ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం.. | Axiom 4 crew unveiled the missions zero gravity indicator Swan Toy | Sakshi
Sakshi News home page

ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..

Jun 5 2025 12:47 PM | Updated on Jun 5 2025 3:08 PM

Axiom 4 crew unveiled the missions zero gravity indicator Swan Toy

సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్‌ని రాకెట్‌లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్‌కు చెందిన ఆక్సియమ్ స్పేస్ మిషన్‌ని స్పేస్‌ఎక్స్-నాసా భాగస్వామ్యంతో మరికొద్దిరోజుల్లోనే ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్‌కు భారత్‌కి చెందిన శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు. మరీ ఈసారి జీరో గ్రావిటీలో చేరుకున్నందుకు గుర్తుగా వ్యోమగాములు ఏ బొమ్మను తీసుకువెళ్తున్నారు..? దాని ప్రత్యేకత వంటి విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!..

ఆక్సియమ్ స్పేస్ మిషన్‌ ఈ నెల జూన్‌ 10న ప్రారంభకానుంది. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ లాంఛ్‌ అవుతుంది. ఈ రాకెట్‌ నలుగురికిపైగా వ్యోమగాములు, వారి పరిశోధన సామాగ్రితో సహా అంతరిక్ష కక్ష్యలోకి తీసుకువెళ్లనుంది. వారితోపాటు జీరో-గ్రావిటీకి గుర్తుగా ఓ చిన్న బొమ్మ కూడా ఈ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ బొమ్మను జీరోగ్రావిటీ ఇండికేటర్‌గా వ్యవహరిస్తారు.

ఈ మేరకు ప్రీ-ఫ్లైట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ఆక్సియం-4 సిబ్బంది మిషన్ జీరో-గ్రావిటీ ఇండికేటర్‌ను ఆవిష్కరించారు. అదేంటంటే సరస్వతి దేవి వాహనమైన 'హంస'. భారరహిత స్థితిలోకి చేరుకున్న దృశ్యమానాన్ని సూచించడానికి వ్యోమగాములు తమ వెంట ఏదో ఒక బొమ్మ తీసుకువెళ్లే సంప్రదాయంలో భాగంగా ఈ సారి హంసను ఎంపిక చేసుకున్నట్లు ఆక్సియం మిషన్‌ పేర్కొది. 

ఇదే ఎందుకంటే..
భారతీయులు జ్ఞానాన్ని, ఉన్నత విద్యను అందించే దేవతగా సరస్వతి మాతను ఆరాధిస్తారు. ఆమె వాహనమే ఈ హంస. ఆంనదాన్ని హంసతో పోలుస్తారు. హంస రంగులా ఆనందం నిర్మలమైన తెలుపులో ఉంటుదనేందుకు సూచిక. అలాగే దాని ముక్కు పసుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. అంటే సవాళ్లు, విజయాలు ఒకదాని వెంట ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అదీగాక ఈ మిషన్‌లో ప్రయాణించి నలుగు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ హంసనే సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవడం విశేషం. 

ముఖ్యంగా ఆ సభ్యులలో ఒకరైన భారతీయ వ్యక్తి వ్యోమగామి శుక్లాకు ఆ బొమ్మతో మతపరంగా మరింత లోతైన సంబంధం ఉంది. ఈ మేరకు గ్రూప్‌ కెప్టెన్‌ శుక్లా మాట్లాడుతూ..హంసకు పాల నుంచి నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందని విశ్వసిస్తారు. ఇది జ్ఞానానికి సూచిక. ఈ బొమ్మ  మా మిషన్‌ని విజయంతం చేసేలా స్ఫూర్తిని నింపుతుందన్నారు. 

ఇక ఈ మిషన్‌ కమాండర్‌ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మాట్లాడుతూ..వ్యోమగామి సిబ్బంది మైక్రోగ్రావిటీ గుర్తుగా స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లోపల ఈ హంస బొమ్మ స్వేచ్ఛగా తేలుతున్నట్లు కెమెరాల్లో చూడొచ్చన్నారు. అంతేగాదు ఈ ఆక్సియమ్‌ రాకెట్‌ను ప్రయోగించిన కొద్దిసేపటికే.. ఈ టాయ్‌ మైక్రోగ్రావిటీలో మన రాకను సూచిస్తుందని చెప్పారు. ఇక మిషన్‌లో పాల్గొన్న మూడు దేశాల వ్యోమగాముల ఆకాంక్షలకు చిహ్నం కూడా ఈ హంస బొమ్మే. అదేలా అంటే..భారతదేశంలో ఇది జ్ఞానానికి చిహ్నం కాగా, పోలాండ్‌, హంగేరిలో ఇది దయకు సంకేతం. 

అంతేగాదు ఆ నలుగురు వ్యోమగాముల వైవిధ్యానికి, ఐక్యతకు చిహ్నంగా ఈ హంస బొమ్మ నిలవడం మరింత విశేషం. కాగా, ఈ ఆక్సియమ్‌ 4 మిషన్‌ గత నెల మే29న ప్రారంభం కావలి, అనివార్య కారణాల రీత్యా జూన్‌ 8కి షెడ్యూల్‌ చేశారు.  ఆ తర్వాత జూన్‌ 10 సాయంత్రం 5.52 నిమిషాలకు లాంఛ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది స్పేస్‌ఎక్స్‌. 

మిషన్‌ సోవియట్ సోయుజ్ T-11తో  రాకేష్ శర్మ  అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడు కాగా,  సరిగ్గా 41 ఏళ్లకు, ఆక్సియమ్‌​ 4 మిషన్‌తో గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలిచారు. అంతేగాదు బహుళ భారతీయ ఏజెన్సీల భాగస్వామ్యంతో శాస్త్రీయ ప్రయోగాలతో కూడిన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొన్న మొదటి భారత పౌరుడు కూడా ఆయనే.

(చదవండి: భారత్‌పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్‌చేస్తే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement