మేకప్‌ ప్రొడక్ట్స్‌తో బికేర్‌ఫుల్‌..! పాపం ఆ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ .. | Beauty Influencer Known for Eating Cosmetic Products become her life loss | Sakshi
Sakshi News home page

మేకప్‌ ప్రొడక్ట్స్‌తో బికేర్‌ఫుల్‌..! పాపం ఆ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ..

Jun 5 2025 4:44 PM | Updated on Jun 5 2025 5:59 PM

Beauty Influencer Known for Eating Cosmetic Products become her life loss

మేకప్‌ వేసుకోవడం అంటే చాలామంది అతివలకు ఇష్టం. అదీగాక యూట్యూబ్‌ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో సౌందర్య సాధనాలతో చేసేపనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్‌లు సైతం మేకప్‌ ప్రొడక్ట్స్‌ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్‌ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెట్టేస్తారు. అలానే ఇక్కడొక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ నిర్లక్ష్య ధోరణితో చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. 

వివరాల్లోకెళ్తే..సోషల్‌ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే ఈ తైవాన్‌ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ మేకప్ ముక్‌బాంగ్‌కు ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆమె మేకప్‌కి సంబంధించిన వీడియోలతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సింపుల్‌ చిట్కాలతో చక్కగా మేకప్‌ వేసుకోవడం ఎలాగో చూపించడం తోపాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్‌ టేస్ట్‌ చేస్తానంటూ కామెడీ చేసేది. 

ఒక్కోసారి నిజంగానే టేస్ట్‌ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్‌ వీడియోలకు మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్‌ దగ్గరి నుంచి లిప్‌స్టిక్‌ వరకు అన్ని టేస్ట్‌ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్

సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్‌ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్‌డమ్‌ సంపాదించుకుంది గానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్‌ ఉత్పత్తులను టేస్ట్‌ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్‌ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించడం గమనార్హం. 

నిపుణుల వార్నింగ్‌..
దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్‌ ప్రొడక్ట్స్‌లో వాడే కెమికల్స్‌ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్‌ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. అంతేగాదు మేకప్‌ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. అలాగే మేకప్‌తో అలానే అస్సలు పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు.

 

(చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement