సిటీ లైఫ్‌తో పరేషాన్‌! | Findings Revealed In The National Statistics Office's Latest Health Survey, Reveals Sharp Rise in Lifestyle Diseases Across India | Sakshi
Sakshi News home page

సిటీ లైఫ్‌తో పరేషాన్‌!

Jul 18 2026 9:17 AM | Updated on Jul 18 2026 10:11 AM

Findings Revealed In The National Statistics Office's Latest Health Survey

లైఫ్‌స్టైల్‌, హెల్త్‌

భారత్‌లో టైఫాయిడ్, మలేరియా వంటి అంటువ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ, జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (జాతీయ గణాంక కార్యాలయం) నిర్వహించిన తాజా ఆరోగ్య సర్వేలో వెల్లడయిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్‌ వంటి సమస్యలు గత పదేళ్లలో దేశంలో విపరీతంగా పెరిగినట్లు ఎన్‌ఎస్‌వో సర్వేలో స్పష్టమయ్యింది. ప్రస్తుతం దేశ జనాభాలో దాదాపు సగం మంది గుండె సంబంధిత సమస్యలు, మెటబాలిక్‌ లోపాలతో బాధపడుతున్నారు. పదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 31 శాతంగా మాత్రమే ఉండేది.

గణాంకాల ప్రకారం.. 2017–18 నాటి సర్వేలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు 16.7 శాతం మాత్రమే ఉండగా.. నేడు అది 25.6 శాతానికి పెరిగిపోయింది. అలాగే థైరాయిడ్, మధుమేహం వంటి జీవనశైలి సమస్యలు గతంలో 15 శాతం మాత్రమే ఉండగా నేడు 24.2 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో ఈ నాన్‌ కమ్యూనికేబుల్‌ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2017–18లో 32 శాతంగా ఉన్న ఇన్ఫెక్షన్ల రేటు, 2025 నాటికి 15 శాతానికి పడిపోయింది.

మహిళల్లో పెరుగుతోన్న అనారోగ్యం..
దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. భారతీయుల్లో మొత్తం అనారోగ్య స్థాయిలు గత సర్వేతో పోల్చినపుడు విపరీతంగా పెరిగాయి. గత సర్వేలో 7.5 శాతం మాత్రమే ఉండగా ప్రస్తుతం 13.1 శాతానికి పెరిగింది. ఇందులో పురుషుల శాతం 11.8 శాతం ఉండగా, మహిళల శాతం 14.4 శాతంగా ఉంది. అంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే వయసు పైబడిన వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో అనారోగ్య రేటు 27.7% నుండి 43.9%కి పెరిగింది. అలాగే వైద్య ఖర్చులు కూడా తీవ్రంగా పెరిగినట్లు ఎన్‌ఎస్‌ఓ అధ్యయనాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement