ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్‌.. లీటరు రూ.1.50 మాత్రమే!

Petrol Diecel Price Hike Which country has Low Pirce  - Sakshi

Most Expensive and Cheapest Petrol and Diesel Prices Countries: పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్‌ కంపెనీలు. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారంతో పెట్రోలు, డీజిల్‌ రేట్లు లీటరకు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. కాన్నీ కొన్ని దేశాల్లో అగ్గిపెట్టె కంటే పెట్రోలు చాలా చీప్‌. మరి కొన్ని చోట్ల ధరలు భగ్గుమంటున్నాయి.

ఇప్పటికే సామాన్యులు మోయలేని దశకు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినా.. ఇంకా తమ ధరల దాహం తీరలేదన్నట్టుగా ఆయిల్‌ కంపెనీలు సంకేతాలు పంపుతున్నాయి. కానీ ఈ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటరు పెట్రోలును కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనుజువెలా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్‌ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలం. అమెరికా ఆయిల్‌ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనుజువెలాలో లీటరు పెట్రోలు ధర 0.02 డాలర్లు మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల‍్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్‌ అందిస్తోంది.

Petrol and Diesel Prices

ఇక్కడయితే ఇంతే
వెనుజువెలా తర్వాత పెట్రోలు అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్‌ నిలిచింది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51గా ఉంది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్‌, నైజీరియా, తుర్క్‌మెనిస్తాన్‌, ఖజకిస్తాన్‌, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోలు వస్తోంది.

అక్కడ మోత మోగుతోంది
పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్‌కాంగ్‌ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్‌కాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్‌కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్‌ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్‌ ఆఫ్రికా రిపబ్లిక్‌ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్‌, డెన్మార్క్‌, మోనాకో, గ్రీస్‌, ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌లలో లీటరు పెట్రోలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి.

Petrol Prices Around the World

ఏడాదిన్నరలో రూ.36 పెరుగుదల
కరోనా సమయంలో డిమాండ్‌, సప్లై మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్‌ ‍ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఎడాపెడా పెట్రోలు, డీజిల్‌ ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మేలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర కనివినీ ఎరుగని రీతిలో పెరిగింది.

మరీ ఈ వైరుధ్యం ఏంటో ?
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు అంటూ కేంద్రం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ‍క్రూడ్‌ ఆయిల్‌ ధర 109 డాలర్లుగా నమోదు అయ్యింది. అ‍ప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్‌ ‍క్రూడ్‌ ఆయిల్‌ ధర 85 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 దగ్గర నమోదు అవుతోంది. 

- సాక్షి, వెబ్‌డెస్క్‌

చదవండి : మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top