నైంటీ.. అయితే ఏంటి? | Viral Instagram Video Of An Elderly Man With Physiotherapist Dr Akash Singh | Sakshi
Sakshi News home page

నైంటీ.. అయితే ఏంటి?

Jul 18 2026 8:34 AM | Updated on Jul 18 2026 8:54 AM

Viral Instagram Video Of An Elderly Man With Physiotherapist Dr Akash Singh

లైఫ్‌స్టైల్‌, హెల్త్‌

ఫిట్‌నెస్‌ అనేది కేవలం యువకులకు, బాడీబిల్డర్లకు మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. ముసలితనం వచ్చిందని ఇంట్లోనే కూర్చోకుండా, జిమ్‌కు వెళ్తూ ఆయన చేస్తున్న కఠినమైన వర్కవుట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ ఆకాష్‌ సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వృద్ధుడికి సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేస్తూ ఈవిధంగా రాసుకొచ్చారు.

‘జిమ్‌ అనేది కేవలం సిక్స్‌ ప్యాక్‌ కోసమో, కండలు పెంచి అందంగా కనిపించడం కోసమో మాత్రమే కాదు. అంతకు మించి.. వయసు పైబడిన వారు తమ దైనందిన పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలగడానికి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి, కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం.’ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలను కూడా శారీరక శ్రమ వైపు ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement