breaking news
Anaganaga
-
'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)
-
‘అనగనగా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇది సినిమా కాదు... ఒక జీవితం: అడివి శేష్
‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. సుమంత్ కుమార్, కాజల్ చౌదరి జంటగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల 15న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రామ్‌పాత్ర కంటతడి పెట్టించింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు..ఒక జీవితం’’ అన్నారు. సుమంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మేము అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాకి వస్తున్న స్పందన చూసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినీ ప్రపంచానికి నన్ను, మా టీమ్‌ను పరిచయం చేసిన చిత్రం ఇది’’ అన్నారు సన్నీ సంజయ్. ‘‘ఇంత పెద్ద సక్సెస్ సుమంత్‌గారి వల్లే సాధ్యమైంది’’ అని రాకేశ్ రెడ్డి గడ్డం తెలిపారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు. -
అనగనగా మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
అనగనగ ఒక ఊరు 27th December 2015
-
నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి!
యాంకర్లు కథానాయికలుగా మారుతున్న సీజన్ ఇది. సుమ, ఉదయభాను ‘హీరోయిన్లు’ అనిపించుకున్నవారే. వీరిద్దరితో పాటు ఈ మధ్య కొందరు యాంకర్లు కూడా కథానాయికలుగా మారారు. ఇప్పుడు ఆ వరుసలో చేరారు ప్రశాంతి. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘అనగనగా’. శ్రీరాజ్ బల్లా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో రవిబాబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఎన్వీయస్ అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘కథానాయికగా నేను నటించిన తొలి సినిమా ఇంత విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీరాజ్‌కి డెరైక్షన్ కొత్త అయినప్పటికీ తెలివిగా తెరకెక్కించాడు. రవిబాబు లాంటి సీనియర్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. హీరోయిన్గా కొనసాగినా, యాంకరింగ్ మాత్రం వదలను’’ అన్నారు.