రుచికోసం నూనెను నీళ్లలా వాడేస్తుస్తున్న రోజులివి. తెలియకుండానే నెల గడిచే సరికి లీటర్ల కొద్దీ తాగేస్తున్నారు. మరణాలకు ఇదే కారణమా? అసలు రోజుకు ఎంత నూనె వాడాలి? నిపుణుల మాటల్లో..
ప్రస్తుతం మనం వాడే నూనెల్లో.. 37 శాతం పామాయిల్, సోయాబీన్ 20 శాతం, ఆవనూనె 14 శాతం, సన్‌ఫ్లవర్ 13 శాతమే
వంట నూనెల వినియోగం గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం సగటున ఏడాదికి 24 కేజీల వంట నూనె వినియోగం. ఇది ఐసీఎంఆర్ సిఫారసు కంటే డబుల్.
రోజుకి 15-20 ఎంఎల్ మోతాదుకి మించి వాడొద్దంటున్నారు నిపుణులు. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్‌లో 100 కేలరీలు.
అందుకే ఒకరోజులో.. వంట నూనె మూడు నుంచి 4 టేబుల్ స్పూన్లకు మించకూడదట. అలాగే ఒక్క రోజులో 30 గ్రాములకు మించి కొవ్వు పదార్థాలు తీసుకోవద్దట.
అధిక నూనె వినియోగంతో అనారోగ్య సమస్యలు తప్పవు. అందులో.. ఊబకాయం, గుండె వ్యాధులు, ఫ్యాటీ లివర్, టైప్-2 మధుమేహం ఖాయం
అన్‌లిమిటెడ్‌గా ఆయిల్ వాడితే పెను ముప్పు ఖాయం. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వినియోగించకపోవడమే ఉత్తమం.
వేపుళ్లకు బదులు స్టీమింగ్, బేకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి ఎలా పడితే అలా వాడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆయిల్.. అతిగా వాడితే అంతే!


