గోల్ఫ్‌ ఆటకు గద్ద కాపలా! | Meet The Golf Course Guardian, A Trained Hawk Keeps Birds Away At The Open Championship, Check More Details | Sakshi
Sakshi News home page

గోల్ఫ్‌ ఆటకు గద్ద కాపలా!

Jul 18 2026 9:41 AM | Updated on Jul 18 2026 9:51 AM

Curious Incident Guard Eagle During Game At Royal Birkdale Golf Club

కిడ్స్‌ స్పెషల్‌

పిల్లలూ... ఈ ఫోటోలో పెంపుడు గద్ద కనిపిస్తుంది చూశారా? ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇది గోల్ఫ్‌ ఆటగాళ్లకు కాపలాదారుగా పని చేస్తోంది! అవును, నిజంగా! మొన్న జూలై 16న ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో 154వ ఓపెన్‌ గోల్ఫ్‌ ఛాంపియన్‌ షిప్‌ మొదలైంది. వేదిక రాయల్‌ బిర్క్‌డేల్‌ గోల్ఫ్‌ క్లబ్‌.

ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్‌ టోర్నమెంట్‌ ఇది. ఇక్కడ ఆటగాళ్లు చాలా దూరం బంతిని కొట్టాలి. కానీ ఒక చిన్న సమస్య. ‘గల్స్‌’ అని సముద్ర పక్షులు ఈ మైదానానికి వస్తుంటాయి. నేల మీద గడ్డిని పాడు చేస్తాయి. గోల్ఫ్‌ బంతిని కూడా తన్నేస్తాయి. అప్పుడు ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. అందుకే నిర్వాహకులు గద్దను కాపలా పెట్టారు. ఈ ఫోటోలో కనిపించే గద్దకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని పని ఏంటంటే గల్స్‌ పక్షులను చూస్తూనే భయపెట్టి తరిమేయడం.

గ్రద్దను చూడగానే చిన్న పక్షులు దగ్గరకు రావడానికి భయపడతాయి కదా! గద్ద గాల్లో ఎగురుతూ మొత్తం మైదానంపై కాపలా కాస్తుంది. ఎక్కడైనా పక్షులు కనిపిస్తే వెంటనే అరుస్తూ వాటిని పారిపోయేలా చేస్తుంది. గద్దకు కూడా ఇది ఒక ఉద్యోగం లాంటిదే. మంచి ఆహారం, పోషణ దొరుకుతాయి. మరి మీకు కూడా ఇలాంటి పెంపుడు పక్షి ఉంటే అది మీకు ఏ పనిలో సహాయం చేయాలని ఉంటుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement