ఇవి.. కాళ్లతో రుచి చూస్తాయి! | Amazing Facts About Butterflies | Sakshi
Sakshi News home page

ఇవి.. కాళ్లతో రుచి చూస్తాయి!

Jun 4 2026 9:41 AM | Updated on Jun 4 2026 9:41 AM

Amazing Facts About Butterflies

అవునా!

పిల్లలూ! మనం రుచి ఎలా చూస్తాం? నాలుకతో కదా.. కానీ సీతాకోకచిలుకలు వాటి కాళ్ళతో రుచి చూస్తాయి! అవును, మీరు విన్నది నిజమే. సీతాకోకచిలుకల కాళ్ళ చివరన చిన్న చిన్న సెన్సార్లు (రుచిని కనిపెట్టే భాగాలు) ఉంటాయి.

మన నాలుక మీద టేస్ట్‌ బడ్స్‌ ఎలా ఉంటాయో, వాటి కాళ్ళకు అలా ఉంటాయన్నమాట. ఒక సీతాకోకచిలుక ఏదైనా ఆకు మీద గానీ, పువ్వు మీద గానీ వాలినప్పుడు... అది తినడానికి మంచిదా కాదా అనేది దాని కాళ్ళ ద్వారా వెంటనే తెలిసి΄ోతుంది. అలాగే సీతాకోక చిలుకకు మనలాగా నోరుకూడా ఉండదు. దానికి బదులు ఒక స్ట్రా లాంటి పొడవైన గొట్టం ఉంటుంది. కాళ్ళతో రుచి చూసి నచ్చిన తర్వాత, ఆ స్ట్రా ద్వారా పువ్వుల్లోని తేనెను తాగేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement