పన్నుల విధానంపై అవగాహన అవసరం | Awareness needed on taxation system | Sakshi
Sakshi News home page

పన్నుల విధానంపై అవగాహన అవసరం

Oct 8 2016 1:55 AM | Updated on Sep 4 2017 4:32 PM

పన్నుల విధానంపై అవగాహన అవసరం

పన్నుల విధానంపై అవగాహన అవసరం

నెల్లూరు(వేదాయపాళెం): వస్తు సేవలు, వాణిజ్యపరమైన పన్నుల విధానంపై ఆయా శాఖల అధికారులకు అవగాహన అవసరమని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

 
  •  జేసీ ఇంతియాజ్‌
 
నెల్లూరు(వేదాయపాళెం): వస్తు సేవలు, వాణిజ్యపరమైన పన్నుల విధానంపై ఆయా శాఖల అధికారులకు అవగాహన అవసరమని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. నగరంలోని గోల్డెన్‌ జూబ్లీ హాల్లో శుక్రవారం కమర్షియల్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 ఏప్రిల్‌ చట్టంలోని ప్రధాన అంశాల గురించి వివరించారు. రాజ్యాంగ సవరణ 122 యాక్ట్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడిట్, పన్నులు, పలు విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని వివరించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగజ్యోతి, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement