కింగ్‌ఫిషర్ వల్లే చెడ్డపేరు | bad name for kingfisher - ashok gajapathi raju | Sakshi
Sakshi News home page

కింగ్‌ఫిషర్ వల్లే చెడ్డపేరు

Jun 16 2014 2:47 AM | Updated on Sep 2 2017 8:51 AM

కింగ్‌ఫిషర్ వల్లే చెడ్డపేరు

కింగ్‌ఫిషర్ వల్లే చెడ్డపేరు

కింగ్‌ఫిషర్ సంస్థ వల్లే విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చెప్పారు.

కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు
 
విజయనగరం: కింగ్‌ఫిషర్ సంస్థ వల్లే విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చెప్పారు. విజయనగరంలో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కింగ్‌ఫిషర్ సంస్థ పన్నులు కట్టకపోవడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నారు. సీమాంధ్ర లో విమానయాన అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఉన్న విమానాశ్రాయాల అభివృద్ధికి కృషిచేస్తామని, పాతవి  తొలగించే ఆలోచన లేదని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే క హోదా కల్పించాలని  కోరుతున్నామన్నారు. యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని, దాన్ని 15 ఏళ్లకు పొడిగించాలని తమపార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు.

బంధుప్రీతిపై మంత్రి గరం!

న్యూఢిల్లీ: విమానయూన రంగంలో.. ఆ రంగానికి చెందిన పలువురు అధికారుల బంధువుల ఉద్యోగితపై మంత్రి అశోక్ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఎరుుర్ ఇండియూ, భారత విమానాశ్రయూల సంస్థ (ఏఏఐ) పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్, విమానాశ్రయూల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్‌ఏ), ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బంధువుల వివరాలను తెలియజేయూల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement