కుబేరుడి పెళ్లి సందడి షురూ : అంగరంగవైభవంగా మూడు రోజుల ముచ్చట | Jeff Bezos and Lauren Sánchez’s star-studded Venice wedding bash | Sakshi
Sakshi News home page

కుబేరుడి పెళ్లి సందడి షురూ : అంగరంగవైభవంగా మూడు రోజుల ముచ్చట

Jun 27 2025 12:25 PM | Updated on Jun 27 2025 1:06 PM

Jeff Bezos and Lauren Sánchez’s star-studded Venice wedding bash

ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos)  పెళ్లి సందడి మొదలైంది. 61 ఏళ్ల టెక్ బిలియనీర్, 55 ఏళ్ల ప్రేయసి లారెన్ సాంచెజ్‌తో వెడ్‌ లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రాంభమైనాయి.  గురువారం తమ మూడు రోజుల వివాహ వేడుకలు షురూ అయ్యాయి. ఈ   వేడుకలకు కిమ్ చ ఖ్లో కర్దాషియాన్, ఓప్రా విన్‌ఫ్రే , ఓర్లాండో బ్లూమ్ వంటి  టాప్‌  మోస్ట్‌ గెస్ట్‌లతో వేదిక కళకళలాడింది. 

 బెజోస్, సాంచెజ్ 16వ శతాబ్దపు గ్రాండ్ కెనాల్ పై ఉన్న విలాసవంతమైన అమన్ హోటల్ లో బస చేయగా, ప్రపంచంలోని పురాతన చలనచిత్రోత్సవానికి నిలయంగా ప్రసిద్ధి చెందిన  శుక్రవారం వెనిస్ సరస్సులోని ఒక ద్వీపంలో ప్రముఖ అతిథులు హాజరయ్యే విలాసవంతమైన మరియు ప్రైవేట్ వేడుకలో వెనిస్,బెజోస్‌, సాంచెజ్‌తో వివాహం చేసుకోనున్నారు.శాన్ గియోవన్నీ ఎవాంజెలిస్టా అనే చిన్న ద్వీపంలో ఉన్న విల్లా బాస్లిని తోటలలో గురువారం అతిథులు  విందారగించారు. వివాహ వేడుక శనివారం తుది పార్టీతో ముగుస్తుంది.

మరోవైపు ఇటాలియన్ మీడియా ప్రకారం, ద్వీపంలో

ని ఒక పెద్ద బహిరంగ యాంఫిథియేటర్ లో వివాహం జరుగుతుంది. వేడుక తర్వాత, ఈ జంటకు ప్రముఖ ఒపెరా గాయని ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి సెరినేడ్ చేస్తారని సమాచారం. ఈ వివాహ  వేడుకల కోసం సాంచెజ్ 27 విభిన్న దుస్తులను సిద్ధం చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సగం మంది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని రూపొందించారట. అంతేకాదుతమ వేడుకల్లో భాగంగా, బెజోస్ ,సాంచెజ్ నగరానికి 3.5 మిలియన్లు డాలర్లు  (దాదాపు 30కోట్లు) విరాళంగా ఇస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జైయా తెలిపారు. 

నటాషా పూనవాలా, ఇవాంకా ట్రంప్‌   సందడి
 లవ్‌ బర్డ్స్‌ పెళ్లి సందడికోసం  వెనిస్‌ చేరుకున్నామంటూ ఇవాంకా ట్రంప్‌ కొన్ని ఫోటోలను  ఇన్‌స్టాలోపోస్ట్‌  చేసింది. భారతీయ దాతృత్వవేత్త , ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనవాలా   ఈ వెడ్డింగ్‌ బాష్‌లో అద్భుతంగా కనిపించారు. ఆమె రూపానికి ఫ్యాన్స్‌మాత్రమే కాదు స్వయంగా వధువు  సాంచెజ్‌ కూడాఫిదా అయినట్టు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన వీడియోను నటాషా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. 

విశిష్ట అతిథులు
ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు,  ప్రముఖ అతిథులతోపాటు,  జోర్డాన్ క్వీన్ రానియా, NFL స్టార్ టామ్ బ్రాడీ, అమెరికన్ డిజైనర్ స్పెన్సర్ ఆంట్లే, గాయని అష,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉన్నారు. వీరిని చేరవేసేందుకు మెగా యాచ్‌లు ,వెనిస్‌లోని మార్కో పోలో విమానాశ్రయంలో కనీసం 95 ప్రైవేట్ విమానాలు ల్యాండింగ్ అనుమతిని అభ్యర్థించాయి.

'నో స్పేస్ ఫర్ బెజోస్' ఆందోళనలు
అయితే, ఈ వేడుకపై  పర్యావరణవేత్తలు  స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 'నో స్పేస్ ఫర్ బెజోస్' (బెజోస్‌కు చోటు లేదు) అనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని   ప్రధాన కాలువలు, సెంట్రల్ వెనిస్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.

కాగా గతంలో జర్నలిస్టు,  యాంకర్‌గా పనిచేసిన లారెన్ శాంచెజ్  జెఫ్ బెజోస్‌లు 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. 2019లో భార్య మెకంజీ స్కాట్‌తో బెజోస్ విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ గతేడాది లారెన్ శాంచెజ్‌తో బెజోస్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement