రోబో అంకుల్‌! చాక్లెట్‌ కావాలా... చిప్స్‌ కావాలా? | Meet China's Galaxy Robot Kiosk Humanoid Shopkeeper Selling Drinks, Snacks And Toys, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రోబో అంకుల్‌! చాక్లెట్‌ కావాలా... చిప్స్‌ కావాలా?

Jul 18 2026 9:46 AM | Updated on Jul 18 2026 10:24 AM

Galaxy Robot Kiosk Humanoid Sales Robot

కిడ్స్‌ స్పెషల్‌

పిల్లలూ... మనం షాపుకెళితే ‘చాక్లెట్‌ కావాలా... చిప్స్‌ కావాలా’ అని అంకుల్‌ అడుగుతాడు. కాని ఇక్కడ అంకుల్‌ లేడు రోబో ఉంది. అందుకే ఈ షాపు పేరు ‘గెలాక్సీ రోబో కియోస్క్‌’.

2026 జూలై 17న చైనాలోని బీజింగ్‌లో తీసిన ఫోటో ఇది. ఈ షాపులో ఏం కావాలన్నా రోబోనే అమ్ముతుంది. జ్యూస్‌ బాటిల్స్, నీళ్లు, చిన్న బొమ్మలు.... ఏవైనా సరే. పిల్లలు క్యూలో నిలబడి స్క్రీన్‌ పై ఏది కావాలో టచ్‌ చేస్తే, లోపల ఉన్న రోబో ఆ వస్తువును తీసి ఇస్తుంది. చూశారా ఎంత బాగుందో! పిల్లలకు ఇది కొత్త అనుభవం. ‘వావ్‌! రోబో మనకు జ్యూస్‌ ఇస్తోంది‘ అని సంతోషంగా చూస్తున్నారు. 

భవిష్యత్తులో ఇలాంటి రోబో షాపులు ఇంకా ఎక్కువ అవుతాయట. అప్పుడు మన ఊళ్లో కూడా వస్తాయేమో! అన్నట్టు ఈ రోబో పేరు ‘హ్యూమనాయిడ్‌ సెల్లర్‌ రోబో’. అంటే మనిషిలా నిలబడి సామాన్లు అమ్మే రోబో. బీజింగ్‌లోని ‘గెలాక్సీ’ కంపెనీ దీనిని తయారు చేసింది. వెల దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు. ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 8 నుంచి 12 గంటల వరకు ఆగకుండా పని చేస్తుంది. లోపల కెమెరా, సెన్సార్లు ఉంటాయి. మీరు ఏ బటన్‌ నొక్కితే ఆ వస్తువును తీసి ఇస్తుంది. అలసి΄ోదు, కోప్పడదు, లెక్క తప్పదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement