అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్రంగా భారత్‌: ఆర్‌బీఐ | RBI Says That Foreign Investors Interested to Invest India | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్రంగా భారత్‌: ఆర్‌బీఐ

Jan 18 2022 8:36 AM | Updated on Jan 18 2022 8:45 AM

RBI Says That Foreign Investors Interested to Invest India - Sakshi

ముంబై: భారత్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అధికంగా ఆకర్షించిందని, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐలోని ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సుమిత్‌రాయ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌కు చెందిన జాలీరాయ్, కమల్‌గుప్తా సంయుక్తంగా విదేశీ పెట్టుబడులపై రూపొందించిన నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఇందులోని అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవిగా ఆర్‌బీఐ పేర్కొంది.

‘‘ఏ దేశ అభివృద్ధిలో అయిన ఎఫ్‌డీఐ కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడుల అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థికాభివృద్ధికి మద్దతుగా నిలుస్తుంది’’ అంటూ ఈ నివేదిక పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, ఎఫ్‌డీఐ విధానాలను క్రమంగా సడలించడం సాయపడినట్టు తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement