విదేశీ వంటకాలకు కేరాఫ్‌గా భాగ్యనగరం..! | Cuisines of Hyderabad Citys Culinary Delights to Relish Best Restaurants | Sakshi
Sakshi News home page

విదేశీ వంటకాలకు కేరాఫ్‌గా భాగ్యనగరం..!

Jun 27 2025 10:46 AM | Updated on Jun 27 2025 11:54 AM

Cuisines of Hyderabad Citys Culinary Delights to Relish Best Restaurants

భాగ్యనగరం రుచికరమైన కాంటినెంటల్‌ వంటకాలకు నెలవన్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం నగరంలో సియోల్, బ్యాంకాక్, టోక్యో వంటి ఆసియన్‌ దేశాలకు చెందిన వినూత్న రుచులకు కేంద్రంగా మారుతోంది. ఇందులో భాగంగా గన్‌రాక్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో తమాషా పేరుతో ఆసియన్‌ వెజ్‌ కెఫేలు నగరంలోని ఫుడ్‌ లవర్స్‌కు సరికొత్త రుచులను అందిస్తున్నాయి. ఆసియా వంటకాలకు కొత్త దిశ చూపేలా ప్రారంభమైన తమాషా 100 శాతం శాకాహారి వంటకాలతో, ఓల్డ్‌ స్కూల్‌ రెట్రో లుక్‌తో, లైవ్‌ మ్యూజిక్‌తో, ఓపెన్‌ ఎయిర్‌లో, యాంటీ ఫొటోలు తీసుకునే స్పాట్లతో ఆకర్షిస్తున్నాయి.

నగరవాసులకు ప్రతిదీ వింతే.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహారం విషయంలో కొత్త వెరైటీలకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. పైగా నగరంలోని ఆహార ప్రియులు కొందరు, ఆహ్లాదం కోసం కొందరు రెగ్యులర్‌గా రెస్టారెంట్లు, కెఫేలు, హోటళ్లను సందర్శిస్తుంటారు. వీరిలో కొందరు ఆకట్టుకునే వాతావరణం కోసం.. అద్భుతమైన యాంబియన్స్‌ కోసం వెతుకుతుంటారు. 

అలాంటి వారిని ఆకట్టుకునేందుకు నిర్వాహకులు కూడా కొత్త తరహా యాంబియన్స్‌ కోసం అన్వేషిస్తుంటారు. ఇందులో భాగంగానే నగరంలో తమాషా డిషెస్‌ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ సందర్శకులను, ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు వివిధ దేశాలకు చెందిన వెరైటీ వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతోంది.. ముఖ్యంగా శాకాహార వంటకాలకు ప్రాముఖ్యతను ఇస్తూ.. సియోల్, బ్యాంకాక్, టోక్యో దేశాల ఆహారాలను వండి వడ్డిస్తున్నారు.  

నోస్టాల్జిక్‌ అనుభూతి.. 
అయితే ఈ కెఫే విశిష్టత కేవలం ఆహారంలోనే కాదు –యాంబియన్స్‌లోనూ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. వింటేజ్‌ టీవీలు, బుక్‌షెల్ఫ్‌లు, గిటార్‌లు, బ్యాంబూ లైట్స్, ఆర్టిస్టిక్‌ కార్నర్లు.. ప్రతి మూల కూడా ఇన్‌స్టా మెంట్‌!, స్టేజిపై లైవ్‌ మ్యూజిక్‌ వింటూ, వెనక నోస్టాలజిక్‌ వీడియోలు చూసే అనుభవాన్ని విభిన్నమైన తరహాలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఈ మధ్య కాలంలో ఆదరణ పొందుతున్న పికిల్‌ బాల్‌ కోర్ట్‌ కూడా ఉండటం విశేషం! 

ఇదొక భావోద్వేగం.. 
ఇది కేవలం కెఫే కాదు– ఒక భావోద్వేగం. మేము మళ్లీ భౌతికంగా అనుసంధానం కావడానికి అనువైన వాతావరణాన్ని ఆహారంతో ముడిపెట్టే ప్రదేశాన్ని సృష్టించాలనుకున్నాం.  
– ఏకె.సోలంకీ, తమాషా కో–ఫౌండర్‌ 

గ్రీన్‌ థాయ్‌ మొదలు జైన్‌ వరకు.. 
కోరియన్‌ చిల్లీ టోఫూ నుంచి జపనీస్‌ కాటేజ్‌ చీజ్‌ కాట్సు వరకు, గ్రీన్‌ థాయ్‌ కర్రీ నుంచి కిమ్చీ పిజ్జా వరకు – ప్రతి ఐటమ్‌లోనూ కొత్తదనం, ఆరోగ్యం, ఆసియన్‌ స్పైసీ టచ్‌ ఉండేలా చూస్తున్నారు. వెజ్జీ థిన్‌ క్రస్ట్‌ పిజ్జా, రోస్‌ కూలర్, క్యూకంబర్‌ ఫిజ్‌ వంటి పానీయాలు, థాయ్‌ మాంగో స్టికీ రైస్‌ వంటి డెజర్ట్స్‌తో వావ్‌ అనిపిస్తున్నాయి. జైన్‌ భోజనాన్ని కోరేవారికీ ప్రత్యేక ఐటమ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement