం, కోడుమూరు మండలంలోని లద్దగిరి, గోరంట్ల, కల్లూరు మండలంలోని మార్కాపురం, కొట్టాల, కర్నూలు మండలంలోని బి. తాండ్రపాడుతోపాటు సి. బెళగల్ మండలంలోని ఆరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వగ్రామం లద్దగిరిలోని వీధి దీపాలకు సరఫరా నిలపివేయడంతో చీకట్లు కమ్ముకున్నాయి. బిల్లులు చెల్లించేందుకు రెండు రోజుల గడువు గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో 12 గ్రామాల్లో సరఫరా నిలిపివేశాం. రెండు రోజులు గడువు ఇస్తున్నాం. వెంటనే స్పందించి విద్యుత్ బకాయిలు చెల్లించాలి. లేకపోతే బకాయిలు ఉన్న ప్రతి గ్రామానికి సరఫరా నిలిపివేస్తాం. - ఉమాపతి, డీఈ, కర్నూలు. -
పింఛన్ల పంపిణీ మా వల్ల కాదు!
తీవ్ర పని ఒత్తిడిలో పురపాలక శాఖ ముందే సిబ్బంది కొరత..ఉన్న వారితో ఇతరత్రా పనులు సాక్షి, హైదరాబాద్: సామాజిక పింఛన్ల పంపిణీ..పురపాలక సంస్థలకు మోయలేని ‘పని భారం’గా మారింది. ఇకపై పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదని పురపాలక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బంది పింఛన్ల పంపిణీలో నిమగ్నమైపోవడంతో పుర‘పాలన’కు సంబంధించిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతోంది. స్థానిక ప్రజల సమస్యలపై దృష్టిసారించేందుకు సైతం పురపాలక శాఖ కమిషనర్లు, ఇతర సిబ్బందికి సమయం చిక్కడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల మునిసిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నుల వసూళ్లు గతితప్పడానికి ఇవే కారణాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 2014-15 తొలి అర్ధవార్షికానికి సంబంధించిన పన్నుల వసూళ్లకు గడువు ముగిసి 9 నెలలు గడిచిపోయినా రాష్ట్రంలో 40 శాతానికి మించి పన్నులు వసూలు కాలేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపట్టిన ఆస్తి పన్నుల సవరణకు సైతం ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పటికే అన్ని మునిసిపాలిటీల్లో సవరించిన ఆస్తి పన్నుల రేట్లను ప్రకటించాల్సి ఉండగా..ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. ఇక కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉంది. వరుస అడ్డంకులే: గడిచిన ఏడాది కాలంలో వరుసగా పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. సర్వే దరఖాస్తుల కంప్యూటరీకరణ ముగిసే లోపే మళ్లీ ప్రభుత్వం ఆహార భద్రత కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఒకటి తర్వాత ఇంకొక్కటి..ఇలా వరుస కార్యక్రమాల కోసం మునిసిపల్ సిబ్బందిని వినియోగించుకోవడంతో రాష్ట్రంలో పురపాలనకు తీవ్ర విఘాతం కలిగింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆహార భద్రత కార్యక్రమం బాధ్యతల నుంచి మునిసిపల్ సిబ్బందిని తప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన కొన్ని రోజుల కింద రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషీకి లేఖ సైతం రాశారు. ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. -
పన్ను మోత
బీబీఎంపీ పరిధిలో త్వరలో అమలుకు రంగం పరిషత్‌లో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని వివిధ రకాల ఆస్తులపై పన్ను పెంచే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిషత్‌కు తెలిపారు. తద్వారా వచ్చిన నిధులతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం జరిగిన సభా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి అడిగిన ప్రశ్నకు సీఎం సిద్ధు సమాధానమిస్తూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి అనుగుణంగా నిధుల సమీకరణ కోసం పన్నుల పెంపు అనివార్యమన్నారు. చాలా ఏళ్ల నుంచి బీబీఎంపీ పరిధిలోని ఆస్తులపై పన్ను పెంచలేదని ఈ సందర్భంగా సిద్ధరామయ్య పరిషత్‌కు గుర్తు చేశారు. మరోవైపు కొన్ని ఆస్తులపై ఎక్కువపన్నులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు. మరోవైపు బీబీఎంపీ పరిధిలో 16 లక్షల ఆస్తులు ఉండగా 14 లక్షల ఆస్తుల నుంచే పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. మిగిలిన రెండు లక్షల ఆస్తుల నుంచి కూడా నిర్ధిష్ట పరిమాణంలో పన్నులు వసూలు చేయడానికి అవసరమైన ప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ప్రతి ఏడాది బీబీఎంపీ పరిధిలోని ఆస్తుల నుంచి రూ.6 వేల కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయడానికి వీలవుతుందన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ లక్ష్యానికి చేరుకోలేకపోతున్నామని సిద్ధరామయ్య వాపోయారు. ఇకపై పన్నుల వసూలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఘాటుగా స్పందించిన కుష్బు
చెన్నై : సినీ రంగంలో అనుభవంతో పాటు రాజకీయాల్లో సినీనటి కుష్బు రాటుదేలారు. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ డేరింగ్ లేడీ ఏ విషయమైనా తనకు తప్పు అనిపిస్తే వెంటనే నిర్భయంగా చెప్పేస్తారు. ఇటీవల వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలు జన జీవనానికి ప్రమాదకరంగా మారాయి. దాంతో అధికారులు రోడ్లపై తాత్కాలిక మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వ్యవహారంపై కుష్బు ఘాటుగా స్పందించారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ ''వర్షాల అనంతరం నగరాల్లోని రోడ్లను చూస్తుంటే మనం ఎందుకు పన్నులు చెల్లిస్తున్నామని... ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా గుంతలు, కోతలు, చేతికందే ఎత్తులో కరెంటు తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రజలందరూ పన్నుకడుతున్నారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'' అంటూ వ్యాఖ్యలు చేశారు. -
'చక్ర'బంధం
అనేక కారణాలతో ఆగిపోతున్న ప్రగతిరథ చక్రాలు తీవ్ర సంక్షోభంలో ఆర్టీసీ... అంతులేని నష్టాలతో దైన్యస్థితి సర్కారు నిర్లక్ష్యం, యాజమాన్యం ఉదాసీనత, తుప్పుపట్టిన విధానాలతో కుదేలు చార్జీల పెంపే మందుగా భావిస్తున్న ప్రభుత్వాలు డొక్కు బస్సులతో మూలుగుతున్న ఆర్టీసీకి చేయూత కరువు, ముక్కుపిండి పన్ను వసూళ్లు పట్టని ‘ప్రైవేటు’ ఆగడాలు, నిర్వహణ లోపాలు గతేడాది ఇంధన వ్యయమే రూ. 2,368 కోట్లు, ఏటా రూ. 400 కోట్లు అధికం అప్పులు రూ. 4,730 కోట్లు, ఈ ఏడాదిలో మరో వెయ్యి కోట్లు అదనం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టని అధికారులు గౌరీభట్ల నరసింహమూర్తి, సాక్షి ప్రతినిధి ప్రగతి రథ చక్రాలుగా పేర్కొనే ఆర్టీసీ బస్సు ఇక నడవలేనంటూ మొరాయిస్తోంది. అంతులేని నష్టాలను మూటగట్టుకుంటూ అంపశయ్యపైకి చేరుకుంటోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఈ దుస్థితికి కారణాలెన్నో..! చార్జీల పెంపు తప్ప మరే ప్రత్యామ్నాయమూ ఆలోచించని యాజమాన్యం, కాలం చెల్లిన నిర్వహణా విధానాలు, సర్కారు నిర్లక్ష్య వైఖరి వంటి అనేకానేక కారణాలతో ఆర్టీసీ నానాటికీ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. సిబ్బందికి జీతాలివ్వలేక వారి పీఎఫ్ సొమ్మునూ వాడేసుకుంటున్న దైన్యం, పదవీ విరమణ చేసినవారికీ సొమ్ము చెల్లించలేని వైనం రవాణా సంస్థ దుస్థితికి తార్కాణం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నష్టాలు కొండలా పేరుకుపోవడంతో ప్రయాణికులపై మరింతగా చార్జీల భారాన్ని మోపకతప్పని పరిస్థితి నెలకొంది. మరి ఇందుకు కారణాలేంటి? కారకులెవరు? గట్టెక్కడానికి మార్గాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం... వెయ్యి కోట్లు తన్నుకుపోతున్న ‘ప్రైవేటు’ కొన్ని నెలల క్రితం లారీ డ్రైవర్లు సమ్మె చేసినప్పుడు ఒక్కసారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. అది ఎంతో తెలుసా?!.. రోజుకు రూ. కోటి. అంటే కేవలం లారీల్లో ప్రయాణికులు తరలుతున్నందున నిత్యం రూ. కోటి చొప్పున ఆదాయం చేజారుతోందన్న మాట! మరి అదే నియంత్రణ లేని ప్రైవేటు బస్సులతో ఎంత ఆదాయం కోల్పోతోంది? దీనిపై ఆర్టీసీ సొంతంగా చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రైవేటు వాహనాలను నియంత్రించి, నిబంధనలను సరిగా అమలు చేస్తే సంస్థకు ఏటా అదనంగా సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఆర్టీసీలో నష్టాల మాటే ఉండదన్నమాట! తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఆర్టీసీ అంపశయ్యపైకి చేరినా రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులను ఎందుకు నియంత్రించలేకపోతున్నారనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. ‘చమురు’ ఇలా వదులుతోంది గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ కోసం ఆర్టీసీ చేసిన వ్యయం అక్షరాలా రూ. 2368 కోట్లు. ఇది అంతకుముందు ఏడాది కంటే దాదాపు రూ. 400 కోట్లు అధికం. ప్రతినెలా డీజిల్‌పై అర్థ రూపాయి చొప్పున పెరుగుతూ రావడంతో ఈ అదనపు భారం పడింది. ఏటా పెరిగే ఆదాయం కంటే ఈ ఇంధన భారమే అధికంగా ఉంటోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లభించడం లేదు. తమిళనాడులో లీటర్ డీజిల్‌కు అక్కడి ఆర్టీసీ చేస్తున్న వ్యయం 45 రూపాయలే. మిగతా మొత్తాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇక విమానాలకు వాడే ఇంధనంపై ప్రస్తుతం వ్యాట్ 4 శాతమే ఉండగా... ఆర్టీసీ వాడే డీజిల్‌పై మాత్రం 22 శాతం ఉంది. వ్యాట్ భారమే ఏటా రూ. 80 కోట్ల వరకు ఉంటోంది. దీన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ వచ్చింది. ఇక ఆర్టీసీ ఖర్చుల్లో డీజిల్ ఖాతా అతిపెద్దది. ఇందులో ఎంత పొదుపు చేస్తే.. నష్టాలు అంత తగ్గుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధం. గుజరాత్ ఆర్టీసీలో 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తుక్కు కింద అమ్మేస్తున్నారు. కానీ మన ఆర్టీసీలో 12 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగేవరకు అవే బస్సులతో ఈడ్చుకొస్తున్నారు. దీంతో ఫిట్నెస్ సరిగా లేక అవి విపరీతంగా డీజిల్ తాగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి బస్సులు 8 వేల వరకు ఉంటాయని అంచనా. సాధారణంగా వంద లీటర్ల డీజిల్‌కు 600 కిలోమీటర్లు తిరగాల్సిన ఈ బస్సులు.. ఇప్పుడు అంతే దూరానికి మరో 15 లీటర్లను ఎక్కువగా తాగుతున్నాయి. దీంతో డీజిల్ ఖర్చు భారీగా పెరుగుతోంది. విడి భాగాలు కూడా తరచూ మార్చాల్సి రావడం మరో నష్టం. ఇంజిన్ ఆయిల్ లీకేజీ సమస్యలూ అధికమే. నాణ్యత లేని పరికరాలు ఆర్టీసీ గ్యారేజీకి సరఫరా అవుతున్న పరికరాల్లో కొన్ని ఏమాత్రం నాణ్యత లేనివి ఉంటున్నాయి. బిగించిన కొద్ది రోజులకే ఆ పరికరాలు పాడైపోతుండటంతో నిర్వహణ వ్యయం పెరుగుతోంది. పైగా కొన్ని కంపెనీలు తమ కొత్త పరికరాలను ఆర్టీసీపైనే ప్రయోగిస్తూ నష్టాన్ని పెంచుతున్నాయి. మొత్తం ఖర్చులో పరికరాల వాటా 20 శాతం వరకు ఉంటుందని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 50 కోట్లన్నమాట. వాహన పన్ను తడిసి మోపెడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆటోలకు వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్)ను రద్దు చేసింది. కానీ ఆర్టీసీ నుంచి మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తోంది. తాజా సంవత్సరానికి ఈ పన్ను రూపంలో సంస్థపై పడిన భారం రూ. 453 కోట్లు. ఇటీవల ఉద్యమ సమయంలో మాత్రం రెండు దఫాలుగా ఈ పన్ను నుంచి మనహాయింపు లభించింది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండు పెండింగులోనే ఉంది. కర్ణాటకలో ఆర్డినరీ బస్సుల ట్యాక్సును ప్రభుత్వమే భరిస్తోంది. గతంలో ప్రైవేటు వాహనాల తరహాలో ప్రతి మూడు నెలలకు ఒక్కో సీటుపై నిర్ధారిత మొత్తం పన్ను ఉండేది. సంస్కరణ చర్యల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. లాభాలపై నిర్ధారిత శాతాన్ని వాహన పన్నుగా వసూలు చేసే విధానాన్ని ప్రారంభించారు. ఆర్డినరీ బస్సుల రాబడిపై 15 శాతం, ఎక్స్‌ప్రెస్ ఆపై కేటగిరీ బస్సులపై 20 శాతం విధించి పెద్ద భారం మోపారు. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక వాటిని 7, 12 శాతాలకు తగ్గించారు. దాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉండగానే ఆయన మృతిచెందారు. సమన్వయ లోపంతో పేచీలు, సమ్మెలు ఆర్టీసీ అధికారులు-కార్మికుల మధ్య సఖ్యత లేక తరచూ చిన్న చిన్న సమ్మెలకు దారితీస్తోంది. డ్యూటీలు వేస్తున్న తీరు, ఓఆర్‌పై నిలదీయడం, బస్సుల కండిషన్ తదితర అంశాలపై రెండు వర్గాల మధ్య అగాథం పెరిగి వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో రీజియన్ల పరిధిలోనే ఎక్కడికక్కడ తాత్కాలిక సమ్మెలు జరుగుతున్నాయి. సంవత్సంలో ఇలాంటివి వంద వరకు ఉంటాయని అంచనా. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. సరుకు రవాణాపై దృష్టి పెడితే... నిత్యం ఆర్టీసీ బస్సులు కొన్ని రకాల సరుకులను రవాణా చేస్తుంటాయి. వ్యాపారులు ప్రత్యేకంగా బుక్ చేసుకుని వాటిని తరలిస్తుంటారు. ఈ మొత్తం లావాదేవీలను ఓ ప్రైవేటు సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ రూపంలో ఆర్టీసీకి సంవత్సరానికి వచ్చే ఆదాయం రూ. 10 కోట్లు మాత్రమే. కానీ ప్రైవేటు సంస్థతో సంబంధం లేకుండా సొంతంగా ఆర్టీసీనే దీన్ని భారీ ఎత్తున నిర్వహిస్తే ఏటా రూ. 300 - 400 కోట్ల వరకు ఆదాయం పొందే వీలుంటుందని అంచనా. కార్మిక సంఘాలు చాలాకాలంగా ఇందుకు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మాత్రం ఈ దిశగా అడుగులేయడం లేదు. రైల్వే శాఖ తన ఆదాయంలో మూడొంతులకుపైగా సరుకు రవాణా ద్వారానే పొందుతోంది. ఆర్టీసీ కూడా అదే బాట పడితే అద్భుతరీతిలో లాభాలు పొందవచ్చని నిపుణలు గతంలోనే తేల్చారు. ప్రస్తుతమున్న కాలం చెల్లిన బస్సులనే ఇందుకు వినియోగించుకోవచ్చునని వారు చెబుతున్నారు. ఆస్తులను సద్వినియోగం చేసుకుంటే... ఆర్టీసీకి ఉమ్మడి రాష్ర్టంలో రూ. 60 వేల కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో భవనాల వాటా 20 శాతం. మిగతా ఖాళీ స్థలాల్లో వాణిజ్యపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తే అప్పనంగా ఆదాయం వచ్చిపడుతుంది. దీనిముందు అప్పులు బలాదూరే! కానీ ఈ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగూ పడలేదు. గుజరాత్ ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు రూ. 500 కోట్లను అక్కడి ఆర్టీసీకి ఏటా కేటాయిస్తోంది. గత రెండు బడ్జెట్లలో రూ. 200 కోట్లు చొప్పున ఇవ్వటం మినహా ఆ తరహా చేయూత మన ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ బ్యాంకుల నుంచి లోన్లు మాత్రం ఇప్పిస్తోంది. కానీ ఆ నిధులు చాలడం లేదు. నడ్డి విరుస్తున్న వడ్డీ ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు రూ. 4730 కోట్లకు చేరాయి. దీనిపై చెల్లిస్తున్న వడ్డీనే అక్షరాలా రోజుకి రూ. కోటిన్నర! అంటే సంస్థ ఆదాయమంతా వడ్డీలకే చాలనప్పుడు ఇక అసలు అప్పు కరిగేదెన్నడో..? ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మూటగట్టుకున్న నష్టాలు రూ. 902 కోట్లు కాగా.. ఈసారి తొలి నాలుగు నెలల నష్టాలే రూ. 450 కోట్లుగా ఉంది. దీన్ని ఇప్పట్లో చ క్కదిద్దే పరిస్థితి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. ఈ ఏడాది నష్టం వెయ్యి కోట్లు దాటుతుందని ముందస్తుగానే నివేదించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆశ్రయించింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలోని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్’ తాజా సంచికలో చెప్పిన వివరాలు(తొలి ఆరు నెలల కాలానికి) -
పన్నులు లేకుండా పనులు కావు: వెంకయ్య
పన్నులు లేకుండా పనులు జరగవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తే, వాళ్లు పన్నులను సక్రమంగా చెల్లిస్తారని, అదే సరైన ఆలోచనలు చేయకపోతే మాత్రం దేశాభివృద్ధి సాధ్యం కాదని ఆయన చెప్పారు. అలాగే బ్యాంకు ఖాతాలు లేనివారిని ఆర్థిక అంటరానివారని నేరుగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగే చెప్పారని గుర్తుచేశారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మాట్లాడుతూ వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఇంటర్నేషనల్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?
నేను మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఏడాది బడ్జెట్లో ఈ తరహా ఫండ్స్‌కు సంబంధించి పన్ను విధి విధానాలు మారాయని మిత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించమంటారా? వద్దంటారా? లేకుంటే ఈ ఫండ్ నుంచి పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌కు మళ్లించమంటారా? - లోకేశ్, జగిత్యాల మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్ అనేది అంతర్జాతీయ ఫండ్. ఈ తరహా అంతర్జాతీయ ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమనిబంధనల్లో మార్పు, చేర్పులు చేస్తూ బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఫండ్స్‌ను ఇప్పుడు డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ ఫండ్ నుంచి మీరు మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా మూడేళ్లలోపు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు పొందే లాభాలపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ప్రతిపాదనల దృష్ట్యా ఇలాంటి ఫండ్స్‌కు ఆదరణ తగ్గుతోంది. అయినప్పటికీ, మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ కిందనే పరిగణించవచ్చు. అమెరికాలో ఉండి, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లోనే ఈ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఫండ్ నుంచి బాగానే ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనీసం మూడేళ్లు ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనాలు పొందగలం. ఈ దృష్ట్యా చూస్తే పన్ను నిబంధనల ప్రభావం ఉండదు. నిరభ్యతరంగా ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. నా మిత్రుడు ఇటీవల ఒక యులిప్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు యులిప్స్ల సరళి మారిందని, ఇన్వెస్ట్ చేయమని నాకు కూడా సలహా ఇచ్చాడు. ఒక వేళ చేస్తే ఎంత కాలం వరకూ ఇన్వెస్ట్ చేయాలి? - పవన్, గుంటూరు మీ మిత్రుడు చెప్పింది కొంతవరకూ నిజమే. 2010 సెప్టెంబర్ తర్వాత వచ్చిన యులిప్‌లు అంతకు ముందటి యులిప్‌లతో పోల్చితే కొంచెం నయమే. కానీ అవి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ ఫండ్స్ కావని చెప్పవచ్చు. వీటి ట్రాక్ రికార్డ్‌ను అంచనా వేయడం కష్టం. అంతేకాకుండా యులిప్‌లో లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంత పారదర్శకంగా యులిప్‌లు పనిచేయవు. బీమా, ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండిటిని వేర్వేరుగా చూడాలని మేం ఎప్పుడూ చెబుతుంటాం. యూలిప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు బదులుగా ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ముందుగా ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్లను పరిశీలించవచ్చు. ఆ తర్వాత మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి, మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఇతర మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే వివిధ సంస్థల టర్మ్ ప్లాన్ల కవరేజ్ ఒకే విధంగా ఉన్నా, ప్రీమియమ్‌ల్లో మాత్రం చాలా మార్పులు ఉన్నాయి. 70-80 శాతం వరకూ తేడాలున్నాయి. ఇలా ఎందుకు ఉంటోంది ? నేను రిలయన్స్, అవైవా, ఏఎక్స్ఏ, ఎస్బీఐ లైఫ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి? - సుజాత, విజయనగరం టర్మ్ ప్లాన్స్‌కు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే బీమా చేసిన మొత్తాన్ని చెల్లించడం. ఇక వివిధ కంపెనీలు వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని ప్రీమియమ్‌లను నిర్ణయిస్తుంటాయి. అందుకనే ఒక్కో సంస్థకు 70-80% వరకూ తేడా ఉండడం సాధారణమే. గతంలో బీమా కంపెనీ చెల్లించిన క్లెయిమ్‌లు, వసూలు చేసే ప్రీమియం.. ఈ రెండు అంశాల ఆధారంగా టర్మ్ ప్లాన్లు తీసుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, దిగువ సంస్థల టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవెల్ కవర్.. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ పాలసీలు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించే ప్రీమియం, మీ బడ్జెట్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన టర్మ్ప్లాన్ను ఎంచుకోండి. -
పన్నుల బాదుడేనా?
పురపాలక సంఘాలకు గ్రీన్ సిగ్నల్ పాలక వర్గాలు సమాయత్తం మౌలిక వసతుల కోసమేనంటున్న వైనం 10శాతానికి మించకూడదంటున్న ప్రజానీకం మచిలీపట్నం : జిల్లాలోని పురపాలక సంఘాల్లో పన్నుల పెంపుదలకు రంగం సిద్ధమవుతోంది. పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలంటే పురపాలక సంఘాల ఆదాయాన్ని పెంచుకోవాల్సిందేననే వాదన పాలకవర్గాల నుంచి వినిపిస్తోంది. వీరి వాదనకు ప్రభుత్వం వంతపాడుతుండటంతో పురపాలక సంఘాల్లో పన్నులు పెంచే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. పది సంవత్సరాలుగా పురపాలక సంఘాల్లో పన్నులు పెంచలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పురపాలక సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే పద్ధతి అమల్లోకి వచ్చింది. దీంతో పురపాలక సంఘాలకు ఆర్థిక వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలో అప్పట్లో పురపాలక సంఘాల్లో పన్నులు పెంచలేదు. జిల్లాలో మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాలున్నాయి. తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీలకు ఇటీవలనే ఎన్నికలు జరిగి మొదటిసారిగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పురపాలక సంఘాలకు నిధులు విడుదల చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్థానికంగానే పన్నులు పెంచి వసూలు చేసుకుని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా చెబుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక జీవో ఏమీ విడుదల చేయనప్పటికీ మౌఖికంగా ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం పన్నుల పెంపుదల ఎంత శాతం ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఏడాది పదిశాతానికి మించకుండా పన్నులు పెంచితే ప్రజలపై ఒకేసారి భారం పడదనే వాదన వినబడుతోంది. జరుగుతున్నది ఇదీ పురపాలక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు విడుదల చేస్తాయి. ఈ నిధులు పురపాలక సంఘాలకు చేరి పనులు పూర్తి చేయాలంటే ఏడాదికి పైగా సమయం పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వినియోగంపై పురపాలక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకపోటవడంతో కొన్ని నిధులు వెనక్కి మళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు పాలకవర్గాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పురపాలక సంఘాల్లో సక్రమంగా పనులు జరగని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టాలంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో వివరించాల్సిన అవసరం ఉంది. అయితే పాలకవర్గ సభ్యుల మధ్య నెలకొన్న వైషమ్యాలు ఈ నిధుల విడుదలకు అడ్డంపడుతోంది. పన్నులు పెరిగేది వీటికే... మచిలీపట్నం పురపాలక సంఘంలో 1.75 లక్షల మంది జనాభా ఉన్నారు. ఏడాదికి ఆదాయం రూ. 8 కోట్లుగా ఉంది. నూజివీడు పురపాలక సంఘంలో రూ. 60వేలు జనాభా ఉండగా రూ. 1.70 కోట్లు ఆదాయంగా ఉంది. నందిగామ పురపాలక సంఘంలో 50వేల మంది జనాభా ఉండగా రూ. 2 కోట్లు ఆదాయంగా ఉంది. పెడనలో 33వేల మంది జనాభా ఉండగా కోటి రూపాయలు ఆదాయం ఉంది. ఉయ్యూరు 50వేల మంది జనాభా ఉండగా రూ. 1.20 కోట్లు ఆదాయంగా ఉంది. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో 52 వేల మంది జనాభా ఉండగా రూ. 1.30 కోట్లు ఆదాయంగా ఉంది. గుడివాడ పురపాలక సంఘంలో 1.13 లక్షల మంది జనాభా ఉండగా రూ. 2.50 కోట్లు ఆదాయంగా ఉంది. పురపాలక సంఘాల్లో ఇంటి పన్నులు, ఆయా పురపాలక సంఘాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, కుళాయి పన్నులు, ఖాళీస్థలాలపై, ఆస్తి, ఆశీలు వసూలు, ప్రచార హోర్డింగ్‌లు, వివిధ దుకాణాలపై లెసైన్సుల రూపంలో పన్నులు వేస్తారు. వీటన్నింటికి పన్నులు 100 శాతం నుంచి 200శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్దస్థాయిలో పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయం పాలకవర్గాలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం ఒకేసారి మోపకుండా ఏడాదికి 10 నుంచి 20శాతానికి పెంచుతూ ఐదేళ్లలో 100శాతం చేయాలనే తలంపులో పాలకవర్గాలు ఉన్నట్లు సమాచారం. పన్నులు పెంచినా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు వసతులు కల్పించటంలో సక్రమంగా వినియోగిస్తేనే ఉపయోగం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పురపాలక సంఘాల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సమస్య, తాగునీటి పైప్లైన్లు, డంపింగ్‌యార్డులు, డ్రెయినేజీ సమ స్య, వీధిదీపాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఏ మేరకు మౌలిక వసతులు కల్పిస్తారో చూడాల్సిందే. -
పడకేసిన పాలన
విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్: కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. గ్రామాల్లో అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. పంచాయతీకి నిధులు అరకొరగా రావడం.. పన్నుల వసూళ్లు సక్రమంగా జరగకపోవడం.. ఆదాయ వనరులు లేకపోవడం.. కారణంగా గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. పంచాయతీల్లో చిల్లిగవ్వ లేక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. మౌలిక సదుపాయల కల్పన పనులు ఏ విధంగా చేపట్టాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. రెండేళ్ల పాటు ప్రత్యేక పాలనలో మగ్గిన పంచాయతీల్లో గతేడాది ఆగస్టు 2న కొత్త సర్పంచ్‌లు కొలువుతీరారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పన్నుల ద్వారా వచ్చే ఆర్థిక వనరులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్‌లు భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడం.. ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు ఇవ్వకపోవడం.. పన్నులు వసూళ్లు మందగించడంతో గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. పంచాయతీల్లో నిధుల లేమి! గ్రామాల్లో అభివృద్ధి పనులకు అరకొరగా నిధులు మంజూరవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.1.34 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. తలసరి గ్రాంటుగా రూ.15.34 లక్షలు, వృత్తిపన్ను కింద రూ.55.64 లక్షలు, 13వ ఆర్థిక సంఘ నిధులు రూ. 4.32కోట్లు గతంలో మంజూరయ్యాయి. వీటితో పాటు రూ. 1.69లక్షలు సర్పంచ్ల జీత భత్యాలు కింద వచ్చాయి. దీర్ఘకాలంలో అభివృద్ధిదూరంగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. పన్నుల వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. దీంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఏజెన్సీలోని పంచాయతీల పరిస్థితి మరిరీ దయనీయం. ఒకటి, రెండు శాతం పన్నులు వ సూలుకావడమే గగనమవుతోంది. పేరుకు పోతున్న పన్ను బకాయిలు జిల్లాలో 925 పంచాయతీలకు 410 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరికీ రెండు, మూడు పంచాయతీలను అప్పగించారు. ఫలితంగా వన్నుల వసూళ్లు మందగించాయి. వసూలు కావాల్సిన వాటి కంటే పాత బకాయిలు అధికంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా పన్నుల బకాయిలు రూ.14.24 కోట్లు ఉండగా, 2013-14కు సంబంధించి రూ.11.23 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. దీని ప్రకారం ప్రతీ ఏటా కనీసం 30 శాతం కూడా పన్నుల రాకపోవడంతో ఎరియర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఎరియర్స్ రూ.14.24 కోట్లకు గాను గతేడాది డిసెంబర్ వరకు రూ.5.06 కోట్లు వసూలైంది. ఇంకా రూ.9.17 కోట్లు రావాల్సి ఉంది. ఈఏడాదితో కలిపి మొత్తం రూ.17.17 కోట్లు బకాయిలు ఉన్నాయి. పాలకవర్గాలకు అన్నీ సవాళ్లే సర్పంచ్‌లుగా కొలువు తీరిన నాటి నుంచి వారిని వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. ఖజానా కూడా మూతపడడంతో నిధులు ఖర్చుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత వరుసగా ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో ఎన్నికల కోడ్ ఒకవైపు, నిధుల ఫ్రీజింగ్ మరోవైపు ఉండడంతో ఉన్న కాస్త నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో పగ్గాలు చేపట్టిన కొత్త పాలకవర్గాలకు నిరాశే మిగిలింది. -
నగర పంచాయతీల్లో పన్నుల మోత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కొత్త ప్రభుత్వం మార్గాలు అన్వేషిస్తోంది. వీటి పరిధిలో ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల మోత మోగించాలని నిర్ణయించింది. ఆయా పురపాలక సంఘాల్లో అభివృద్ధికయ్యే నిధులను స్థానికంగా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పన్నుల వడ్డనకు ప్రతిపాద నలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీల ప్రజలపై పన్నుల భారం పడనుంది. ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను సహా పలు కేటగిరీల టాక్సులపై ప్రతిపాదనలు పంపాలని నగర పంచాయతీల కమిషనర్లకు రాష్ట్ర పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పన్నుల పెంపుపై పురపాలికల యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. నాలుగు నగర పంచాయతీల పరిధిలో సాలీనా రూ.10 కోట్ల ఆదాయం రాకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పన్ను అసెస్మెంట్ పరిధిలోకి రాని కట్టడాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. భారమే.. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలుగా ఉండి... ఇటీవల నగర పంచాయతీలుగా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజలపై వివిధ రకాల పన్నుల మోత మోగనుంది. కేవలం ఒకట్రెండు పన్నులు చెల్లింపుతో మమ అనిపించే స్థానికులు ఇకపై అనేక రూపాల్లో పన్నులు చెల్లించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను తదితరాల మదింపుపై పురపాలక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు. ఈ నేపథ్యంలో అన్ అసెస్డ్ ప్రాపర్టీలను గుర్తించడం ద్వారా రాబడి పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అంతే కాకుండా పన్నుల నిర్ధారణలో హేతుబద్ధత పాటించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించిన క్రమంలో... ప్రతి ఇంటి నీ సర్వే చేయాలని నిర్ణయించింది. పంచాయతీలతో పోలిస్తే నివాస గృహాలపై ఆస్తిపన్ను భారం రెట్టింపు కానుంది. అదేసమయంలో వాణిజ్య భవనాల టాక్సులు గణనీయంగా పెరిగే అవకాశముంది. పంచాయతీలతో పోలిస్తే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు అడ్డగోలుగా పెరిగాయని ఆందోళనతో ఉన్న స్థానికులకు తాజా ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల పెంపే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. -
వేతన జీవులకు పెద్దగా ఒరిగేదేం లేదు!
-
కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్ను విధానమిదే!
-
హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రా అభివృద్ధా?
సాక్షి, విశాఖపట్నం:‘హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేస్తామంటే జరిగేపని కాదు.. హైదరాబాద్ ఇడ్లీలు తిని, అక్కడి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం తప్ప! ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా.. ఆ ఛాయలేం కనిపించట్లేద’ని విశాఖ ఎంపీ కంభంపాటి హరి బాబు ఆక్షేపించారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. -
ముందున్నది మొసళ్ల పండగే: జైట్లీ
ముందున్నది మొసళ్ల పండగేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్లో వాతలు తప్పకపోవచ్చని ఆర్థికవేత్తలు ముందునుంచి వేస్తున్న అంచనాలను నిజం చేసేలాగే ఆయన మాటలు ఉంటున్నాయి. భారతదేశానికి ఆర్థిక క్రమశిక్షణ కావాలో.. లేదా ప్రజాకర్షక పథకాల మీద అర్థం పర్థం లేని వ్యయం కావాలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. మన వృద్ధిరేటు ఇప్పటికే మందగమనంలో ఉందని, ద్రవ్యలోటు కూడా చాలా ఎక్కువగా ఉందని, గత రెండేళ్లతో పోలిస్తే ద్రవ్యోల్బణం కాస్త తక్కువగానే ఉన్నా.. ఇప్పటికీ అది ఆమోదయోగ్యమైన స్థాయి కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. మనముందు అనేక సవాళ్లున్నాయని, రుతుపవనాలు ఆశాజనకంగా లేవని, ఇరాక్ ప్రభావంతో చమురు ధరలు మండుతున్నాయని కూడా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్థం పర్థం లేకుండా ప్రజాకర్షక పథకాల మీదే ఎక్కువగా దృష్టి పెడితే ఖజానా మీద భారం పెరిగిపోతుందని, అందువల్ల ఆర్థికమంత్రి ఎక్కువ పన్నులు విధిస్తారనే ఆశించాలని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టే రాబోయే కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. -
కింగ్‌ఫిషర్ వల్లే చెడ్డపేరు
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు విజయనగరం: కింగ్‌ఫిషర్ సంస్థ వల్లే విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చెప్పారు. విజయనగరంలో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కింగ్‌ఫిషర్ సంస్థ పన్నులు కట్టకపోవడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నారు. సీమాంధ్ర లో విమానయాన అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఉన్న విమానాశ్రాయాల అభివృద్ధికి కృషిచేస్తామని, పాతవి తొలగించే ఆలోచన లేదని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే క హోదా కల్పించాలని కోరుతున్నామన్నారు. యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని, దాన్ని 15 ఏళ్లకు పొడిగించాలని తమపార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. బంధుప్రీతిపై మంత్రి గరం! న్యూఢిల్లీ: విమానయూన రంగంలో.. ఆ రంగానికి చెందిన పలువురు అధికారుల బంధువుల ఉద్యోగితపై మంత్రి అశోక్ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఎరుుర్ ఇండియూ, భారత విమానాశ్రయూల సంస్థ (ఏఏఐ) పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్, విమానాశ్రయూల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ), ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బంధువుల వివరాలను తెలియజేయూల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. -
రాజభవనమేంటీ, ఇదీ సత్రమే
జెన్ పథం ఆ రాజుకి భవనాలు కట్టించడంలో మక్కువెక్కువ. ఆయన ఎన్నో భవనాలు కట్టించాడు. అవన్నీ విలాసవంతమైనవీ, విశాలమైనవీనూ. కానీ మరోవైపు ఈ కట్టడాల వల్లఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. దాంతో ఆయన ఖజానా నింపడం కోసం ప్రజలపై కొత్త కొత్త పన్నులు వేయడం మొదలుపెట్టాడు. జనం వాటిని కట్టలేక అవస్థలు పడుతూ వచ్చారు. ఆకలి బాధలు ఎక్కువయ్యాయి. కడుపునిండా తిండి లేక ప్రజలు మాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరుణంలో రాజ్యంలోని ఒక వీధి గుండా ఒక సాధువు నడుచుకుంటూ పోతున్నాడు. అక్కడక్కడ ప్రజలు తమ ఇక్కట్ల గురించి మాట్లాడుకోవడం ఆయన చెవిన పడింది. ఆయన మనసులో ఏ ఆలోచన వచ్చిందో గానీ ఆయన ప్రయాణ దిశ మారింది. పొరుగూరుకు వెళ్లాలనుకున్న ఆయన తిన్నగా రాజుగారి ఆస్థానానికి అడుగులు వేశారు. సాధువు రూపం చూసీచూడగానే గౌరవించేటట్టు ఉంది. ఆయన రాజుగారి భవంతికి చేరుకున్నారు. ప్రవేశద్వారం వద్ద ఉన్న భటులు ఆయనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుపడలేదు. ఆయన ఎవరని కూడా అడగలేదు. సాధువు సరాసరి రాజుగారి భవనంలోకి అడుగుపెట్టారు. ఆయన వెళ్లేసరికి అక్కడ సభ జరుగుతోంది. ఇరవై మెట్లు పైన ఉన్న సింహాసనంలో రాజుగారు కూర్చుని ఉన్నారు. ఈ మెట్లకు అటూ ఇటూ ఉన్న ఆసనాలలో మంత్రులు, పండితులు కూర్చున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా సభలోకి వచ్చి నిల్చున్న సాధువును చూసి రాజు సహా అందరూ ఆశ్చర్యపోయారు. సాధువును చూసిన రాజు ‘‘మీరెవరు? మీకు ఏం కావాలి? మిమ్మల్ని లోపలకు పంపింది ఎవరు?’’ అని ప్రశ్నలవర్షం కురిపించాడు. కానీ సాధువు రాజుగారి మాటలేవీ పట్టించుకోకుండా ‘‘ఈ రోజు రాత్రి నిద్రపోవడానికి నాకు కాస్తంత చోటు కావాలి’’ అని అన్నారు. రాజుకుగానీ మరెవ్వరికీ గానీ ఆయన మాట అర్థం కాలేదు. ‘‘ఏంటీ? నిద్రపోవడానికా’’ అని రాజు అడిగాడు. ‘‘ఈ రోజు రాత్రి ఈ సత్రంలో నిద్రపోవాలనుకుంటున్నాను. రేపు ఉదయం లేచీలేవగానే నా పనులు కానిచ్చుకుని వెళ్లిపోతాను’’ అని సాధువు తాపీగా జవాబిచ్చారు. ‘‘చూడ్డానికి పెద్దవారిలా ఉన్నారు. మీ మాట విచిత్రంగా ఉంది. ఇది మీరనుకుంటున్నట్లు సత్రం కాదు. ఇది నా రాజభవనం’’ అని రాజు మీసాలు దువ్వాడు. ‘‘అలాగా?’’ అంటూ ‘‘మీ ముందు ఇక్కడ ఎవరున్నారు?’’ అని అడిగారు సాధువు. ‘‘మా నాన్నగారు’’ ‘‘ఆయన ఎక్కడున్నారు?’’ ‘‘ఆయన ఇప్పుడు లేరు. గతించారు’’ ‘‘ఆయనకన్నా ముందు...’’ ‘‘మా తాతగారు’’ ‘‘ఆయన ఏమయ్యారు?’’ ‘‘ఆయనా చనిపోయారు’’ - ఇలా మరో రెండు తరాల వారి గురించి వారి మధ్య మాటలు సాగాయి. ఆ తర్వాత సాధువు ‘‘బాటసారులు కొంతకాలం బసచేసి వెళ్లిపోయే చోటును సత్రమనేగా అంటారు. మీరంటున్న ఈ రాజభవనంలో ఇప్పుడు మీరున్నారు. మీ కన్నా ముందు మీ నాన్నగారు. అంతకన్నా ముందు మీ తాతగారు, ఆయన కన్నా ముందు మీ ముత్తాత ఇలా ఎవరో ఒకరు ఉండిపోయే ఈ చోటుని కూడా సత్రమనే నేనంటాను. ఏమీ అనుకోకపోతే ఒక మాటంటాను. ఇప్పుడు మీరున్నారు. మీ తర్వాత మీ కుమారుడు ఉంటాడిక్కడ. అతని తర్వాత అతని కుమారుడు... ఇలా ఉండిపోతుంటారు. ఎవరూ శాశ్వతంగా ఉండడం లేదు. అటువంటప్పుడు ఇది ఎలా రాజప్రాసాదం అవుతుంది. ఇదీ ఒక సత్రమే అనుకోవడంలో తప్పేముంది?’’ అని ప్రశ్నించడంతో రాజు ఆ సాధువు సామాన్యులు కాదని, ఓ జ్ఞాని అని గ్రహించాడు. ఆయన ఏం చెప్పదలచుకున్నారో అర్థమైంది. ఆయన తన కళ్లు తెరిపించారని తెలుసుకుని అప్పటి నుంచి విలాసవంతమైన భవనాలు కట్టించడం మానేశాడు. ఖజానాలో డబ్బులు మిగుల్తూ వచ్చాయి. దాంతో ప్రజలపై పన్నులు విధించే అవసరమూ కలగలేదు. అప్పటి దాకా ఉన్న పన్నులే కాకుండా పన్ను బకాయిలను సైతం కట్టక్కర్లేదని దండోరా వేయించాడు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల ప్రశంసలు పొందుతూ రాజు మిగిలిన శేషజీవితం ఆనందంగా గడిపాడు. - యామిజాల జగదీశ్ -
‘ప్రయివేట్’కు పచ్చజెండా
కొత్త ప్రభుత్వం అండతో ట్రావెల్స్ ఖుషీ దర్జాగా రాకపోకలు ఆదాయం ఎరగా చూపి తెరచాటు ప్రయత్నాలు ప్రయివేటు ట్రావెల్స్ ఇక చక్రం తిప్పనున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న ఆర్టీసీ మళ్లీ కష్టాల బాట పట్టక తప్పదు. కొత్తగా గద్దెనెక్కబోయే సర్కారుకు ఆదాయం ఎరగా వేసి తమహవా కొనసాగిస్తామనే ధీమాను ప్రయివేటు ఆపరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకోవడంతో రవాణా శాఖాధికారులు ప్రయివేటు వాహనాలపై అప్పట్లో కన్నెర్రజేశారు. ఇప్పుడు నాయకుల అండతో మళ్లీ తమ హవా కొనసాగిస్తామని ప్రయివేటు రవాణాదారులు ధీమాగా చెబుతున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రయివేట్ ట్రావెల్స్‌కు కాలం కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడంతో ప్రయివేటు ఆపరేటర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. తమ వ్యాపారానికి ఇక అడ్డు లేదని ఆపరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో మహారాష్ట్రలోని షోలాపూర్, మహబూబ్‌నగర్ వద్ద పాలెం బస్సు దుర్ఘటనలు ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వ చర్యలతో ప్రయివేట్ బస్సుల రాకపోకలు నిలిచాయి. ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నడుస్తున్నా చిన్నా చితకా ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కడం లేదు. వందలాది బస్సులు బకాయిలు తీర్చలేక ఫైనాన్స్ కంపెనీల గూటికి చేరాయి. త్రైమాసిక పన్నులు, బీమా, ఫిట్నెస్ లేని కారణంగా అనేక బస్సులు గ్యారేజీలకు పరిమితమయ్యాయి. రవాణా శాఖాధికారులు మార్గమధ్యంలో బస్సులు నిలిపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వ్యాపారులు సేద తీరారు. గమ్యస్థానంలో సీజ్ చేసుకోవచ్చని హైకోర్టు వెల్లడించిన తీర్పు ఆపరేటర్లకు కలిసివచ్చింది. ఇదే సాకుతో అధికారులు తనిఖీలకు పుల్‌స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. చట్టపరంగా రాకపోకలు ఇక రాబోయే రోజుల్లో చట్టపరంగా రాకపోకలు చేస్తామని ఆపరేటర్లు చెబుతున్నారు. కాంట్రాక్ట్ పర్మిట్ ఉండి స్టేజి క్యారియర్‌గా రాకపోకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని చట్టం చెబుతోంది. స్టేజి క్యారియర్ పర్మిట్ మంజూరుతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా! అనే దిశగా వ్యాపారులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ‘ఇన్నాళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం..వచ్చింది మా ప్రభుత్వం’ అంటూ వారు చెబుతుండడం విశేషం. ‘కోర్టుల ద్వారా పోరాడతాం, అవసరమైతే ప్రత్యేక బిల్లుతో ప్రభుత్వం ద్వారా అనుమతులు కచ్చితంగా పొందుతాం’ అని చెప్పడం గమనార్హం. ఆదాయం లక్ష్యంగా.. ప్రభుత్వ ఆదాయం కోసం బస్సులకు స్టేజి క్యారియర్ పర్మిట్లు మంజూరు చేయడం ఒక్కటే ఉత్తమమని ప్రయివేట్ ఆపరేటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విభజనతో ఇరు రాష్ట్రాలకు కోట్ల రూపాయల ఆదాయం రాబట్టవచ్చని అంటున్నారు. ఆదాయం కోసం ఆయా ప్రభుత్వాలు పర్మిట్లు మంజూరు చేయక తప్పదని జోస్యం చెబుతున్నారు. కొండంత అండగా నాయకులు విజయవాడ, అనంతపురానికి చెందిన లోక్ సభ సభ్యులు ట్రావెల్స్ వ్యాపారానికి పెద్ద దిక్కుగా మారారు. ఇప్పటికే వారిద్దరూ రాష్ట్రంలో ప్రముఖ ట్రావెల్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ వ్యాపారులు భారీగా వెచ్చించినట్టు తెలిసింది. వ్యాపార లోకానికి నాయకులు కొండంత అండగా ఉండగా తమకు అడ్డుపడేది ఎవరని ఆపరేటర్లు ధీమాగా ఉన్నారు. ఉద్యమాలతో ఫలితం ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాపారం పుంజుకుంటోంది అంటే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లడం.. అర్థమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రావెల్స్ వ్యాపారం కుదేలవడంతో గతేడాదిగా ఆర్టీసీ పురోగతి సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యమించి పోరాడితే ప్రయివేట్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇక పల్లెల్లో చీకట్లు
సాక్షి, మంచిర్యాల : గ్రామ పంచాయతీల్లో అంధకారం అములుకోనుంది. ఇప్పటికే పన్నులు వసూలుకాక అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇంతకాలం విద్యుత్ భారం మోస్తూ వస్తున్న ప్రభుత్వం ఇకపై ఆ భారాన్ని పంచాయతీలపై వేయాలని నిర్ణయించింది. దీంతో తాగునీటి పథకాలకు, వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ చార్జీలు పంచాయతీలే చెల్లించాల్సి ఉంటుంది. ఇక వీధుల్లోని లైట్లు వేయాలంటే పంచాయతీలు ఆలోచించాల్సిందే. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు రెండు వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. 2009 నుంచి ప్రభుత్వమే చెల్లిస్తోంది.. 2008 సంవత్సరానికి ముందు విద్యుత్ బిల్లులు పంచాయతీలే చెల్లించేవి. ప్రభుత్వాలు పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు సరిగ్గా మంజూరు చేయకపోవడం, పన్నులు కూడా వసూలు కాకపోవడంతో బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కొన్నిచోట్ల పంచాయతీలు విద్యుత్ చార్జీలు, బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే హైదరాబాద్‌లో అధిక శాతం బకాయిలు 2009, 2011లో చెల్లించింది. పంచాయతీల బకాయిలే అధికం జిల్లాలో 27మేజర్.. 