పోరంకి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సూసైడ్‌ కేసులో ట్విస్ట్‌ | Twist In Case Of Poranki Sri Chaitanya College Student | Sakshi
Sakshi News home page

పోరంకి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సూసైడ్‌ కేసులో ట్విస్ట్‌

Feb 3 2026 7:20 PM | Updated on Feb 3 2026 8:01 PM

Twist In Case Of Poranki Sri Chaitanya College Student

సాక్షి, కృష్ణాజిల్లా: పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్‌లో పవన్ కుమార్‌కి తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జనవరి 5న పవన్‌పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. కొట్టిన దృశ్యాలను విద్యార్థులు ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్‌పై విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. హాస్టల్‌లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లను పవన్‌ చేతిపై రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు గోప్యంగా ఉంచిన శ్రీచైతన్య యాజమాన్యం.. సాక్ష్యాలను తారుమారు చేసింది. చేతిపై ఉన్న పేర్లను శ్రీచైతన్య సిబ్బంది తుడిచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను జువెనైల్  కోర్టుకు తరలించారు. కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జేఎల్‌లు రాజేష్, ఆనంద్, కృష్ణ, మెస్ బాయ్ హేమంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement