
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్‌లో నిలిచింది.
జెఫ్ బెజోస్‌తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.
ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు
జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్‌కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు.