
సోమవారం(జూన్ 30) సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి.

పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. ప్రమాదంలో పలువురు మరణించగా.. తీవ్ర గాయాలతో మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద తీవ్రతకు ఇంకొందరు గల్లంతు అయ్యారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది.























