breaking news
Foreign corporate investors
-
అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్రంగా భారత్: ఆర్బీఐ
ముంబై: భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అధికంగా ఆకర్షించిందని, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐలోని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు చెందిన సుమిత్‌రాయ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన జాలీరాయ్, కమల్గుప్తా సంయుక్తంగా విదేశీ పెట్టుబడులపై రూపొందించిన నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులోని అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవిగా ఆర్బీఐ పేర్కొంది. ‘‘ఏ దేశ అభివృద్ధిలో అయిన ఎఫ్‌డీఐ కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడుల అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థికాభివృద్ధికి మద్దతుగా నిలుస్తుంది’’ అంటూ ఈ నివేదిక పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, ఎఫ్‌డీఐ విధానాలను క్రమంగా సడలించడం సాయపడినట్టు తెలిపింది. -
భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్‌లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్‌లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
నిఫ్టీ పదహారువేల మార్క్ దాటేనా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలే ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు. పైన పేర్కొన్న అంశాలతో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ.., ప్రాథమిక మార్కెట్లో ఐపీఓలకు లభిస్తున్న అపూర్వ ఆదరణతో స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఈ వారంలోనూ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవ్వొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. దిగువస్థాయిలో 15,600 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ మార్కెట్ రెండోవారమూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆటో, బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో గతవారంలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను నష్టపోయాయి. అందరి చూపు ఆర్బీఐ వైపు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం(ఆగస్ట్ 4న) ప్రారంభం కానుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను ఆగస్ట్ ఆరున ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత్‌దాస్ వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చని ఆర్థివేత్తలు భావిస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఆర్బీఐ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలు... ఆటో కంపెనీలు జూలై వాహన విక్రయ గణాంకాల విడుదలను ఆగస్ట్ ఒకటి నుంచి వెల్లడించడం షురూ చేశాయి. పలు కంపెనీలు వాహన ధరల్ని పెంచిన నేపథ్యంలో వాహన అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం ఉండొచ్చు. కావున ఈ రంగ స్టాకులు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఇక ఆగస్ట్ రెండో తేదిన (సోమవారం) జూలై నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, జూన్ మాసపు తయారీ రంగపు డాటా 4వ తేదిన(బుధవారం) వెల్లడికానున్నాయి. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అవంతీ ఫీడ్స్, అల్కేమ్ అమైన్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, సిప్లా, డాబర్, ఇమామీ, ఎస్కార్ట్స్, గెయిల్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, వోడాఫోన్ ఐడియా, నాల్కో, ఇన్ఫోఎడ్జ్, పీఎన్బీ, ఎస్బీఐ, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్ వంటి ప్రధాన కంపెనీలు వాటి జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్నాయి.ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. నాలుగు ఐపీఓలు... ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో ఒకేరోజు నాలుగు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయాగ్నటిక్స్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3,614 కోట్లను సమీకరించనునున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్ట్ నాలుగవ తేదీ (బుధవారం)న ప్రారంభమై.., ఎనిమిదో తేది (శుక్రవారం) ముగియనున్నాయి. ఆగస్ట్ 6న గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ లిస్టింగ్... హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ షేర్లు శుక్రవారం(ఆగస్ట్ 6న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓను ఈ జూలై 27– 29 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 695–720 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,514 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓ చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.720తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.130–150 మధ్య ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. నాలుగో నెలలో అమ్మకాలే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర అమ్మకందారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ జూలైలో రూ.23,193 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చి నెల తర్వాత ఎఫ్ఐఐలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలకు పాల్పడటం ఇదే తొలిసారి. గతవారంలో ఏకంగా రూ.10,288 విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు ధీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతూ సూచీలకు భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ నెలలో డీఐఐ రూ.18,394 కోట్ల షేర్లను కొన్నారు. గత ఒక్క వారంలోనే రూ.8,206 కోట్ల షేర్లను కొన్నారు -
Nifty: 15 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. డెరివేటివ్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ అంశం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫైనాన్షియల్ అసెట్స్ విలువలు అనూహ్యంగా పెరిగిపోవడం భారత్ వంటి ఈక్విటీ మార్కెట్లకు ప్రమాదమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) హెచ్చరించింది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 338 పాయింట్లు పతనమైన 49,565 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 15వేల దిగువన 14,906 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కమోడిటీ ధరలను అదుపులో పెట్టేందుకు చర్యలను తీసుకుంటామని చైనా ప్రకటనతో మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఆర్థిక, ప్రైవేట్ రంగ షేర్లలోనూ చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 406 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. నష్టాల మార్కెట్లోనూ స్మాల్ క్యాప్ షేర్లు రాణించాయి. ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్ అవుతున్న చిన్న షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఓ దశలో 23,093 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరకు 22,980 వద్ద ముగిసింది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.876 కోట్ల షేర్లు అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.71 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ‘‘ప్రపంచ ప్రతికూలతలు సూచీలను నష్టాల బాటపట్టించాయి. నిఫ్టీ సూచీ 15 వేల స్థాయిని కోల్పోయినప్పటికీ.. 14,900 స్థాయిని నిలుపుకోవడం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. ఇన్వెస్టర్లు దిద్దుబాటుకు ఆస్కారం లేని నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► మార్చి క్వార్టర్లో నికర లాభం ఆరు రెట్లు పెరగడంతో భాష్ షేరు ఏడుశాతానికి పైగా లాభపడి రూ.15846 వద్ద ముగిసింది. ► కరోనా వ్యాధిని నిర్ధారించే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో సిప్లా షేరు 2% లాభంతో రూ.924 వద్ద స్థిరపడింది. ► మెరుగైన క్యూ4 ఫలితాలతో శక్తి పంప్స్ షేరు 15 శాతం లాభపడి రూ.712 వద్ద నిలిచింది. ► టాటా స్టీల్, హిందాల్కో, సెయిల్, జేఎస్పీఎల్ షేర్లు 4–6% క్షీణించడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ శాతం 3% నష్టపోయింది. -
ఉద్యోగ కల్పనలో ఏపీని ఆదర్శంగా తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య - పరిష్కరానికి చేపట్టవలసిన కార్యాచరణ అన్న ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే గ్రామ సచివాలయాలలో గ్రాడ్యుయేట్ల కోసం లక్షా 26 వేల 728 ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించిందని అన్నారు. దేశ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సవరించిన విషయం తెలిసిందే. నిబంధనలను తుంగలో తొక్కుతూ గత యూపీఏ ప్రభుత్వం వేల కోట్ల బ్యాంక్ రుణాల మంజూరీకి అనుమతించి, అంతులేని అక్రమాలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు వంటి దుస్సాహసానికి ఒడిగట్టి ఆర్థిక రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని అన్నారు.(‘కక్కుకుంటూ ఒకరు.. కెన్యాపై మరొకరు’) కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదు దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఆయన ప్రస్తావిస్తూ తాజాగా విడుదలైన పే కమిషన్ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో 38.9 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా 31 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగిందని అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో 46 శాతం, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో 47 శాతం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, సివిల్ సర్వీసుల ద్వ్రారా 2014లో 1364 పోస్టులు భర్తీ చేస్తే 2019 నాటికి ఆ సంఖ్య 896కి తగ్గిపోయిందన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని,. ఒక కేలండర్‌ను అనుసరించి వాటిని భర్తీ చేయకపోవడం వలన లక్షలాది మంది ఉద్యోగావకాశాలను కాలరాసినట్లువుతుందని అన్నారు. నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదని సూచించారు. (కరోనాపై బాలీవుడ్ సెలబ్రిటీల సూచనలు) దేశంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రధానంగా జాతీయ రహదారులు, పట్టణ రవాణా, పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో భారీ పెట్టుబడుల ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు. పదేళ్ళు గడిచినా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇంకా డ్రాయింగ్ టేబుల్ స్థాయి నుంచి ముందుకు కదలలేదని ఉదాహరించారు. అలాగే విశాఖపట్నం నుంచి ఫార్మా, మెరైన్ ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం కార్గో సౌకర్యాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదని తెలిపారు. విశాఖపట్నం మేజర్ పోర్టు విస్తరణ ప్రణాళిక ఆచరణకు నోచుకోలేదని, ఇలాంటి కారణాల వలన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందని ఆయన విమర్శించారు. ('లేఖలు, లీకులు అందులో భాగమే') సవరించిన బడ్డెట్ అంచనాలలో భారీగా కోత ‘‘దేశ జనాభాలో కనీసం 70 శాతం గ్రామాల్లోనే ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడమే. దీనికి విరుద్ధంగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీలకు సవరించిన బడ్డెట్ అంచనాలలో భారీగా కోత పెట్టింది. సబ్సిడీలలో దాదాపు 28 శాతం కోత విధించారు. ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో గత ఏడాది కంటే 9,500 కోట్లు తగ్గించారు. దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైన, అక్కడ నిరుద్యోగ సమస్యపైన ప్రబలంగా ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిలా పనిచేస్తున్న విదేశీ ఆర్థిక పెట్టుబడులపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం దిశగా తరుముతోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం యావత్తు ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో పాల్గొంది. ఇలాంటి సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోవాలి. ఇప్పటివరకు మాన్యుఫాక్చరింగ్ రంగంలో ముందున్న చైనాను అధిగమించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ జేఏసీ) న్యూఢిల్లీ : ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఎగుమతులపై సుంకాల మాఫీకి పథకం గురించి రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎగుమతులకు కల్పిస్తున్న రాయితీలపై ఏర్పడిన వివాదంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పేనల్ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీవోలో నెలకొన్న వివాదం గురించి వివరించారు.(‘ఆ మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి’) పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టాం భారత్ అమలు చేస్తున్న ఎగుమతులకు సంబంధించిన పథకాలు, సుంకం చెల్లించకుండా దిగుమతులు చేసుకునే పథకంపై ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికా వివాదం లేవనెత్తింది. దీనిపై వివాద పరిష్కార ప్యానల్ తన నివేదిక సమర్పిస్తూ భారత్ ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకాలు డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా లేవని తీర్పు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. నివేదికను గత ఏడాది నవంబర్ 19 భారత్ సవాలు చేసింది. అయితే డబ్ల్యూటీవో అప్పిలేట్ వ్యవస్థ క్రియాశీలంగా లేని కారణంగా విచారణ భారత్ దాఖలు చేసిన పిటిషన్ సస్పెన్షన్‌లో ఉండిపోయిందని అన్నారు. డబ్ల్యూటీవో తీర్పు ఎగుమతులపై దుష్ప్రభావం చూపకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎగుమతి చేసే ఉత్పాదనలపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. (మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18) న్యూఢిల్లీ : నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాలకు చెందిన వ్యక్తులు ఈ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం ప్రధాన పారిశ్రామిక రంగాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మాన్యుఫాక్చరింగ్ రంగం గణనీయమైన భాగస్వామ్యం పొందేందుకు, ప్రధాన పారిశ్రామిక రంగాల మధ్య పోటీతత్వం పెంచేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన జరుగుతుందని మంత్రి వెల్లడించారు. (కామసూత్ర నటికి కరోనా కష్టాలు) -
ఎఫ్‌పీఐల డార్లింగ్.. బీమా!
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ లిస్టయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్రభుత్వరంగ సంస్థ. సెబీ నిబంధనలు అనుకూలం... ‘‘గత 4–6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్స్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ పరిశోధన విభాగం అధిపతి దీపక్ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది. దీర్ఘకాలంలో భారీ అవకాశాలు ‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్బీఐ లైఫ్ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్ – సెప్టెంబర్ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. -
చాయ్‌వాలా అసలు ఛాయ
విశ్లేషణ నరమేధం తర్వాత గుజరాత్‌కు అంతకుముందులా దేశ విదేశీ కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రావడం లేదు. ఈ ‘వికాస పురుషుడి’ ‘ప్రగతి’ పథకాలు ముందుకు నడవాలంటే అన్నివైపుల నుంచి పెట్టుబడులు రావాలి. తాను దేశ ప్రధాని పదవిలోకి వస్తే తప్ప ఆ పెట్టుబడుల్ని ధారాళంగా ఆహ్వానించడం కుదరదు. ‘ధర్మరాజు’ అని పేరు తగిలించుకున్న వాళ్లంతా ధర్మరాజులు కారు. తాను ‘చాయ్‌వాలా’నని పాత పట్టా దులిపి మీద తగిలించుకున్న రాజకీయవేత్త కూడా నిజమైన చాయ్‌వాలా కాదు. 2002 సంవత్సరంలో గుజరాత్లో మైనారిటీల నరమేధాన్ని సాగించి దేశవ్యాప్తంగానూ, విదేశాలలోనూ అప్పుడు అభాసుపాలై,గా నేడు దేశం ముందు నిలబడిన నరేంద్ర మోడీ ‘చాయ్‌వాలా’ పేరుతో మోసగించ జూస్తున్నారు. తండ్రి చాయ్ దుకాణంలో చిన్నప్పుడు సాయపడే వాడేగానీ, మోడీయే చాయ్‌వాలా కాదని కూడా కథనాలు ఉన్నాయి. గుజరాత్ మారణకాండకు గత పదేళ్లుగానే కాదు, 2014 ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ క్షణం దాకా కూడా ముఖ్యమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పకుండా కాలం డొల్లించుకుంటూ వస్తున్నాడు. అతని ‘నాజీ’ మనస్తత్వాన్ని కనబడనివ్వకుండా బీజేపీ నాయకత్వంలోని కొందరు అతని తరఫున పరోక్షంగా ‘క్షమాపణలు’ చెబుతూ తప్పించుకుంటు న్నారు. ఆ చెప్పేవారు కూడా ‘గుజరాత్ మారణకాండ’ను ప్రస్తా వించకుండా ‘టు హూమ్ సో యెవ్వర్!’ అన్నట్టుగా ‘గాయపడిన హృదయాలకు’ అని వదిలేస్తున్నారు. బీజేపీ, పరివార్ పనిగట్టు కొని పాటించిన ఈ మౌనం అర్థం అప్పటి ఊచకోతలను మోడీ ప్రధాన మంత్రిత్వం కోసం మరచిపొమ్మని చెప్పడాని కేనా? తాను కిందిస్థాయి, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినందుకూ, చిన్నతనంలో అడపాదడపా చాయ్ దుకాణంలో కూర్చున్నం దుకూ, ‘చాయ్‌వాలా’ పేరుతో చలామణీలోకి వచ్చినందుకూ ఆ నరమేధాన్ని ఇకనైనా జనం మరచిపోవచ్చనీ, తనను ఢిల్లీ గద్దెపైన కూర్చోబెట్టవచ్చుననీ మోడీ భావిస్తున్నాడా? వాజపేయినీ పట్టించుకోలేదు గుజరాత్ మరణకాండపై వ్యాఖ్యానిస్తూ నాటి ఎన్డీఏ ప్రధాని వాజ్‌పేయి అయినా, ‘ఇది దుర్లభం, దుస్సహం, నీవు రాజధర్మం, నీతి తప్పావు. గద్దెపై ఉండదగవ’ని బాహాటంగానూ, లోపాయికారీగానూ హెచ్చరించారు. ఆ మాటను కూడా మోడీ తోసిపుచ్చాడు. మోడీ మీద వచ్చిన ‘ఆరోపణల’ను పరిశీలించి నివేదిక అందించాలని రాఘవన్ అధ్యక్షతన నియమించిన స్పె షల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌ను కోర్టు ఆదేశించింది. ఆ విచారణ సంస్థ పరస్పరం ప్రతికూల నిర్ణయాల మధ్య నివేదికను సమర్పిస్తూ, అనేక మంది గుజరాత్ ఉన్నతాధికారులు 2002 నాటి నరమేధానికి కారకులని పేర్కొన్నప్పటికీ, మోడీని నిర్దోషిగా పేర్కొనడం ఒక ప్రహసనం. ఈ అంశాలనే సుప్రసిద్ధ పాత్రికేయుడు, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సీనియర్ సంపాదకుడుగా ఎన్నో న్యాయ సంబంధమైన, మానవహక్కుల గురించిన సమస్యలపై పాఠకుల్ని చైతన్యవంతుల్ని చేసిన మనోజ్‌మిట్టా (‘ది ఫిక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ఫైండింగ్: మోడీ అండ్ గోధ్రా’) వెలుగులోకి తెచ్చారు. 1984 నాటి ఢిల్లీ ఘోరకలి గురించీ, 2002 నాటి గుజరాత్ కిరాతకాల గురించీ, మోడీ హయాంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నదీ వివరించడమే కాకుండా, ‘నిజనిర్ధారణ’కు నియమించిన కమిటీల నివేదికలు ఇటీవలి కాలంలో ఎలా కట్టు కథలుగా ముగుస్తున్నాయో కూడా బయటపెట్టాడు. గుజరాత్లో, ఆ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన 2,000 మంది ఊచకోత ఘటనలో గుజరాత్ పాలనా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తోడు దొంగలయిన సన్నివేశంపైన నిజనిర్ధారణ చేయమని సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. కాగా ఈ ‘బృందం తుది నివేదిక మా త్రం ఒక న్యాయ వ్యవస్థగా సుప్రీంకోర్టు పరువును కాస్తా పూడ్చిపెట్టేసింద’ని మనోజ్ మిట్టా వెల్లడించారు. సరిగ్గా ఈ అవకాశం కోసమే మోడీ చూస్తున్నాడు. ఆ అనుకూల ముహూర్తాన్ని ‘సిట్’ విచారణ సంస్థ కల్పిం చింది. చివరికి సుప్రీంకోర్టు కూడా ‘సిట్’ నిర్వహించిన తీరుకు విస్తుపోవాల్సి వచ్చింది. సుప్రీం అచేతనత్వాన్ని అవకాశంగా తీసుకున్న మోడీ తాను నిర్దో షిగా దేశం ఎదుట నిలబడాలని భావించాడు. సుప్రీం న్యాయస్థానం మౌనా న్ని అవకాశంగా తీసుకుని ‘భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే మంచి కోర్టుగా పేరొందింది. ‘సిట్’ సంస్థలో పని చేసే వారంతా చాలా తెలివిగల అధికారులు. వారి నివేదిక వచ్చింది. నాకు క్లీన్చిట్ ఇచ్చారు. ఎలాంటి మచ్చలేని క్లీన్చిట్ ఇచ్చేశారుగదా’ అని (2003లో రాయిటర్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ) చెప్పుకున్నాడు. అయినా మోడీ ‘చాయ్‌వాలా’ గానే చెప్పుకుం టూ తిరుగుతున్నాడు. నరమేధం తర్వాత గుజరాత్‌కు అంతకు ముందులా దేశ విదేశీ కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రావడం లేదు. ఈ ‘వికాస పురు షుడి’ ‘ప్రగతి’ పథకాలు ముందుకు నడవాలంటే అన్నివైపుల నుంచి పెట్టు బడులు రావాలి. తాను దేశ ప్రధాని పదవిలోకి వస్తే తప్ప ఆ పెట్టుబడుల్ని ధారాళంగా ఆహ్వానించడం కుదరదు. పెట్టుబడుల కోసమే.. మోడీ గుజరాత్ ప్రజలను మోసం చేశాడు. 60,000 మందికి పైగా రైతులను భూముల నుంచి ‘బేదఖత్’ చే సి వాటిని ‘సెజ్’ల పేరిట కార్పొరేట్ సంస్థల భారీ వ్యాపారం కోసం కుదువ పెట్టాడు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడా ల్సిన పరిస్థితులు కల్పించాడు. అయినా ‘చాయ్‌వాలా’నేనంటాడు. ‘గుజరాత్ లోకి రాకుండా ఆగిపోయినా పెట్టుబడులు’ తిరిగి రావడానికి దారులు వెతు క్కుంటున్న మోడీని, 2003 జనవరిలో ముంబై - ఢిల్లీ సభల్లో భయం మధ్యనే దేశ బడా గుత్త పెట్టుబడి వర్గాలు, వారి ప్రతినిధులు వ్యాపార పరి భాషలో ‘దార్శనిక ముఖ్యమంత్రి’ అని ఆకాశానికెత్తారు. గుజరాత్ నరమేధ ప్రయోగం దెబ్బకి జడిసిపోయిన గుత్తవర్గాలు కొందరు, కాలం గడిచిపోతు న్న కొద్దీ ప్రజల జ్ఞాపకశక్తి కూడా కొడిగట్టుకుపోతుందన్న విశ్వాసం గల కార్పొరేట్ సంస్థలు మరికొన్ని గుజరాత్లో పెట్టుబడుల కోసం సిద్ధమై ఈ సభకు వచ్చారు. వారిలో అదానీలు, అంబానీలు, విదేశీ గుత్తేదార్లు ఉన్నారు. ఇంతకూ, సుమారు 20 ఏళ్లుగా చెవులు చిల్లులుపడేలా స్వదేశీ సరుకు గురించీ, స్వదేశీ ఉద్యమ ప్రాధాన్యం గురించీ అనుకూలంగానూ, విదేశీ సరుకు దిగుమతులకు వ్యతిరేకంగానూ ప్రచారం చేస్తూ వచ్చిన ఆర్ఎస్ఎస్ - బీజేపీ పరివార్ సంస్థ ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ ఇప్పుడు నోళ్లు కుట్టేసుకుంది. బీజేపీ, మోడీల గుత్తేదారు అనుకూల విధానాలపై మంచ్ విరుచుకుపడడం లేదు. అందుకే మోడీ ముంబై - ఢిల్లీ సభల్లో ఇలా ప్రకటించగలిగాడు: ‘వ్యాపార రంగంతో, వ్యాపార సంస్థల వ్యవహారాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. జోక్యం కూడదు. ఎక్కడైతే వ్యాపార లావాదేవీలు సాగకుండా అడ్డంకులు (రెడ్టేపిజం) ఉంటాయో అక్కడల్లా నేను వాటిని తొలగించి స్వాగతం పలుకుతాను’ అన్నాడు! ‘వ్యాపారం వ్యాపారమే’ అని అనూ ఆఘా నిర్వచించింది! ‘దేశం వెలిగిపోతుంది’ అన్న సంపన్న వర్గాల పాలక రాజకీయుల నినాద భేరీలకు మహా రచయిత చెహోవ్ ఇచ్చిన సమాధానం చాలు. అది: చంద్రుడు వెలిగిపోతున్నాడని నాకు చెప్పకు. ముక్కచెక్కలైపోతున్న జీవాల పైన ప్రసరించాల్సిన కాంతిరేఖను చూపించు!’ అందుకే, నాటి ‘చాయ్‌వాలా’ నేటి కార్పొరేట్ల ‘ఛాయా’మాత్రం గానే మిగులుతాడని అనిపిస్తుంది. వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు) ఏబీకే ప్రసాద్