
భారత సంతతి సీఈవో లీనా నాయర్‌కు బ్రిటన్ అత్యున్నత గౌరవం లభించింది. ఆమె ఛానెల్ సీఈవోగా రిటైల్ అండ్ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గానూ..యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ మేరకు ఛానెల్ గ్లోబెల ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీనా నాయర్‌ను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.
ఈ కొత్తఏడాది 2025 గౌరవ పురస్కారాల జాబితాలో ఆమె ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. అంతేగాదు ఛానెల్ బ్రాండ్ లీనా శక్తిమంతమైన నాయకురాలిగా ప్రపంచఖ్యాతీ సంపాదించుకుందని ప్రశంసించింది. దీర్ఘకాలిక సమగ్ర వ్యాపార ప్రభావాన్ని అందించింది. తన బ్రాండ్ హవాను కొనసాగించడం, క్లయింట్ అనుభవాన్ని మెరుగుపరచడం,నిలకడగా సాగేలా వేగవంతం చేయడం వంటి సేవలను అందించిదని ఛానెల్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
కాగా భారతీయ వ్యాపార కార్యనిర్వాహకురాలిగి లీనా నాయర్ జనవరి 2022లో ఛానెల్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్‌లో ఆమెనే తొలి భాతర సంతతి మహిళా సీఈవో. తన నాయకత్వంలో ఛానెల్ బ్రాండ్‌కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేసింది. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్‌కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేసింది.
తద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుండటం విశేషం. ఇక ఆమె ఛానెల్‌లో చేరడాని కంటే ముందు..యూనిలీవర్‌లో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. చివరగా లీనా స్వస్థలం భారత్‌లోని మహారాష్ట్రలోని కోల్హాపూర్. ఆమె బాల్యమంతా గడిచింది. ఉన్నత విద్య కోస యూకే వచ్చి అక్కడే సెటిల్ అయ్యారామె.