ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : ఫొటో దెబ్బకి ఎంపీ రాజీనామా | Epstein Files Expose Ex British Envoy Peter Mandelson | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : ఫొటో దెబ్బకి ఎంపీ రాజీనామా

Feb 2 2026 3:51 PM | Updated on Feb 2 2026 3:55 PM

Epstein Files Expose Ex British Envoy Peter Mandelson

లండన్‌: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ఫైళ్లు అమెరికాలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంకీ ఎప్‌స్టీన్‌ పేజీలను విడుదల చేశారు. వాటిల్లో మాజీ యూకే రాయబారి ప్రస్తుత అధికార లేబర్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు పీటర్ బెంజమిన్ మాండెల్సన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది

ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో పీటర్‌ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పీటర్‌ లోదస్తులతో ఉండగా.. ఆయనతో ఓ మహిళా సన్నిహితంగా ఉంది. ఆ ఫొటోలపై దుమారం చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఫొటో గురించి అడగ్గా.. 'తెలియదు గుర్తులేదు మర్చిపోయా'. దాట వేశారు. ప్రస్తుతం,ఈ అంశంపై యూకే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది

ఇక ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో 2003-04 మధ్య కాలంలో ఎప్‌స్టీన్‌కు పీటర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎప్‌స్టీన్‌ నుంచి పీటర్‌కు సుమారు 75వేల డాలర్లు అందగా.. 25వేల డాలర్లకు సంబంధించి లావాదేవీల వివరాలు ఉండటం గమనార్హం. పీటర్‌తో అస్పష్టంగా ఉన్న మహిళ గురించి వివరాలు గురించి ఆయన్ని మీడియా ఆరా తీసింది.  

ఫోటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదు. ఆ ప్రదేశాన్ని, స్త్రీని తాను గుర్తించ లేకపోతున్నానని, ఏ సందర్భంలో ఆ ఫొటోను దిగాల్సి వచ్చిందో గుర్తించ లేకపోతున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement