breaking news
Lauren Sanchez
-
బెజోస్‌తో పెళ్లి, ఆ పోస్ట్లన్నీమాయం, పేరు మార్చేసిన లారెన్ సాంచెజ్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్‌లో నిలిచింది.జెఫ్ బెజోస్‌తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్‌కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు. -
900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు
లేటు వయసులో లేటెస్ట్గా అంటూ లవ్ బర్డ్స్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్,లారెన్ సాంచెజ్ (Lauren Sanchez and Jeff Bezos) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటలీలోని వెనిస్లో శనివారం రాత్రి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ , వినోద రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల వధువు వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.మాజీ టీవీ యాంకర్ , పైలట్ లారెన్ సాంచెజ్, డోల్స్ & గబ్బానా ఆల్టా మోడా రూపొందించిన గౌనులో మెరిసింది. ఈ పెళ్లి గౌను తయారీకి 900 గంటలు పట్టిందట. అలాగే చేతితో తయారు చేసిన ఇటాలియన్ లేస్,180 సిల్క్ చిఫ్ఫోన్-కవర్డ్ బటన్లుకూడా ఉన్నాయట. హౌస్‌బోట్ చిత్రంలో నటి సోఫియా లోరెన్ ధరించిన 1950ల నాటి లుక్ ప్రేరణగా దీని డిజైన్ రూపొందించారు. దీని ధర దాదాపు 12 కోట్లు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. అన్నట్టు ఈ గౌను తయారీ వెనుక పెద్ద కథే ఉందట. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos)వోగ్ కథనం ప్రకారం ఏప్రిల్‌లో, సాంచెజ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్స్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో అంతరిక్ష అంచుకు వెళ్లింది. ఈ అనుభవం తనను అనేక విధాలుగా మార్చిందని, అదే తన జీవితంలో మధురమైన క్షణాల సమయంలో ఎలా కనిపించాలో నిర్ణయం తీసుకునేలా చేసిందని తెలిపింది. అంతకుముందు తాను స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరించాలని ఊహించుకున్నానని సాంచెజ్ చెప్పింది. కాలాతీతంగా, అర్థవంతంగా తన డ్రెస్ ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే తన పెళ్లి రోజున తన గ్లామ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది, ఇది గౌను కాదు, కవితా భాగం, మీ మ్యాజిక్కు ధన్యవాదాలు అంటూ మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.తానేంటో, తన స్టోరీ ఏంటో తెలియజేయాలనే కోరికతోపాటు, 11 నిమిషాలు తన అంతరిక్ష యాత్రకు ప్రత్యేక జ్ఞాపకంగా కొంచెం నీలిరంగులో,ముఖ్యంగా పెళ్లి కూతుళ్లు అదృష్టంగా భావించే వివాహ సంప్రదాయాన్ని జోడించేలా ఈ స్పెషల్ వెడ్డింగ్ గౌన్‌ను ఎంచుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఈ డ్రెస్‌ను ముందే చూడాలిన జెఫ్ బెజోస్ చాలా వేడుకున్నాడట. కానీ బిగ్ సర్ప్రైజ్గా ఉండాలని లారెన్ సాంచెజ్ దీనికి సున్నితంగా తిరస్కరించిందిట. కాగా 2019నుంచి డేటింగ్లో ఉన్న లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్, గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 27న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vogue (@voguemagazine) -
అంగరంగ వైభవంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి వేడుక (ఫోటోలు)
-
ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్ చేసిన లారెన్
ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్ ఫొటోను లారెన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జెఫ్ బెజోస్(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్ అయిన లారెన్(55)తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరగ్గా.. శుక్రవారం(జూన్ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.వివాహం తర్వాత ఈ ఇన్‌స్టా పేజీకి తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్‌గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్‌లను షేర్ చేశారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్‌లు 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్తో ఎంగేజ్మెంట్ టైంలో 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.వైవాహిత జీవితానికొస్తే.. మెకెంజీ స్కాట్‌ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్‌తో డేటింగ్ మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) -
కుబేరుడి పెళ్లి సందడి షురూ : అంగరంగవైభవంగా మూడు రోజుల ముచ్చట
ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) పెళ్లి సందడి మొదలైంది. 61 ఏళ్ల టెక్ బిలియనీర్, 55 ఏళ్ల ప్రేయసి లారెన్ సాంచెజ్‌తో వెడ్ లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రాంభమైనాయి. గురువారం తమ మూడు రోజుల వివాహ వేడుకలు షురూ అయ్యాయి. ఈ వేడుకలకు కిమ్ చ ఖ్లో కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే , ఓర్లాండో బ్లూమ్ వంటి టాప్ మోస్ట్ గెస్ట్‌లతో వేదిక కళకళలాడింది. This is Jeff Bezos’s $500 million yacht. Republicans are cutting Americans’ healthcare to give him a tax cut so he can buy a bigger yacht. pic.twitter.com/SxTRaIxqpn— Piyush Mittal 🇺🇸🇺🇦🇬🇪🇨🇦🟧🌊🌈 (@piyushmittal) June 26, 2025 బెజోస్, సాంచెజ్ 16వ శతాబ్దపు గ్రాండ్ కెనాల్ పై ఉన్న విలాసవంతమైన అమన్ హోటల్ లో బస చేయగా, ప్రపంచంలోని పురాతన చలనచిత్రోత్సవానికి నిలయంగా ప్రసిద్ధి చెందిన శుక్రవారం వెనిస్ సరస్సులోని ఒక ద్వీపంలో ప్రముఖ అతిథులు హాజరయ్యే విలాసవంతమైన మరియు ప్రైవేట్ వేడుకలో వెనిస్,బెజోస్, సాంచెజ్‌తో వివాహం చేసుకోనున్నారు.శాన్ గియోవన్నీ ఎవాంజెలిస్టా అనే చిన్న ద్వీపంలో ఉన్న విల్లా బాస్లిని తోటలలో గురువారం అతిథులు విందారగించారు. వివాహ వేడుక శనివారం తుది పార్టీతో ముగుస్తుంది.మరోవైపు ఇటాలియన్ మీడియా ప్రకారం, ద్వీపంలోని ఒక పెద్ద బహిరంగ యాంఫిథియేటర్ లో వివాహం జరుగుతుంది. వేడుక తర్వాత, ఈ జంటకు ప్రముఖ ఒపెరా గాయని ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి సెరినేడ్ చేస్తారని సమాచారం. ఈ వివాహ వేడుకల కోసం సాంచెజ్ 27 విభిన్న దుస్తులను సిద్ధం చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సగం మంది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని రూపొందించారట. అంతేకాదుతమ వేడుకల్లో భాగంగా, బెజోస్ ,సాంచెజ్ నగరానికి 3.5 మిలియన్లు డాలర్లు (దాదాపు 30కోట్లు) విరాళంగా ఇస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జైయా తెలిపారు. నటాషా పూనవాలా, ఇవాంకా ట్రంప్ సందడి లవ్ బర్డ్స్ పెళ్లి సందడికోసం వెనిస్ చేరుకున్నామంటూ ఇవాంకా ట్రంప్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలోపోస్ట్ చేసింది. భారతీయ దాతృత్వవేత్త , ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనవాలా ఈ వెడ్డింగ్ బాష్‌లో అద్భుతంగా కనిపించారు. ఆమె రూపానికి ఫ్యాన్స్మాత్రమే కాదు స్వయంగా వధువు సాంచెజ్ కూడాఫిదా అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను నటాషా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. విశిష్ట అతిథులుప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖ అతిథులతోపాటు, జోర్డాన్ క్వీన్ రానియా, NFL స్టార్ టామ్ బ్రాడీ, అమెరికన్ డిజైనర్ స్పెన్సర్ ఆంట్లే, గాయని అష, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉన్నారు. వీరిని చేరవేసేందుకు మెగా యాచ్‌లు ,వెనిస్లోని మార్కో పోలో విమానాశ్రయంలో కనీసం 95 ప్రైవేట్ విమానాలు ల్యాండింగ్ అనుమతిని అభ్యర్థించాయి.'నో స్పేస్ ఫర్ బెజోస్' ఆందోళనలుఅయితే, ఈ వేడుకపై పర్యావరణవేత్తలు స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నో స్పేస్ ఫర్ బెజోస్' (బెజోస్‌కు చోటు లేదు) అనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కాలువలు, సెంట్రల్ వెనిస్లోని పలు పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.కాగా గతంలో జర్నలిస్టు, యాంకర్‌గా పనిచేసిన లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్‌లు 2018 నుంచి డేటింగ్లో ఉన్నారు. 2019లో భార్య మెకంజీ స్కాట్‌తో బెజోస్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గతేడాది లారెన్ శాంచెజ్‌తో బెజోస్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రూ.43 వేల కోట్ల పడవపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్‌కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు. -
అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?
ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి గోల ఏంటంటే..అమెరికా టెక్ దిగ్గజం జెఫ్ బెజోస్(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్లో జూన్ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.వెనిస్లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్‌లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా.. విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు. ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని ఒక అంచనా. వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’’ అంటూ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్ను ప్రైవేట్ పార్టీగా బెజోస్ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది. మెకెంజీ స్కాట్‌ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్‌వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్‌తో డేటింగ్ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్ డాలర్లు)2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్‌రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చారు. 2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్ సింగర్ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు. ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు2018లో ఉదయ్‌పూర్‌లోని రాజమహల్లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు2004లో ఫ్రాన్స్‌లో వెర్సైల్స్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు. 5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు1981లో ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు. 6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు2018లో విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లుఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం. 8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు2011లో వెస్ట్‌మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు 9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్‌లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్‌తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లుబాస్కెట్బాల్ చక్రవర్తి మైఖేల్ జార్డన్ వివాహం క్యూబన్ అమెరికా మోడల్ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్ వివాహ వేడుక గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.