‘గీతం’ యూనివర్సిటీ భూముల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో విచారణ | AP High Court to hear petition on transfer of government lands to Gitam University | Sakshi
Sakshi News home page

‘గీతం’ యూనివర్సిటీ భూముల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో విచారణ

Feb 3 2026 7:38 PM | Updated on Feb 3 2026 8:04 PM

AP High Court to hear petition on transfer of government lands to Gitam University

సాక్షి,విజయవాడ: ఏ హక్కుతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాదులపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్‌ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

మంగళవారం ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement