
ప్రపంచ కుబేరులలో ఒకరు 'జెఫ్ బెజోస్' తల్లి 'జాక్లిన్ గిస్ బెజోస్' ఆగస్టు 14, 2025న మరణించారు. ఈ విషయాన్ని అమెజాన్ ఫౌండర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు.
జాక్లిన్ గిస్ బెజోస్ 78ఏళ్ల వయసులో లెవీ బాడీ డిమెన్షియాతో కన్నుమూశారు. ''లెవీ బాడీ డిమెన్షియా అనే మెదడు సంబంధిత వ్యాధితో సుదీర్ఘ పోరాటం తర్వాత, ఆమె ఈరోజు మరణించింది, ఆమెను ప్రేమించేవారు మనలో చాలామంది ఉన్నారు. నేను ఆమెను ఎప్పటికీ నా గుండెల్లో ఉంచుకుంటాను. ఐ లవ్ యూ అమ్మ'' అంటూ జెఫ్ బెజోస్ భావోద్వేగ పోస్ట్ చేశారు.
బెజోస్ భార్య లారెన్ సాంచెజ్ బెజోస్ ఆ పోస్ట్ కింద.. "మేము ఆమెను చాలా మిస్ అవుతాము, లవ్ యూ" అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజి యాడ్ చేశారు.
జాక్లిన్ బెజోస్ గురించి
డిసెంబర్ 29, 1946న వాషింగ్టన్, డీసీలో జన్మించిన జాక్లిన్.. న్యూ మెక్సికోలోని బెర్నాలి, అల్బుకెర్కీలలో పెరిగారు. చదువుకునే వయసులోనే 'టెడ్ జోర్గెన్సెన్'తో బిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి పాఠశాలలో చదువుతూ.. పగటిపూట పని చేస్తూ జెఫ్‌ను పెంచింది. అయితే వీరు విడిపోయారు. 1968లో, ఆమె క్యూబా వలసదారు మిగ్యుల్ “మైక్” బెజోస్‌ను వివాహం చేసుకుంది, అతను జెఫ్‌ను దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత జాక్లిన్ & మైక్ జంటకు మార్క్ & క్రిస్టినా అనే పిల్లలు జన్మించారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించారు.