కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం | Kerala Thrissur Kodakara Building Collapse Incident updates | Sakshi
Sakshi News home page

కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం

Jun 27 2025 11:32 AM | Updated on Jun 27 2025 12:35 PM

Kerala Thrissur Kodakara Building Collapse Incident updates

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్‌ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. 

తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. 

  • మృతులు:

రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

రుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారు

అలీమ్ (30) – శవంగా గుర్తింపు

సుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్‌ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం  ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్‌, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement