ది బెస్ట్‌ ఐస్‌ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్‌లకు చోటు..! | 5 Indian Ice Creams Among TasteAtlas Top 100 | Sakshi
Sakshi News home page

ది బెస్ట్‌ ఐస్‌ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్‌లకు చోటు..! నటి దీపికా పదుకొణె

Jun 27 2025 12:38 PM | Updated on Jun 27 2025 6:21 PM

5 Indian Ice Creams Among TasteAtlas Top 100

ఆన్‌లైన్ ఫుడ్ ర్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ది బెస్ట్‌ రెసీపీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, రెస్టారెంట్లలు తదితర వాటిల జాబితా అందించనట్టుగానే ఈసారి అందరికి ఇష్టమైన చల్లటి హిమక్రీమ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. వాటిలో భారత్‌కి చెందిన ఐదు ప్రముఖ బ్రాండ్‌ల ఐస్‌క్రీమ్‌లు చోటు దక్కించుకోవడం విశేషం. మెత్తం వంద ది బెస్ట్‌ ఐస్‌క్రీమ్‌ల జాబితాను వెల్లడించగా అందులో ఐదు భారతీయ ఐస్‌క్రీమ్‌లకు స్థానం లభించింది. 

వాటిలో ముందుంజలో ఉన్నది ముంబైకి చెందిన  కె. రుస్టమ్స్ & కో. బ్రాండ్‌కి చెందిన మ్యాంగో శాండ్‌విచ్ ఐస్‌క్రీమ్‌. దీన్ని సన్నని వేఫర్‌లలో ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌లకు గమ్యస్థానంగా నిలిచింది. ఇది అత్యంత పురాతన ఐసీక్రీమ్‌ దుకాణం. దీన్ని దాదాపు 1950లలో స్థాపించారు. అప్పటి నుంచి విభిన్న రుచుల ఐస్‌క్రీమ్‌లతో వినియోగదారులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మామిడి శాండ్‌విచ్‌ టేస్ట్‌ అట్లాస్‌ గుర్తింపుతో మరింత ప్రజాదరణను పొందనున్నది. 

ఇక రెండో స్థానంలో పబ్బాస్, మంగళూరు గడ్బాద్ ఐస్‌క్రీమ్‌ ఉంది. ఇది సాంప్రదాయ ఐస్ క్రీం రుచులకు ప్రసిద్ధి చెందింది. దీనిలో జెల్లీలు, పండ్లు మిళితం చేసిన గడ్బాద్ ఐస్ క్రీమ్‌ ఇది. దీన్ని స్థానికులు, పర్యాటకులు అత్యంత ఇష్టంగా తింటారట. మూడవ స్థానంలో సహజసిద్ధమైన కొబ్బరితో చేసిన ఐస్‌ క్రీమ్‌. ఈ బ్రాండ్‌ 1984లో స్థాపించారు. ఇప్పటి దీని ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదు.  

ఇక నాల్గవ స్థానంలో అప్సరస్ జామ ఐస్ క్రీమ్‌ దక్కించుకుంది. ఇది కూడా ముంబైలో స్థాపించబడిన బ్రాండ్‌. టేస్టీ అట్లాస్‌ కూడా ఈ జామా ఐస్‌క్రీం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది జామ ముక్కల తోపాటు మసాల దినుసులతో తయారు చేసిన వెరైటీ ఐస్‌క్రీమ్‌. చివరి స్థానంలో కార్నర్ హౌస్, బెంగళూరు డెత్ బై చాక్లెట్ అని పిలిచే సిగ్నేచర్ ఐస్ క్రీమ్‌ ఉంది. 

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె అత్యంత ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్‌ అట. ఇది పొరలు పొరలుగా ఉండి, పైన చెర్రీ కూడా ఉంటుందట. దీన్ని గుడ్డు సొన, చక్కెర కలయికతో తయారు చేస్తారు. అయితే ఆహారప్రియులు దీన్ని ఎక్కువగా చెస్ట్‌నట్ తేనెతో సేవిస్తారట. 

(చదవండి: విదేశీ వంటకాలకు కేరాఫ్‌గా భాగ్యనగరం..!)
 

Advertisement
 
Advertisement
Advertisement