839 మైనర్లతో కలుపుకు ని 866గ్రామ పంచాయితీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో ఆస్తి, నీటి, రెవెన్యూ ఇతరాత్ర పన్నులు వసూలు చేసుకున్న తర్వాత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల కు కలిపి ఒకేసారి విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. పన్ను తక్కువగా వసూలు కావడం, బకాయిలు ఎక్కువగా ఉండడంతో ఇకపై విద్యుత్ చార్జీల భారాన్ని ఆయా పంచాయతీలపైనే వేయాలని నిర్ణయించింది. మరోపక్క.. క్షేత్రస్థాయిలో ప న్నులు వసూలు కాక.. ప్రస్తుతం పేరుకుపోయి న కరెంట్ బిల్లులు చెల్లించడం పంచాయతీలకు తలకుమించిన భారంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆదిలాబాద్ పరిధిలో మైనర్ పంచాయతీల్లో రూ.8,65,77,000 ఉండగా మే జర్ జీపీలో రూ. 4,63,65,00 బకాయి ఉంది. నిర్మల్ పరిధిలోని మైనర్ జీపీల్లో 3,77,01,000, మేజర్ జీపీలో రూ. 1,61,72,000, భైంసా పరి ధిలో మైనర్ జీపీల్లో రూ.3,92,81,000, మేజర్ జీపీల్లో రూ. 1,82,37,000, మంచిర్యాల పరిధిలోని మైనర్ జీపీల్లో రూ.6,49,25,000, మేజర్ 2,91,50,000, కాగజ్‌నగర్ పరిధిలోని మైనర్ జీపీల్లో రూ.11,39,77,000, మేజర్ జీపీల్లో రూ. 2,20,92,000 బకాయి ఉంది. పన్నుల వసూలుకు కార్యదర్శుల కొరత జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీల్లో కేవ లం 225 మంది మాత్రమే రెగ్యులర్ కార్యదర్శులున్నారు. 641పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 571 స్థానాల్లో ఇన్చార్జీలు ఉన్నారు. ఇన్చార్జీల స్థానా ల్లో పన్నుల వసూళ్లు పూర్తిగా నిలిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో నుంచి రూ. 16కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా.. ఇప్పటివ రకు కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూల య్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిల్లుల చెల్లింపు ఎలా సాధ్యమని కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య వివరణ ఇస్తూ.. ‘గ్రామాల్లో పన్నులు వసూలు కాని విషయం వాస్తవం. పంచాయతీలపై కరెంట్ చార్జీల భారం వేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. కానీ అధికారికంగా ఇంత వరకు పూర్తి వివరాలు తెలియదు.’ అన్నారు. భారం మోపొద్దు.. మా పంచాయతీ పరిధిలో 3 వేల పైచిలుకు జనాభా ఉంది. కానీ వసూలయ్యే పన్నులు మాత్రం రూ.40 వేల లోపే. ఇప్పటికే నిధులు లేక గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నాం. ఇప్పుడు కరెంట్ చార్జీల భారం కూడా మా పైనే మోపితే.. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో పునరాలోచించాలి. - డేగబాపు, వేంపల్లి సర్పంచి, మంచిర్యాల మండలం -
పావలా వాటా కూడా వసూలు కాని పన్నులు
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్:జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్నుల వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు తదితర మున్సిపాలిటీలలో ఈ అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్)లో ఇప్పటి వరకు కనీసం పావలా వాటా కూడా వసూలు కాలేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు మున్సిపాలిటీలలో పన్నులు వసూలు కాకపోడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే అధికారులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించేవారు. దీంతో నెల నెలా కనీసం జీతభత్యాలకు కావలసిన మొత్తానికైనా ఆయా సిబ్బంది పరుగులెత్తి పన్నులు వసూలు చేసేవారు. అయితే 2011 నుంచి పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే మున్సిపల్ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తుండడంతో పన్నుల వసూళ్లపై శ్రద్ధ కనబరచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలు.. నివాస, వ్యాపా ర సముదాయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తి పన్నులు, అలాగే రావడం లేదు. ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్యనే తిరుగుతూ అక్కడ్నుంచే పార్టీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు అందిస్తూ వస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడైన సత్తిబాబు రెండునెలలుగా సొంత జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. పార్టీ క్యాడర్ అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు ఆయన రా జీడ్రామాకు తెరలేపినట్లు తెలుస్తోంది.అప్పుడుఉద్యమకారులు నిలదీసినా ‘నానూ రాజీనామా సేసినాను కదేటి’ అని చెప్పుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పండక్కీ రాకపోతే పనైపోయినట్లే..!! విజయనగరం జిల్లా వాసులకు దసరా తరువాత వచ్చే పైడితల్లమ్మ పండగ చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంగా అక్టోబర్ 20, 21, 22 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పండగ సందడి నెలకొంటుంది. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా పూసపాటి ఆనందగజపతిరాజు, ఆయన సోదరుడు అశోక్ గజపతిరాజులకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఇదే తరుణంలో జిల్లాకు చెందిన మంత్రి ఎవరైనా ఉంటే వారికీ ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సత్తిబాబు ఈ ఉత్సవాలకు వస్తే జనంతో పాటు ఉద్యమ సంఘాలు ఆయన్ను నిలదీసే అవకాశం ఉంది. అలాగని వారికి భయపడి ఉత్సవాలకు రాకుండా దాక్కుంటే అంతకు మించిన పరువు తక్కువ పని ఇంకొకటి ఉండదు. ఈ నేపథ్యంలో పండక్కి రావాలన్నా జనానికి ఏదో ఒక మాట చెప్పి ఒప్పించాలి. దీంతో దానికి ముందస్తుగా అక్టోబర్ 6, 8 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించాలని పార్టీ జిల్లా నేతలు నిర్ణయించారు. దానికి సత్తిబాబును సైతం ఆహ్వానించారు. అయితే నేరుగా వచ్చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఈ లోగా రాజీడ్రామా నడిపి, ఈ కార్యక్రమానికి హాజరై ఆ తరువాత పైడితల్లమ్మ ఉత్సవాలకు మార్గం సుగమం చేసుకోవాలన్నది బొత్స పథకం. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన్ను అడ్డుకుని తీరుతామని ఉద్యమ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. విభజనకు మూలకారకుడైన సత్తిబాబును జిల్లాలో తిరగనిచ్చేది లేదని, ప్రజలకు వివరణ ఇచ్చిన తరువాతనే ఆయన జిల్లాకు రావాలని, లేదంటే తగిన విధంగా ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.