రెక్కల రాకెట్‌: ఎవరెస్ట్‌ దాటిన బాతు! | Kids Special Story, Meet The Bar Headed Goose, The Amazing Bird That Flies Over Mount Everest, Read Full Story | Sakshi
Sakshi News home page

రెక్కల రాకెట్‌: ఎవరెస్ట్‌ దాటిన బాతు!

Jul 18 2026 10:12 AM | Updated on Jul 18 2026 10:58 AM

Striped Headed Duck Kids Special Story Vintalu Viseshalu

కిడ్స్‌స్పెషల్‌

పిల్లలూ, మీకో సూపర్‌ పక్షి కథ చెప్పనా? ఊపిరి ఆడని ఎత్తులో, వణికించే చలిలో, ఎవరెస్ట్‌ పైనుంచి టప్‌ అని దూకేసే బాతు గురించి! బార్‌ హెడెడ్‌ గూస్‌. ‘చారల తల బాతు’ అని కూడా అనొచ్చు. తల మీద రెండు నల్ల చారలు. అదే దీని గుర్తు. రాకెట్‌లా ఎవరెస్ట్‌ శిఖరం పై నుంచి అంటే తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో హాయిగా ఎగురుతుంది. మనకు అక్కడ ఊపిరి ఆడదు. దీనికి మాత్రం అది రాజమార్గం!

ఎందుకు అంత కష్టపడుతుంది?
చలికాలం వస్తే మంగోలియా, టిబెట్‌లో పూర్తిగా మంచు. తినడానికి గడ్డిపోచ కూడా దొరకదు. అందుకే సెప్టెంబర్‌ వచ్చిందంటే చాలు, ‘పదండి ఇండియా యాత్ర వెళ్దాం’ అని ఐదు వేల మంది నేస్తాలతో బయల్దేరుతుంది ఈ బాతు. మధ్యలో హిమాలయాలు అడ్డొస్తే? ‘దాటేద్దాం పద’ అని పైనుంచి వెళ్లిపోతుంది. దీనివి గొప్ప ఊపిరితిత్తులు. మనకన్నా మూడు రెట్లు ఎక్కువ గాలిని పీల్చుకుంటుంది. బలమైన గుండె. నిమిషానికి నాలుగు వందల సార్లు కొట్టుకుంటుంది. కొండల మధ్య, లోయల మధ్య పైకి కిందికి ఊగుతూ శక్తిని పొదుపు చేస్తుంది.

ప్రపంచంలోనే గొప్పది... 
‘ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి’ అని దీనికి పేరుంది. శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఎనిమిది గంటల్లో హిమాలయాలు దాటేసింది. కాబట్టి నెక్స్ట్‌ టైమ్‌ ‘‘నేను చేయలేను’’ అనిపిస్తే ఈ చారల తల బాతుని గుర్తు తెచ్చుకోండి. రెక్కలు లేకపోయినా పర్లేదు, గుండె ధైర్యం ఉంటే చాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement