భయం వేస్తే వీపు తట్టేదెందుకో తెలుసా? | Touch Therapy For Kids, Why A Gentle Pat On The Back Helps When You Feel Scared, More Details Inside | Sakshi
Sakshi News home page

భయం వేస్తే వీపు తట్టేదెందుకో తెలుసా?

Jul 18 2026 9:58 AM | Updated on Jul 18 2026 10:26 AM

Touch Therapy To Use When Feeling Scared Kids Special Story

కిడ్స్‌ స్పెషల్‌

టచ్‌ థెరపీ

డన్‌గా మనం భయపడినప్పుడు అమ్మో, నాన్నో వచ్చి వీపు తడతారు కదా. ఎందుకో తెలుసా? మన వీపు మీద చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. పెద్దలు తట్టినప్పుడు ఆ నరాలు మెదడుకు కబురు పంపిస్తాయి... ‘భయపడకు, నీ పక్కన నీవాళ్లు ఉన్నారు’ అని.

ఆ సిగ్నల్‌ రాగానే మన మెదడు ‘సేఫ్‌’ అని ఫీల్‌ అవుతుంది. భయం వేస్తే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీపు మీద లయగా తడితే ఆ తట్లు గుండెకి ‘మెల్లగా కొట్టుకో’ అని మెసేజ్‌ చేస్తాయి. డాక్టర్లు దీన్ని ‘టచ్‌ థెరపీ’ అంటారు.

పూర్వం అడవిలో మనుషులు గుంపులుగా తిరిగేవాళ్లు. క్రూరమృగాలు తమను పసిగట్టకుండా మెల్లగా నడిచేవారు. అప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తే పెద్దవాళ్లు వీపు తట్టి ‘ష్‌... పడుకో. పులి వస్తుంది’ అని కాపాడేవాళ్లు. ఆ అలవాటు ఇప్పటికీ మన రక్తంలోనే ఉంది. కాబట్టి నెక్ట్స్‌ టైమ్‌ భయం వేస్తే, పెద్దల దగ్గరికి పరిగెత్తి వీపు అప్పగించేయండి. తట్టు ఫ్రీ... భయం పరార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement