సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం హయతాబాద్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చందనవెల్లి పారిశ్రామికవాడలోని ట్రీ ఫాయిల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పరిశ్రమలో మంటలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఎన్విడియా చిప్స్‌ను చైనాకు తరలించిన లీ మింగ్


