వెన్నుకు దన్నుగా... శలభాసనం! | Shalabhasana Locust Pose For A Healthy Spine | Sakshi
Sakshi News home page

వెన్నుకు దన్నుగా... శలభాసనం!

Jul 18 2026 9:05 AM | Updated on Jul 18 2026 9:05 AM

Shalabhasana Locust Pose For A Healthy Spine

యోగా

లభం అంటే మిడత. ఈ ఆసనంలో శరీర ఆకారం మిడతలా కనిపిస్తుంది కాబట్టి దీనిని శలభాసనం అంటారు. శలభాసనం అనేది పొట్టపై పడుకుని చేసే యోగాసనం. ఇది వెన్నెముకను బలపరచి, శరీరానికి స్థిరత్వాన్ని, శక్తిని అందించడంలో సహాయపడుతుంది.

చేసే విధానం...
- మ్యాట్‌పై బోర్లా (పొట్టపై) పడుకోవాలి.
- రెండు కాళ్లను నిటారుగా ఉంచి, చేతులను తొడల కింద ఉంచాలి.
- గడ్డాన్ని లేదా నుదుటిని నేలపై ఆనించాలి.
- శ్వాసను లోపలికి తీసుకుంటూ రెండు కాళ్లను మోకాళ్లు వంచకుండా పైకి ఎత్తాలి.
- తొడలు, నడుము కండరాలను బిగించి 10–30 సెకన్లు అదే స్థితిలో ఉంచాలి.
- శ్వాసను వదులుతూ నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి.
- 3–5 సార్లు పునరావృతం చేయాలి.

జాగ్రత్తలు...
- గర్భిణులు ఈ ఆసనం వేయకూడదు.
- ఇటీవల కాలంలో పొట్ట లేదా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నవారు చేయకూడదు.
- తీవ్రమైన నడుము నొప్పి, స్లిప్‌ డిస్క్, హెర్నియా ఉన్నవారు వైద్యుడు లేదా యోగా నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి.
- అధిక రక్తపోటు లేదా తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.
- కాళ్లను ఒక్కసారిగా పైకి ఎత్తకుండా, నెమ్మదిగా శ్వాసతో సమన్వయం చేసుకుంటూ చేయాలి.
- నొప్పి అనిపిస్తే వెంటనే ఆసనం ఆపాలి.

ప్రయోజనాలు... 
- వెన్నెముకను బలంగా, ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.
- నడుము కండరాలు, తొడలు బలపడతాయి.
- పొట్ట అవయవాలకు మసాజ్‌ లభించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది (సరైన మార్గదర్శకత్వంలో చేస్తే).
- శరీర భంగిమ మెరుగుపడుతుంది.
- రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.
- అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది.
- కోర్‌ కండరాలను బలపరుస్తుంది.
- మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.
- అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement