ఉద్యోగ కల్పనలో ఏపీని ఆదర్శంగా తీసుకోండి

Vijaya Sai Reddy Said Take AP As An Ideal In Job Creation - Sakshi

రాజ్యసభ చర్చలో ప్రభుత్వానికి  విజయసాయి రెడ్డి సూచన

సాక్షి, న్యూఢిల్లీ : యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య - పరిష్కరానికి చేపట్టవలసిన కార్యాచరణ అన్న ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే గ్రామ సచివాలయాలలో గ్రాడ్యుయేట్ల కోసం లక్షా 26 వేల 728 ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించిందని అన్నారు. దేశ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సవరించిన విషయం తెలిసిందే. నిబంధనలను తుంగలో తొక్కుతూ గత యూపీఏ ప్రభుత్వం వేల కోట్ల బ్యాంక్‌ రుణాల మంజూరీకి అనుమతించి, అంతులేని అక్రమాలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే ఎన్‌డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు వంటి దుస్సాహసానికి ఒడిగట్టి ఆర్థిక రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని అన్నారు.(‘కక్కుకుంటూ ఒకరు.. కెన్యాపై మరొకరు’)

కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదు
దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఆయన ప్రస్తావిస్తూ తాజాగా విడుదలైన పే కమిషన్‌ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో 38.9 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా 31 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగిందని అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో 46 శాతం, సైన్స్‌, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో 47 శాతం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, సివిల్ సర్వీసుల ద్వ్రారా 2014లో 1364 పోస్టులు భర్తీ చేస్తే 2019 నాటికి ఆ సంఖ్య 896కి తగ్గిపోయిందన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని,. ఒక కేలండర్‌ను అనుసరించి వాటిని భర్తీ చేయకపోవడం వలన లక్షలాది మంది ఉద్యోగావకాశాలను కాలరాసినట్లువుతుందని అన్నారు. నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదని సూచించారు. (కరోనాపై బాలీవుడ్‌ సెలబ్రిటీల సూచనలు)

దేశంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రధానంగా జాతీయ రహదారులు, పట్టణ రవాణా, పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో భారీ పెట్టుబడుల ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు. పదేళ్ళు గడిచినా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఇంకా డ్రాయింగ్‌ టేబుల్‌ స్థాయి నుంచి ముందుకు కదలలేదని ఉదాహరించారు. అలాగే విశాఖపట్నం నుంచి ఫార్మా, మెరైన్‌ ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం కార్గో సౌకర్యాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదని తెలిపారు. విశాఖపట్నం మేజర్‌ పోర్టు విస్తరణ ప్రణాళిక ఆచరణకు నోచుకోలేదని, ఇలాంటి కారణాల వలన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందని ఆయన విమర్శించారు. ('లేఖలు, లీకులు అందులో భాగమే')

సవరించిన బడ్డెట్‌ అంచనాలలో భారీగా కోత
‘‘దేశ జనాభాలో కనీసం 70 శాతం గ్రామాల్లోనే ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తికి తగిన డిమాండ్‌ లేకపోవడమే. దీనికి విరుద్ధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీలకు సవరించిన బడ్డెట్‌ అంచనాలలో భారీగా కోత పెట్టింది. సబ్సిడీలలో దాదాపు 28 శాతం కోత విధించారు. ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో గత ఏడాది కంటే 9,500 కోట్లు తగ్గించారు. దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైన, అక్కడ నిరుద్యోగ సమస్యపైన ప్రబలంగా ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిలా పనిచేస్తున్న విదేశీ ఆర్థిక పెట్టుబడులపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం దిశగా తరుముతోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం యావత్తు ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో పాల్గొంది. ఇలాంటి సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోవాలి. ఇప్పటివరకు మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో ముందున్న చైనాను అధిగమించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
(సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ జేఏసీ)

న్యూఢిల్లీ : ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఎగుమతులపై సుంకాల మాఫీకి పథకం గురించి  రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎగుమతులకు కల్పిస్తున్న రాయితీలపై ఏర్పడిన వివాదంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పేనల్‌ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీవోలో నెలకొన్న వివాదం గురించి వివరించారు.(‘ఆ మూడు శాంపిల్స్‌ నెగిటివ్‌ వచ్చాయి’)

పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టాం
భారత్‌ అమలు చేస్తున్న ఎగుమతులకు సంబంధించిన పథకాలు, సుంకం చెల్లించకుండా దిగుమతులు చేసుకునే పథకంపై ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికా వివాదం లేవనెత్తింది. దీనిపై వివాద పరిష్కార ప్యానల్‌ తన నివేదిక సమర్పిస్తూ భారత్ ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకాలు డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా లేవని తీర్పు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. నివేదికను గత ఏడాది నవంబర్‌ 19 భారత్‌ సవాలు చేసింది. అయితే డబ్ల్యూటీవో అప్పిలేట్‌ వ్యవస్థ క్రియాశీలంగా లేని కారణంగా విచారణ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సస్పెన్షన్‌లో ఉండిపోయిందని అన్నారు. డబ్ల్యూటీవో తీర్పు ఎగుమతులపై దుష్ప్రభావం చూపకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎగుమతి చేసే ఉత్పాదనలపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.
(మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18)

న్యూఢిల్లీ : నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ కార్యదర్శి అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాలకు చెందిన వ్యక్తులు ఈ వర్కింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం ప్రధాన పారిశ్రామిక రంగాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మాన్యుఫాక్చరింగ్‌ రంగం గణనీయమైన భాగస్వామ్యం పొందేందుకు, ప్రధాన పారిశ్రామిక రంగాల మధ్య పోటీతత్వం పెంచేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన జరుగుతుందని మంత్రి వెల్లడించారు. (కామసూత్ర నటికి కరోనా కష్టాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top