breaking news
eagle fight
-
గోల్ఫ్ ఆటకు గద్ద కాపలా!
పిల్లలూ... ఈ ఫోటోలో పెంపుడు గద్ద కనిపిస్తుంది చూశారా? ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇది గోల్ఫ్ ఆటగాళ్లకు కాపలాదారుగా పని చేస్తోంది! అవును, నిజంగా! మొన్న జూలై 16న ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో 154వ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ మొదలైంది. వేదిక రాయల్ బిర్క్డేల్ గోల్ఫ్ క్లబ్.ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇది. ఇక్కడ ఆటగాళ్లు చాలా దూరం బంతిని కొట్టాలి. కానీ ఒక చిన్న సమస్య. ‘గల్స్’ అని సముద్ర పక్షులు ఈ మైదానానికి వస్తుంటాయి. నేల మీద గడ్డిని పాడు చేస్తాయి. గోల్ఫ్ బంతిని కూడా తన్నేస్తాయి. అప్పుడు ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. అందుకే నిర్వాహకులు గద్దను కాపలా పెట్టారు. ఈ ఫోటోలో కనిపించే గద్దకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని పని ఏంటంటే గల్స్ పక్షులను చూస్తూనే భయపెట్టి తరిమేయడం.గ్రద్దను చూడగానే చిన్న పక్షులు దగ్గరకు రావడానికి భయపడతాయి కదా! గద్ద గాల్లో ఎగురుతూ మొత్తం మైదానంపై కాపలా కాస్తుంది. ఎక్కడైనా పక్షులు కనిపిస్తే వెంటనే అరుస్తూ వాటిని పారిపోయేలా చేస్తుంది. గద్దకు కూడా ఇది ఒక ఉద్యోగం లాంటిదే. మంచి ఆహారం, పోషణ దొరుకుతాయి. మరి మీకు కూడా ఇలాంటి పెంపుడు పక్షి ఉంటే అది మీకు ఏ పనిలో సహాయం చేయాలని ఉంటుంది? -
ఉగ్రవాదుల డ్రోన్లపై గద్దలతో దాడి!
ఉగ్రవాదులు డ్రోన్లు తయారుచేసి, వాటితో దాడులకు తెగబడేందుకు కుట్రలు పన్నితే.. ఆ కుట్రను భగ్నం చేయడానికి ఫ్రెంచి సైన్యం వారికి దీటుగా స్పందించింది. నాలుగు గద్దలను పెంచి.. వాటికి డ్రోన్లను ధ్వంసం చేయడంలో శిక్షణ ఇచ్చింది. పెరిగి పెద్దవైన ఆ నాలుగు గద్దలు వాటి విధులను బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాయి. డి అర్టగ్నాన్, అథోస్, పోర్థోస్, అరామిస్ అని పేరున్న ఈ నాలుగు.. డ్రోన్లను వెంటాడి, వేటాడి మరీ నాశనం చేస్తున్నాయి. అలా నాశనం చేసిన వెంటనే వాటికి బ్రహ్మాండంగా మాంసంతో విందుభోజనాలు వడ్డించారు. మిలటరీ కంట్రోల్ టవర్ సమీపం నుంచి ఈ గద్దలు తమ ఆపరేషన్లను కొనసాగిస్తున్నట్లు ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది. 20 సెకండ్లలో 200 మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న గద్దలు.. డ్రోన్‌ను గుర్తించగానే దానిమీద పడి నాశనం చేసి వచ్చేస్తున్నాయి. గద్దలు చాలా బాగా పనిచేస్తున్నాయని, వాటితో మంచి ఫలితాలు వస్తున్నాయని ఫ్రెంచి వైమానిక దళం కమాండర్ ఒకరు తెలిపారు. కొన్ని వారాల క్రితం ఇరాకీ సైనికులు ఒక డ్రోన్‌ను గమనించి.. అది బాంబు జారవిడుస్తోందని తెలిసి దానిమీద విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. రేడియో నియంత్రిత గూఢచారులుగా వ్యవహరించే డ్రోన్లను ఉగ్రవాదులు అభివృద్ధి చేయించి, వాటితో సైన్యం మీద దాడులు మొదలుపెడుతున్నారు. ఈ తరహా దాడులను అడ్డుకోడానికి గద్దలైతేనే సరైన మార్గమని భావించిన ఫ్రాన్స్.. ఆ దిశగా ప్రయత్నించి సఫలమైంది. ఈ గద్దలలో మూడింటికి 'త్రీ మస్కిటీర్స్'లో పాత్రల పేర్లు పెట్టారు. త్వరలోనే మరిన్ని గద్దలకు ఇలా శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తామని చెబుతున్నారు. అలాగే గద్దలకు రక్షణగా ఉండేందుకు, అవి బాంబు పేలుడుతో గాయపడకుండా చూసేందుకు కావల్సిన పరికరాలు కూడా వాటికి అమరుస్తున్నట్లు చెప్పారు.


