
మరో ఘోర ఉదంతం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లూ కలర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాం బయటపడింది. దీంతో యూపీ మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మీరట్‌లో ఓ మహిళ గంజాయి మత్తులో తూలుతూ.. ప్రియుడి సాయంతో తన భర్తను చంపి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంగతి తెలిసిందే.
ఛండీగఢ్: మీరట్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. పంజాబ్‌లోని లూధియానాలో ఓ డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెడ, కాళ్లను తాడుతో కట్టి.. డ్రమ్ములోకి కుక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
జూన్ 25వ తేదీన.. ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా దుర్వాసన వస్తుండడం చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ము నుంచి మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. డ్రమ్ములో ఓ బెడ్‌షీట్‌లో మృతదేహం చుట్టి ఉంది. చనిపోయిన వ్యక్తికి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒంటిపై గాయాలు లేవని.. పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
లోతైన దర్యాప్తు..
డ్రమ్ము కొత్తగా ఉండడంతో.. లూథియానాలో 42 డ్రమ్ము తయారీ యూనిట్లకు, దుకాణాలకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ మధ్యకాలంలో కనిపించకుండా పోయిన వ్యక్తల జాబితాతో మృతుడి వివరాలు సరిపోల్చుకుంటున్నారు.
మీరట్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు ఇలా..
- ఫిబ్రవరి 24, 2025:
మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్‌పుత్ లండన్ నుంచి తన కుమార్తె పుట్టినరోజు కోసం భారత్‌కు వచ్చారు. - ఫిబ్రవరి 25, 2025:
భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్యకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు ప్రయత్నం విఫలమైంది. - మార్చి 3, 2025:
సౌరభ్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు
శరీరాన్ని ముక్కలు చేసి, తల, చేతులను వేరు చేశారు
శరీర భాగాలను మిక్సర్ గ్రైండర్‌లో వేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు - మార్చి 4-5, 2025
సిమెంట్, డ్రమ్ములు కొనుగోలు చేసి శరీర భాగాలను డ్రమ్ములో వేసి సిమెంట్ పోసారు
డ్రమ్మును ఇంట్లో దాచారు - మార్చి 10, 2025 (సుమారు):
డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానం వ్యక్తం చేశాడు
సౌరభ్ కూతురు ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పినా, మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు - మార్చి 20–25, 2025:
పోలీసులు డ్రమ్మును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు
ఫోరెన్సిక్ బృందం బెడ్‌షీట్‌లు, బాత్రూమ్ టైల్స్‌పై రక్తపు మరకలు గుర్తించింది
సూట్‌కేస్‌లో కూడా రక్తపు ఆనవాళ్లు లభించాయి - మార్చి 26–27, 2025:
ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అరెస్టయ్యారు
ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు
ముస్కాన్‌కు 2019 నుంచి సాహిల్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు
ప్రస్తుతం నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జైలులో ఉన్నారు. ముస్కాన్ ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. ఆమె జైలులో లా చదివే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.