‘అనగనగా’ హోటల్‌కు రూ.20 వేల జరిమానా | Water Board fines Anaganaga restaurant 20000 | Sakshi
Sakshi News home page

‘అనగనగా’ హోటల్‌కు రూ.20 వేల జరిమానా

Oct 8 2026 9:01 AM | Updated on Oct 8 2026 9:01 AM

Water Board fines Anaganaga restaurant 20000

హైదరాబాద్‌: నల్లా నీటిని దుర్వినియోగపర్చిన ఘటనపై జలమండలి కొరడా ఝుళిపించింది. జూబ్లీహిల్స్‌లోని ‘అనగనగా’ హోటల్‌కు రూ.20 వేల జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌ ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్డునెంబర్‌–45లోని ప్లాట్‌నెంబర్‌–775–జీలోని ‘అనగనగా’ హోటల్‌ సిబ్బంది ప్రాంగణాన్ని  తాగునీటితో శుభ్రం చేస్తూ కనిపించారు. 

భారీగా నీటిని వృథా చేయడాన్ని ఆయన గుర్తించారు. అత్యంత విలువైన నీరు సహజ వనరు అని, ప్రాంగణాలు, రహదారులను శుభ్రం చేసేందుకు మంచినీటిని విచక్షణారహితంగా వినియోగించడం సరికాదని ఎండీ స్పష్టం చేశారు. సంబంధిత వ్యక్తులకు నోటీసు జారీ చేసి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు రూ.20 వేల జరిమానా విధించిన అధికారులు.. ఆ మొత్తాన్ని వసూలు చేశారు. మంచినీటితో పాటు ఇతర నీటి వనరులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement